తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోగోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

    ఫొటో సోర్స్, Telangana CMO

    ఫొటో క్యాప్షన్, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోగోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు.

    “దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్ గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు” అని తెలంగాణ సీఎంఓ తెలిపింది.

    తెలంగాణ

    ఫొటో సోర్స్, Telangana CMO

    వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకం వంటి చిహ్నాలను కూడా ఈ లోగోలో పొందుపరిచారు.

    తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

  3. అమ్మాయిల పీరియడ్స్ గురించి అబ్బాయిలూ తెలుసుకోవాలి, ఎందుకంటే...

  4. పాకిస్తానీ అమ్మాయిని పెళ్ళాడేందుకు ఏడేళ్ళు ఎదురుచూసిన భారత ప్రేమికుడు

  5. బ్రిటన్ ప్యాలెస్‌లో ఇథియోపియా యువరాజు మృతదేహం, ఇవ్వడానికి నిరాకరిస్తున్న రాజకుటుంబం, కారణమేంటి?

  6. రామ్‌చరణ్: జీ-20 సమావేశాలకు హాజరైన ఆర్ఆర్ఆర్ హీరో

    రాంచరణ్

    ఫొటో సోర్స్, ANI

    జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ - 20 సమావేశాలకు తెలుగు సినీ నటుడు రాంచరణ్ హాజరైనట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు రాంచరణ్ ఈరోజు శ్రీనగర్ చేరుకున్నారు.

    జీ - 20 సమావేశాల్లో టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు.

    ఆర్థిక పురోగతిలో ఫిల్మ్ టూరిజం పాత్ర, సాంస్కృతిక పరిరక్షణ అంశాలపై ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. శరత్ బాబు: అరుదైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన క్యారెక్టర్ యాక్టర్

  8. సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత

    శరత్ బాబు

    ఫొటో సోర్స్, UGC

    టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

    ఏఐజీ ఆసుపత్రిలో శరత్ బాబు నెల రోజులకు పైగా చికిత్స పొందుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఏఐజీ వైద్యులు ధ్రువీకరించారు.

    ఉదయం నుంచి శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. మల్టీఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో ఆయన మృతి చెందారు.

    1973లో రామరాజ్యం చిత్రం ద్వారా శరత్ బాబు తెలుగు తెరకు పరిచయమయ్యారు.

    1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో శరత్ బాబు జన్మించారు.

    హీరోగా, విలన్‌గా సహాయ నటుడిగా అనేక పాత్రను పోషించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

    ఆయన ఇప్పటి వరకూ దాదాపు 300లకి పైగా సినిమాల్లో నటించారు.

  9. దిల్లీ కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఏముంది, కేజ్రీవాల్ కేంద్రంపై ఎందుకు మండిపడుతున్నారు?

  10. బెంగళూరు వరదలో కారు మునిగి విజయవాడ యువతి మృతి, సీఎం సిద్ధరామయ్య పరామర్శ

    బెంగళూరు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో సీఎం సిద్ధరామయ్య

    బెంగళూరులో ఒక్కసారిగా వరద ముంచెత్తి అండర్‌పాస్‌లో కారు మునిగిపోయిన ఘటనలో ఏపీలోని విజయవాడకు చెందిన 22 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయారు.

    కారులో చిక్కుకుపోయిన యువతి కుటుంబ సభ్యులు ఐదుగురితో పాటు డ్రైవర్‌ను అత్యవసర సేవల సిబ్బంది, స్థానికులు కాపాడారు.

    విధాన వీధి, నృపతుంగ రోడ్డుకి అనుసంధానంగా ఈ అండర్‌‌పాస్ ఉంటుంది.

    కారులో చిక్కుకుపోయిన యువతి భానురేఖను విధాన వీధిలోని ఒక ఆస్ప్రత్రికి తరలించగా, ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

    ''ఖాళీ ఈసీజీ రిపోర్టును వైద్యులు చూపించారు'' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి బీబీసీకి చెప్పారు.

    ''ఈ ఘటనపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నాం. మాకు అందిన సమాచారం మేరకు, అండర్‌పాస్‌లో ఎంత లోతు ఉందో డ్రైవర్ అంచనా వేయలేకపోయారు. అండర్‌పాస్‌లో కారు చిక్కుకుపోయిన సమయంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తి కారు మునిగిపోయింది.'' అని ఓ పోలీసు అధికారి చెప్పారు.

    కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి వచ్చి భాను రేఖ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

    భాను రేఖ కుటుంబం విజయవాడ నుంచి వచ్చిందని, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వెళ్తున్నారని సీఎం చెప్పారు.

    ''ఆమె ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. వరద కారణంగా అండర్‌పాస్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ పడిపోయింది. డ్రైవర్ వరద నీటిని అంచనా వేయకుండా అటువైపు రావడంతో ప్రమాదం జరిగింది'' అని సిద్దరామయ్య మీడియాతో అన్నారు.

    ఒక ఆటో కూడా ఆ అండర్‌పాస్‌‌లో చిక్కుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ ఆటో పైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. స్థానికులు ఆమెను కాపాడారు.

    ఈ సీజన్‌లో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుంటాయి. అది మామూలు విషయమే. '' మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల మధ్యలో భారీ వర్షం కురిసింది. మూడు సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు నమోదైంది. అది ఓ మోస్తారు వర్షమే'' అని బెంగళూరుకి చెందిన భారత వాతావరణ శాస్త్రవేత్త ప్రసాద్ బీబీసీకి చెప్పారు.

  11. ప్రధాని మోదీకి పపువా న్యూ గినియా అత్యున్నత పౌర పురస్కారం

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, twitter/@narendramodi

    పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ''కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగొహు'' పురస్కారాన్ని అందజేసింది.

    పపువా న్యూ గినియా అత్యున్నత పౌరపురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగొహు. ఇప్పటి వరకూ చాలా తక్కువ మందికి ఈ గౌరవం దక్కింది.

    పపువా న్యూ గినియా చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ గవర్నర్ జనరల్ సర్ బాబ్ డేడ్ ఈ పురస్కారాన్ని అందజేశారు.

    పసిఫిక్ దీవులకు సంఘీభావంగా నిలిచినందుకు, వాటి ప్రయోజనాల కోసం నాయకత్వం వహించినందుకు ప్రధాని మోదీకి ఈ గౌరవం లభించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ గౌరవానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

    ''పాపువా న్యూ గినియా నాకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగొహును ప్రదానం చేయడం సంతోషం కలిగించింది. ఈ అవార్డును అందించినందుకు గవర్నర్ జనరల్ సర్ బాబ్ డేడ్‌కు కృతజ్ఞతలు. ఇది భారతదేశానికి ఒక ముఖ్యమైన గుర్తింపు. భారత ప్రజలు సాధించిన ఘనత.'' అని మోదీ ట్వీట్ చేశారు.

    అంతకుముందు ఫిజీ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారాన్ని అందించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    జపాన్‌లో జరిగిన జీ - 7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం పపువా న్యూ గినియాకి చేరుకున్నారు.

    ఆ దేశ ప్రధాని జేమ్స్ మరపె స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘన స్వాగతం తెలిపారు.

    విమానం దిగి వచ్చిన ప్రధాని మోదీకి జేమ్స్ మరపె పాదాభివందనం చేశారు. ఆయనను మోదీ పైకి లేపారు.

    ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  12. కండోమ్ అడగడానికి మగాళ్ళు ఎందుకు సిగ్గుపడతారు, దీన్ని ఎవరు మార్చేశారు?

  13. కశ్మీర్‌లో జీ-20 సమావేశాలు, చైనా, పాకిస్తాన్ అభ్యంతరం

    కశ్మీర్

    ఫొటో సోర్స్, Getty Images

    జీ - 20 సమావేశాల్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మే 22 నుంచి 24వ తేదీ వరకు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి.

    ఈ సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. తొలుత జరిగిన రెండు సమావేశాల కంటే శ్రీనగర్ సమావేశాలకు ఎక్కువ మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది.

    ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని జీ - 20 సమావేశాల చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. జీ - 20 దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల సహకారం కూడా అవసరమని ఆయన అన్నారు.

    ఈ సమావేశాలకు 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అయితే, జీ-20 దేశాలన్నీ ఇందులో పాల్గొనడం లేదు. సమావేశాలకు హాజరవుతున్న సభ్య దేశాలలో సింగపూర్ నుంచి అతి పెద్ద ప్రతినిధి బృందం హాజరుకానుంది.

    శ్రీనగర్‌లో జరుగుతున్న టూరిజం సమావేశాలకు చైనా సహా కొన్ని దేశాలు హాజరుకావడం లేదని వార్తా సంస్థ ది హిందూ తెలిపింది. సౌదీ అరేబియా, తుర్కియే కూడా మే 19 వరకూ నమోదు చేసుకోలేదు.

    కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని తుర్కియే అప్పట్లో వ్యతిరేకించింది. కశ్మీర్ విషయంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డొవాన్ భారత్‌కు వ్యతిరేకంగా ప్రకటన కూడా చేశారు. కశ్మీర్ విషయంలో తుర్కియే మొదట పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ ఇటీవల ఆ వైఖరిలో కాస్త వెనక్కుతగ్గింది.

    చైనా ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెబిన్ ప్రకటించారు. ''వివాదాస్పద ప్రాంతంలో జీ - 20 సమావేశాలు నిర్వహించడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. అలాంటి సమావేశాల్లో మేము పాల్గొనడం లేదు.'' అని చెప్పారు. కశ్మీర్‌లో యధాతథ స్థితిని మార్చడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు.

    శ్రీనగర్‌లో జీ - 20 సమావేశాలు నిర్వహించడంపై పాకిస్తాన్ కూడా నిరసన తెలిపింది. వివాదాస్పద ప్రాంతమైన కశ్మీర్‌లో భారత్ ఎలా సమావేశాలు నిర్వహిస్తుందని ప్రశ్నించింది.

    అయితే, శ్రీనగర్ తమ భూభాగంలో అంతర్భాగమని భారత్ తెలిపింది. పొరుగు దేశంతో సాధారణ సంబంధాల కోసం సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అవసరమని పేర్కొంది.

  14. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కర్నూల్ ఎస్పీకి సీబీఐ లేఖ, విశ్వభారతి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

    వివేకా హత్య కేసు

    ఫొటో సోర్స్, YS Avinash Reddy/Facebook

    కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు కర్నూల్ ఎస్పీకి సీబీఐ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చింది.

    మరికాసేపట్లో సీబీఐ అధికారులు విశ్వభారతి ఆస్పత్రికి చేరుకోనున్నారు. పోలీస్ ఫోర్స్ కోసం సీబీఐ అధికారులు ఎస్పీ కార్యాలయం వద్ద వేచిచూస్తున్నారు.

    అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనున్నట్లు లేఖ ఇవ్వడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఆస్పత్రి వద్ద పోలీసులను మోహరించారు.

    అవినాష్ రెడ్డి అరెస్టు ప్రచారంతో నిన్న అర్ధరాత్రి నుంచే ఆయన అనుచరులు హాస్పిటల్ దగ్గరకు భారీగా చేరుకున్నారు.

    ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన అవినాష్ అనుచరులను పోలీసులు చెదరగొట్టారు. ఆస్పత్రి పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది