ఎల్ సాల్వడార్: ఫుట్‌బాల్ స్డేడియంలో తొక్కిసలాట, 12కు చేరిన మృతుల సంఖ్య

గేట్లు మూసివేసిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు స్డేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన సంభవించినట్లు సమాచారం

లైవ్ కవరేజీ

  1. రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఒక యువతి గంధపు మాల తీసుకుని ఆయన పాదాలను తాకేందుకు వంగగానే..

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. ఐపీఎల్ 2023: గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లి సెంచరీ

    కోహ్లి

    ఫొటో సోర్స్, Getty Images

    ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం చిన్నస్వామి స్డేడియంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.

    కోహ్లీ 61 బంతుల్లో (13 ఫోర్లు, ఒక సిక్స్) 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.

    టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసింది.

    బెంగళూరు బ్యాటింగ్ నెమ్మదిగానే మొదలైంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసీ తొలి ఓవర్‌లో ఆరు పరుగులు జోడించగా, రెండో ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే జోడించారు.

    ఆ తర్వాత మూడో, నాలుగో ఓవర్ల మధ్య కోహ్లి, డుప్లెసీ ఎనిమిది ఫోర్లు బాదారు. దీంతో ఐదో ఓవర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 50 పరుగులకు చేరుకుంది.

    ఓపెనింగ్ జోడీ డు ప్లెసిస్, కోహ్లి పవర్‌ప్లే మొదటి ఆరు ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది.

    ఎనిమిదో ఓవర్ తొలి బంతికి ఫాఫ్ డుప్లెసీని అవుట్ అయ్యాడు. డుప్లెసి 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    ఆ తర్వాత వచ్చిన మాక్స్ వెల్, లామ్రోర్ తొందరగానే పెవిలియన్ చేరారు.

    అయితేమరో ఎండ్‌లో కోహ్లీ పరుగుల వరద పారించడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది.

  4. పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి ప్రేమాయణం పెళ్లిగా ఎలా మారింది?

  5. బ్రెస్ట్ క్యాన్సర్ మగాళ్లకు కూడా వస్తుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

  6. ఎల్ సాల్వడార్: ఫుట్‌బాల్ స్డేడియంలో తొక్కిసలాట, 12 మంది మృతి

    ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట

    ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 12 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఎల్ సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని కస్కట్లాన్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది.

    ఆ స్టేడియంలో అలియాంజా , శాంటా అనా జట్టు ఫాస్‌ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఘటన అనంతరం మ్యాచ్‌ను నిలిపివేశారు. గేట్లు మూసివేసిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు స్డేడియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన సంభవించినట్లు సమాచారం.

    కొంతమంది అభిమానులు నకిలీ టిక్కెట్లను విక్రయించినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుగుతోందని చెప్పారు. స్టేడియం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బారికేడ్లను తొలగించేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక మీడియా షేర్ చేసిన దృశ్యాలలో కనిపించాయి.

    ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే అన్నారు. టీమ్‌లు, మేనేజర్‌లు, స్టేడియం అధికారులు, లీగ్, ఫెడరేషన్‌తో సహా అందరిపై దర్యాప్తు జరుగుతుందని బుకెలే చెప్పారు.

  7. స్టార్‌బక్స్: ట్రాన్స్‌జెండర్స్ మీద తీసిన ఈ యాడ్ ఎందుకు చర్చకు దారి తీసింది?

  8. 30 అడుగుల లోతు నీటిలో 74 రోజులుగా ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నారంటే...

  9. ఈ బాలీవుడ్ నటిని డ్రగ్స్ స్మగ్లర్‌గా సినీ ఫక్కీలో ఇరికించారు

  10. ఓషో వల్లే రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారా?

  11. రాజీవ్ గాంధీ చివరి క్షణాల్లో ఏం జరిగింది? ఆయన మాట ఎలా నిజమైంది?

  12. చక్కెర‌ ఎంత తినాలి? షుగర్ ఫ్రీ పిల్స్ మంచివేనా?

  13. ఐపీఎల్ 2023: కోల్‌కతా నైట్ రైడర్స్ మీద లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం

    నికోలస్ పూరన్

    ఫొటో సోర్స్, Getty Images

    కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచులో ఒక్క పరుగు తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ గెలిచింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 58, క్వింటన్ డీ కాక్ 27 బంతుల్లో 28 పరుగులు చేశారు.

    177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది.

    33 బంతుల్లో 67 పరుగులు చేసిన రింకూ సింగ్, 28 బంతుల్లో 45 పరుగులు చేసిన జేసన్ రాయ్ పోరాడినప్పటికీ కోల్‌కతా గెలవలేక పోయింది.

    ఈ గెలుపుతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

  14. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  15. 'నగ్నంగా ఆరుబయట స్నానం చేయమన్నారు, మొదట్లో సిగ్గుపడ్డాను కానీ....