ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా వార్తలతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
వీరిద్దరి సమావేశంలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా వార్తలతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.

ఫొటో సోర్స్, ANI
జపాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ సమావేశమైనట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ఇరువురు నాయకులు ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. జీ7 సదస్సులో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు.
వీరిద్దరి సమావేశంలో ఇరు దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, ANI
రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మోదీ, జెలియన్ స్కీ కలుసుకోవడం ఇదే మొదటిసారి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడికి సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, INC/YouTube
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఎన్సీపీ నేత శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు.
లింగాయత్, ఒక్కలిగలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
నేడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేవారిలో డా.జి పరమేశ్వర(ఎస్సీ), కేహెచ్ మునియప్ప(ఎస్సీ), కేజే జార్జ్(క్రిస్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీశ్ జర్కిహోళీ(ఎస్టీ), ప్రియాంక్ ఖర్గే(ఎస్సీ), రామలింగా రెడ్డి(ఒక్కలిగ), జమీర్ అహ్మద్(ముస్లిం)లు ఉన్నారు.

ఫొటో సోర్స్, INC/YouTube

ఫొటో సోర్స్, Facebook/Siddaramaiah
నేడు 12.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీ పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియడంలో జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కమల్ హాసన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వంటి వారు రానున్నారు.

ఫొటో సోర్స్, ANI
జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
‘‘హిరోషిమా పేరు వింటే ఇప్పటికీ ప్రపంచం భయపడుతోంది. ఇక్కడి మహాత్మాగాంధీ విగ్రహం అహింసా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంది’’ అని మోదీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.