'రూ. 2,000 నోటు నల్ల డబ్బు దాచుకునే వాళ్ళకే ఉపయోగపడింది' -మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం
రూ. 2,000 నోటు చలామణీని నిలిపి వేస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఇది ఊహించిన పరిణామమేనని, త్వరలో 1,000 రూపాయల నోటు మళ్ళీ తెచ్చినా ఆశ్చర్యం లేదని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా వార్తలతో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.
నమస్తే. గుడ్ నైట్.
'రూ. 2,000 నోటు నల్ల డబ్బు దాచుకునే వాళ్ళకే ఉపయోగపడింది' -మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం రూ. 2,000 నోటు ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనది కాదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ నోటును ప్రజలు ఎప్పుడూ కూడా ఎక్కువగా వాడలేదని, కేవలం నల్ల డబ్బును దాచుకునే వాళ్ళకే ఇది ఉపయోగపడిందని అన్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ఈ నిర్ణయంతో పరిపూర్ణమైందని చెప్పిన చిదంబరం, దీన్ని చలామణి నుంచి తీసేస్తారనే అనుమానాలు మొదట నుంచీ ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“నేను 2016లోనే చెప్పాను, ఇప్పుడు అదే నిజమైంది. రూ. 1,000, 500 నోట్లను రద్దు చేయాలని తీసుకున్న తెలివితక్కువ నిర్ణయానికి ముసుగు వేసేందుకే రూ. 2,000 నోటు తెచ్చారు”అని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు.
అప్పట్లో ప్రజలు 500, 1000 రూపాయల నోట్లను బాగా చలామణీలో పెట్టేవారని గుర్తు చేసిన చిదంబరం, “పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి తెచ్చిన కొన్ని వారాల్లోనే ప్రభుత్వానికి మళ్ళీ 500 రూపాయల నోట్లను తీసుకురాక తప్పలేదు. ఇక మళ్ళీ 1,000 రూపాయల నోటు త్వరలోనే వచ్చినా ఆశ్చర్యం లేదు”అని అన్నారు.
రూ. 2,000 నోటు మార్పిడి నేటి నుంచే.. మీ దగ్గరున్న నోట్లను ఇలా మార్చుకోవాలి
జీ7: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్, పాపువా న్యూగినీ, ఆస్ట్రేలియా పర్యటనలో ప్రస్తావించే అంశాలేంటి?
రూ. 2,000 నోటును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన ఆర్.బీ.ఐ

ఫొటో సోర్స్, Getty Images
రూ. 2,000 నోటును వాడకం నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ వెల్లడించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
అయితే, ఈ నోటు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతుందని ఆర్.బీ.ఐ వివరించింది.
రెండు వేల రూపాయల నోట్లను తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చని, ఏ బ్యాంకులోనైనా వాటిని మార్చుకోవచ్చని ఆర్.బీ.ఐఈ ప్రకటనలో తెలిపింది.
ఎవరైనా ఒకసారి 20,000 రూపాయల విలువ చేసే 2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చని ఆర్.బీ.ఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సౌకర్యం అన్ని బ్యాంకులలో 30 సెప్టెంబర్ వరకు అందుబాటులో ఉంటుందన్న ఆర్.బీ.ఐ, ఆ తరువాత కూడా ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. అయితే, దేశంలోని అన్ని బ్యాంకులు ఇక నుంచి 2,000 నోట్లను ఇవ్వడం ఆపేయాలని స్పష్టం చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, RBI
రూ. 500, 1000 నోట్లను రద్దు చేసినప్పుడు 2016లో ప్రభుత్వ రూ. 2,000 నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లను 2018-19 నుంచి ముద్రించడం మానేసినట్లు ఆర్.బీ.ఐ తెలిపింది.
మెనోపాజ్‌తరువాత మహిళల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఏమవుతుంది?
హన్మకొండ: ఏడేళ్ళ చోటూను కుక్కలు దాడి చేసి చంపేశాయి, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే పార్క్ సమీపంలో కుక్కల దాడిలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన చోటూ(7) అనే బాలుడు మృతి చెందాడు.
వారాణాసి కి చెందిన మల్కాన్, సునితలతో పాటు మరో రెండు కుటుంబాలు బొమ్మలు అమ్ముకునేందుకు నిన్న రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్ లో దిగారు.
రైల్వే క్వార్టర్స్ పార్కులో చెట్ల కింద వారు తాత్కాళిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం సమయంలో చోటూ తన తోటివారితో చెట్ల కింద ఆడుకుంటున్నప్పుడు వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
తల్లిందండ్రులు వచ్చే సరికే చోటూ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృత దేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
వరంగల్(పశ్ఛిమ) ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి లు బాధిత కుటుంబ సభ్యులను ఎంజీఎం లో పరామర్శించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ తరపున మేయర్ సుధారాణి లక్ష రూపాయల పరిహారం చెక్కు ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ ఘటన పై వరంగల్ మేయర్ గుండు సుధారాణి మీడియా తో మాట్లాడుతు.. నిబంధనల ప్రకారం కుక్కలను చంపడం నేరం అని అందుకే వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామని అన్నారు.

ఫొటో క్యాప్షన్, కాజీపేట రైల్వే పార్కు వద్ద కుక్కలు దాడి చేసిన ప్రదేశం గ్రేటర్ వరంగల్ పరిధిలో వీధి కుక్కల తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు , నాయకులు చెబుతున్నట్టుగా కుక్కల బర్త్ కంట్రోల్ కార్యక్రమం సరిగా జరగడం లేదని‘ఫోరం ఫర్ బెటర్ వరంగల్’ అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ బీబీసీ తో అన్నారు.
‘’గతంలో చాలా సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే వారు లేరు. రికార్డుల పరంగాగ్రేటర్ వరంగల్ పరిధిలో 19 వేల కుక్కలున్నాయి. వీటిలో 7 వేలకుపైగా కుక్కలకు చర్మ సంబంధ వ్యాధులు సోకాయి. నెలకు 600 కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహించాల్సి ఉంది.ఇప్పుడు చింతగట్టు లో ఉన్న కుక్కల బర్త్ కంట్రోల్ సెంటర్లో సరిపడా సిబ్బంది లేరు. మరో సెంటర్ కూడా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. అయితే అది కార్యరూపం దాల్చడం లేదు’’ అని సుధాకర్ అన్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్: 'ప్రతిపక్షాలు ఏకమైతే దేశానికి మంచిది'

ఫొటో సోర్స్, Getty Images
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు.
''కర్ణాటకలో అద్భుత విజయం సాధించారు. ముఖ్యమంత్రితో మాకు గతంలోనే పరిచయం ఉంది. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆయన ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పిలిచారు. వస్తానని చెప్పా'' అని నితీశ్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయా? అని అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిచ్చారు.
''ప్రస్తుతం దీనితో కలుస్తున్నాం. అది జరిగినప్పుడు చెబుతాను. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే దేశానికి మంచిది. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని ఆయన చెప్పారు.
అయితే, ప్రతిపక్షాల ఐక్యతలో కీలకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సిద్దరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడం లేదు. ఆమె స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ నేత కకోలి ఘోష్ హాజరుకానున్నారు.
మరోవైపు, కర్ణాటక కాబోయే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిల్లీ చేరుకున్నారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర సీనియర్ నేతలను వ్యక్తిగతంగా ఆహ్వానించేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు.
తెలుగు ఐఏఎస్ అధికారి హత్య కేసు దోషి ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై విచారణ

ఫొటో సోర్స్, ANI
బిహార్‌కు చెందిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు బిహార్ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది.
తెలుగు ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ సింగ్‌ను బిహార్ ప్రభుత్వం విడుదల చేసింది.
బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కృష్ణయ్య భార్య ఉమ కృష్ణయ్య సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను మే 8వ తేదీన విచారణ జరిపిన సుప్రీం కోర్టు రెండు వారాల్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది.
వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని బిహార్ ప్రభుత్వం శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. అందుకు కోర్టు సమ్మతించింది.
తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది.
నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్రమాణం చేయిస్తున్న సీజేఐ డీవై చంద్రచూడ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వారితో ప్రమాణం చేయించారు.
జస్టిస్ కేవీ విశ్వనాథన్ 2030 ఆగస్టులో భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడయ్యే అవకాశముంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘పచ్చళ్ల పల్లె': ఇక్కడ ఏటా టన్నుల కొద్దీ పచ్చళ్లు పెడతారు
ఇస్లామాబాద్: ఒంటరి వ్యక్తులకు అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా!
హుస్సేన్ రాణా ఎవరు... అమెరికా ఆయనను భారత్‌కు ఎందుకు అప్పగిస్తోంది?
అస్సాం: బహుభార్యత్వాన్ని నిషేధిస్తామంటున్న ప్రభుత్వం.. ముస్లింలలో భయం
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసలైతే జరిగేది ఇదే
ఏదైనా జరిగితే మమ్నల్ని నిందించొద్దు: తృణమూల్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, THE KERALA STORY
‘ది కేరళ స్టోరీ’ సినిమా మీద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విధించిన నిషేధంపై సుప్రీం కోర్టు గురువారం స్టే ఇచ్చింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ- ఈ వివాదాస్పద సినిమా ప్రదర్శన వల్ల రాష్ట్రంలో ఏదైనా జరిగితే ప్రతిపక్ష పార్టీలు తమను నిందించవద్దని టీఎంసీ వ్యాఖ్యానించింది.
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంపై నిషేధం విధించినట్లు తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది.
''సినిమా విడుదలైన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ప్రతిపక్షాలు దీన్ని తమ విజయంగా, ప్రభుత్వ ఓటమిగా భావించాల్సిన పనిలేదు'' అని తృణమూల్ కాంగ్రెస్ నేత శశి పంజా చెప్పారు.
సినిమా ప్రదర్శనపై ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తివేయడాన్ని ప్రతిపక్ష బీజేపీ స్వాగతించింది. ఈ నిర్ణయం తృణమూల్ కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలను బట్టబయలు చేసిందని తెలిపింది.
రాజకీయ లబ్ధి కోసమే ఈ సినిమాపై మమతా బెనర్జీ నిషేధం విధించారని సీపీఎం కూడా విమర్శించింది.
హిరోషిమాలో జీ-7 దేశాల సమావేశాలు, హాజరుకానున్న ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, GETTY IMAGES
జపాన్‌లోని హిరోషిమా నగరంలో మే 19 నుంచి 21 వరకు జీ -7 దేశాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు.
హిరోషిమాలో జీ -7 సమావేశాలు నిర్వహించేందుకు జపాన్‌కు ప్రత్యేకమైన కారణముంది. ఇక్కడ సమావేశాలు నిర్వహించడం ద్వారా శాంతి, అణు నిరాయుధీకరణ సందేశం ఇవ్వాలని జపాన్ భావిస్తోంది.
1945 ఆగస్టు 6న ప్రపంచంలో తొలి అణుబాంబు హిరోషిమాపై పడింది. ఈ ఘటనలో వేల మంది చనిపోయారు. చాలా మంది వికలాంగులయ్యారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా స్వస్థలం కూడా హిరోషిమానే.
యుక్రెయిన్‌తో యుద్ధంలో అణ్వాయుధాలు ప్రయోగించొద్దని పాశ్చాత్య దేశాలు రష్యాను హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ జీ-7 సమావేశాలు జరగనున్నాయి.
మరోవైపు ఉత్తర కొరియా కూడా అణు క్షిపణి పరీక్షలను పెంచింది.
జీ-7 ప్రధానంగా పారిశ్రామిక దేశాల కూటమి. ఇందులో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ సభ్యదేశాలు. యూరోపియన్ యూనియన్ నుంచి ఇద్దరు ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు.
జీ-7లో సభ్యత్వం లేని దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది.
