ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయండంతో ఇస్లామాబాద్ నగరంలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఆర్మీ ప్రాంతంలోకి చొచ్చుకెళ్ళారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అనంతరం ఇస్లామాబాద్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి.
ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేపట్టిన ఈ నిరసనల్లో అయిదుగురు పోలీసులు గాయపడ్డారని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘించిన 43 మంది నిరసనకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇమ్రాన్ అరెస్ట్ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) తమ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

సాయంత్రం 4 గంటల తర్వాత జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ ఇంటి బయట పీటీఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత మరింత మంది నిరసనకారులు పోగయ్యారు.
తాము లాహోర్ కంటోన్మెంట్‌లోకి ప్రవేశిస్తామని నిరసనకారులు చెప్పారు.
సాయంత్రం 5 గంటల సమయంలో ఒక గేటు ద్వారా నిరసనకారులు కంటోన్మెంట్ లోపలికి వెళ్లారు.
కంటోన్మెంట్ సమీపంలో ఉన్న వాహనాలకు ఆందోళనకారులు తగులబెట్టారు.
అక్కడ కూడా పోలీసులకు, నిరసనకారుల మధ్య గొడవ జరిగింది. వాహనాలకు నిప్పు పెట్టే సమయంలో అక్కడ పేలుళ్లు కూడా సంభవించాయి.

ఫొటో సోర్స్, ANI
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చైర్మన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు.
ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల భద్రతా బలగాలు మంగళవారం ఆయనను అరెస్టు చేశాయి.
అల్-కాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఇస్లామాబాద్ ఐజీ ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్ట్ తర్వాతపాకిస్తాన్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
నగరంలో 144 సెక్షన్ విధించామని, దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇస్లామాబాద్ పోలీసులు హెచ్చరించారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టు ఆవరణ నుంచి అపహరించారని పార్టీ నేత ఫవాద్ చౌదరీ ఒక ట్వీట్ చేశారు.
లాయర్లను, సామాన్యులను హింసించిన గుర్తు తెలియని వ్యక్తులు, ఇమ్రాన్ ఖాన్‌కు జాడ తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఆయన అందులో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముజఫర్ నగర్ అల్లర్ల సందర్భంగా జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు ఇద్దరు నిందితులను దోషులుగా గుర్తించినట్లు లైవ్ లా వెబ్‌సైట్ ఓ ట్వీట్‌లో పేర్కొంది.
ఘటన జరిగిన సమయంలో బాధితురాలి వయసు 27 సంవత్సరాలు.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ కేసుపై కోర్టు తుది తీర్పును సిద్ధం చేసింది.
ఐపీసీలోని సెక్షన్ 376(2)(జి), 376-డి, 506 నిందితులను దోషులుగా నిర్ధరించింది.

ఫొటో సోర్స్, ANI
మధ్యప్రదేశ్‌లో ఖర్గోన్ జిల్లాలో ఓ వంతెనపై నుంచి బస్సు కిందపడిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు.
ప్రమాద బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఖర్గోన్ ఎస్పీ ధరమ్ వీర్ సింగ్ చెప్పినట్టు ఏఎన్ఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. కర్ణాటక సార్వభౌమత్వంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టుపై వివరణ ఇవ్వాలని కోరింది.
వాస్తవానికి, కర్ణాటక సార్వభౌమత్వం అనే పదాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ప్రసంగంలో ఉపయోగించారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ట్విటర్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు. కర్ణాటక ప్రతిష్టకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగించే వారిని కాంగ్రెస్ పార్టీ అనుమతించదని ఆ పోస్టులో రాశారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఒక రాష్ట్ర సార్వభౌమత్వం గురించి మాట్లాడడమంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని విభజించడమేనని బీజేపీ అంటోంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని బీజేపీ నేత తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కర్ణాటకను దేశం నుంచి వేరు చేయాలని కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.