తెలంగాణలో ప్రియాంక గాంధీ: 'నీళ్ళు, నిధులు అన్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే'
తెలంగాణలో నీళ్ళు, నిధులు పాలక బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు మాత్రమే లభిస్తున్నాయని, యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను కూడా పాలక పక్ష కుటుంబ సభ్యులకు, వారి బంధు మిత్రులకు ఇస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
తెలంగాణలో ప్రియాంక గాంధీ: 'నీళ్ళు, నిధులు అన్నీ పాలక బీఆర్ఎస్ పార్టీ వారికే'

ఫొటో సోర్స్, ANI
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘యువ సంఘర్ష్ ర్యాలీ’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో మాట్లాడుతూ, “తెలంగాణలో నీళ్ళు, నిధులు పాలక బీఆర్ఎస్ పార్టీ సభ్యులకు మాత్రమే లభిస్తున్నాయి” అని ప్రియాంకఅన్నారు. తెలంగాణలో యువతకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను కూడా పాలక పక్ష కుటుంబ సభ్యులకు, వారి బంధు మిత్రులకు ఇస్తున్నారని ప్రియాంక ఆరోపించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యువ సంఘర్ష్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ప్రియాంక గాంధీకి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జైబోలో తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రియాంక గాంధీ, “తెలంగాణ అంటే ఇక్కడి ప్రజలకు మ్యాప్‌లో ఒక ప్రాంతం మాత్రమే కాదు. ఈ నేల వారికి అమ్మతో సమానం” అని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని సోనియమ్మ బిడ్డగా మాట ఇస్తున్నానని ప్రియాంక అన్నారు.
జర్మనీ: భారీ వంతెన క్షణాల్లో ఎలా కుప్పకూలిందో చూడండి...
ఐశ్వర్య తాటికొండ: టెక్సస్ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీ, ఆమె ఫ్రెండ్‌కూ బుల్లెట్ గాయాలు
ది కేరళ స్టోరీ చిత్రాన్న బ్యాన్ చేసిన పశ్చిమ బెంగాల్

ఫొటో సోర్స్, The Kerala Story
ది కేరళ స్టోరీ సినిమాను బ్యాన్ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్వేషపూరితమైన ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందిని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ సమాచారం ప్రకారం, “ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఏంటి? అది ఒక వర్గాన్ని అవమానించేందుకు తీశారు. ఇప్పుడీ కేరళ స్టోరీ ఏంటి? వాస్తవాలను వక్రీకరిస్తూ అల్లిన కథ” అని మమతా బెనర్జీ అన్నారు.
దీనిపై ది కేరళ స్టోరీ నిర్మాత విపుల్ షా స్పందిస్తూ, “ఆమె ఈ నిర్ణయం తీసుకుంటే, మేం చట్ట ప్రకారం సవాలు చేస్తాం” అని అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘించిన థియేటర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. తమిళనాడులో కూడా థియేటర్ల యాజమాన్యం ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించింది.
ది కేరళ స్టోరీ చిత్రానికి దర్శకుడు సుదీప్తో సేన్. ఈ చిత్రం గత శుక్రవారం (మే 5)విడుదలైంది. అప్పటి నుంచి అది సినీ, రాజకీయవర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. హిందూ మహిళలు ఇస్లాం స్వీకరించి ఐఎస్‌లో చేరడమనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
పాకిస్తాన్: ఉచిత ఆహారం కోసం క్యూ కడుతున్న ప్రజలు... రాజకీయ కలహాలే ఆ దేశాన్ని చిందరవందర చేస్తున్నాయా?
సుప్రీం కోర్టు: ‘‘మణిపుర్ హింస ఒక మానవతా సంక్షోభం’’, సుచిత్ర కె మొహంతి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, ANI
మణిపుర్‌లో తలెత్తిన హింస ఒక మానవతా సంక్షోభం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ హింసలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
మణిపుర్‌లో హింసపై తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా దాఖలైన పలు పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారించింది.
‘‘ఇది ఒక మానవతా సంక్షోభం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మా తక్షణ లక్ష్యం ప్రజలకు రక్షణ, పునరావాసం కల్పించడం. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి’’ అని చీఫ్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
కర్ణాటక ఎన్నికలు: బీజేపీ మళ్లీ వస్తుందా, కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందా? గ్రాఫిక్స్‌లో రాజకీయ ముఖచిత్రం
గాలి జనార్దన రెడ్డి: బళ్లారిలో పట్టు నిలుపుకుంటారా?
మీరు ఇలాంటి ఖురాన్ ఎప్పుడూ చూసి ఉండరు
తెలంగాణ: రబీ సాగును ముందుకు జరపాలని కేసీఆర్ ఎందుకు అంటున్నారు? ఇది రైతులకు ప్రయోజనకరమేనా?
కళ్యాణ కర్ణాటక: ఈ ‘పాత హైదరాబాద్’ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు డిమాండ్ చేస్తోంది?
మణిపుర్‌లో హింసకు తెగల మధ్య కొట్లాటే కారణమా?
రాజస్థాన్: మిగ్-21 యుద్ధ విమానం కూలి, ఇద్దరు మహిళలు మృతి

ఫొటో సోర్స్, BBC/MOHARSINGHMEENA
భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ సమీపంలో కూలిపోయింది.
ఈ యుద్ధ విమానం బహ్లోల్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంటిపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు.
పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ రోజు ఉదయం సాధారణ శిక్షణలో భాగంగా విమానం ఎగురుతున్నప్పుడు ఈ దుర్ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరో రెండు రోజుల్లో తుపాను వచ్చే అవకాశం

ఫొటో సోర్స్, Getty Images
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
రేపు, ఎల్లుండిలోగా అల్పపీడనం వాయుగుండగా మారి, ఉత్తరదిశగా కదులుతూ తుపానుగా మారేందుకు అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
మోచా తుపాను బంగ్లాదేశ్, మియన్మార్ తీరాల దిశగా వెళ్లే అవకాశాలున్నాయని, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రస్తుతానికి ఉత్తర దిశగా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కదులుతూ ఉందని తెలిపారు.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇవాళ సాయంత్రం లోగా ఒడ్డుకు చేరుకోవాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అత్యవసర సహయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇవాళ నుంచి రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి లేదా ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురవవచ్చని, పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
కేరళ: మళప్పురంలో టూరిస్ట్ బోటు తిరగబడి 21 మంది మృతి

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, తానూర్ తీరంలో బోటు ప్రమాదం కేరళలోని మళప్పురం జిల్లాలో టూరిస్ట్ బోటు బోల్తా పడిన ఘటనలో 21 మంది చనిపోయారు. ఆదివారం సాయంత్రం తానూర్ తీరంలో ఈ ఘటన జరిగింది.
మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు.
పడవలో ఎంత మంది ఉన్నారో కచ్చితంగా తెలియదని, ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికితీశామని రీజనల్ ఫైర్ రేంజ్ ఆఫీసర్ షిజు కేకే ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ఎవరైనా బురదలో కూరుకుపోయుంటే కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు.
"ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాం. వీటిని క్యాబినెట్ మంత్రులు పర్యవేక్షిస్తున్నారు" అని ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బాధిత కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.
ఐపీఎల్: చివరి బంతికి 'ఓడి' గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images
ఆదివారం జైపూర్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తృటిలో ఓటమి తప్పించుకుంది. చివరి బంతికి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జో బట్లర్ ధాటిగా మ్యాచ్ ప్రారంభించారు. జైస్వాల్ (17 బంతుల్లో 35 పరుగులు) ఔటయిన తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
పదకొండు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. జోస్ బట్లర్ 32 బంతులల్లో అర్ధ శతకం పూర్తిచేశాడు. పది ఫోర్లు, నాలుగు సిక్స్‌లు కొట్టాడు.
సంజూ శాంసన్ నాలుగు ఫోర్లు, అయిదు సిక్స్‌లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఫొటో సోర్స్, Getty Images
సన్‌రైజర్స్ 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు అన్మోల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ 50 పరుగుల స్థిరమైన భాగస్వామ్యాన్ని అందించారు.
ఆరో ఓవర్‌లో అన్మోల్‌ప్రీత్ (25 బంతుల్లో 33 పరుగులు) అవుటయ్యాడు.
తరువాత రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మతో కలిసి నిలకడగా ఆడాడు. కానీ, 14వ ఓవర్‌కు కొట్టాల్సిన రన్ రేట్ 14 పరుగులకు పెరిగింది.
హెన్రిచ్ క్లాసెన్ (12 బంతుల్లో 26 పరుగులు), గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25 పరుగులు) కొన్ని కీలకమైన పరుగులు జోడించినప్పటికీ, చివరి ఓవర్‌కు మ్యాచ్ క్లిష్టంగా మారింది.
చివరి ఆరు బంతుల్లో హైదరాబాద్‌కు 17 పరుగులు కావాలి. జట్టు ఓటమి అంచున నిలబడింది.
కానీ ఆఖరి బంతికి మ్యాచ్ ఊహించని ములుపు తిరిగింది. రాజస్థాన్ బౌలర్ సందీప్ వేసిన బంతిని సమద్ నేరుగా పైకి కొట్టాడు. బంతిని లాంగ్ ఆఫ్‌లో ఉన్న ఫీల్డర్ క్యాచ్ పట్టాడు. ఔట్ అంటూ సందీప్ వేలు పైకెత్తి చూపించాడు.
ఆ బంతికి సమద్ ఔటయ్యాడనే అంతా అనుకున్నారు. కానీ, అది నో బాల్‌గా తేలింది. దాంతో, ఊపిరి పీల్చుకున్న సమద్, తర్వాతి బంతికి సిక్స్ కొట్టాడు. నాలుగు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించింది.
ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో ఓడిపోయింది. తాజా విజయంతో ప్లేఆఫ్‌లో నిలిచే అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది.
నమస్కారం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
