You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మణిపుర్ ఘర్షణలలో 52 మంది మృతి

ఆర్టికల్ 355 ప్రకారం శాంతిభద్రతల నిర్వహణ కోసం కేంద్రం అత్యవసర పరిస్థితి విధించినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, వదంతులు వ్యాపింపజేసేవారిపై చర్యలు తీసుకుంటామని మణిపుర్ ప్రభుత్వ భద్రత అధికారి కుల్దీప్ సింగ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. మణిపుర్‌: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?

  3. అమ్మాయిల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు, ఎలా బయటపడిందంటే...

  4. గర్భధారణలో ఆ 14 రోజుల రహస్యం ఏంటి? అది తెలిస్తే కృత్రిమ మానవుల్ని సృష్టించడం సాధ్యమవుతుందా?

  5. బ్రిటన్ కింగ్ చేతికి కత్తిని అందించిన ఈ మహిళ ఎవరు, ఏం చేస్తారు?

  6. ఆనంద్ మహీంద్రా - రాజమౌళి: సింధు నాగరికతపై సినిమాను పాకిస్తాన్ ఎలా అడ్డుకుందంటే....

  7. మణిపుర్‌ ఘర్షణలు: 52కి పెరిగిన మృతుల సంఖ్య

    మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. కుకి, మెయితెయ్ తెగల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

    హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు.

    భద్రతాదళాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన హింసను వెంటనే అదుపులోకి తేవాలని సూచించారు.

    రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడుతోందని సీఎం చెప్పారు.

    కొన్ని చోట్ల కర్ఫ్యూను ఎత్తివేశారు.

    మరోవైపు ఆర్టికల్ 355 ప్రకారం శాంతిభద్రతల నిర్వహణ కోసం కేంద్రం అత్యవసర పరిస్థితి విధించినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని, వదంతులు వ్యాపింపజేసేవారిపై చర్యలు తీసుకుంటామని మణిపుర్ ప్రభుత్వ భద్రత అధికారి కుల్దీప్ సింగ్ చెప్పారు.

  8. ‘రష్యా మాపై ఫాస్ఫరస్ బాంబు ప్రయోగించింది’ – యుక్రెయిన్

    రష్యా ఫాస్ఫరస్ బాంబులు వేసిందని యుక్రెయిన్ ఆరోపించింది. బఖ్‌మూత్‌ నగరంపై రష్యా ఇలాంటి దాడులు చేసినట్లు యుక్రెయిన్ ఆరోపించింది.

    బఖ్‌మూత్ నగరం తగలబడుతున్నట్లు, తెల్ల భాస్వరం(వైట్ ఫాస్ఫరస్) పైనుంచి కురుస్తున్నట్లుగా యుక్రెయిన్ మిలటరీ విడుదల చేసిన డ్రోన్ ఫుటేజ్‌లో కనిపిస్తోంది.

    వైట్ ఫాస్ఫరస్ ఆయుధాలపై నిషేధం లేనప్పటికీ జనావాసాలపై వీటిని ప్రయోగించడాన్ని యుద్ధ నేరంగా పరిగణిస్తారు.

    ఆర్పడానికి కష్టమయ్యే మంటలను ఈ ఫాస్ఫరస్ బాంబులు తొందరగా వ్యాపింపజేస్తాయి. రష్యా ఇలాంటి బాంబులను గతంలోనూ వాడినట్లు ఆరోపణలున్నాయి.

    వ్యూహాత్మక ప్రయోజనాలపై ప్రశ్నలున్నప్పటికీ బఖ్‌మూత్‌ను చేజిక్కించుకోవడానికి రష్యా కొద్ది నెలలుగా ప్రయత్నిస్తోంది.

    ఈ దాడిలో వేల మంది రష్యా సైనికులు మరణించినట్లు పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి.

    రష్యా అధీనంలో లేని బఖ్‌మూత్ ప్రాంతాలపై ఆ దేశం మంటలు రేపే ఆయుధాలను ప్రయోగించిందని యుక్రెయిన్ రక్షణ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది.

    ఇది ఎప్పుడు జరిగిందనేది స్పష్టత లేనప్పటికీ ఎత్తయిన భవనాలు, చుట్టూ మంటలు కనిపిస్తున్న ఈ వీడియోను సర్వేలెన్స్ డ్రోన్లతో చిత్రీకరించినట్లు కనిపిస్తోంది.

    చెలరేగుతున్న మంటలు, తెల్లని మేఘాల వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

  9. అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

    అమెరికాలోని డాలస్‌, టెక్సస్‌కు ఉత్తరాన ఉన్న ఓ మాల్‌లో సాయుధుడు ఒకరు కాల్పులు జరపడంతో 8 మంది మరణించినట్లు అత్యవసర సేవల విభాగం తెలిపింది.

    కాల్పుల తరువాత అలెన్ నగరంలోని ఈ మాల్ నుంచి వందల మంది సురక్షితంగా తరలించారు.

    బాధితులలో కొందరు చిన్నారులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

    కాల్పులకు పాల్పడిన సాయుధుడిని హతమార్చినట్లు పోలీసులు చెప్పారు.

    కాల్పుల్లో గాయపడిన ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.