గూగుల్‌కు దిల్లీ హైకోర్ట్ ఆదేశం: 'మసాలా దినుసుల్లో ఆవు మూత్రం ఉందని చెప్పే వీడియోలను తొలగించాలి'

భారతీయ మసాలా దినుసుల్లో ఆవు పేడ, ఆవు మూత్రం ఉంటాయని చెబుతున్న ఇబ్బందికరమైన యూట్యూబ్ వీడియోలను తొలగించాలని దిల్లీ హైకోర్టు గూగుల్‌ను ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.

    న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.

    ధన్యవాదాలు

  2. రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు జడ్జికి ప్రమోషన్

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    సుచిత్ర కె మొహంతి, బీబీసీ కోసం

    'మోదీ సర్‌నేమ్' కేసులో రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ కోర్టు సీజేఎం హరీష్ హెచ్ వర్మ్‌కు ప్రమోషన్ వచ్చింది.

    మోదీ ఇంటి పేరు 2019 నాటి ఒక క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

    మోదీ ఇంటిపేరును అవమానించారని రాహుల్‌పై అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించి, తీర్పు ఇచ్చిన సూరత్ కోర్టు జడ్జి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) హరీష్ హస్‌ముఖ్‌భాయ్ వర్మకు రాజ్‌కోట్ అదనపు జిల్లా న్యాయమూర్తి (ఏడీజే)గా ప్రమోషన్ వచ్చింది.

    గుజరాత్ ప్రభుత్వ న్యాయ శాఖ జారీ చేసిన 68 మంది న్యాయమూర్తుల బదిలీలు, పదోన్నతుల జాబితాలో 43 ఏళ్ల జడ్జి వర్మ పేరును కూడా చేర్చారు. గుజరాత్ రాష్ట్ర న్యాయ శాఖ 65 శాతం కోటా విధానంలో 68 మంది న్యాయమూర్తులకు పదోన్నతులు, బదిలీలు ఇచ్చింది.

    ఇందులో భాగంగా సీజేఎం వర్మతో పాటు సూరత్, జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన మరో అయిదుగురు న్యాయమూర్తులకు పదోన్నతి లభించింది.

    జడ్జి వర్మ స్వస్థలం వడోదర. మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌లెబీ పూర్తిచేశారు. 2008లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అయ్యారు.

  3. గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీయడానికి కారణాలేంటి... ఇతర విమానయాన సంస్థలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది?

  4. పసిపిల్లలు ఒకరి తరువాత ఒకరు చనిపోతూనే ఉన్నారు... ఏమిటీ దారుణం?

  5. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  6. గూగుల్‌కు దిల్లీ హైకోర్ట్ ఆదేశం: 'మసాలా దినుసుల్లో 'ఆవు మూత్రం' వీడియోలను తొలగించాలి'

    spices

    ఫొటో సోర్స్, Getty Images

    క్యాచ్ కంపెనీ సహా ఇతర కంపెనీలు తయారు చేస్తున్న భారతీయ మసాలా దినుసుల్లో ఆవు పేడ, ఆవు మూత్రం కలిసి ఉంటుందని చెబుతున్న ఇబ్బందికరమైన యూట్యూబ్ వీడియోలను తొలగించాలని దిల్లీ హైకోర్టు గూగుల్‌ను ఆదేశించింది.

    ఆ వీడియోలు కంపెనీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశపూర్వకంగా అప్‌లోడ్ చేసినవేనని భావిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని, మూడు వీడియోలను తొలగించామని గూగుల్ కోర్టుకు తెలిపింది.

    భారతీయ మసాలా దినుసుల గురించి టీవైర్, వ్యూ న్యూస్ చానెళ్లు అభ్యంతరకరమైన, తప్పుడు సమాచారాన్ని అప్‌లోడ్ చేశాయని, క్యాచ్ కంపెనీ విషయంలో తప్పుడు సమాచారంతో వీడియోలు అప్‌లోడ్ చేశాయని కోర్టు వ్యాఖ్యానించింది.

    భారతీయ మసాలా దినుసుల్లో ఆవు పేడ, ఆవు మూత్రం కలిసి ఉంటాయని చెబుతున్న వీడియో తమ దృష్టికి వచ్చినట్లు కంపెనీ కోర్టుకు తెలిపింది.

  7. ఆంధ్రప్రదేశ్: చిత్తూరు చింతపండు ఎందుకు తగ్గిపోతోంది... చింత చెట్లు ఏమైపోతున్నాయి?

  8. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళన

    కర్ణాటక రాజకీయ వేడి తెలంగాణకు తగిలింది. కర్ణాటకలో ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐతో పాటూ, హిందూత్వ సంస్థ భజరంగ్ దళ్‌ని కూడా నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది.

    దీనిపై కర్ణాటకలో బీజేపీ తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తోంది.

    ఆ క్రమంలోనే తెలంగాణ బీజేపీ విభాగం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

    హైదరాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలు ఒకే రోడ్డులో ఉంటాయి.

    పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయం దగ్గరకు రావడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

    పరస్పరం రెండు పార్టీల వారూ పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. కూతురి హత్య కేసులో న్యాయం కోసం ఓ తండ్రి 26 ఏళ్ల పోరాటం, చివరకెలా ముగిసిందంటే...

  10. చార్‌ధామ్: కేదార్‌నాథ్ మార్గంలో విరిగిపడ్డ మంచుచరియలు, కాలినడక భక్తులు వెళ్లొద్దని అధికారుల సూచన

    కేదార్‌నాథ్ ఆలయం

    ఫొటో సోర్స్, Getty Images

    చార్‌ధామ్ యాత్రలో, కేదార్‌నాథ్ మార్గంలో మంచు చరియలు విరిగిపడడం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, యాత్ర నిర్వాహకులకు సవాల్‌గా మారింది.

    కేదార్‌నాథ్ మార్గంలోని భైరవ్ మంచుచరియలు గురువారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో విరిగిపడ్డాయి. దీంతో కేదార్‌‌నాథ్ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా మూసుకుపోయింది.

    మంచుచరియలు విరిగిపడడంతో కాలినడకన వెళ్లే భక్తులను అధికారులు నిలిపేశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

    ''బుధవారం సాయంత్రం భైరవ్ గడెరె, కుబేర్ మంచుచరియలు విరిగిపడడంతో కేదార్‌నాథ్ మార్గం మూసుకుపోయింది. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డీడీఆర్ఎఫ్, వైఎంఎ‌ఫ్, స్థానిక పోలీసులు కలిసి మంచును తొలగించి రాకపోకలు పునరుద్ధరించాం'' అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రజ్వార్ చెప్పారు.

    మంచు

    ఫొటో సోర్స్, asif ali

    అయితే గురువారం మళ్లీ భైరవ్ మంచుచరియలు విరిగిపడడంతో కేదార్‌నాథ్ మార్గం పూర్తిగా మూసుకుపోయినట్లు నందన్‌ సింగ్ చెప్పారు.

    కేదార్‌నాథ్‌ మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లొద్దని జిల్లా అధికార యంత్రాంగం సూచించిందని ఆయన తెలిపారు.

    హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునేవారు కేదార్‌నాథ్ వెళ్లొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

  11. అధ్యక్ష భవనంపై దాడి అమెరికా పనేనన్న రష్యా, తిరస్కరించిన యూఎస్

    క్రెమ్లిన్‌పై దాడి

    ఫొటో సోర్స్, social

    క్రెమ్లిన్‌పై దాడుల వెనక మాస్టర్ మైండ్ అమెరికానేనంటూ రష్యా చేసిన ఆరోపణలను యూఎస్ తిరస్కరించింది.

    అమెరికా సాయంతోనే యుక్రెయిన్ ఈ దాడులు చేసిందని గురువారం పుతిన్ ప్రతినిధి ఆరోపణలు చేశారు.

    ఈ దాడులకు ఒక రోజు ముందు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకు యుక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది.

    అయితే, రష్యా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తోందని యూఎస్ రక్షణ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

    అదే సమయంలో, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని యుక్రెయిన్ ప్రకటించింది. ఈ సాకుతో యుద్ధాన్ని మరింత ఉధృతం చేసేందుకు రష్యా తమపై నెపం మోపుతోందని యుక్రెయిన్ వాదిస్తోంది.

    క్రెమ్లిన్‌పై దాడి జరిగిన సమయంలో పుతిన్ ఆ భవనంలో లేరు.

    మరోవైపు యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. సౌత్ ఖేర్సన్‌లో బుధవారం 21 మంది చనిపోయారు.

    వ్లాదిమిర్ పుతిన్

    ఫొటో సోర్స్, Getty Images

    ''క్రెమ్లిన్‌పై దాడి జరిగింది. క్రెమ్లిన్ భవనం డోమ్‌పై డ్రోన్ మిస్సైల్‌ దాడి ఘటన వీడియో కూడా వైరల్ అవుతోంది. మిస్సైల్ దాడితో అక్కడ భారీగా పొగ వ్యాపించింది.'' అని రష్యా అధ్యక్షుడి ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ బుధవారం చెప్పారు.

    ఈ దాడి వెనక అమెరికా ఉందని నిస్సహందేహంగా చెప్పగలమని పెస్కోవ్ గురువారం ఆరోపించారు. అయితే, అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన విడుదల చేయలేదు.

    ''అలాంటి దాడులు కీవ్‌లో ప్లాన్ చేసినవి కావు, వాషింగ్టన్‌లో చేసినవి'' అని పెస్కోవ్ ఆరోపించారు. అయితే, పెస్కోవ్ అబద్ధాలు చెబుతున్నారని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ కొట్టిపారేశారు.

  12. మణిపూర్ : ఉద్రిక్తతల కారణంగా రైళ్లు నిలిపేసిన రైల్వే శాఖ

    ఈశాన్య సరిహద్దు రైల్వే

    ఫొటో సోర్స్, ANI

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో చెలరేగిన హింస, ఉద్రిక్తత పరిస్థితుల ఉద్రిక్తంగా మారాయి.

    మీటీ అనే తెగవారిని ఎస్టీ జాబితాలో కలపాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసనలతో హింస చెలరేగింది. మణిపూర్‌లోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కేంద్ర బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐదు రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

    శాంతిభద్రతల సమస్య కారణంగా మణిపూర్ మీదుగా వెళ్లే రైళ్లను ఈశాన్య సరిహద్దు రైల్వే నిలిపేసింది.

    ''మణిపూర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకూ రైళ్లు నడపడం లేదు. మణిపూర్ ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం.'' అని ఈశాన్య సరిహద్దు రైల్వే డిప్యూటీ సీపీఆర్వో సవ్యసాచి చెప్పినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది