బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
దిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Twitter/BRS Party
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ తన కేంద్ర కార్యాలయాన్ని దిల్లీలో ఈరోజు ప్రారంభించింది.
దిల్లీలోని వసంత్ విహార్‌లో ఈ కార్యాలయ భవనాన్ని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తన చేతుల మీదుగా ప్రారంభించారు.
కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నాలుగు రోజుల క్రితమే అంటే ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ నూతన సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, THE KERALA STORY
ది కేరళ స్టోరీ సినిమా విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలనే అభ్యర్థనను సుప్రీం కోర్టు మరోసారి తిరస్కరించింది.
ది కేరళ స్టోరీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పార్దివాలా బెంచ్ తిరస్కరించింది.
''నటీనటులు, నిర్మాతల కష్టాన్ని ఆలోచించాలి. ఒక సినిమా తీసేందుకు ఎంతో సమయం, డబ్బు వెచ్చిస్తారు. ఆ సినిమాను మార్కెట్‌కి వదిలేయండి. మార్కెట్‌లో ఆ సినిమా సంగతేంటో తెలిసిపోతుంది.'' అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు కేరళ హైకోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే, ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది.
మిలిటెంట్ సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) వేల సంఖ్యలో యువతులను ఎలా బ్రెయిన్ వాష్ చేస్తోంది, వాళ్లు సిరియా, అఫ్ఘానిస్తాన్ ఎలా వెళ్తున్నారనే విషయాలు కథాంశంగా 'ది కేరళ స్టోరీ' సినిమా తెరకెక్కింది. ఆదా శర్మ నటించిన ఈ సినిమా మే 5న విడుదలకు సిద్ధమైంది.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
బిహార్‌లో జరుగుతున్న కులగణనపై పట్నా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఇది మధ్యంతర ఉత్తర్వు మాత్రమేనని, ఈ కేసులో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసు తదుపరి విచారణ జూలై 3వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కులగణన వివరాలు విడుదల చేయొద్దని బిహార్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన, ఆర్థిక సర్వే రాజ్యాంగ విరుద్ధమని దాఖలైన పిటిషన్‌పై పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ కేవీ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది.
చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు, కులప్రాతిపాదికన ఆర్థిక సర్వే చేయొచ్చా? అది చట్టం పరిధిలో ఉందా? ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని హైకోర్టు ప్రశ్నించింది.
ఈ సర్వే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని పిటిషనర్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వం కులం ఆధారంగా జనాభా లెక్కలు, ఆర్థిక సర్వే చేపట్టిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
వాదనలు విన్న న్యాయస్థానం కులగణనపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter
మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సాయం చేయాలని బాక్సింగ్ ప్లేయర్ మేరీ కోమ్ గురువారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మణిపూర్‌లో బుధవారం గిరిజనుల నిరసన ప్రదర్శనలో హింస చెలరేగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెంటనే ఆర్మీ, అస్సాం రైఫిల్స్ రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలోనే మేరీ కోమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
''మా రాష్ట్రం తగలబడుతోంది. దయచేసి సాయం చేయండి'' అని ఆమె ట్వీట్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆమె ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
''ఇప్పటికే ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ను మోహరించాం. రాష్ట్ర పోలీసులు కూడా ఉన్నారు. భద్రతా బలగాలు రేపటి కల్లా హింసాత్మక పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తాయి'' అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
హింస ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో 9 మంది మరణించారు.
ఈ కాల్పుల్లో 8 మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థే ఈ కాల్పులు జరిపాడు.
కాల్పులు జరిపేందుకు కొద్దివారాల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరెవరిని చంపాలనుకుంటున్నాడో ముందే జాబితా తయారు చేసుకున్నాడని చెప్పారు.
కాల్పులు జరిపిన 13 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. బెల్‌గ్రేడ్‌లోని ఓ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులతో సహా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు. కాల్పులకు కారణమేంటనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తన తండ్రి లైసెన్స్ గన్‌తో నిందితుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనకు ముందు నిందితుడు తన తండ్రితో కలిసి పలుమార్లు షూటింగ్ రేంజ్‌కి వెళ్లాడు.
ఈ ఘటనలో నిందితుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, CHANDAN SINGH RAJPUT/BBC
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్న తమపై దిల్లీ పోలీసులు దాడి చేశారని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న రెజ్లర్లు ఆరోపించారు.
రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి నిరసనకారులు పడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. దీనిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనలో కొందరు రెజ్లర్లు, కొందరు పోలీసులు గాయపడ్డారని దిల్లీ పోలీసులు వెల్లడించారు. బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, సోమనాథ్ భారతి తమకు పడకకు ఏర్పాట్లు చేశారన్న పోలీసుల వాదనను రెజ్లర్లు తోసిపుచ్చారు. వర్షం కారణంగా తమ పరుపులు తడిశాయని, తామే స్వయంగా బెడ్ లను ఆర్డర్ చేసుకున్నామని వారు తెలిపారు.
అయితే, ఈ బెడ్‌లను నిరసన దీక్ష ప్రాంతానికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని, తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపించారు.
‘‘పోలీసుల దాడిలో ఇద్దరు రెజ్లర్ల తలలకు గాయాలయ్యాయి. మాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. దేశ ప్రజలంతా మాకు మద్ధతుగా రావాలి’’ అని రెజ్లర్ సాక్షి మలిక్ అన్నారు. ఈ ఘటనలో రెజ్లర్ రాహుల్, దుష్యంత్, ఫోగాట్‌ల తలలకు గాయాలైనట్లు రెజ్లర్లు తెలిపారు.
మరోవైపు పోలీసులు జంతర్ మంతర్‌కు వెళ్లే రెండు రోడ్లకు దాదాపు 50 మీటర్ల ముందు నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం అర్థరాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. బారికేడ్లు దాటి వెళ్లేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించలేదు.
దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా జంతర్ మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.