ఎన్‌సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
భారత జనాభాలో అనూహ్యంగా పడిపోయిన శ్రామిక మహిళ శాతం... ఎందుకిలా?
డాన్స్ క్లాసులు ఇలా కూడా ఉంటాయా... అవును, తెలిస్తే ఆశ్చర్యపోతారు
పట్టాభిషేకాలు - సంప్రదాయాలు: మోకాళ్లపై నడిచే రాణి, ఎవరూ కూర్చోని పవిత్ర సింహాసనం, దూడ చర్మంతో కిరీటం
దివాలా ప్రకటించిన ‘‘గో ఫస్ట్’’ ఎయిర్‌లైన్స్ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ విమానయాన సంస్థ ‘‘గో ఫస్ట్’’ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు తెలిపింది.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దివాలా తీసినట్లు ప్రకటించింది.
నిధుల కొరత కారణంగా మే 3, 4 తేదీల్లో విమానాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్లను సరఫరా చేయకపోవడంతో దాదాపు 50 శాతం విమానాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా గో ఫస్ట్ యాజమాన్యం నిధుల లేమితో ఇబ్బంది పడుతోంది.
గో ఫస్ట్ మార్కెట్ షేర్ మార్చి నెలలో 8.5 శాతం నుంచి 7 శాతం కంటే దిగువకు పడిపోయింది.
ప్రాట్ అండ్ విట్నీపై డెలావర్ కోర్టులో అత్యవసర పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది.
మే 3, 4 తేదీల్లో విమానాల రద్దు గురించి ప్రయాణీకులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
బెంగళూరు Vs. హైదరాబాద్: ఐటీ రంగంలో ఏది టాప్ సిటీ?
చీకోటి ప్రవీణ్: థాయ్‌లాండ్‌లో అసలేం జరిగింది.. గ్యాంబ్లర్స్ అరెస్టులపై అక్కడి పోలీసులు ఏం చెబుతున్నారు?
కర్ణాటక ఎన్నికలు: బెంగళూరు ఎందుకిలా తయారైంది?
విరాట్ కోహ్లీ X గౌతమ్ గంభీర్: ఐపీఎల్ మ్యాచ్ తర్వాత వీరిద్దరు ఎందుకు గొడవపడ్డారు?
ప్రియాంకా చోప్రా: ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏమిటి? మహిళలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
ఎన్‌సీపీ జాతీయ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రకటించారు.
"పార్టీ అధ్యక్షుడిగా ఉండకుడదని నిర్ణయించుకున్నాను. కానీ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కార్యాచరణను కొనసాగిస్తాను" అని పవార్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పవార్ రాజకీయల్లోకి అడుగుపెట్టారు. ప్రభుత్వంలో వివిధ పదవుల్లో పనిచేశారు.
1999లో కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్‌సీపీని స్థాపించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా శరద్ పవార్ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రక్షణ, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
ప్రస్తుతం ఆయన మహావికాస్ అఘాడి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇది మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యుబీటీ), ఎన్‌సీపీల కూటమి.
శరద్ పవార్‌కు రాజకీయాలతో పాటు క్రికెట్‌పై కూడా ఆసక్తి ఉంది. 2005, 2008 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. 2010-12 మధ్య అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
పవార్ తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఎన్‌సీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని పీటీఐ తెలిపింది.
వైరల్: శవాన్ని రేప్ చేయకుండా సమాధిపై ఇనుప తలుపు పెట్టారనే వార్తల్లో నిజమెంత? ఇది పాకిస్తాన్‌లోదా, హైదరాబాద్‌లోదా?
దళితులు: హిందూమతం నుంచి బౌద్ధంలోకి మారిన తర్వాత కుల వివక్ష తగ్గిందా?
'తాగుడుకు అలావాటు పడిన పోలీసు అధికారులు ఉద్యోగాలు విడిచిపెట్టాలి'

ఫొటో సోర్స్, Getty Images
అస్సాంలో తాగుడుకు అలవాటు పడిన 300 మంది పోలీస్ అధికారులు ఉద్యోగాలు విడిచిపెట్టాలని ప్రభుత్వం కోరింది.
అధిక మద్యపానం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిందని, అందుకే వారు తొందరగా రిటైర్ అవ్వాలని కోరినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
"పోలీస్ ఫోర్స్‌ను ప్రక్షాళన చేస్తామని" సీఎం శర్మ అంతకుముందు చెప్పారు.
డ్యూటీలో ఉండగా మద్యం మత్తులో తూలిన పలువురు అస్సాం అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక అందించింది.
"ఇది పాత రూలే. మేం కొత్తగా తీసుకురాలేదు, చాలా రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు" అని సీఎం శర్మ చెప్పారు.
అలాగే, "ఊబకాయం" ఉన్న అధికారులు, అవినీతి కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా వలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సీఎం శర్మ గురువారం చెప్పారు.
అధికారులు శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చూడాలని పోలీస్ చీఫ్‌లను కోరారు.
వైఎస్‌ఆర్ వాహనమిత్ర: ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇచ్చే పథకం.. దరఖాస్తు ఇలా
రష్యా-యుక్రెయిన్ యుద్ధం: అయిదు నెలల్లో 20 వేల మంది రష్యా సైనికులు చనిపోయారన్న అమెరికా

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో 2022 డిసెంబర్ నుంచి 20 వేల మందికి పైగా రష్యా సైనికులు హతమయ్యారని అమెరికా అంచనా వేస్తోంది.
అంతే కాకుండా, 80 వేల మంది గాయపడ్డారని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ సోమవారం వెల్లడించారు.
మృతుల్లో సగం మంది తూర్పు బఖ్‌ముట్ నగరంపై దాడి చేస్తున్న వాగ్నర్ గ్రూపు సైనికులు. వాగ్నర్ గ్రూప్ రష్యా తరపున పోరాడుతున్న ఒక ప్రైవేట్ సైన్యం.
రష్యా గత ఏడాది నుంచి బఖ్‌ముట్ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. తూర్పు యుక్రెయిన్‌లో ఉన్న ఈ చిన్న పట్టణం ఇరు దేశాలకూ వ్యూహాత్మకంగా ప్రాముఖ్యమైనది.
బఖ్‌ముట్ పట్టణంలో చాలా భాగాన్ని రష్యా ఆక్రమించుకున్నప్పటికీ, యుక్రెయిన్ సైనికులు పట్టువిడువకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న యుద్ధం రెండు దేశాలకూ ప్రతిష్టాత్మకంగా మారింది.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
"వీలైనంత ఎక్కువ మంది రష్యా సైనికులను చంపడం, వారి నిల్వలను తగ్గించడమే లక్ష్యంగా తమ సైనికులు పోరాడుతున్నారని" యుక్రెయిన్ ఆర్మీ చెబుతోంది.
"బఖ్‌ముట్ ద్వారా దోన్‌బస్ ప్రాంతంలో రష్యా చేసిన దాడి చాలావరకు విఫలమైంది. వ్యూహాత్మకమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది" అని కిర్బీ అన్నారు.
"రష్యా మొత్తంగా లక్ష కంటే ఎక్కువమంది సైనికులను కోల్పోయి ఉండవచ్చని అంచనా. కిందటి డిసెంబర్ నుంచి బట్‌ముఖ్‌లోనే 20,000 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు" అని ఆయన తెలిపారు.
ఈ గణాంకాలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు. రష్యా ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.
లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది?
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
