తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ కోర్టు
ఈ సంఘటనకు సంబంధించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీతోపాటు మెుత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లైవ్ కవరేజీ
మీపై పిడుగు పడుతుందో, లేదో పావు గంట ముందే చెప్పే యాప్
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ తెలుగు లైవ్ పేజ్ సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుసుకుందాం....
స్లీప్ పెరాలసిస్: నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది?
ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?
జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ కోర్టు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

తుని రైలు దహనం కేసుని కోర్టు కొట్టేసింది. విజయవాడ రైల్వే కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమంలో ఈ ఘటన జరిగింది. 2016 జనవరి 31న సాయంత్రం విశాఖ నుంచి విజయవాడ వైపు వస్తున్న రైలుని ఆందోళనకారులు తుని దగ్గర అడ్డుకున్నారు. ప్రయాణీకులను దించేసి తగులబెట్టారు.
కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తొలుత తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకి చెందిన వారు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లని నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదంటూ తునిలో జాతీయ రహదారిపై ముద్రగడ బైటాయించారు. ఆయనకి మద్దతుగా రైల్ రోకో జరిగింది.

ఆ సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. గందరగోళం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ పైనా దాడి జరిగింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళన కారులు దహనం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీతోపాటు మెుత్తం 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.24మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన కోర్టు అనంతరం కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేసులన్నీ రద్దు చేశారు.
మే డే ఎలా మొదలైంది? కార్మిక దినోత్సవం చరిత్ర ఏమిటి?
దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ
కాపురాన్ని చక్కదిద్దలేనప్పుడు ఆరు నెలలు వేచిచూడకుండానే విడాకులు: సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

ఫొటో సోర్స్, Getty Images
సుచిత్ర కె. మొహంతి
బీబీసీ కోసం
కాపురంలో చక్కదిద్దలేని పరిస్థితులు ఉంటే వివాహ చట్టాల ప్రకారం ఉన్న ఆరు నెలల నిబంధనను కూడా పక్కనబెట్టి విడాకులు మంజూరు చేసే అధికారం తమకు ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 తమకు ఈ అధికారం కల్పించిందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చెప్పింది.
‘‘భార్యాభర్తలుగా కలిసుండేందుకు ఎట్టిపరిస్థితుల్లో అవకాశం లేదని నిరూపించిన సమయంలో, కాపురంలో చక్కదిద్దలేని పరిస్థితులు ఉంటే ఆ పెళ్లిని రద్దు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఆరు నెలల కాల వ్యవధి నుంచి కూడా మినహాయింపు ఇచ్చే అధికారం ఉంది’’ అని బెంచ్ తన తీర్పులో చెప్పింది.
పూర్తి న్యాయం చేసేందుకు ఇలాంటి కేసుల్లో విడాకుల మంజూరీకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకోగలమని బెంచ్ చెప్పింది.
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించిన దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, YSR/TWITTER
సుచిత్ర కె. మొహంతి
బీబీసీ కోసం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్లకు దిల్లీ పోలీసులు భద్రత కల్పించారు.
మహిళా రెజ్లర్లకు ఈ రోజు దిల్లీ పోలీసులు భద్రత కల్పించినట్లు రెజ్లర్ల న్యాయవాదుల్లో ఒకరైన నరేంద్ర హుడా బీబీసీకి తెలిపారు.
తమ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన మహిళా రెజ్లర్లకు భద్రతను కల్పించాలని దిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు నేడు భద్రతను అందించినట్లు హుడా చెప్పారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌పై మహిళా రెజ్లర్లు చేస్తున్న లైంగిక వేధింపుల ఫిర్యాదులపై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్ఐఆర్‌లను దిల్లీ పోలీసులు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయడంతో ఇక ఇప్పుడు ఈ అంశంపై సరైన విచారణ జరుగనుందని హుడా చెప్పారు.
పర్సనల్ ఫైనాన్స్: అప్పు భారం తగ్గాలంటే ఏంచేయాలి?
కర్ణాటక ఎన్నికలు: ప్రధాని నరేంద్ర మోదీ వాహనంపైకి దూసుకొచ్చిన 'బీజేపీ కార్యకర్త' మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూర్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోలో భద్రతా ఉల్లంఘన జరిగింది.
ప్రధాని వాహనంపైకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ విసిరారు.
ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదని, అత్యుత్సాహంతో చేశారని పోలీసులు తెలిపారు.
ఆ ఫోన్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తదేనని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీపీ) అలోక్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi
మొబైల్ ఫోన్ విసిరిన వ్యక్తిని గుర్తించి, ఆయనకు ఆ ఫోన్‌ను ఇచ్చేశామని అలోక్ కుమార్ తెలిపారు. అలాగే, ఆయన వాంగ్మూలాన్ని ఈ రోజు ఉదయం రికార్డు చేయనున్నట్టు చెప్పారు.
విజువల్స్‌లో కనిపిస్తున్నదాని ప్రకారం, ప్రధాని వాహనం మీదకు ఫోన్ వచ్చింది. మోదీకి తృటిలో ప్రమాదం తప్పింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
