లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారంతో రేపు మళ్లీ కలుద్దాం.
58 ఏళ్ల తర్వాత భారత్ బంగారు పతకం గెలిచి ఆసియా చాంపియన్‌గా నిలిచింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారంతో రేపు మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, BAI_Media/Twitter
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ - 2023లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి బంగారు పతకం సాధించారు.
58 ఏళ్ల తర్వాత భారత్ బంగారు పతకం గెలిచి ఆసియా చాంపియన్‌గా నిలిచింది.
1965లో లక్నోలో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్ పోటీల్లో దినేష్ ఖన్నా థాయ్‌లాండ్‌కి చెందిన సంగోబ్ రట్టనుసోన్‌పై విజయం సాధించి గోల్డ్‌మెడల్ గెలుచుకున్నారు.
సాత్విక్-చిరాగ్ జోడీ, మలేషియన్ క్రీడాకారులు ఆంగ్ యూ సిన్, లియో యీ యీ జోడీపై 21-16, 17-21, 19-21 పాయింట్లతో విజేతగా నిలిచింది.
ఈ జోడీ వరల్డ్ చాంపియన్‌షిప్ - 2022లో రజత పతకం సాధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''చిరాగ్, సాత్విక్ ప్రదర్శన గర్వపడేలా చేసింది.'' అస్సాం ముఖ్యమంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
''ఆసియా చాంపియన్స్‌గా నిలవడం చరిత్రాత్మకం మాత్రమే కాదు. ఇండియన్ బ్యాడ్మింటన్‌కి భారీ పరిణామం. ఇది దేశం గర్వించదగ్గ విషయం'' అని ఆయన రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విజేతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Twitter
తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆరో అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుని పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
''తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి? తెలంగాణను కూలగొట్టి మళ్లీ కడతారా అని విపరీతమైన, దుర్మార్గమైన కురస వ్యక్తులు, మరగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం.'' అని కేసీఆర్ అన్నారు.
ఎండాకాలంలో మత్తళ్లు దుంకే చెరువులే పునర్నిర్మాణానికి భాష్యం. బీళ్లుగా మారిపోయిన లక్షలాది, కోట్లాది ఎకరాల భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకుని లక్షల ఎకరాలలో పంటచేలలో వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని కేసీఆర్ అన్నారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, ఐటీలో బెంగళూరును దాటి దూసుకుపోయే పరిస్థితి, వలస వెళ్లిన పాలమూరు బిడ్డలు వెనక్కి రావడం, హైదరాబాద్‌లో అద్భుతంగా, శోభాయమానంగా ఇదీ తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పేలా తలఎత్తుకుని నిలిచిన సెక్రటేరియటే తెలంగాణ పునర్నిర్మాణమని కేసీఆర్ అన్నారు.

ఫొటో సోర్స్, BRIJ BHUSHAN SHARAN SINGH/FACEBOOK
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ)పై హరియాణకు చెందిన 90 శాతం అథ్లెట్స్, గార్డియన్లకి నమ్మకం ఉందని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
ఒకే ‘అఖాడా’కు చెందిన కొన్ని కుటుంబాలు, అమ్మాయిలు మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ అఖాడా దీపేందర్ హుడాకి చెందిందన్నారు.
‘‘జంతర్ మంతర్ వద్ద మీకు న్యాయం దొరకదు. న్యాయం కావాలంటే, పోలీసుల వద్దకు, కోర్టుకు వారు వెళ్లాలి. ఇప్పటి వరకు వాళ్లు అలా చేయలేదు. కోర్టు ఏం నిర్ణయిస్తే దానికి మేం కట్టుబడి ఉంటాం.
అఖిలేష్ యాదవ్‌కి నిజమేంటో తెలుసు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు. ఉత్తర ప్రదేశ్‌లోని 80 శాతం రెజ్లర్ల కుటుంబాలు, సమాజ్ వాదీ పార్టీ సిద్ధాంతాలకు చెందినవే. వారు నన్ను నేతాజీ అని పిలుస్తారు. వారి నేతాజీ ఎలాంటి వాడో వారికి తెలుసు అని వారు చెబుతున్నారు’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతోన్న రెజ్లర్ల నిరసనకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించినప్పుడు, బ్రిజ్ భూషణ్ ఈ విధంగా స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
దేశ ప్రజలనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌లో మాట్లాడారు.
దేశంలో కోట్లాది మంది ప్రజల ‘మన్ కీ బాత్’ ఈ కార్యక్రమమని, ఇది వారి భావ వ్యక్తీకరణ అని చెప్పారు.
దేశ ప్రజల మంచితనానికి, సానుకూలతకు ప్రత్యేక పండగగా ఈ కార్యక్రమం మారిందని ప్రధాని మోదీ అభివర్ణించారు.
2014 అక్టోబర్ 3న విజయదశమి సందర్భంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘క్లీన్ ఇండియా మూవ్‌మెంట్’, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ప్రకృతి కీ బాత్’ వంటి పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు.
ఈ అంశాలు ప్రజా ఉద్యమంగా మారాయన్నారు.
ఈ ప్రొగ్రామ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లక్ష్మణ్ రావు ఇనామ్‌దార్‌ని గుర్తుకు చేసుకున్నారు. ఇనామ్‌దార్ గుజరాత్‌లో ఒక సంఘ్ కార్యకర్త.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

పంజాబ్‌లోని లుధియానాలో గియాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ఘటన జరిగింది.
ఈ గ్యాస్ లీక్ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయినట్లు లుధియానా డిప్యూటీ కమిషనర్ సురభి మలిక్ చెప్పారు.
ఈ ఘటన తర్వాత కొంత గ్యాస్ కాలుష్యం జరిగినట్లు తెలిపారు.
మాన్‌హోల్స్‌లో మిథేన్‌తో కెమికల్ రియాక్షన్ జరగడంతో ఈ ఘటన జరిగి ఉండవచ్చునని అన్నారు.
దీన్ని నిర్ధారించేందుకు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు శాంపుల్స్‌ను సేకరిస్తున్నాయని చెప్పారు.
సంఘటన జరిగిన వెంటనే ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, టెక్నికల్ టీమ్ అక్కడికి చేరుకున్నాయి.
స్థానిక అడ్మినిస్ట్రేషన్, మెడికల్ టీమ్ కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుని తమ సేవలందించాయి.
గ్యాస్ లీకేజీ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇవాళ కీలకమైన మ్యాచ్ జరగనుంది.
ముంబై ఇండియన్స్(ఎంఐ), రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్)లు ఐపీఎల్‌లో వెయ్యివ మ్యాచ్‌ను ఆడబోతున్నాయి.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ 1000వ మ్యాచ్ జరగనుంది.
అయితే, ఈ సీజన్‌లో ఆడబోయే 42వ మ్యాచ్ ఇది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచి, నాలుగు ఓడిపోయి ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.
అలాగే, రాజస్తాన్ రాయల్స్ ఐదు మ్యాచ్‌ల గెలుపు, మూడు మ్యాచ్‌ల ఓటమితో రెండో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో గెలుపొందింది.
కాగా, ఐపీఎల్ మ్యాచ్‌లు 2008లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Twitter/Telangana CMO
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది.
ప్రత్యేక పూజా కార్యక్రమాలతో సచివాలయ ప్రారంభోత్సవం మొదలైంది.
మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్యలో యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.
తర్వాత కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసి 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది.
సచివాలయ ఆహ్వానిత ఉద్యోగులతో నిర్వహించే సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
ఈ కొత్త సచివాలయానికి తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది.
రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.