ఆనంద్ మోహన్ సింగ్‌ విడుదలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన జి.కృష్ణయ్య భార్య

‘‘జీవితకాల శిక్ష అంటే చనిపోయే వరకు వేయాలి. అంతేకానీ 14ఏళ్లు అని నిర్వచించకూడదు’’ అని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో ఉమ కృష్ణయ్య పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారంతో రేపు మళ్లీ కలుద్దాం.

  2. తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉందో చూశారా...

  3. మహిళా రెజ్లర్ల‌కు లైంగిక వేధింపులు: తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు

  4. టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్‌ల కథ ఏంటి?

  5. పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?

  6. సుప్రీం కోర్టును ఆశ్రయించిన జి.కృష్ణయ్య భార్య, సుచిత్ర కె.మొహంతి, బీబీసీ కోసం

    భర్త కృష్ణయ్యతో ఉమ
    ఫొటో క్యాప్షన్, భర్త కృష్ణయ్యతో ఉమ

    1994లో బిహార్‌లో హత్యకు గురైన తెలుగు ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య భార్య ఉమ కృష్ణయ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

    జి.కృష్ణయ్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను బిహార్ ప్రభుత్వం విడుదల చేసింది.

    దీనిని సవాలు చేస్తూ ఉమ కృష్ణయ్య శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ విభాగానికి చెందిన వారు బీబీసీకి తెలిపారు.

    కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన ఆనంద్ మోహన్‌కు జీవితకాల శిక్ష పడింది. 14ఏళ్ల తరువాత ఆయన విడుదల అయ్యారు.

    ‘‘జీవితకాల శిక్ష అంటే చనిపోయే వరకు వేయాలి. అంతేకానీ 14ఏళ్లు అని నిర్వచించకూడదు’’ అని సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌లో ఉమ కృష్ణయ్య పేర్కొన్నారు.

  7. ‘మేం క్రీడాకారులం, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు’ – సాక్షి మలిక్

    సాక్షి మలిక్

    ఫొటో సోర్స్, ANI

    తాము క్రీడాకారులమని, తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని మహిళా రెజ్లింగ్ ప్లేయర్ సాక్షి మలిక్ చెప్పారు.

    ఇక్కడికి వచ్చి ఎవరైనా తమ ధర్నాను పాడు చేయాలని చూస్తే, దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుందని, తాము కాదని అన్నారు.

    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోన్న రెజ్లర్లకు మద్దతు ఇచ్చేందుకు రాజకీయ పార్టీల నాయకులు వస్తుండటంతో సాక్షి మలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    దిల్లీ పోలీసులు

    ఫొటో సోర్స్, ANI

    డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదు చేసిన ఒక ఎఫ్ఐఆర్ కాపీని రెజ్లర్లకు ఇచ్చినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

    పోక్సో కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీని మాత్రం రెజ్లర్లకు ఇవ్వలేదని, దాన్ని బాధిత కుటుంబానికి మాత్రమే ఇస్తామని పోలీసులు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. 'నేను నేరస్థుడిని కాదు, రాజీనామా చేస్తే వారి ఆరోపణలను ఒప్పుకున్నట్లు అవుతుంది' - బ్రిజ్ భూషణ్

    బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌

    ఫొటో సోర్స్, ANI

    డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై స్పందించారు.

    తాను నేరస్థుడిని కాదని, రాజీనామా చేస్తే వారి ఆరోపణలను ఒప్పుకున్నట్లు అవుతుందని చెప్పారు.

    తాను నిర్దోషినని, న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు.

    విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

    సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాను గౌరవిస్తానని కూడా చెప్పారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ

    ప్రియాంక గాంధీ

    ఫొటో సోర్స్, Twitter/Congress

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత ఏడు రోజులుగా నిరసన చేస్తోన్న మహిళా రెజ్లర్లకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు.

    డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి పదవి నుంచి బ్రిజ్ భూషణ్‌ శరణ్ సింగ్‌ను తొలగించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.

    ఆయన పదవిలో ఉన్నప్పుడు, న్యాయమైన విచారణ జరగదన్నారు.

    ‘‘ఎఫ్ఐఆర్‌లో ఏం ఉందన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు దాన్ని వారు చూపించడం లేదు? రెజ్లర్లు పతకాలు గెలుచుకుని వచ్చినప్పుడు మనమందరం ట్వీట్ చేస్తూ, గర్వంగా భావిస్తాం. కానీ, ఇవాళ వాళ్లు న్యాయం దొరకడం లేదని రోడ్డుపై కూర్చున్నారు.

    ఈ స్టేజీకి వచ్చేందుకు మహిళా రెజ్లర్లందరూ ఎంతో కష్టపడ్డారు. ఎందుకు ప్రభుత్వం ఆయన్ను(బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను) కాపాడేందుకు ప్రయత్నిస్తుందో నాకర్థం కావడం లేదు.’’ అని ప్రియాంక గాంధీ అన్నారు.

    ప్రధాన మంత్రి నుంచి ఏదైనా జరుగుతుందని తాను ఆశించడం లేదని, రెజ్లర్ల గురించి ఆయనకు ఆందోళన ఉంటే, ఇప్పటి వరకి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు కలవలేదు అని ప్రశ్నించారు.

    దేశమంతా ఇప్పుడు వారికి అండగా నిలుస్తుందని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. హిట్లర్‌ ఆరాధనలో మునిగితేలిన సావిత్రీ దేవి ఎవరు?