వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5కు వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది.
లైవ్ కవరేజీ
లైవ్ పేజ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
పొన్నియిన్ సెల్వన్ 2 రివ్యూ: మణిరత్నం మాయాజాలం ఫలించిందా?
వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5కు వాయిదా

ఫొటో సోర్స్, YS Avinash Reddy/Facebook
ఫొటో క్యాప్షన్, వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది.
హైకోర్టుకు రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నందున, అవి ముగిశాక విచారణ చేపడతామని తెలిపింది.
ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్ సురేంద్ర విచారణ జరిపారు. కానీ, వెంటనే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలు కాదని చెప్పారు.
అయితే, వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణ జరపాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఆ మేరకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు విజ్జప్తి చేశారు.
ఈ విషయంపై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టునే ఆశ్రయించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.
గాఫ్ ఐలాండ్: ఈ అందమైన ద్వీపంలో పని చేయడానికి మనిషి కావాలంట.. జీతం 22 లక్షలు
ద్వేషపూరిత ప్రసంగాలను సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
సుచిత్ర కె. మొహంతి, బీబీసీ కోసం
ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కడ వినిపించినా సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వు ఇచ్చింది.
విద్వేషాన్ని చిమ్మే విషయంలో మతాలకు అతీతంగా కేసు నమోదు చేయాలని, అప్పుడే భారతదేశ లౌకిక స్వభావానికి పెద్దపీట వేసినట్టు అవుతుందని తెలిపింది.
విద్వేషపూరిత ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో ఎలాంటి జాప్యం జరిగినా దానిని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.
'ఏజెంట్' రివ్యూ: అఖిల్‌కు సురేందర్ రెడ్డి మాస్ విజయాన్ని ఇచ్చారా?
మహారాష్ట్ర: పాల్ఘర్‌లో ఇద్దరు సాధువులను కొట్టిచంపిన కేసును సీబీఐకి అప్పగిస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
సుచిత్ర కె. మొహంతి, బీబీసీ కోసం
మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఇద్దరు సాధువులను కొట్టిచంపిన కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది.
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందులో నిర్ణయం తీసుకున్నందున, దీనిపై విచారించాల్సింది ఏమీ లేదని తెలుపుతూ, కోర్టు ప్రొసీడింగ్స్ క్లోజ్ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
2020 ఏప్రిల్ 16 రాత్రి, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో ఇద్దరు సాధువులు ముంబై నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళుతుండగా, గడ్చించిలే గ్రామంలో వారిపై మూకదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సాధువులు, వారి కారు డ్రైవర్ మరణించారు.
రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఈ రోజు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు

ఫొటో సోర్స్, ANI
సుచిత్ర కె.మొహంతి
బీబీసీ కోసం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఈ రోజు (ఏప్రిల్ 28న) ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తామని దిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకు తెలిపారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సమయంలో, దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు గురించి ఈ విషయం చెప్పారు.
ఈ కేసులో మైనర్ బాధితురాలికి అవసరమైన భద్రతను ఏర్పాటు చేయాలని దిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఏడుగురు టాప్ మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఫిర్యాదుదారుల్లో ఒకరైన మైనర్‌కు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని, ఆమెకు అవసరమైన భద్రతను కల్పించాలని దిల్లీ పోలీసుకమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఆబాలికకు కల్పించే భద్రత వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలంటూ దిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు ఇది అతిపెద్ద గెలుపు.
కేసుపై తదుపరి విచారణను మే 4న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.
మహిళా రెజ్లర్ల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, మైనర్ బాలిక భద్రతపై కోర్టులో ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఆమెను బయటకు ఎక్కడికైనా పంపించాలి. ఆమెకు దిల్లీలో రక్షణ లేదు’’ అని కోర్టును కోరారు.
అతీక్ అహ్మద్ హత్య: నివేదిక ఇవ్వాలని యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఫొటో సోర్స్, ANI
సుచిత్రా కె.మొహంతి
బీబీసీ కోసం
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ పోలీసు కస్టడీలో హత్యకు గురికావడంపై చేపట్టిన విచారణ నివేదికలను తమకు అందజేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు ఎలా హత్యకు గురయ్యారనే విషయాలను తెలపాలని చెప్పింది.
జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వు ఇచ్చింది. అలాగే, ఏప్రిల్ 14న అతీక్ కొడుకు అసద్ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంపైనా తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఈ ఘటనల తర్వాత యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా కోర్టు నివేదికను కోరింది.
పోలీసు కస్టడీలో వారిని ఆస్పత్రికి తీసుకొస్తున్నప్పుడు, వారిని మీడియా ముందుకు ఎందుకు తీసుకెళ్లారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆస్పత్రి ఎంట్రీ గేట్ వద్దకే అంబులెన్స్‌ను ఎందుకు తీసుకెళ్లలేదు? వారినెందుకు మీడియా ముందుకు తీసుకెళ్లారు? అంటూ సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
అతీక్ అహ్మద్, అష్రఫ్‌ల హత్యపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఈ ప్రశ్నలు అడిగింది.
కోర్టులో తదుపరి విచారణ మూడు వారాల తర్వాత జరుగనుంది.
దళిత ఐఏఎస్ కృష్ణయ్య హత్య: 'కారుపై వేల మంది రాళ్ల దాడి చేశారు, బయటకు లాగి చిత్రవధ చేశారు’ - భార్య ఉమ
ఇన్సూరెన్స్ స్కామ్ కేసు: సత్యపాల్ మాలిక్ ఇంటికి చేరుకున్న సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images
ఇన్సూరెన్స్ స్కామ్ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ ఆయన ఇంటికి చేరుకుంది.
దిల్లీలోని ఆర్‌కే పురం ప్రాంతంలో ఉన్న సత్యపాల్ మాలిక్ ఇంటికి ఉదయం 11.45 గంటలకు సీబీఐ వెళ్లినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్టు చేసింది.
ఈ కేసులో భాగంగా సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నిస్తుండటం ఏడు నెలల్లో ఇది రెండవసారి.
నిరుడు అక్టోబర్‌లో కూడా సీబీఐ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
ఆ సమయంలో బిహార్, జమ్ముకశ్మీర్, గోవా, మేఘాలయ గవర్నర్‌గా తన బాధ్యతలను సత్యపాల్ మాలిక్ పూర్తి చేసుకున్నారు.
తాను జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నప్పుడు రెండు బిల్లులను పాస్ చేస్తే రూ.300 కోట్లను ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు సత్యపాల్ మాలిక్ చెప్పారు. కానీ, ఆ బిల్లులను తాను పాస్ చేయలేదన్నారు.
ఈ కేసుల్లో ఒకటి జమ్ముకశ్మీర్‌లోని ప్రభుత్వోద్యోగులకు చెందిన ఇన్సూరెన్స్‌కి చెందినది. దీనిలో రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రమేయముంది.
అలాగే మరొకటి కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌లో అక్రమాలకు చెందినది.
ఈ కేసులపై సీబీఐ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆంధ్రప్రదేశ్: బిందెడు నీళ్ళ కోసం నానా అవస్థలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా మహిళలు
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
జియా ఖాన్ డెత్ కేసు: నటుడు సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు

ఫొటో సోర్స్, ANI
జియా ఖాన్ డెత్ కేసులో నటుడు సూరజ్ పంచోలిని ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
2013 జూన్ 3న జియా ఖాన్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
దాదాపు పదేళ్ల కిందట జరిగిన ఈ ఆత్మహత్య కేసుపై శుక్రవారం ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించింది.
‘‘సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున్న, కోర్టు మిమ్మల్ని(సూరజ్‌ను) దోషిగా నిర్ధారించలేకపోతుంది. నిర్దోషిగా ప్రకటన చేస్తున్నాం’’ అని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఏఎస్ సయ్యద్ తీర్పు చెప్పారు.
ఈ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలి ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెక్షన్ 306(ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్ట్ చేశారు.
సూరజ్ పంచోలి నటులు ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్‌ల కొడుకు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
వీరికి ఎప్పటికైనా న్యాయం దొరుకుతుందా? - రెజ్లర్ల నిరసనపై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్

ఫొటో సోర్స్, YEARS
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తోన్న నిరసనకు భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మద్దతు ఇచ్చారు.
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో రెజ్లర్ల ఫోటోను షేర్ చేస్తూ, వీరికి ఎప్పటికైనా న్యాయం దొరుకుతుందా? అంటూ రాశారు.
ఈ ఫోటోకు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పూనియాలను ట్యాగ్ చేశారు.
ఇంతకుముందే ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కూడా రెజ్లర్లకు మద్దతు పలికారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలని గత ఐదు రోజులుగా జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం జరిగే వరకు తమ నిరసన కొనసాగుతుందని సంగీతా ఫొగాట్ చెప్పారు.
అంతకుముందు కూడా తాము న్యాయం కోసం పోరాడామని, ఇప్పుడు కూడా తాము న్యాయం కోసమే పోరాడుతున్నామని చెప్పారు.
నిందితునికి శిక్ష పడే వరకు తమ నిరసన కొనసాగుతుందన్నారు.
ఆపరేషన్ కావేరి: సూడాన్ పోర్ట్ నుంచి 326 మంది భారతీయులను తరలించిన ఇండియన్ నేవి

ఫొటో సోర్స్, ANI
ఆపరేషన్ కావేరి: ఐఎన్ఎస్ తార్కాష్‌లో సూడన్ పోర్టు నుంచి 326 మంది భారతీయ పౌరుల్ని తరలించినట్లు భారత నేవి ప్రకటించింది.
ప్రస్తుతం వీరిని జెడ్డాకి తరలిస్తున్నట్లు చెప్పింది.
భారత ఎంబసీ ప్రకారం, సూడాన్‌లో సుమారు 1500 మంది భారత సంతతి ప్రజలు స్థిరపడ్డారు. అలాగే ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో సుమారు 3,000 మంది భారతీయులు చిక్కుకు పోయారు.
వారిని సురక్షితంగా బయటకు తరలించడానికి అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్టు వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత్ అంతకుముందే తెలిపింది.
అలాగే సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయంలో రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలను సిద్ధంగా ఉంచింది.
కాగా, గత కొంత కాలంగా సూడాన్‌లో తుపాకుల మోత మోగుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
అథ్లెట్స్ రోడ్లపైకి రావడం నన్నెంతో బాధిస్తోంది: నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, @Neeraj_chopra1
రెజ్లర్లు చేస్తోన్న నిరసనపై భారత అథ్లెట్, ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా స్పందించారు.
‘‘న్యాయం కోరుతూ మన అథ్లెట్స్ రోడ్లపైకి రావడం నన్నెంతో బాధిస్తోంది. మన గొప్ప దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వారెంతో కష్టపడ్డారు. గర్వంగా తలెత్తుకునేలా చేశారు.
అథ్లెట్ అయినా, కాకపోయినా దేశంలో ప్రతి ఒక్కరి సమగ్రతను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఇలా జరగకుండా ఉండాల్సింది. ఇది చాలా సున్నితమైన విషయం. పారదర్శకంగా, నిష్పాక్షికంగా దీనిపై విచారణ జరగాలి.
సంబంధిత అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే న్యాయం దక్కుతుంది’’ అని అథ్లెట్ నీరజ్ చోప్రా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Twitter/Neeraj Chopra
