హోమో సెక్సువల్ జంటలకు కనీస ప్రయోజనాలు కల్పించండి: సుప్రీంకోర్టు సూచన

స్వలింగ సంపర్క జంటల వివాహ బంధాన్ని చట్టబద్దంగా గుర్తించకపోయినా ఉమ్మడి బ్యాంకు ఖాతా, బీమా పథకంలో నామినీ వంటి కనీస ప్రయోజనాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

లైవ్ కవరేజీ

  1. ఎన్డీయేలోకి టీడీపీ: నరేంద్ర మోదీపై చంద్రబాబు స్వరం ఎలా మారుతూ వచ్చింది?

  2. ధన్యవాదాలు

    లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

  3. ఐసీయూలో అద్భుతం: 'నా భార్య బతికే అవకాశాలు 2 శాతమే అన్నారు.. కానీ, ఏడాదిన్నర తరువాత కోమా నుంచి బయటికొచ్చింది'

  4. హంతకులు పుడతారా, తయారవుతారా? ఒక మనిషి మరో మనిషిని ఎందుకు చంపుతారు?

  5. 15 ఏళ్లు వచ్చినా పీరియడ్స్ రాకపోతే ఏంచేయాలి?

  6. హోమో సెక్సువల్ జంటలకు కనీస ప్రయోజనాలు కల్పించండి: సుప్రీంకోర్టు సూచన

    స్వలింగ సంపర్కులు

    ఫొటో సోర్స్, Getty Images

    సుచిత్రా కె.మొహంతి

    బీబీసీ కోసం

    హోమో సెక్సువల్ జంటలకు కనీస సామాజిక ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

    వారి వివాహ బంధాన్ని చట్టబద్దంగా గుర్తించకపోయినా ఉమ్మడి బ్యాంకు ఖాతా, బీమా పథకంలో నామినీ వంటి కనీస ప్రయోజనాలను కల్పించేందుకు ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు కోరింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించాలా, లేదా అనే విషయం పార్లమెంట్ పరిధిలో ఉందన్న కేంద్రం వాదనలతో మౌఖికంగా ఏకీభవించింది.

    వీరి వివాహాలకు చట్టబద్దత కల్పిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశముందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు.

    వీరి పెళ్లికి చట్టబద్ధత కల్పిస్తే, ఉదాహరణకు వావీవరుసల్లేని(‌ఇన్‌సెస్ట్) లైంగిక సంబంధం పెట్టుకున్న ఎవరైనా ఇద్దరు మేజర్లు అందులో ఎలాంటి తప్పూ లేదని, అది తమ సమ్మతితోనే జరిగిందని కోర్టును ఆశ్రయించే అవకాశముందని మెహతా వాదించారు.

    ఈ వాదనపై కోర్టు స్పందిస్తూ- స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించకపోయినా కనీస సామాజిక ప్రయోజనాలు కల్పించడంపై కేంద్రం తన వైఖరి తెలియజేయాలని సూచించింది.

    హోమో సెక్సువల్ జంటల వివాహాలకు చట్టబద్దత కల్పించాలనే కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.

    కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి వాయిదా వేసింది.

    ''మీ అభిప్రాయాన్ని మేం పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇది పార్లమెంట్ పరిధిలోని అంశమని బలమైన వాదనలు వినిపించారు. అది శాసన సంబంధమైన వ్యవహారమే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం'' అని మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. స్వలింగ సంపర్కుల సంబంధాలపై కేంద్రం ఏం చేయాలనుకుంటోందని ప్రశ్నించింది.

    ''చట్టబద్దత కల్పించకపోయినా వాళ్లు (ఎల్జీబీటీక్యూఐఏ) ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు.

    సంబంధిత వ్యవస్థలను సంప్రదించి తదుపరి విచారణ సందర్భంగా కేంద్రం తన వైఖరి తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది.

  7. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించి సస్పెండైన దిల్లీ వర్సిటీ విద్యార్థికి హైకోర్టులో ఊరట

    బీబీసీ డాక్యుమెంటరీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ద్వారా లోకేష్ చుగ్‌ క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని దిల్లీ యూనివర్సిటీ ఆరోపిస్తోంది.

    సుచిత్రా కె.మొహంతి

    బీబీసీ కోసం

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించి సస్పెండైన దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి లోకేష్ చుగ్‌కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.

    దిల్లీ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి, కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి లోకేష్ చుగ్‌ 'అడ్మిషన్‌'ను పునరుద్ధరించాలని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ ఆదేశించారు.

    ''2023 మార్చి 10న దిల్లీ యూనివర్సిటీ జారీ చేసిన ఆదేశాలను సమర్థించలేం. ఆ ఆదేశాలపై స్టే విధిస్తున్నాం. పిటిషనర్ 'అడ్మిషన్‌'ను పునరుద్ధరిస్తున్నాం'' అని న్యాయమూర్తి చెప్పారు.

    యూనివర్సిటీ నిర్ణయం సహజ న్యాయసూత్రాల ఉల్లంఘనగా హైకోర్టు చెప్పింది.

    మార్చి 10న దిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీహెచ్‌డీ విద్యార్థి లోకేష్ చుగ్‌‌ను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. ఏడాది పాటు పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిని నిరాకరించారు.

    బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ద్వారా లోకేష్ చుగ్‌ క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని యూనివర్సిటీ ఆరోపిస్తోంది.

  8. డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?

  9. 90 ఏళ్ల కిందట భారత్‌లో జరిగిన ఒక దారుణ బయో మర్డర్ కుట్ర

  10. గోళ్ళ రంగు వెనుక పొంచి ఉన్న ప్రమాదాలు

  11. ఆంధ్రప్రదేశ్: 'అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించి కిడ్నీ తీసుకున్నాడు' - బీబీసీతో విశాఖ బాధితుడు

  12. టాస్క్ ఫ్రాడ్: ‘ఇన్‌స్టా ప్రొఫైల్ లైక్ చేసి, ఫాలో అవండి, డబ్బు సంపాదించండి’ అంటూ దోచేస్తున్నారు... ఏమిటీ మోసం?

  13. చక్కెర ధర పెరిగిపోతుందా... టీ, కాఫీలు మరింత కాస్ట్‌లీ అవుతాయా?

  14. తెల్లవారుజామున జైలు నుంచి విడుదలైన కృష్ణయ్య హత్యకేసు దోషి ఆనంద్ మోహన్, చందన్ కుమార్ జజ్‌వాడే, బీబీసీ ప్రతినిధి

    ఆనంద్ మోహన్ సింగ్
    ఫొటో క్యాప్షన్, ఆనంద్ మోహన్ సింగ్

    ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ గురువారం ఉదయం సహర్సా జైలు నుంచి విడుదలయ్యారు.

    ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటే, వారిని ఉదయం పూట మాత్రమే విడుదల చేయాలని జైలు నిబంధనావళిలో ఉన్నట్లు బీబీసీతో సహర్సా జైలు సూపరింటెండెంట్ చెప్పారు.

    ఆనంద్ మోహన్ ఈరోజు ఉదయం 6:15 గంటలకు విడుదలయ్యారు.జైలు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ మోహన్ బుధవారం విడుదల కావాల్సి ఉండగా, ప్రక్రియ ఆలస్యం కావడంతో గురువారం ఉదయం విడుదల చేశారు.

    బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం, జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఆనంద్ మోహన్‌తో పాటు మరో 27 మందిని విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

    గోపాల్‌గంజ్ జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణయ్య 1994 డిసెంబరు 5న నడి రోడ్డు మీదే హత్యకు గురయ్యరు. ఈ కేసులో ఆనంద్‌కు జీవిత ఖైదు విధించారు.

    మొదట ఈ కేసులో దిగువ న్యాయస్థానం ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. అయితే, ఈ శిక్షను జీవిత ఖైదుకు పట్నా హైకోర్టు తగ్గించింది.

    పట్నా హైకోర్టు తీర్పు తర్వాత, ఆనంద్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ, ఆయనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు.

  15. ‘‘రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ను అంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు’’

    శివరాజ్ సింగ్ చౌహాన్

    ఫొటో సోర్స్, @OfficeofSSC

    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీని అంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

    కర్ణాటకలో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి శివరాజ్ సింగ్ ప్రసంగించారు.

    ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారు. స్వాతంత్య్రం సాధించడమే కాంగ్రెస్‌ ఏర్పాటు లక్ష్యమని గాంధీ అన్నారు. అయితే, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, గాంధీ మాట వినకుండా కాంగ్రెస్‌ను ఒక రాజకీయ పార్టీగా మార్చారు.

    మహాత్మాగాంధీ చెప్పిన మాటను నెహ్రూ వినలేదు. కానీ, నేను బాపూజీ మాట వింటాను. ఆయన చెప్పినట్లుగా కాంగ్రెస్‌ను అంతం చేస్తానని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నారు" అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు చేశారు.

    బుధవారం ఆయన కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు.