ధన్యవాదాలు
లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం...
ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ వెల్లడించారు.
లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం...

ఫొటో సోర్స్, DAILY CHHATTISGARH
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో అనుమానిత మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) దళానికి చెందిన 10మంది సభ్యులు, ఒక డ్రైవర్ మృతి చెందారు.
దంతెవాడలోని అరన్‌పూర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం రావడంతో, దంతేవాడ నుండి డీఆర్‌జీ దళాన్ని పంపించారు.
సెర్చ్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా, అరన్‌పూర్ రోడ్డుపై అనుమానిత మావోయిస్టులు ఐఈడీని పేల్చారని, అది ఆపరేషన్‌లో పాల్గొన్న డీఆర్‌జీ జవాన్ల వాహనాన్ని ఛిద్రం చేసిందని పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగిన ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను తరలించామని, సీనియర్ అధికారులు అక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దాడి ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విచారం వ్యక్తం చేశారు.అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. నక్సలైట్లను వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రజలపై 'మన్ కీ బాత్' చాలా పెద్ద ప్రభావం చూపించిందని ఆమీర్ ఖాన్ అన్నారు.
ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఒక ముఖ్యమైన మార్గం అని ఆయన అన్నారు.
'నేషనల్ కన్వెన్షన్ ఆన్ మన్ కీ బాత్ @ 100' సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.
ఈ ఒకరోజు సదస్సును ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు.
ఏప్రిల్ 30న మన్ కీ బాత్ 100 ఎపిసోడ్ ప్రసారం కానుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ కార్యక్రమానికి హాజరైన ఆమీర్ ఖాన్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడారు.
"దేశ నాయకులు దేశ ప్రజలతో మాట్లాడడానికి, చర్చించడానికి ఇదొక ముఖ్యమైన మార్గం. దేశ భవిష్యత్తు, దేశ ప్రజలకు అందించే సహకారం వంటి విషయాలపై చర్చించేందుకు ఇదొక ముఖ్యమైన కార్యక్రమం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటీషన్‌ను ఏప్రిల్ 28, శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
బ్రిజ్ భూషణ్ శరణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, టీనేజ్ పిల్లలను కూడా వదల్లేదని సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సహా ఏడుగురు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు.
బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు కొన్ని దర్యాప్తులు చేయాల్సిన అవసరం ఉందని దిల్లీ పోలీసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ లా ఆఫీసర్ సొలిసిటర్ జనరల్ (ఎస్‌జి) తుషార్ మెహతా ఈరోజు అపెక్స్ కోర్టుకు తెలిపారు.
అవేమీ లేకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే, వెంటనే కేసు ఫైల్ చేస్తామని ఎస్‌జీ మెహతా అన్నారు.
దర్యాప్తుకు సంబంధించిన అంశాలను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టాలని సీజేఐ డీఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌జీని కోరింది.
శుక్రవారం విచారణ సమయంలో మరికొంత అదనపు సమాచారాన్ని కోర్టుకు అందిస్తామని రెజ్లర్ల తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
బ్రిజ్ భూషణ్ శరణ్‌పై భారత మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసినా, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని సుప్రీంకోర్టు పోలీసులను మంగళవారం ప్రశ్నించింది.
రెజర్లు చేసిన ఫిర్యాదులు తీవ్రమైనవి, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉన్నట్టు కోర్టు భావిస్తోందని తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.
అక్కడే కసరత్తులు, రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బుధవారం ఉదయం రెజర్ల ప్రాక్టీస్ వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఒలింపిక్ రెజ్లర్ బజరంగ్ పునియా ఏఎన్ఐతో మాట్లాడుతూ "మేం ఇక్కడ శాంతియుతంగా నిరసన చేస్తూ, రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. పతకాలు సాధిస్తామని ఈ దేశ ప్రజలు మాపై నమ్మకం పెట్టుకున్నారు. మేం వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేయలేదు. మరి, నిరసనలు, ప్రాక్టీస్ చేయకుండా మమ్మల్ని ఎలా ఆపగలరు?" అని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
2021లో కాబూల్ విమానాశ్రయంలో బాంబు పేలుళ్లకు బాధ్యుడిగా భావిస్తున్న ఇస్లామిక్ స్టేట్ సూత్రధారి తాలిబాన్ చేతిలో హతమయ్యాడని అమెరికా అధికారులు వెల్లడించారు.
ఈ బాంబు దాడిలో 170 మంది పౌరులు, 13 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, అనేకమంది ప్రజలు దేశం విడిచివెళ్లారు. ఆ సమయంలో కాబూల్ విమానాశ్రయంపై దాడి జరిగింది.
ఐఎస్ కమాండర్‌ను కొన్ని వారాల క్రితమే చంపారు కానీ, ఆతడి మరణాన్ని ధృవీకరించడానికి సమయం పట్టిందని అమెరికా అధికారులు బీబీసీ వార్తా భాగస్వామి సీబీఎస్‌తో తెలిపారు.
చనిపోయిన కమాండర్ పేరు వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటెలిజెన్స్, పర్యవేక్షణ విభాగం సేకరించిన సమాచారం ఆధారంగా, కమాండర్ చనిపోయాడన్న సంగతి తెలిసిందని అమెరికా అధికారులు చెప్పారు.
కాగా, కాబూల్ విమానాశ్రయ బాంబు దాడికి ఈ కమాండరే కారణమని ఎలా తెలిసిందో చెప్పలేదు.
"ఈ దాడి వెనుక ఉన్న ప్రధాన హస్తాల్లో ఈ కమాండర్ ఒకరని ప్రభుత్వ నిపుణులు చాలా కచ్చితంగా చెబుతున్నారు" అని ఒక సీనియర్ సీబీఎస్ అధికారి తెలిపారు.
ఏప్రిల్ ప్రారంభంలోనే ఐఎస్ కమాండర్ మరణం గురించి అమెరికాకు తెలిసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తాలిబాన్లు ఈ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని చంపారా లేదా తాలిబాన్, ఐఎస్ మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఆ కమాండర్ చనిపోయాడా అన్నది స్పష్టంగా తెలుపలేదు.
సోమవారం, బాంబు దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఐఎస్ కమాండర్ మరణ వార్తను అమెరికా చేరవేయడం ప్రారంభించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.