బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ తుగ్లక్ లేన్ నివాసాన్ని ఖాళీ చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
దిల్లీలోని 12, తుగ్లక్ రోడ్‌లో ఉన్న అధికారిక నివాసాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో గత నెలలో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధరించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయింది.
‘‘లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ శనివారం నాడు తుగ్లక్ రోడ్ నివాసాన్ని ఖాళీ చేశారు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తెలిపారు.
అప్పీలు చేసుకునేందుకు కోర్టు ఆయనకు 30 రోజుల గడువు ఇచ్చిందని, అయితే ఇల్లు ఖాళీ చేయడం ద్వారా నిబంధనలపై తనకు ఎంత గౌరవం ఉందో రాహుల్ గాంధీ నిరూపించుకున్నారని థరూర్ అన్నారు.
సీబీఐ నోటీసులు అందిన తర్వాత జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇది నిజం కాదని దిల్లీ పోలీసులు ట్వీట్‌లో తెలిపారు.
“జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం తప్పు. ఆయన స్వయంగా మద్దతుదారులతో ఆర్.కె.పురం పోలీస్‌స్టేషన్ కి వచ్చారు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లిపోవచ్చు అని చెప్పాం’’ అని దిల్లీ పోలీసులు వెల్లడించారు.
మరోవైపు రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చద్ధా తనను, సత్యపాల్ మాలిక్‌తోపాటు మరికొందరిని దిల్లీ ఆర్.కె.పురం పోలీసులు అరెస్టు చేశారని సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, దీన్ని కూడా పోలీసులు తోసిపుచ్చారు.
గుర్నామ్ సింగ్ వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడని, సత్యపాల్ మాలిక్ ఆర్.కె.పురం స్టేషన్‌కు వచ్చారని పోలీసులు స్పష్టం చేశారు.
బీమా కుంభకోణం కేసులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ శుక్రవారంనోటీసులు జారీ చేసింది.
సీబీఐ సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించడం ఇది రెండోసారని, మొదటిసారి గత ఏడాది అక్టోబర్‌లో కూడా విచారించారని పీటీఐ వెల్లడించింది.
జమ్మూ కశ్మీర్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్‌కు సంబంధించి మాలిక్ ఆరోపణలు రావడంతో ఆయన పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది.
కొన్ని రోజుల కిందట సత్యపాల్ మాలిక్ న్యూస్ వెబ్‌సైట్ 'ది వైర్'కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
తాను జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు ఫైళ్లను ఆమోదించడానికి తనకు రూ. 300 కోట్ల లంచం ఆఫర్ చేశారని మాలిక్ పేర్కొన్నారు.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ)-సి55 ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది.
సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లింది. టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది.
ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పేలోడ్‌ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలదు.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్ నుంచి ఇవ్వాళ మధ్యాహ్నం 2.20 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్‌ఎల్‌వీ)-సి55 ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది.
ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనుంది. టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందినది.
ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఉపగ్రహంలో సింథటిక్ ఎపర్చరు రాడార్ పేలోడ్‌ను ఉంచారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలదు.
లూమాలైట్-4 ఉపగ్రహాన్ని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.
సింగపూర్ ఇ-నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం, ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యం.
ఈద్ ఉల్ ఫితర్‌ను దేశవ్యాప్తంగా ముస్లింలు వేడుకగా జరుపుకొంటున్నారు.
హైదరాబాద్‌లోని మక్కా మసీదులో వేలాది మంది నమాజ్ చేశారు.
దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ రంజాన్ పండుగను జరుపుకొంటున్నారు. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు.
సమాజంలో ఈ సామరస్య, సుహృద్భావ స్ఫూర్తి మరింతగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
అందరి ఆరోగ్యం, మంచి కోసం ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రంజాన్ సందర్భంగాముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.