You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినా‌ష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ‌‍జారీచేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. ఐపీఎల్ ఫైనల్ మే 28న

    ఐపీఎల్ 2023 ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు, ఎక్కడ జరుగుతాయనే వివరాలను బీసీసీఐ తెలిపింది.

    తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మే 23న జరుగనుంది.

    ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ చెన్నైలో మే 24న జరుగుతుంది.

    రెండో క్వాలిఫయర్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మే 26న జరుగనుంది.

    ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో మే 28న జరుగుతుంది.

  3. ఇన్సూరెన్స్ స్కామ్ కేసు: సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు

    ఇన్సూరెన్స్ స్కామ్ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.

    పలు విషయాల్లో స్పష్టత కోసం సీబీఐ తనను అక్బర్‌ రోడ్డులోని తన గెస్ట్ హౌస్‌కి రావాలని పిలిచిందని సత్యపాల్ మాలిక్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

    ‘‘నాకు కొన్ని విషయాలు తెలుసు, అందుకే నన్ను సీబీఐ పిలిచింది. ప్రస్తుతం నేను రాజస్థాన్ వెళ్తున్నాను. ఏప్రిల్ 27-29 మధ్యలో అందుబాటులో ఉంటానని నేను వారికి తెలిపాను’’ అని మాలిక్ చెప్పారు.

    కొన్ని రోజుల క్రితం సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుల్వామా దాడికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

    అవినీతి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. జమ్ముకశ్మీర్, గోవా గవర్నర్‌గా ఉన్నప్పుడు, అవినీతి విషయంపై పలుసార్లు ప్రధానికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు.

  4. సొరంగాల్లోకి వేడి నీళ్లు ఎందుకు పంపుతున్నారు? ఈ నగరం భూగర్భంలో ఏం జరుగుతోంది?

  5. డయాబెటిస్, గుండెజబ్బులు: రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి? ఎవరికి ఎంత అవసరం?

  6. స్వలింగ సంపర్కుల పెళ్లిని చట్టబద్ధం చేస్తే వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?

  7. పుంఛ్‌ ఘటన: కార్గిల్ యుద్ధంలో తండ్రి.. తీవ్రవాదులతో పోరులో కొడుకు మృతి

  8. 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే

    అమరేంద్ర యార్లగడ్డ

    బీబీసీ ప్రతినిధి

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినా‌ష్ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ‌‍జారీచేసిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది.

    హైకోర్టు ఏప్రిల్ 18న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    ఆమె పిటి‌‍షన్‌ను విచారించిన ‌‍సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ‌‍‌‍‌ఆదే‌‍‌‍శాలపై స్టే వి‌‍‌‍‌‍‌ధించింది.

    దీనిపై అవినా‌‍‌‍‌ష్ రెడ్డి తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ- హైకోర్టు ‌‍ఆదే‌‍శాలపై స్టే వి‌‍‌‍‌‍‌‍ధించడం వల్ల సీబీ‌‍ఐ అవినాష్‌ను అరెస్టు చేసే అవకా‌‍‌‍శం ‌‍ఉందన్నారు. ఈ అంశంపై తదుపరి విచార‌‍‌‍ణ ఏప్రిల్ 24 సోమవారం చేపడతామని, అప్పటివరకు అవినా‌‍‌ష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ‌సీబీఐను ‍ఆదేశించింది.

    కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

  9. విరూపాక్ష రివ్యూ: ఈ థ్రిల్లర్‌తో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టారా? సుకుమార్ స్క్రీన్ ప్లే పనిచేసిందా?

  10. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  11. వికలాంగులైనా.. ఈ మహిళా క్రికెటర్లు బౌండరీలు బాదేస్తున్నారు

  12. ట్విట్టర్: సచిన్, కోహ్లీ, అమితాబ్, దీపిక, రాహుల్ గాంధీ, యోగి, కెజ్రీవాల్ సహా పలువురు సెలబ్రిటీల బ్లూ టిక్కులు మాయం

    ట్విట్టర్ లెగసీ వెరిఫైడ్ ఖాతాల నుండి బ్లూ టిక్‌లు తొలగించింది. బ్లూ టిక్ కావాలంటే వినియోగదారులు కొంత ధర చెల్లించి 'ట్విట్టర్ బ్లూ' సభ్యత్వాన్ని తీసుకోవలసి ఉంటుందని ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.

    అలా చేయనివారి ఖాతాలకు ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్‌లు తొలగిస్తామని ఏప్రిల్ 12న ప్రకటించారు.

    దాంతో, దేశంలో చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారుల ట్విట్టర్ ఖాతాల నుంచి బ్లూ టిక్‌లు తొలగిపోయాయి.

    అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అలియా భట్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్, ఆయుష్మాన్ ఖురానా, రవీనా టాండన్ తదితర సెలబ్రిటీల అకౌంట్ల నుంచి బ్లూ టిక్‌లు తొలగిపోయాయి.

    రాజకీయ నాయకుల్లో రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, అశోక్ గహ్లోత్, అరవింద్ కేజ్రీవాల్, దిగ్విజయ్ సింగ్, భగవంత్ మాన్, మనోజ్ సిన్హా, భూపేంద్ర పటేల్‌ల ట్విట్టర్ ఖాతాలకు ఇప్పుడు బ్లూ టిక్‌లు కనిపించడం లేదు.

    క్రీడాకారుల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, సానియా మీర్జా, ఎంసీ మేరీకోమ్, యోగేశ్వర్ దత్, అశ్వనీ పొన్నప్ప, కిదాంబి శ్రీకాంత్ వంటి వారి అకౌంట్లలో బ్లూ టిక్‌లు మాయం.

    ట్విట్టర్ బ్లూ సభ్యత్వం తీసుకుని నెలవారీ రుసుము చెల్లించిన తరువాత మాత్రమే వినియోగదారుల బ్లూ టిక్ కొనసాగుతుందని మస్క్ చెప్పారు.

  13. కొకైన్: ఏకంగా జలాంతర్గాములనే తయారు చేసి రవాణా చేస్తున్నారు, ఎక్కడంటే...

  14. దిల్లీ: సాకేత్ కోర్టులో కాల్పులు.. ఒక మహిళకు బుల్లెట్ గాయాలు

    డిల్లీలోని సాకేత్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

    ఒక మహిళకు బుల్లెట్ తగిలి గాయమైంది.

    దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.

    పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.

  15. కింగ్ చార్లెస్ III: బ్రిటన్ రాజుకు పట్టాభిషేకం ఎందుకు నిర్వహిస్తున్నారు, అవసరమా అని ఎవరు అంటున్నారు?

  16. జమ్మూ కశ్మీర్‌-ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన ఐదుగురు సైనికుల పేర్లను విడుదల చేసిన భారత సైన్యం

    జమ్మూ కశ్మీర్‌లోని పుంఛ్ జిల్లాలో గురువారం తీవ్రవాదులు జరిపిన హ్యాండ్ గ్రెనేడ్ దాడిలో ఐదుగురు సైనికులు చనిపోయారు. వారి పేర్లను భారత సైన్యం విడుదల చేసింది.

    హవల్దార్ మన్‌దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబాశిష్ బస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికృష్ణ సింగ్, సిపాయి సేవక్ సింగ్ ఈ ఘటనలో మృతి చెందారు.

    ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వారికి నివాళులు అర్పించారు. ఈ ఐదుగురు సైనికుల త్యాగానికి భారత సైన్యం సెల్యూట్ చేస్తోందన్నారు.

    పుంఛ్ సెక్టార్‌లో దేశం పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఈ ఐదుగురు సైనికులు అత్యున్నత త్యాగం చేశారని అన్నారు.

    గురువారం మధ్యాహ్నం మూడు గంటలప్పుడు జవాన్ల వాహనంపై తీవ్రవాదులు గ్రెనేడ్ విసిరారని, వాహనం కాలిపోవడానికి అదే కారణమై ఉండొచ్చని సైన్యం ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

    చనిపోయిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారు. ఆ ప్రాంతంలో తీవ్రవాదులపై ఆపరేషన్‌లో భాగంగా వారిని మోహరించారు.

    ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు రాజౌరిలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సైన్యం చెప్పింది.

    ప్రస్తుతం దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో మరింత సమాచారం సేకరిస్తున్నారు.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.