You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్ అల్లర్లు: నరోదా ఊచకోత కేసులో మొత్తం 68 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
2002 ఫిబ్రవరి 28న నరోదా గ్రామంలో చెలరేగిన అల్లర్లలో 11 మంది ముస్లింలను సజీవ దహనం చేశారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన తొమ్మిది కేసుల్లో నరోదా ఊచకోత కేసు ఒకటి.
లైవ్ కవరేజీ
నిమిషాల్లో సరకులను డెలివరీ చేసే బ్లింకిట్‌లో సమ్మె ఎందుకు?
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
యుక్రెయిన్ యుద్ధం: బ్రిటన్, నార్వే పరిసరాల్లో రష్యా 'ఘోస్ట్ షిప్స్' .. అక్కడేం జరుగుతోంది?
స్పేస్‌ఎక్స్: నింగిలోకి వెళ్లిన కొద్దిసేపటికే పేలిన 'స్టార్‌షిప్'.. ఎలాన్ మస్క్ ఏమన్నారు?
పుంఛ్‌లో సైనిక వాహనంపై గ్రనేడ్ దాడి: ఐదుగురు జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్‌లో గురువారం ఐదుగురు జవాన్ల మరణానికి కారణమైన ఘటన వెనక తీవ్రవాదుల హస్తం ఉందని భారత సైన్యం ఒక ప్రకటనలో చెప్పింది.
మధ్యాహ్నం మూడు గంటలప్పుడు జవాన్ల వాహనంపై తీవ్రవాదులు గ్రనేడ్ విసిరారని, వాహనం కాలిపోవడానికి అదే కారణమై ఉండొచ్చని సైన్యం ఉత్తర కమాండ్ ప్రధాన కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది.
చనిపోయిన జవాన్లు రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందినవారు. ఆ ప్రాంతంలో తీవ్రవాదులపై ఆపరేషన్‌లో భాగంగా వారిని మోహరించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో సైనికుడు రాజౌరిలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సైన్యం చెప్పింది.
గుజరాత్: నరోదా ఊచకోత కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
గుజరాత్ అల్లర్లకు సంబంధించిన నరోదా గ్రామం ఊచకోత కేసులో మొత్తం 68 మంది నిందితులను అహ్మదాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది.
2002 ఫిబ్రవరి 28న నరోదా గ్రామంలో చెలరేగిన అల్లర్లలో 11 మంది ముస్లింలను సజీవ దహనం చేశారు.
నిందితుల జాబితాలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన మాయా కొడ్నానీ, బజరంగ్‌దళ్ నాయకుడు బాబు బజరంగి, విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి జైదీప్ పటేల్, బీజేపీ నాయకుడు వల్లభ్ పటేల్, ఇతరులు ఉన్నారు.
హత్య, అల్లర్లకు పాల్పడటం, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, నేరపూరిత కుట్ర, ఇతర అభియోగాలు వీరిపై ఉన్నాయి.
మాయా కొడ్నానీ, బాబు బజరంగి సహా ఆరుగురు నరోడా పాటియా కేసులో ఇప్పటికే దోషులుగా తేలారు.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన తొమ్మిది కేసుల్లో నరోదా ఊచకోత కేసు ఒకటి.
ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ దాదాపు 14 ఏళ్ల క్రితం 2009 జులైలో మొదలైంది.
‘నేను అత్యాచారం వల్ల పుట్టాను.. కానీ, ఆ ప్రభావం నాపై పడనివ్వను'
సూడాన్: మూలికలు అమ్ముకోవడానికి వెళ్లి ఘర్షణల్లో చిక్కుకుపోయిన హక్కి-పిక్కి గిరిజనులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందా?
బ్రేకింగ్ న్యూస్, 'మోదీ ఇంటిపేరు' కేసులో రాహుల్ గాంధీ అప్పీల్‌ను కొట్టివేసిన సూరత్ సెషన్స్ కోర్టు
మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం కేసులో సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ గాంధీకి స్టే నిరాకరించింది.
2019లో మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సూరత్ సెషన్స్ కోర్టు మార్చి 23న రెండేళ్లు జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేయడానికి ఆయనకు నెల రోజుల గడువు ఇచ్చింది.
శిక్షపై మధ్యంతర స్టే కోరుతూ రాహుల్ గాంధీ దరఖాస్తు పెట్టుకున్నారు.
నేడు సూరత్ సెషన్స్ కోర్టు రాహుల్ దరఖాస్తును తిరస్కరించిందని ఆయన తరపు లాయర్ కిరీట్ పన్వాలా బీబీసీకి తెలిపారు.
సెషన్స్ కోర్టు నిర్ణయంతో గత నెలలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు ఈ తీర్పు రాహుల్‌కు పెద్ద ఎదురుదెబ్బ.
రాహుల్ గాంధీ బెయిల్‌పై కొనసాగుతారని, శిక్షకు సంబంధించిన అప్పీల్ పరిష్కారమయ్యే వరకు ఆయన్ను అరెస్ట్ చేయరని లాయర్ కిరీట్ పన్వాల్ బీబీసీతో చెప్పారు.
సూరత్ సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హై కోర్టులో పిటిషన్ వేస్తారని చెప్పారు.
"మేము తీర్పు కాపీ కోసం వేచి చూస్తున్నాం. మాకు అందిన వెంటనే, దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం" అని కిరీట్ పన్వాల్ బీబీసీతో చెప్పారు.
జనాభాలో చైనాను దాటేస్తున్న భారత్... ఇవీ 5 ముఖ్యాంశాలు
రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేడు
రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.
2019లో మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సూరత్ సెషన్స్ కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. సెషన్స్ కోర్టు నిర్ణయంతో గత నెలలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దయింది.
కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ రాహుల్ మళ్లీ కేసు వేశారు.
"సూరత్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి రాబిన్ మోగ్రా ఈరోజు ఉదయం 11.00 గంటలకు రాహుల్ గాంధీ అప్పీల్ కేసులో తీర్పు వెల్లడిస్తారు. రాహుల్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం" అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కిరీట్ పన్వాలా బీబీసీతో చెప్పారు.
ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 42 ఏళ్లు: ఇది ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ
కె-పాప్ స్టార్ మూన్‌బిన్ మృతి.. ఆత్మహత్య అని పోలీసుల అనుమానం
కె-పాప్ స్టార్, 25 ఏళ్ల మూన్‌బిన్ మరణించారు. ఈ విషయాన్ని మూన్‌బిన్ పాటలు రికార్డ్ చేసే సంస్థ వెల్లడించింది.
బుధవారం రాత్రి మూన్‌బిన్ సియోల్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఆయన మేనేజర్ గుర్తించారని పోలీసులు తెలిపినట్టు దక్షిణ కొరియా మీడియా ప్రచురించింది.
"ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం. మృతికి కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి శవపరీక్ష నిర్వహిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.
"మూన్‌బిన్ హఠాత్తుగా మనల్ని వదిలివెళ్లిపోయారు. ఆకాశంలో నక్షతమైపోయారు" అంటూ మూన్‌బిన్ రికార్డింగ్ కంపెనీ 'ఫాంటియాగో' ఒక ప్రకటన విడుదల చేసింది.
మూన్‌బిన్ 2016లో బాయ్స్ గ్రూప్ 'ఆస్ట్రో' బ్యాండ్‌లో చేరకముందు నటుడిగా, మోడల్‌గా చేశారు.
ఆయన సోదరి మూన్ సువా కూడా కే-పాప్ సింగరే. గర్ల్స్ బ్యాండ్ బిల్లీలో ఆమె భాగం.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.