సీబీఐ కార్యాలయం నుంచి బయటికొచ్చిన అరవింద్ కేజ్రీవాల్

మద్యం పాలసీ కేసులో సీబీఐ విచారణకు హాజరైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

లైవ్ కవరేజీ

  1. భారత్ vs పాకిస్తాన్: ముస్లిం జనాభా గురించి నిర్మలా సీతారామన్ అన్న మాటలు ఎంతవరకు నిజం? - రియాల్టీ చెక్

  2. పుల్వామా దాడిపై జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ ఏమన్నారు? భారత్‌ను పాకిస్తాన్ ఎందుకు నిందిస్తోంది?

  3. సీబీఐ కార్యాలయం నుంచి బయటికొచ్చిన అరవింద్ కేజ్రీవాల్

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    మద్యం పాలసీ కేసులో సీబీఐ విచారణకు హాజరైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

    తనను తొమ్మిదిన్నర గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారని, మద్యం స్కాం అని చెబుతున్నదంతా బూటకమని కేజ్రీవాల్ అన్నారు.

    ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయతీ గల పార్టీ. మా పార్టీని ఖతం చేయాలని వాళ్లు అనుకుంటున్నారు. కానీ దేశ ప్రజలంతా మా వెంట ఉన్నారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    అంతకుముందు సీబీఐ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

    ''నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. బీజేపీ నేతలు దాని (అరెస్టు) గురించి మాట్లాడుతున్నారు. సీబీఐని బీజేపీ కంట్రోల్‌ చేస్తోంది'' అని సీబీఐ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్ అన్నారు.

    ''కొన్ని దేశ విద్రోహక శక్తులు భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు. వాళ్లకి నేనొక్కటే చెబుతున్నా. దేశం పురోగతి సాధిస్తుంది'' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

  4. వివేకా హత్య కేసు: విచారణకు రావాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసు

    YS Avinash Reddy

    ఫొటో సోర్స్, fb/YsAvinashYouth

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలంటూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసు ఇచ్చింది.

    సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

  5. అమర్త్యసేన్, శాంతినికేతన్ మధ్య భూ వివాదం.. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదంగా మారిందా?

  6. IPL 2023: కోల్‌కతాపై ముంబయి విజయం

    ishan kishan

    ఫొటో సోర్స్, Getty Images

    ఐపీఎల్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైడ్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో 'ఇంపాక్ట్ ప్లేయర్‌'గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. 51 బంతుల్లో( 6 ఫోర్లు, 9 సిక్సర్లు) 104 పరుగులు సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మన్ నుంచి సరైన సహకారం అందకపోవడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 185 పరుగులు చేసింది.

    ముంబయి బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు తీశాడు. 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇషాన్ కిషన్ 58 పరుగులు, రోహిత్ శర్మ 20 పరుగులు చేసి ఔటయ్యారు.

    అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (25 బంతుల్లో 43), తిలక్ వర్మ (25 బంతుల్లో 30), టిమ్ డేవిడ్ (13 బంతుల్లో 24)లు సైతం బ్యాట్ ఝలిపించడంతో ముంబై 17.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

    కేకేఆర్ బౌలర్లలో సుయాస్ శర్మ రెండు వికెట్లు తీశాడు.

    ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు.

  7. అతీక్ మర్డర్: గుడ్డు ముస్లిం ఎవరు? చనిపోవడానికి కొద్దిసెకన్ల ముందు అష్రఫ్ మాట్లాడింది ఇతని గురించేనా?

  8. వివేకా హత్య కేసు: వైఎస్ భాస్కర్‌ రెడ్డికి 14 రోజులు రిమాండ్

    వైఎస్ భాస్కర్ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

    సీబీఐ అధికారులు ఆయనను ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులలో అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

    ఆదివారం కావడంతో ఇంట్లో ఉన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట భాస్కర్ రెడ్డిని హాజరుపరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

    భాస్కర్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

  9. కెరియర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ఎక్కడ చదవొచ్చు? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

  10. రాహుల్ గాంధీ : ‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంది’

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, FB/IndianNationalCongress

    కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోలార్‌లో పర్యటించారు. బహిరంగ సభలో ప్రసంగించారు.

    కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనిలోనూ 40 శాతం కమిషన్ తీసుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తాను లేఖ రాస్తే, ఇప్పటి వరకూ ప్రధాని నుంచి సమాధానం రాలేదన్నారు.

    అంటే కమిషన్ తీసుకోవడాన్ని ప్రధాన మంత్రి అంగీకరించినట్టేనని రాహుల్ గాంధీ విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అదానీకి ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయలు కట్టబెడితే, తాము కర్ణాటకలోని పేద ప్రజలు, మహిళలు, యువతకు ఆ డబ్బులు ఇస్తామని రాహుల్ అన్నారు.

    ‘‘మీరు అదానీకి మనస్ఫూర్తిగా సాయం చేసినట్టే, మేము కర్ణాటక ప్రజలకు సాయం చేస్తాం’’ అన్నారు.

    అదానీ షెల్ కంపెనీలకు 20 వేల కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయని ప్రశ్నిస్తే బీజేపీ పార్లమెంట్‌ను స్తంభింపజేసిందని రాహుల్ అన్నారు. పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి అలా జరిగిందని, సాధారణంగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటాయని ఆయన అన్నారు.

    తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు రెండు లేఖలు రాశానని, అయితే స్పీకర్ తనకు అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ అన్నారు. స్పీకర్ నవ్వుతూ తానేం చేయలేనని చెప్పారని రాహుల్ అన్నారు.

    అదానీ విషయం పార్లమెంట్‌లో చర్చను అనుమతించేందుకు స్పీకర్ భయపడ్డారని, ఆ తర్వాత తనపై అనర్హత వేటు పడిందని రాహుల్ గాంధీ అన్నారు.

  11. దుబాయ్‌: అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, నలుగురు భారతీయులు సహా 16 మంది మృతి

    అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, ALI HAIDER/EPA-EFE/REX/Shutterstock

    దుబాయ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది చనిపోయారని, వారిలో నలుగురు భారత పౌరులు ఉన్నట్టు భావిస్తున్నారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

    చనిపోయినట్టు భావిస్తున్న కుటుంబం కేరళకు చెందినదిగా పీటీఐ పేర్కొంది.

    ఈ అగ్నిప్రమాదంలో చనిపోయినట్టు భావిస్తున్న నలుగురిలో ఒక జంట ఉన్నట్లు భారత్‌‌కు చెందిన సోషల్ వర్కర్ నజీర్ వతనపల్లి చెప్పారని ఖలీజ్ టైమ్స్ తెలిపింది.

    భవనంలోని నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు క్రమంగా భవనం అంతటా వ్యాపించాయి.

    ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలైన నగరంలోని గోల్డ్, స్పైస్ మార్కెట్లకు సమీపంలోని అల్- రస్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

    స్థానిక కాలమానం ప్రకారం 12 గంటల 41 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాలకు) అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.

    భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. ఈ ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతిందని పేర్కొంది.

    ఈ దుర్ఘటనపై విచారణ జరుగుతోందని దుబాయ్ సివిల్ డిఫెన్స్ చెప్పినట్లు యూఏఈ వార్తాపత్రిక ది నేషనల్‌ తెలిపింది.

  12. అతీక్ అహ్మద్: ఈ బాహుబలి క్రిమినల్ భార్య, పిల్లలు, సోదరుడి క్రైమ్ కథలు మీకు తెలుసా?

  13. ఊర్వశి: భర్త ఆచూకీ కోసం 84 రోజులు పోరాడిన మహిళ, చివరకు ఏం తేలిందంటే...

  14. అరవింద్ కేజ్రీవాల్: సీబీఐ విచారణకు హాజరైన దిల్లీ సీఎం

    మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారని, ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    విచారణకు హాజరయ్యే ముందు మహాత్మ గాంధీ స్మృతివనం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.

    గాంధీ సమాధి వద్ద కేజ్రీవాల్ నివాళులర్పించారు. అనంతరం సీబీఐ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పక్కన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ''నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. బీజేపీ నేతలు దాని 'అరెస్టు' గురించి మాట్లాడుతున్నారు. సీబీఐని బీజేపీ కంట్రోల్‌ చేస్తోంది'' అని సీబీఐ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు దిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ''కొన్ని దేశ విద్రోహక శక్తులు భారత్‌ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు. నేను వాళ్లకి చెబుతున్నా. దేశం పురోగతి సాధిస్తుంది'' అని కేజ్రీవాల్ అన్నారని ఏఎన్ఐ తెలిపింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ ఎంపీలు, నేతలు ఆయన వెంట ఉన్నారు.

  15. అతీక్, అష్రఫ్‌ హత్యకు కొద్దిసేపు ముందు ఏం జరిగింది?

  16. తిరుపతి: గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం... ఏమిటీ దీని ప్రత్యేకత?

  17. అరవింద్ కేజ్రీవాల్ : బీజేపీ వాళ్లు చాలా శక్తివంతులు, ఎవరినైనా జైల్లో పెట్టగలరు

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    మద్యం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే సీబీఐ ఆయనకు నోటీసులిచ్చింది.

    విచారణకు హాజరయ్యే ముందు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో సందేశమిచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ''విచారణకు రావాలని సీబీఐ పిలిచింది. నేను తప్పకుండా ఈరోజు విచారణకు హాజరవుతా. వాళ్లు చాలా శక్తివంతులు. వాళ్లు ఎవరినైనా జైల్లో పెట్టగలరు. నన్ను అరెస్టు చేయాలని బీజేపీ ఆదేశిస్తే సీబీఐ ఆ ఆదేశాలను తప్పకుండా పాటిస్తుంది.'' అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ''నేను అవినీతిపరుడినని మీరు చెబుతున్నారు. నేను ఆదాయ పన్ను శాఖలో కమిషనర్‌గా పనిచేశాను. నేను కావాలనుకుంటే కోట్లు సంపాదించేవాడిని. అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడు అయితే ఇక ప్రపంచంలోనే నిజాయితీపరుడు ఎవరూ ఉండరు'' అని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    సీబీఐ విచారణ నేపథ్యంలో దిల్లీలోని కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సీబీఐ హెడ్ క్వార్టర్స్ వద్ద కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని, భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  18. వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్

    అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి

    కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు మెమోను భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి కి అందించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

    పులివెందులలో అదుపులో తీసుకున్న భాస్కర్ రెడ్డిని కడపకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తోంది.

    మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలిలోని అవినాష్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ బృందాలు వెళ్ళాయి.

    వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు సీబీఐ ప్రశ్నించింది. భాస్కర్ రెడ్డి కూడా పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.

    రెండు రోజుల క్రితం ఎంపీ అవినాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.

    వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇటీవల అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారిగా ఉన్న సీబీఐ ఎస్పీపై చర్యలు కూడా తీసుకుంది.

    ఈ నేపథ్యంలో ఐదుగురు అధికారులతో కూడిన దర్యాప్తు బృందం రంగంలో దిగింది. ఆ బృందం రాగానే కేసులో కీలక వ్యక్తుల అరెస్టు ప్రక్రియ చేపట్టడం ఆసక్తిగా మారింది.

  19. సీబీఐ కార్యాలయం నుంచి బయటికొచ్చిన అరవింద్ కేజ్రీవాల్