లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది.
కోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించినందుకు సీబీఐ, ఈడీలను ప్రాసిక్యూషన్ చేస్తామని శనివారం విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ హెచ్చరించారు.
గవర్నర్‌తో కొనసాగుతున్న వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ కేజ్రీవాల్ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు. స్టాలిన్‌కు రాసిన లేఖను కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ “బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ ప్రజా ప్రతినిధులను అణచివేసే కేంద్రం చర్యలను ఖండిస్తున్నాం. ఎం.కే. స్టాలిన్‌కు అండగా ఉంటాం. గవర్నర్‌లు / లెఫ్టినెంట్‌లు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా దిల్లీ అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం'' అని తెలిపారు.
ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను ఉపయోగిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, UGC
హనుమకొండలో బీజేపీ శనివారం నిరుద్యోగ మార్చ్ చేపట్టింది. ఈ ర్యాలీలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. బీజేపీ పిలుపు నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఖాళీ పోస్టుల భర్తీపై తొలి సంతకం చేస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈనెల 21న పాలమూరులో నిరుద్యోగ మార్చ్ నిర్వహించబోతున్నామని బండి సంజయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు దిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లి 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
కెప్టెన్ డుప్లెసీస్ 22 పరుగులు, మహిపాల్ లోమ్రోర్ 26, మాక్స్‌వెల్ 24 పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 175 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కూడా ఖాతా తెరవకుండానే ఔటవడంతో జట్టు కష్టాల్లో పడింది.
దిల్లీ జట్టు 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే మనీశ్ పాండే 38 బంతుల్లో 50 పరుగులు, అక్షర్ పటేల్ 21 పరుగులు, నార్జ్ 23 పరుగులు సాధించడంతో దిల్లీ చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేయగలిగింది.
ఆర్‌సీబీ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నారు. కాగా, దిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో ఇది వరుసగా ఐదో ఓటమి.

ఫొటో సోర్స్, Getty Images
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో సైన్యం, పారామిలిటరీ దళం మధ్య కాల్పులు, దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘర్షణలో ముగ్గురు చనిపోయారు.
నగరం మధ్యలో ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయం చుట్టూ కాల్పుల శబ్దాలు వినిపించాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
ఈ దాడుల నేపథ్యంలో సూడాన్‌లోని భారతీయులందరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అక్కడి భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
మూడు విమానాశ్రయాలను, ఆర్మీ చీఫ్ నివాసం, అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) తెలిపింది.
అయితే, సైన్యం దానిని ఖండించింది. తమ వైమానిక దళం పారామిలటరీ స్థావరాలపై దాడులు చేస్తోందని పేర్కొంది.
సూడాన్‌లో హింసను తక్షణమే ఆపాలని అమెరికా, రష్యా సహా పలు దేశాలు కోరాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రకటించిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజల తరఫున తాను ఈ బిడ్డింగ్‌లో పాల్గొంటున్నానని ఆయన చెప్పారు.
బొగ్గు లేదా ఇనుప ఖనిజం వ్యాపారంలో ఉన్న కంపెనీలు మాత్రమే ఈ బిడ్‌లో పాల్గొనాలని స్టీల్ ప్లాంట్ జారీ చేసిన ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనలో నిబంధన ఉంది.
దీనిపై ఆయన్ని అడిగితే.. "కంపెనీ లాపై నాకు అవగాహన ఉంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటనని పూర్తిగా చదివిన తర్వాతే ప్రజల తరఫున ఈ బిల్డింగ్‌లో పాల్గొంటున్నాను. బిడ్ వేసిన వారందరికీ ఇకపై స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్‌ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనివ్వం" అని లక్ష్మీనారాయణ బీబీసీతో చెప్పారు.
ఈ బిడ్డింగ్‌లో 20కి పైగా కంపెనీలు పాల్గొన్నాయని, ఓ ప్రైవేట్ సంస్థ తరఫున లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేశారని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఈ బిడ్డింగ్‌కు గడువును ఐదు రోజులు పొడిగించింది.
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘ఉక్కు సంకల్పయాత్ర’ పేరుతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ARVIND KEJRIWAL
మద్యం కేసులో సీబీఐ సమన్లు జారీచేయడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 16న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు.
‘‘రేపు సీబీఐ విచారణకు హాజరవుతాను. నేను మళ్లీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. ప్రధానిగారూ.. కేజ్రీవాల్ దొంగ, అవినీతిపరుడు అయితే ఈ ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదు.’’ అని కేజ్రీవాల్ అన్నారు.
‘‘ఒకవేళ నన్ను అరెస్ట్ చేయాలని బీజేపీ సీబీఐకి ఆదేశాలిస్తే, వారి ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుంది’’ అని కేజ్రీవాల్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మనీశ్ సిసోడియా తన 14 ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారని, కానీ ఈడీ వద్ద ఆయన ఫోన్లు 4 ఉన్నాయని చెబుతోందని, సీబీఐ ఒకటుందని అంటోందని కేజ్రీవాల్ చెప్పారు.
ఒకవేళ మనీశ్ సిసోడియా తన అన్ని ఫోన్లను ధ్వంసం చేస్తే, సీబీఐ, ఈడీ వద్దకి ఈ ఫోన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ ఏజెన్సీలు కోర్టుకి అబద్ధం చెబుతున్నాయని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఓ మహిళను తుపాకీతో బెదిరించి మెడలోని గొలుసు లాక్కెళ్లారని దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఓ షాపు దగ్గరకు వస్తున్న మహిళపై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు
సీసీ కెమెరాలకు చిక్కాయి.
తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆమె మెడలోని గొలుసును లాక్కున్నారు. మహిళ అరుస్తుండగా, సాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి కూడా తుపాకీ చూసి భయంతో వెనక్కి తిరిగి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది.

ఫొటో సోర్స్, Reuters
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాని పాల్గొంటున్న ఒక బహిరంగ కార్యక్రమంలో పొగబాంబు విసిరినట్లు అలజడి చెలరేగడంతో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
వకయామా నగరంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని కిషిడా సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.
ఒక వ్యక్తి ఏదో విసిరినట్టుగా కనిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. దాని నుంచి పొగ వస్తోందన్నారు. పెద్ద శబ్దం వినిపించిందని మరొకరు చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
అనుమానితుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్నట్టు వీడియోలో కనిపించింది.
జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేసిన ఫుటేజీలో ఘటనా స్థలం నుంచి జనం గుంపులు గుంపులుగా పారిపోవడం కనిపించింది. ఆ వీడియోలో ఒక వ్యక్తిని చుట్టుముట్టి, అతన్ని కిందకు వంచి పట్టుకుని, అతన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇలాంటి ఘటనలు జపాన్‌లో చాలా అరుదు. గతేడాది ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని షింజో అబే హత్యానంతరం నేతల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, ANI
మహారాష్ట్రలో బస్సు గుంతలో పడి 12 మంది చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలైనట్లు పేర్కొంది.
రాయ్‌గడ్ జిల్లాలోని ఖోపోలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రాయ్‌గడ్ ఎస్పీ చెప్పినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.