పంజాబ్: భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఫైరింగ్, నలుగురు జవాన్ల మృతి
వెంటనే మిలిటరీ స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయి. స్టేషన్ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి
లైవ్ కవరేజీ
లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.
బీఆర్‌ఎస్ సభలో ప్రమాదం: నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, UGC
ఖమ్మం జిల్లా కారేపల్లి దగ్గర బీఆర్ఎస్ సభలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
ఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోగా, చికిత్స సమయంలో మరో ఇద్దరు మరణించారు. రమేశ్, మంగులు ఘటన జరిగిన చోటే మరణించారు. గాయపడ్డ వారిలో లక్ష్మణ్, సందీప్ చికిత్స పొందుతూ చనిపోయారు.
పార్టీ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పురవ్వలు పడి పూరి గుడిసె దగ్ధమైంది. మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలింది.
కారేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విచారం వ్యక్తం చేశారు.
మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాల ఐక్యత దిశగా చరిత్రాత్మక నిర్ణయం: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, TWITTER/@RAHULGANDHI
త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలతో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు.
దేశ రాజధాని దిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో బుధవారం రాహుల్ గాంధీని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జనతా దళ్ (యునైటెడ్) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ కలిశారు.
‘‘ఇది సైద్ధాంతిక పోరాటం. ప్రతిపక్షాల ఐక్యత దిశగా ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మేం కలిసే ఉంటాం. కలిసే పోరాడతాం’’అని రాహుల్ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భేటీ అనంతరం ఖర్గే విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నేడు ఒక చరిత్రాత్మక భేటీ జరిగింది. మేం చాలా అంశాలపై మాట్లాడుకున్నాం. విపక్షాలు కలిసే ఉండాలని మేం నిర్ణయం తీసుకున్నాం. త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో అందరమూ కలిసే పోటీచేస్తాం’’అని ఖర్గే వివరించారు.
ఈ భేటీ తర్వాత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా నీతీశ్ కుమార్, తేజస్వి యాదవ్ కలిశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎలాన్ మస్క్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ట్విటర్ అమ్మకం, బ్లూటిక్‌ల తొలగింపుపై ఆయన ఏమన్నారు?
మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
పారిశ్రామికవేత్త కేశవ్ మహీంద్రా మృతి

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
ఫొటో క్యాప్షన్, కేశవ్ మహీంద్రాకు 99 ఏళ్లు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఎమెరిటస్, ప్రముఖ పారిశ్రామికవేత్త కేశవ్ మహీంద్రా బుధవారం ముంబయిలోని ఆయన ఇంట్లో కన్నుమూశారు.
ఆయన వయస్సు 99 సంవత్సరాలని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
కేశవ్ 48 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూప్‌కు సారథ్యం వహించారు.
ఆయన హయాంలోనే మహీంద్రా గ్రూప్ ఆటో మొబైల్ రంగాన్ని దాటి విస్తరించింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవలు, హాస్పిటాలిటీ లాంటి వ్యాపారాల్లోకి ప్రవేశించింది.
విల్లీస్ కార్పొరేషన్, మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటిష్ టెలికాం, అనేక ఇతర అంతర్జాతీయ కంపెనీలతో మహీంద్రా గ్రూప్ ఒప్పందాలు కేశవ్ మహీంద్రా హయాంలోనే జరిగాయి.
అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించిన ఆయన, 1947లో మహీంద్రా గ్రూపులో చేరారు. 1963లో ఛైర్మన్ అయ్యారు.
ఆనంద్ మహీంద్రాకు 2012లో ఆయన మహీంద్రా గ్రూపు బాధ్యతలను అప్పగించారు.
ఆనంద్ అప్పుడు కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. కేశవ్‌కు ఆనంద్ సమీప బంధువు.
గ్రూపు బాధ్యతలు ఆయనకు అప్పగించిన తర్వాత కేశవ్, కంపెనీ డైరెక్టర్ల బోర్డులో కొనసాగారు.
కిబితూ: భారత్‌లోని చివరి గ్రామం నుంచి చైనాకు మోదీ ప్రభుత్వం పంపుతున్న సందేశం ఏమిటి?
రాజస్థాన్: ఆరోగ్య హక్కు బిల్లుకు గవర్నర్ ఆమోదం

ఫొటో సోర్స్, YEARS
ఆరోగ్య హక్కు (రైట్ టు హెల్త్) బిల్లుకు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా బుధవారం ఆమోదం తెలిపారు.
మార్చి 21న ఈ బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.
ఈ బిల్లుపై ప్రైవేట్ డాక్టర్లు, ఆస్పత్రుల యజమానులు, సిబ్బంది ఆందోళనలు చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు ఈ బిల్లు ముగింపు పలుకుతుందని డాక్టర్లు విమర్శించారు. బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఒప్పుకోలేదు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA/BBC
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, వైద్య మంత్రి పర్సాది లాల్ మీనా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీ ఉషా శర్మ ఏడుగురు డాక్టర్లతో సమావేశమయ్యారు.
చివరికి ప్రభుత్వంతో డాక్టర్లు ఒక ఒప్పందానికి రావాల్సి వచ్చింది.
ఆరోగ్య హక్కు బిల్లును తీసుకొచ్చిన తొలి రాష్ట్రం రాజస్థానే.
సొంత ప్రజలపై బాంబులు వేయించిన ప్రభుత్వం, మియాన్మార్‌లో 100 మందికి పైగా మృతి
ఖమ్మం: బీఆర్ఎస్ సభలో అగ్నిప్రమాదం, ఒకరు మృతి

ఫొటో సోర్స్, UGC
ఖమ్మం జిల్లా కారేపల్లి దగ్గర బీఆర్ఎస్ సభలో ప్రమాదం జరిగింది. పార్టీ ఆత్మీయ సమ్మేళనం కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు వస్తుండటంతో కార్యకర్తలు బాణసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పురవ్వలు పడి పూరి గుడిసె దగ్ధమైంది.
మంటల వల్ల గుడిసెలోని సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు శబ్దానికి అందరూ భయపడి అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సభ ప్రారంభానికి ముందే పేలుడు జరగడంతో అక్కడంతా గందరగోళం ఏర్పడింది.
టప్పర్‌వేర్: ఈ ప్లాస్టిక్ కంటెయినర్ తయారీ కంపెనీ ఎందుకు దివాలా స్థితిలో ఉంది?
కరోనా: మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్

ఫొటో సోర్స్, GETTY IMAGES
సుచిత్ర మోహంతి
బీబీసీ కోసం
దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో న్యాయవాదులు, పిటిషనర్లు, ఇతరులు అందరూ మాస్క్‌లు ధరించాలని సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
దిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ తక్షణ నిర్ణయంగా దీన్ని తీసుకుందని ఈ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన సీనియర్ అధికారులు బీబీసీకి చెప్పారు.
కాగా, దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కి పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 7,830 కేసులు నమోదయ్యాయి.
భటిండా మిలటరీ స్టేషన్‌లో ఫైరింగ్, ఉగ్రవాద చర్య కాదన్న పంజాబ్ పోలీసులు

ఫొటో సోర్స్, ANI
భటిండా మిలటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఉగ్రవాద ప్రమేయం లేదని భటిండా ఎస్ఎస్‌పీ గుల్నీత్ సింగ్ ఖురానా చెప్పారు. బీబీసీ జర్నలిస్ట్ అరవింద్ ఛాబ్రాకు ఆయన ఈ సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని, కానీ, ఈ కాల్పులు ఎవరు జరిపారో ఇంకా తెలియలేదన్నారు.
భటిండాలోని ఆర్మీ కంటోన్మెంట్ అన్ని ప్రవేశ ద్వారాలను మూసివేసినట్లు పోలీసు వర్గాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.
రెండు రోజుల క్రితం 28 కాట్రెడ్జ్‌తో ఉన్న ఒక ఇన్సాస్ రైఫిల్ కనబడకుండా పోయిందని పోలీసులు చెప్పినట్లు పేర్కొంది.
ఈ సంఘటన వెనుక ఆర్మీ వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీఆర్ అంబేడ్కర్: అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనలో ఎలా కష్టపడేవారంటే....
బ్రేకింగ్ న్యూస్, భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఫైరింగ్, నలుగురి మరణం
పంజాబ్‌లోని భటిండా మిలిటరీ స్టేషన్‌లో తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఫైరింగ్ ఘటన జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
ఈ ఘటనలో నలుగురు మరణించినట్లు వెల్లడించింది.
వెంటనే మిలిటరీ స్టేషన్‌లోని క్విక్ రియాక్షన్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.
స్టేషన్ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బిహార్‌లో భూకంపం, రిక్టర్‌స్కేల్‌పై 4.3గా నమోదు

ఫొటో సోర్స్, ANI
బిహార్‌లోని అరారియాలో భూకంపం వచ్చింది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సీఎస్) ట్వీట్ చేసింది.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.35 గంటలకి ఈ భూకంపం వచ్చినట్లు ఎన్‌సీఎస్ పేర్కొంది.
10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది.
ఏప్రిల్ 9న కూడా నికోబార్ ఐల్యాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. నికోబార్ ఐల్యాండ్‌లో సాయంత్రం 4.01 గంటలకు భూకంపం వచ్చింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జమ్ముకశ్మీర్‌లో కూడా భూకంపం, రిక్టర్‌స్కేల్‌పై 4.0గా నమోదు
అటు, జమ్ముకశ్మీర్‌లో కూడా భూప్రకంపనాలు సంభవించాయి.
ఈ రోజు ఉదయం 10.10 గంటలకు జమ్ముకశ్మీర్‌లో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
రిక్టర్‌స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.0గా పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కర్ణాటక ఎన్నికలు: 189 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ

ఫొటో సోర్స్, ANI
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 189 మంది అభ్యర్థులతో తమ తొలి జాబితాను విడుదల చేసింది.
తొలి జాబితాలో బీజేపీ కొత్త వారికి అవకాశం కల్పించింది. 189 మంది అభ్యర్థుల్లో 52 మంది కొత్తగా పోటీ చేయబోతున్నారు.
అయితే, ఈ కొత్త జాబితాలో కొందరు సిట్టింగ్ మంత్రులతో పాటు 10 మందికి టిక్కెట్లు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.
224 సీట్లున్న ఈ రాష్ట్ర అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఓట్ల లెక్కింపును మే 13న చేపట్టనున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మాజీ ముఖ్యమంత్రి జగ్‌దీశ్ శెట్టర్‌ని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని దిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయి.
శెట్టర్‌కి టిక్కెట్ ఇవ్వడం నిరాకరించినట్లు వార్త రావడంతో, హుబ్లిలోని ఆయన నివాసం వద్ద పెద్ద మొత్తంలో ప్రజలు గుమికూడారు.
అయితే, శెట్టర్ సీటుకి ఇంకా అభ్యర్థిని ఎవర్ని ప్రకటించలేదు.
టిక్కెట్ దక్కని నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు తాను దిల్లీ వెళ్తున్నట్లు శెట్టర్ చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
జగదీశ్ శెట్టర్‌తో పాటు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడికి కూడా టిక్కెట్ రాలేదు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేయండి.