భారతీయ - అమెరికన్ శాస్త్రవేత్త సీఆర్ రావుకు అత్యున్నత పురస్కారం

భారతీయ-అమెరికన్ గణాంక శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణారావు (సీఆర్ రావు)కు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారం దక్కింది.

లైవ్ కవరేజీ

  1. టప్పర్‌వేర్: ఈ ప్లాస్టిక్ కంటెయినర్ తయారీ కంపెనీ ఎందుకు దివాలా స్థితిలో ఉంది?

  2. బీఆర్ అంబేడ్కర్: అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనలో ఎలా కష్టపడేవారంటే....

  3. పంజాబ్: భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఫైరింగ్, నలుగురు జవాన్ల మృతి

  4. సూరత్‌ వాకథాన్: చీరకట్టులో నడిచిన 15వేలమంది మహిళలు

  5. తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?

  6. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  7. స్వలింగ సంపర్కులను రోజూ వెంటాడే భయాలు ఇవే

  8. ప్రాణాలకు తెగించి ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న తల్లీకూతుళ్లు

  9. కోళ్ల ఫారాలు ఒక్కసారిగా ఎందుకు మూసేస్తున్నారు?

  10. మిర్యాలగూడ - దళిత యువకుడి హత్య: 'తక్కువ కులపోడని చంపిండన్నరు' .. రోదిస్తున్న నవీన్ తల్లి - గ్రౌండ్ రిపోర్ట్

  11. కర్ణాటకలో 'అమూల్‌ X నందిని' వివాదం ఏమిటి? గుజరాత్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు ఏమైంది?

  12. కీళ్ల నొప్పులకు యూరిక్ యాసిడ్ పెరిగి పోవడమే కారణమా? తగ్గాలంటే ఏం చేయాలి?

  13. ఆప్‌కు జాతీయ పార్టీ హోదా: 'ఈ రోజు మనీశ్, జైన్ సాబ్‌లను మిస్ అవుతున్నా’- కేజ్రీవాల్

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు, ఓటర్లకు, విమర్శకులకు ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.

    ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి సోమవారం ఎన్నికల కమిషన్ జాతీయ పార్టీ హోదా ఇచ్చింది.

    ఈ సందర్భంగా కేజ్రీవాల్, ఇద్దరు మాజీ మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లను గుర్తుకు చేసుకున్నారు. వారు ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్నారు.

    ‘‘ఈ సంతోషకరమైన క్షణంలో, నేను మనీశ్, జైన్ సాబ్‌లను మిస్ అవుతున్నాను. ఒకవేళ వారు ఉండుంటే, మన సంతోషం మరింత పెరిగేది’’ అన్నారు.

    కేవలం పదేళ్లలోనే జాతీయ పార్టీ హోదా పొందడం ఆమ్ ఆద్మీ పార్టీకి అద్భుతమని కేజ్రీవాల్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతానికి నిజాయతీ, దేశభక్తి, మానవత్వం మూడు పిల్లర్లుగా ఉన్నాయన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. మయన్మార్‌లో ఆర్మీ వైమానిక దాడులు; 53 మంది మృతి

    మయన్మార్‌లో ఆర్మీ వైమానిక దాడులు

    ఫొటో సోర్స్, Getty Images

    మయన్మార్‌ అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో సుమారు 53 మంది మరణించారు.

    చనిపోయిన వారిలో 15 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రాణాలతో బయటపడ్డ వారు చెప్పారు.

    అయితే, మరణాల సంఖ్యను ఇంకా బీబీసీ వెరిఫై చేయలేదు.

    మిలటరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సాగింగ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో సైన్యం ఈ దాడులు చేసింది.

    2021 ఫిబ్రవరిలో అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం, తమల్ని వ్యతిరేకిస్తున్న వారిపై వైమానిక దాడులు చేస్తోంది.

    మయన్మార్‌లో మిలటరీ ప్రభుత్వాన్ని సాగింగ్ కమ్యూనిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

    ఉదయం 7 గంటలకు ఒక మిలటరీ జెట్ వచ్చి, బాంబు వేసినట్లు ఆ గ్రామస్థులు చెప్పారు. ఆ తర్వాత 20 నిమిషాల పాటు ఒక హెలికాప్టర్ గన్‌షిప్ తమ గ్రామంపై చక్కర్లు కొట్టిందన్నారు.

  15. భారత్‌లో ఆపిల్ తొలి రిటైల్ స్టోర్లు

    ఆపిల్ తొలి రిటైల్ స్టోర్

    ఫొటో సోర్స్, ANI

    టెక్ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన తొలి రిటైల్ స్టోర్లను వచ్చే వారం ప్రారంభించబోతుంది.

    ఆపిల్ బీకేసీ స్టోర్ ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభమవుతుండగా.. దిల్లీలో సాకేత్ స్టోర్ ఏప్రిల్ 20న కస్టమర్ల ముందుకు వస్తోంది.

    కస్టమర్ల కోసం ఆపిల్ ముంబై స్టోర్ ఉదయం 11 గంటల నుంచి ఓపెన్‌లో ఉంటుంది. దిల్లీ అవుట్‌లెట్ 10 గంటలకే తెరుచుకుంటుంది.

    2020లో తొలిసారి ఆపిల్ తన ఆన్‌లైన్ స్టోర్‌ను భారత్‌లో తెరిచింది. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లను కూడా తెరవాలనుకుంది. కానీ, కరోనా మహమ్మారి కారణంతో ఈ ప్లాన్స్ వాయిదా పడ్డాయి.

    భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వృద్ధిపై ఆపిల్ ఎక్కువగా దృష్టిసారించింది. తన ప్రొడక్ట్‌లను ఇక్కడ తయారు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతోంది.

  16. పారిశుధ్య కార్మికుడిగా పనిచేసే ఓ యువకుడికి లాంకస్టర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్

  17. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్ కేసుపై ఈడీ విచారణ

    టీఎస్‌పీఎస్‌సీ

    ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK

    టీఎస్‌పీఎస్ ప్రశ్నపత్రాల లీక్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ చేపడుతోంది.

    ఈ కేసులో జైలులో ఉన్న ప్రధాన నిందితులకు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది.

    జైలులో ఉన్న నిందితులను ప్రశ్నించేందుకు నాంపల్లి కోర్టు అనుమతిని ఈడీ కోరుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. పార్టీలకు జాతీయ హోదా ఎలా ఇస్తారు? దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

  19. ఎల్‌నినో పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం.. ఐఎండీ

    ఐఎండీ వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర

    ఫొటో సోర్స్, ANI

    ఈ ఏడాది వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు.

    అయితే ఈ రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.

    ఈ సీజన్ ద్వితీయార్థంలో ఎల్‌నినో ప్రభావముంటుందని చెప్పారు. అయితే, ఎల్‌నినో ఇయర్స్ అన్ని కూడా రుతుపవనాలకు చెడు చేయవని అన్నారు.

    1951 నుంచి 2022 మధ్య నమోదైన ఎల్‌నినో ఇయర్స్‌లో 40 శాతం సాధారణ వర్షపాతం లేదా సాధారణం కన్నా అధిక వర్షపాతమే నమోదైందని ఐఎండీ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. దక్షిణ కొరియా: కాలుతున్న అడవి గుండా కారు డ్రైవింగ్

    దక్షిణ కొరియాలో కాలుతున్న అడవి గుండా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోన్న ఒక వాహనదారుడు, ఆ కార్చిచ్చును తన ఫోన్‌లో చిత్రీకరించారు.

    సోల్ నగరానికి తూర్పున 168 కి.మీల దూరంలో ఉన్న గాంగ్నెయుంగ్ అటవీ ప్రాంతంలో ఈ కార్చిచు చెలరేగింది.

    అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

    కానీ, బలమైన గాలులు వీస్తుండటంతో పాటు, వాతావరణం అనుకూలించకపోతుండటంతో మంటలు మరింత చెలరేగుతున్నాయి.

    కాలుతోన్న ఈ అడవిని ఒక వాహనదారుడు తన ఫోన్‌లో చిత్రీకరించారు.

    వీడియో క్యాప్షన్, దక్షిణ కొరియా : కాలుతున్న అడవి గుండా కారు డ్రైవింగ్