బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో రాజకీయ ‘దురుద్దేశంతోనే’ తన పేరును అనవసరంగా లాగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం.
న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దయిన నేపథ్యంలో.. తెలంగాణలోని హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
ఈ ఆందోళనలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు.
కాగా, క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో, ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Twitter/KTR
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) వ్యవహారంలో తన మీద ‘‘నిరాధారమైన, అసత్య ఆరోపణలు’’ చేశారంటూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల మీద కేటీఆర్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపారు.
టీఎస్‌పీఎసీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో రాజకీయ ‘దురుద్దేశంతోనే’ తన పేరును అనవసరంగా లాగుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.
‘‘సుదీర్ఘ కాలంగా ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారి మీద అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వీరికి లేదు’’ అని కేటీఆర్ అన్నారు
ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఎలాంటి ‘‘ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణల’’ను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో కేటీఆర్ డిమాండ్ చేశారు.
వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నకిలీ మందులు తయారు చేస్తోన్న 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
20 రాష్ట్రాల్లో 76 కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.
నకిలీ మందులు తయారు చేస్తోన్న దేశంలోని ఫార్మా కంపెనీలపై భారీ ఎత్తున చర్యలు చేపట్టినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తోన్న ఈఫార్మసీలను కట్టుదిట్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.
భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తుల మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్ అనే వ్యక్తి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
భరత్ కుమార్ యాదవ్, పులివెందుల పట్టణంలోనీ దిలీప్ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం.
భరత్ కుమార్ యాదవ్‌కు దిలీప్ అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారని స్థానికులు చెబుతున్నారు.
దీంతో ఇంటికి వెళ్లిన భరత్ తనవద్ద ఉన్న తుపాకీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. దిలీప్ ఛాతి, నుదిటిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఆ సమయంలోనే అతడి పక్కనే ఉన్నమహబూబ్ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో అతడిపైనా కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు.
గాయాలతో వీరిద్దరూ కింద పడిపోవడంతో భరత్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్ తరలిస్తుండగా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినట్లువైద్యులు తెలిపారు.
గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ విచారణకు హాజరైన భరత్ కుమార్ యాదవ్‌కు అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్ కుమార్ యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సరిహద్దులో ఉన్న ఉత్తర మెక్సికో నగరం సియుడాడ్ జుయారెజ్‌లో శరణార్థుల నిర్భంద శిబిరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
సుమారు 39 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
నేషనల్ మైగ్రేషన్ ఇన్‌స్టిట్యూట్ పార్కింగ్ స్థలంలో పలు మృతదేహాలపై బ్లాంకెట్లను కప్పుతున్న అగ్నిమాపక సిబ్బందిని, సహాయక దళాలను చూడొచ్చని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ కరెస్పాండెంట్ తెలిపారు.
సోమవారం అర్ధరాత్రికి ముందు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది.
భారతీయ న్యూస్ ఏజెన్సీ పీటీఐ కథనం ప్రకారం ఈ ప్రమాదంలో 39 మంది చనిపోయారని, 29 మందికి గాయాలయ్యాయని తెలిసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సంఘటన స్థలంలో 70 మంది శరణార్థులున్నట్లు సహాయ సిబ్బందిలోని ఒకరు ఏఎఫ్‌పీకి చెప్పారు.
వీరిలో చాలా మంది వెనెజులాకి చెందిన వారు. ఈ అగ్నిప్రమాదంపై మెక్సికో అటార్ని జనరల్ ఆఫీసు విచారణకు ఆదేశించినట్లు మీడియా రిపోర్టులు తెలిపాయి.
ఈ నగరం మెక్సికోలో సరిహద్దు నగరాల్లో ఒకటి. ఇక్కడి నుంచే శరణార్థులు అమెరికాలోకి ప్రవేశిస్తారు.
సరైన డాక్యుమెంట్లు లేని చాలా మంది శరణార్థులు ఇక్కడ ఉండి, అమెరికాలోకి ప్రవేశించేందుకు వేచిచూస్తుంటారు.
2014 నుంచి సుమారు 7,661 మంది శరణార్థులు చనిపోయారని లేదా కనిపించకుండా పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ డేటా పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పాన్-ఆధార్ అనుసంధాన తుది గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది.
తుది గడువు పొడిగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది.
దీంతో ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారికి మరో మూడు నెలలు సమయం లభించింది.
పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే, పలు ఇబ్బందులను పన్ను చెల్లింపుదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ, మరో 3 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినసరం లేదని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అయితే, 2023 జూలై 1 నుంచి ఆధార్‌తో అనుసంధానం కానీ పన్నుచెల్లింపుదారుల పాన్ కార్డులు మాత్రం పనిచేయకుండా పోతాయి.
అలాంటి పాన్ కార్డుదారులు ఎలాంటి రీఫండ్‌లను పొందలేరు.
పాన్ పనిచేయని సమయంలో రీఫండ్‌లపై లభించే వడ్డీ చెల్లింపులు కూడా జరగవు.
టీడీఎస్, టీసీఎస్ అత్యధిక రేటులో డిడక్ట్ అవుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదలచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, UGC
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం స్కూల్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
సమీపంలోని చెరువులో దానిని విసిరేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దుండగులు తొలగించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దళిత సంఘాలు కూడా తమ నిరసనను తెలియజేశాయి.
పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అంబేడ్కర్ విగ్రహ తలను తొలగించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్టు తణుకు పోలీసులు బీబీసీకి తెలిపారు. దుండగులను పట్టుకుంటామని, పోలీసులు బృందాలు రంగంలో దిగాయని వెల్లడించారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC
శంకర్ వడిశెట్టి,
బీబీసీ కోసం
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1గా ఉన్న చెరుకూరి రామోజీరావుతోపాటుఆయన కోడలు, ఈ కేసులో ఏ2 అయిన శైలజా కిరణ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
మార్చి 29 లేదా 31న విచారణకు అందుబాటులో ఉండాలని వాటిలో చెప్పింది. ఏప్రిల్ 3 లేదా 6న అయినా విచారణకు రావచ్చని తెలిపింది.
క్రైమ్ నంబర్ 3/2023గా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో మోసం, ఇతర సెక్షన్ల కింద సీఐడీ అభియోగాలు మోపింది. చిట్ ఫండ్ యాక్ట్‌తోపాటు పలు చట్టాల ప్రకారం ఈ కేసు నమోదు చేసినట్టు సీఐడీ తెలిపింది.
మార్గదర్శి పేరుతో సేకరించిన డిపాజిట్లను దారి మళ్లించి చట్టాన్ని ఉల్లంఘించారన్నది సీఐడీ మోపిన ప్రధాన అభియోగం.
ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్లు కొందరు అరెస్ట్ అయ్యి, రిమాండ్‌కు వెళ్లారు. తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI
శంకర్ వడిశెట్టి, సుచిత్రా కె.మొహంతిబీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.
రాజధాని విషయంలో రాష్ట్ర శాసనసభకు హక్కు లేదని హైకోర్టు చెప్పిందని, ఇది అభ్యంతరకరమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది.
అమరావతే ఏకైక రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి తరపున రైతులు కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్లన్నీ కలిపి కోర్టు విచారణ జరపబోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చినప్పుడల్లా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వీటిని ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. అమెరికాలో గన్ కల్చర్‌పై చర్చ జరుగుతుంటుంది.
1968 నుంచి 2017 మధ్య, అమెరికాలో తుపాకుల వల్ల సుమారు 15 లక్షల మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి.
తుపాకీ నియంత్రణ అనేది అమెరికాకు ఒక ప్రధానమైన రాజకీయ సమస్య అని చెప్పవచ్చు. ఈ చర్చలో ఒక వైపు ఆయుధాలపై నిషేధం గురించి మాట్లాడేవాళ్లు, మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధాలు ధరించే హక్కును కాపాడటం గురించి మాట్లాడేవాళ్లు ఉన్నారు. వివరాలు ఈ కథనంలో...