పాకిస్తాన్: కోర్టు వద్ద పోలీసులతో పీటీఐ మద్దతుదారుల ఘర్షణ.. బయటి నుంచే వెనుదిరిగిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్‌లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు.
లైవ్ కవరేజీ
విద్యార్థినుల న్యూడ్ వీడియోలు తీసి వేధిస్తున్నారంటూ మతాధికారిపై ఆరోపణలు, అసలేంటీ కేసు?
తెలంగాణ: ఘన వ్యర్థాల నిర్వహణపై డిజిటల్ క్లాసుల ద్వారా శిక్షణ ఇస్తున్న స్వచ్ఛ బడి
పాకిస్తాన్: కోర్టు బయటి నుంచే వెనుదిరిగిన ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images
తోశఖానా కేసులో ఇస్లామాబాద్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెనుదిరిగారు.
కోర్టు భవనాల వద్ద ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తటంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. ‘‘ఈ పరిస్థితిలో విచారణ జరగజాలదు’’ అని చెప్పింది.
ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఆయనతో కలిసి కోర్టు ఆవరణలోకి రావటానికి పోలీసులు అనుమతించలేదు. కోర్టు గేటు దగ్గర కారులో ఉండే కోర్టులో హాజరు నమోదు చేసుకోవటానికి జడ్జి అనుమతించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు తోశఖానాకు ఖరీదైన బహుమతులను అమ్మారని, తద్వారా ఆయన లాభపడ్డారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవి తప్పుడు ఆరోపణలని, రాజకీయ ప్రేరేపితమని ఇమ్రాన్ ఖాన్ తిరస్కరిస్తున్నారు.
ఈ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటంతో ఇమ్రాన్ ఖాన్‌ను లాహోర్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయటానికి కొద్ది రోజుల కిందట పోలీసులు ప్రయత్నించారు. అప్పుడు ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తి హింస చెలరేగింది.

ఫొటో సోర్స్, EPA
ఈ కేసులో సంబంధిత కోర్టులో తాను శనివారం నాడు హాజరవుతానని ఇమ్రాన్ ఖాన్ హామీ ఇవ్వటంతో.. అరెస్ట్ వారెంట్ మీద లాహోర్ హైకోర్టు స్టే విధించింది.
శనివారం ఉదయం 8 గంటల సమయంలో లాహోర్ నుంచి బయలు దేరిన ఇమ్రాన్ ఖాన్ కాన్వాయ్ సాయంత్రం 4 గంటల సమయానికి ఇస్లామాబాద్‌లోని కోర్టు భవనాల వద్దకు చేరుకుంది. అయితే ఆ కాంప్లెక్స్ దగ్గర ఆయన రాకముందే ఆయన మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది.
ఇమ్రాన్ ఖాన్ కోర్టు లోపలికి రాలేదని ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ స్పెషల్ అసిస్టెంట్ ఆరోపించారు.
‘‘కోర్టు ప్రారంభమైంది. న్యాయవాదులు హాజరయ్యారు. కానీ ఇమ్రాన్ ఖాన్ తన కారును కోర్టు ఆవరణలోకి తీసుకురాలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇమ్రాన్ ఖాన్.. అధికార యంత్రాంగం మీద ఆరోపణలు చేస్తూ ఆడియో సందేశం విడుదల చేశారు.
తను ‘‘టోల్ ప్లాజా నుంచి జ్యుడీషియల్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకోవటానికి ఐదు గంటలు పట్టింది. గేటు బయట నేను 15 నిమిషాల పాటు నిలుచున్నాను’’ అని ఆయన ఆ ఆడియోలో చెప్పారు.
మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో ఉన్న సమయంలో లాహోర్‌లోని జమాన్ పార్క్‌లో గల ఆయన నివాసం వద్ద పోలీసులు చర్యలు చేపట్టారు. ఆయన మద్దతుదారులు చాలా మందిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ: ‘టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వెనుక ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టం’ - కేటీఆర్, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, కేటీఆర్
టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. లీకేజీ అంశంపై ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో డామేజ్ నివారణపై ఈ సమావేశంలో చర్చసాగింది.
అనంతరం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహచర మంత్రులు గంగుల కమలాకర్, సబిత రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాట్లు వ్యవస్థ మొత్తానికి చెడ్డపేరుతెచ్చాయని, ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు తీసుకుని సాధ్యమైనంత త్వరలో రద్దు చేసిన పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని కేటీఆర్ అన్నారు.
గతంలో అప్లై చేసుకున్న విద్యార్థులంతా తిరిగి ఫీజు చెల్లించకుండానే ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రద్దు చేసిన పరీక్షల మెటీరియల్‌ను విద్యార్థులకు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీ సర్కిళ్లను పటిష్టపరించేందుకు నిర్ణయించామని, అదే సందర్భంలో జిల్లాల్లోని రీడింగ్ సెంటర్లు 24 గంటలు పనిచేసేలా చూసి అక్కడే అభ్యర్థులకు ఉచిత భోజన వసతిని అందిస్తామని తెలిపారు.
లీకేజీ వెనుక ఎవరి హస్తం ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదని కేటీఆర్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, గవర్నర్‌కు బీజేపీ, బీఎస్‌పీ నేతల వినతిపత్రం మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల నిరసనలు కొనసాగుతున్నాయి. కమిషన్ బోర్డును రద్దు చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో ఈ రోజు బీజేపి, బీఎస్పీ పార్టీ నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.
లీకేజీపై రేపు నిజామాబాద్ జిల్లా గాంధారిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ లీకేజీ వెనుక మంత్రి కేటీఆర్ పీఏ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్: స్కూల్లో ఫ్యాన్ పాడు చేశారంటూ పిల్లల్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టిన టీచర్లు.. అసలు ఏం జరిగింది?
‘మా దేశం నుంచి వెళ్లిపోండి’.. భారతీయ విద్యార్థులకు కెనడా హెచ్చరిక.. వారి అడ్మిషన్లు ఫోర్జరీవంటూ ఆరోపణలు
కోర్టు వద్దకు చేరుకున్న ఇమ్రాన్ ఖాన్.. పోలీసులతో ఇమ్రాన్ మద్దతుదారుల ఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఒక కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్‌లోని జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు.
మరోవైపు.. ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. ఆ ప్రాంతం మొత్తాన్నీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చుట్టుముట్టారు..

ఫొటో సోర్స్, UGC
వాళ్లు రాళ్లు విసురుతుండటంతో చాలా కార్లు ధ్వంసమయ్యాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ లాఠీచార్జి చేస్తున్నారు. రబ్బర్ బులెట్లతో కాల్పులు కూడా జరుపుతున్నారు
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తోశాఖానా కేసులో ఇస్లామాబాద్ స్థానిక కోర్టులో ఇమ్రాన్ శనివారం నాడు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జ్యుడీషియల్ కాంప్లెక్స్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇమ్రాన్ ఖాన్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ చేరుకోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పాకిస్తాన్ పార్టీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది.
ఆ లేఖను పార్టీ నాయకుడు అసద్ ఉమర్ ట్విటర్‌లో విడుదల చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, BRS Party/Facebook
తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, మూడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ ముగిసింది.
ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.
మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపి అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుచుకున్నారు.
తెలంగాణలో బీజేపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలవడం ఇదే తొలిసారి.
నల్లగొండ,నిజామాబాద్,హైదరాబాద్ స్థానాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చ్ 6న నోటిఫికేషన్ విడుదలకాగా 23న పోలింగ్ జరిగింది.
అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు కూర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు.
రెండో సారి ఎమ్మెల్సీగా నవీన్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. దేశపతి శ్రీనివాస్ సీఎంఓ కార్యాలయంలో ఓఎస్‌డీగా పనిచేశారు.
మరో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డికి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డితో బంధుత్వం ఉంది. ఆయన గతంలో ఒకసారి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.
మోదీ: తృణధాన్యాలతో చిన్న రైతులకు లబ్ధి
గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్‌ను దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
తృణధాన్యాలతో నేరుగా 2.5 కోట్ల మంది రైతుల జీవితాలు ముడిపడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
‘శ్రీ అన్న’ మిషన్‌తో చిన్న రైతులకు లాభం చేకూరడంతోపాటు గ్రామీణ ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆరోగ్యం: ఏం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది? విటమిన్ టాబ్లెట్లు మంచివేనా?
తెలంగాణలో వానల వల్ల పంట నష్టం, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, UGC
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పంటనష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలకు ఎక్కువగా ఉద్యానవన పంటలకు నష్టం కలిగింది.
శుక్రవారం వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న వికారాబాద్ జిల్లాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మంత్రి సబిత ఇంద్రారెడ్డి ,ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డిలు ఏరియల్ సర్వే నిర్వహించారు.
‘అకాలవర్షాల బారిన పడకుండా మార్చి నెలాఖరు లోపు యాసంగి పంటలు చేతికి వచ్చేలా రైతులు సీజన్ ఒక నెల ముందుకు జరుపుకుని ప్రణాళికాబద్ధంగా సాగుచేయాలి. ఈ విషయంలో రైతులను చైతన్యం చేస్తున్నాం.
నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాలలో రైతులు ఇప్పటికే దీనిని అనుసరిస్తున్నారు. రైతులకు పరిహారం అందించి ఆదుకుంటాం. నష్టం వివరాల నివేదిక సీఎం కు అందిస్తాం’’ అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోనే 2 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో ఉద్యానపంటలకు పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
వికారాబాద్ ,సంగారెడ్డి, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, ఊపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిలాల్లో పంట నష్టం సంభవించింది. ఎక్కువగా మొక్కజొన్న, శనగా , టమాట, జొన్న, బొప్పాయి, మామిడి, మిర్చీ పంటలు ఈ జిల్లాల్లో దెబ్బతిన్నాయి.
బలమైన గాలులకు పిందెలు రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోయారు.
వికారాబాద్ లో వడగళ్ల వర్షంతో అత్యధిక నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందనిభారత వాతావరణ కేంద్రం, హైదరాబాద్ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు. నిన్న అత్యధికంగా సంగారెడ్డి జిల్లా రాయికోడ్ 7.5 సెం.మీ ,పుల్కల్ 6.8 సెం.మీ, నాగర్ గిద్ద 5.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్: పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ హవా, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా పట్టభద్రుల స్థానంలో ఆ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ దక్కింది. మూడు స్థానాలకు గానూ రెండు చోట్ల టీడీపీ విజయం సాధించింది. ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా వేపాడ చిరంజీవి రావు గెలిచారు. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్ విజేతగా నిలిచారు.
తూర్పు రాయలసీమలో ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన కంచర్ల శ్రీకాంత్‌కు తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటి మీద 34,110 ఓట్ల ఆధిక్యం లభించింది. కంచర్ల శ్రీకాంత్ గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్‌ను అందుకున్నారు.
ఉత్తరాంధ్రలో చిరంజీవిరావుకి తొలి ప్రాధాన్యంలో 82,958, రెండో ప్రాధాన్యంలో 11,551 ఓట్లు దక్కాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి చిరంజీవిరావుకు మొత్తం 1,12,686 వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుధాకర్ టీడీపీ అభ్యర్థికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఇద్దరి మధ్య భారీ తేడా కనిపించింది. పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ మూడోస్థానంలో నిలిచారు. సిటింగ్ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి గట్టి పోటీ సాగుతోంది. మొదటి ప్రాధాన్యతా ఓటు లెక్కింపు పూర్తయ్యే సమయానికి వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1300 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యతా ఓటు లెక్కింపు సాగుతోంది. హోరాహోరీగా సాగుతున్న పోరులో సాయంత్రానికి ఇక్కడి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
టీచర్ల రెండు స్థానాలను వైసీపీ మద్ధతుదారులు గెలుచుకున్నారు. తూర్పు రాయలసీమ నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పశ్చిమ రాయలసీమ నుంచి ఎంవీ రామచంద్రారెడ్డి గెలిచారు.
స్థానిక సంస్థల కోటాలో 9 సీట్లను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఐదు చోట్ల ఏకగ్రీవాలు కాగా, ఎన్నికలు జరిగిన నాలుగు సీట్లు ఆపార్టీకి దక్కాయి.
నరేంద్ర మోదీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని కూడా వివాదాస్పద ప్రసంగాలు చేశారా?
ఇంటికి చేరుకున్న లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ భాను రెడ్డి

ఫొటో సోర్స్, Defence PRO
అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ భాను రెడ్డి మృతదేహం ఆయన స్వస్థలం హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి చేరుకుంది.
అంతకు ముందు సైనిక లాంఛనాలతో విజయ్ భాను రెడ్డి మృతదేహానికి అధికారులు, ఆయన తండ్రి నివాళులు అర్పించారు.
గురువారం అంటే మార్చి 16న అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో విజయ్ భాను రెడ్డితోపాటు మరొక పైలెట్ చనిపోయారు.

ఫొటో సోర్స్, Defence PRO

ఫొటో సోర్స్, Defence PRO
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
