సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో
మంటలను ఆర్పుతున్నారు.
కాంప్లెక్స్‌లో మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి.
కొద్దిగా మంటలు కనిపిస్తున్నాయి. కానీ మంటలకంటే ఎక్కువగా దట్టమైన పొగ అలముకుంది.
ఇది ఎనిమిది అంతస్తుల భవనం. చాలా పాత భవనం. ఇందులో
గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు చెప్తున్నారు.
ఈ భవనంలోని 5, 6 అంతస్తుల్లో బాధితులు
చిక్కుకున్నట్లుగా ఉంది. ఈ అంతస్తుల్లో దట్టమైన పొగ ఉంది. దానిని క్లియర్
చేస్తున్నారు.
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు
ఏడుగురిని కిందికి దించి, కాపాడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఇంకా లోపల మరో ముగ్గురు నుంచి ఏడుగురు వరకూ
ఉంటారని అంచనాగా చెప్పారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు క్రేన్ సాయంతో
శ్రమిస్తున్నారు.
చాలా మంది తమ వారి ఫోన్లు కలవకపోవటం వల్ల వారు
లోపలున్నారా బయటున్నారా తెలీక ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇంకా లోపల ఎంత మంది చిక్కుకుని
ఉన్నారన్నదానిపై అయోమయం నెలకొంది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎవరైనా చనిపోయారనే సమాచారం లేదు.
అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల
అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ విజయలక్ష్మి,
కలెక్టర్ అమోయ్ కుమార్ కూడా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి 10:30 గంటల సమయానికి.. మరో గంటలో
పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.