హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం: పొగలో చిక్కుకున్న పలువురు బాధితులు
హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం రెండు పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగాయి. సికిందరాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో, జీడిమెట్లలో కొంత కాలంగా మూతపడి ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో
ఆరుగురు చనిపోయినట్లు గాంధీ ఆస్పత్రి వర్గాలు గురువారం అర్థరాత్రి దాటాక తెలిపాయి.
ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించలేదు.
అర్థరాత్రికి మంటలు దాదాపు 95 శాతం అదుపులోకి
వచ్చాయి.
స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం: పొగలో చిక్కుకున్న పలువురు బాధితులు, సతీశ్ బళ్ల, బీబీసీ ప్రతినిధి
సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో
మంటలను ఆర్పుతున్నారు.
కాంప్లెక్స్‌లో మంటలు దాదాపు అదుపులోకి వచ్చాయి.
కొద్దిగా మంటలు కనిపిస్తున్నాయి. కానీ మంటలకంటే ఎక్కువగా దట్టమైన పొగ అలముకుంది.
ఇది ఎనిమిది అంతస్తుల భవనం. చాలా పాత భవనం. ఇందులో
గురువారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు చెప్తున్నారు.
ఈ భవనంలోని 5, 6 అంతస్తుల్లో బాధితులు
చిక్కుకున్నట్లుగా ఉంది. ఈ అంతస్తుల్లో దట్టమైన పొగ ఉంది. దానిని క్లియర్
చేస్తున్నారు.
కాంప్లెక్స్‌లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు
ఏడుగురిని కిందికి దించి, కాపాడినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఇంకా లోపల మరో ముగ్గురు నుంచి ఏడుగురు వరకూ
ఉంటారని అంచనాగా చెప్పారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు క్రేన్ సాయంతో
శ్రమిస్తున్నారు.
చాలా మంది తమ వారి ఫోన్లు కలవకపోవటం వల్ల వారు
లోపలున్నారా బయటున్నారా తెలీక ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇంకా లోపల ఎంత మంది చిక్కుకుని
ఉన్నారన్నదానిపై అయోమయం నెలకొంది.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎవరైనా చనిపోయారనే సమాచారం లేదు.
అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల
అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.
మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ విజయలక్ష్మి,
కలెక్టర్ అమోయ్ కుమార్ కూడా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి 10:30 గంటల సమయానికి.. మరో గంటలో
పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ఫొటో క్యాప్షన్, భవనంలో చిక్కుకున్న వారిని భారీ క్రేన్ సాయంతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు
వీటిని అదుపులోకి తెచ్చేందుకు
అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను
ఆర్పుతున్నారు.
చుట్టుపక్కల పరిశ్రమలకు ఈ మంటలు వ్యాపించకుండా
ఉండేలా ముందు జాగ్రత్తగా ఇతర పరిశ్రమలను అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు.
మొత్తంగా 150 కెమికల్ డ్రమ్ములు
పేలినట్లు కోపల్లె ఫార్మా కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.
మధ్య తరగతి కష్టాలు: మహిళ రెండు ఉద్యోగాలు చేస్తున్నా.. తరగని ధరల భారం
అరుణాచల్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతదేహాలు గుర్తింపు
ఫొటో సోర్స్, Pinaki Das/BBC
అరుణాచల్
ప్రదేశ్‌లోని ప్రమాదానికి గురైన భారత సైన్య చీతా హెలికాప్టర్‌కు చెందిన ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించినట్లు ఆర్మీ
అధికార ప్రతినిధి తెలిపారు.
మండాలాకు సమీపంలో ఈ ప్రమాదం
జరిగినట్లు భారత ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు.
సైనిక కార్యకలాపాల్లో భాగంగా బయల్దేరిన హెలికాప్టర్‌కు,
గురువారం ఉదయం 9:15 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్
కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని ఆర్మీ తెలిపింది.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బందిని ఘటనా
స్థలానికి పంపింది భారత సైన్యం.
వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం, పొగమంచు
కారణంగా విజిబులిటీ తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని తమ ప్రాథమిక
విచారణలో తేలినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ ప్రమాదంపై పూర్తి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
హైదరాబాద్: సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం, సతీశ్ బళ్ల, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్లో గురువారం సాయంత్రం రెండు పెద్ద అగ్ని ప్రమాదాలు
జరిగాయి. సికిందరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్, జీడిమెట్లలోని ఒక ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదాలు జరిగాయి.
స్వప్నలోక్ కాంప్లెక్సులోని మూడవ అంతస్తులో
మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ కొందరు పనిచేస్తున్నట్టు
సమాచారం. స్వప్నలోక్ ఆనుకుని ఉన్న అపార్టుమెంటుల వైపు మంటల వేడి తగులుతోంది.
అయితే కాంప్లెక్సులో ఎందరు చిక్కుకున్నారు అనేది
ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి.
అటు జీడిమెట్లలో కొంతకాలంగా మూసి ఉన్న కోపల్లే
ఫార్మా కంపెనీలో మంటలు ఎగిసిపడుతన్నాయి.
రసాయనాలు నిల్వ ఉంచిన డ్రమ్ములు పేలుతూ భారీ
శబ్దాలు వినిపిస్తున్నాయి. ఫైర్ ఇంజిన్లు మంటలు వ్యాపించకుండా ఆర్పుతున్నాయి.
‘‘మిమ్మల్ని చంపటానికి ఎవరైనా వస్తే అందరం కలిసి చనిపోదాం’ అంటూ ముస్లింలు మమ్మల్ని ఆపారు’’ - కశ్మీర్ లోయని వీడి వెళ్లని ఓ కశ్మీరీ పండితుల కుటుంబం కథ
కవితకు మరోసారి ఈడీ సమన్లు.. 20న హాజరు కావాలని పిలుపు
ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి మార్చి 20వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావలసిందిగా తెలంగాణ ఎంఎల్‌సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా నోటీసులు పంపించింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మొదటిసారి మార్చి 7న ఈడీ సమన్లు పంపింది. ఆ మేరకు ఈ నెల 11వ తేదీన దిల్లీలోని
ఈడీ కార్యాయంలో ఆమె విచారణకు వచ్చారు. దాదాపు 9 గంటల పాటు ఈడీ ఆమెను ప్రశ్నించింది.
మళ్లీ మార్చి 16వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలంటూ కవితకు ఈడీ అదే రోజు సమన్లు పంపింది. అయితే మహిళలను విచారణ కోసం ఆఫీసులకు చట్టవ్యతిరేకమంటూ కవిత 15వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆమె పిటిషన్‌ను ఈ నెల 24న విచారించటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
మరోవైపు.. మార్చి 16వ తేదీ విచారణకు రాలేనంటూ కవిత ఈడీకి సమాచారం పంపారు. ఈడీ అడిగిన వివరాలను తన ప్రతినిధుల ద్వారా పంపించారు.
కవిత విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ గురువారం నాడు మళ్లీ నోటీసులు పంపించింది.
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి దిల్లీ యాత్రకు బయలుదేరారు.
తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుని అక్కడి నుంచి
ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు.రాత్రికి ఆయన దిల్లీలో బస చేస్తారు.
శుక్రవారం ఉదయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లను జగన్ కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రితో
సమావేశానికి అపాయింట్‌మెంట్ ఖరారు అయిందని సీఎంఓ చెబుతోంది. షెడ్యూల్ మాత్రం ఇంకా
విడుదల కాలేదు.
ఒకవైపు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ముఖ్యమంత్రి దిల్లీకి పయనం కావడం ఆసక్తిగా
మారింది. రేపు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం
హఠాత్తుగా దిల్లీ ఎందుకు వెళ్లారు అన్నదానిపై చర్చ సాగుతోంది.
వైఎస్ జగన్ చివరిసారిగా
గత ఏడాది డిసెంబర్ 28న దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాత పెట్టుబడుల
సదస్సు సన్నాహాల్లో భాగంగా జనవరి నెలాఖరున దిల్లీ వెళ్ళినా కేంద్ర ప్రభుత్వ
పెద్దలను కలవకుండానే వచ్చేశారు.
మనీష్ సిసోడియా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
ఫొటో సోర్స్, ANI
దిల్లీ మాజీ
ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు
చేసినట్లే ఏఎన్ఐ ఒక కథనంలో తెలిపింది.
దిల్లీ
ప్రభుత్వంలోని ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అవకతవకల ఆరోపణలకు సంబంధించి.. సిసోడియాతో పాటు
మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ మంగళవారం నాడు ఈ ఎఫ్ఐఆర్ నమోదు
చేసింది.
ఫీడ్‌బ్యాక్
యూనిట్ అక్రమ ఏర్పాటు వల్ల, దాని పని వల్ల ప్రభుత్వం రూ. 36 లక్షలు నష్టపోయినట్లు
ప్రాధమిక విచారణలో వెల్లడైందని సీబీఐ ఈ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
మనీష్ సిసోడియా,
అప్పటి విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ జైన్, ముఖ్యమంత్రికి ప్రత్యేక సలహాదారుగా
పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ ఆర్.కె.సిన్హా, ఐబీ రిటైర్డ్ జాయింట్ డిప్యూటీ
డైరెక్టర్ పి.కె.పుంజ్‌లు.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాధమిక
విచారణలో తేలినట్లు చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మనీష్ సిసోడియాను ఇప్పటికే దిల్లీ మద్యం విధానం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం రిమాండ్‌పై జైలులో ఉన్నారు.
తాజాగా సీబీఐ ఆయన మీద కేసు నమోదు చేయటంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మనీష్ మీద పలు బూటకపు కేసులు పెట్టి చాలా కాలం పాటు జైలులో ఉంచాలన్నది ప్రధానమంత్రి ప్రణాళిక’’ అని ఆరోపించారు.
ఇది దేశానికి విచారకరమంటూ ట్వీట్ చేశారు.
అరుణాచల్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ల కోసం గాలింపు
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
భారత
సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని మండాలా పర్వతాల్లో
కూలిపోయింది.
హెలికాప్టర్‌లో
ఇద్దరు పైలట్లు ఉన్నారని, వారి కోసం గాలింపు, సహాయ చర్యలు ప్రారంభించామని
సైనికాధికారులు తెలిపారు.
సైనిక
కార్యకలాపాల్లో భాగంగా బయల్దేరిన హెలికాప్టర్‌తో గురువారం ఉదయం 9:15 గంటల సమయంలో
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సంబంధాలు తెగిపోయాయని డిఫెన్స్ గువాహటి పబ్లిక్
రిలేషన్స్ ఆఫీసర్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఆస్కార్ ఉత్తమ నటి మిషెల్ యో ఎవరు? జాకీ చాన్ కోసం రాసిన ‘ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్’ పాత్ర ఆమెను ఎలా వరించింది?
జపాన్: 2019 తరువాత ఆ దేశంలో అడుగుపెడుతున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు
తల్లి కడుపులోని బిడ్డ గుండెకు ఆపరేషన్... ‘‘ద్రాక్ష పండు’’ సైజులో గుండె... తేడా వస్తే ప్రాణం పోతుంది
బ్రేకింగ్ న్యూస్, ‘‘ఈడీ విచారణకు కవిత హాజరు కారు’’
‘‘మహిళలను ఈడీ
ఆఫీసుకు పిలవడమే చట్టవ్యతిరేకం... అందువల్ల కవిత గారు ఈడీ విచారణకు నేడు హాజరు
కారు’’ అని కవిత ప్రతినిధి సోమ భరత్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
ఆంధ్రప్రదేశ్ 2023-24 బడ్జెట్‌ను
ప్రవేశపెడుతున్నారు.
వరుసగా 5వసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
2023-24 వార్షిక బడ్జెట్: రూ.2,79,279కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం: రూ.31,061 కోట్లు
రెవెన్యూ లోటు: రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు: రూ.54,587 కోట్లు
కేటాయింపు ఇలా...
జగనన్న విద్యా కానుక: రూ.560 కోట్లు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి: రూ.15,873 కోట్లు
పురపాలక పట్టణాభివృద్ధి: రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్: రూ.1,166 కోట్లు
ఫొటో సోర్స్, AndhraPradesh CM/Facebook
బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
బడ్జెట్‌కు అంతరాయం కలిగిస్తున్నారంటూ
వారిని ఒక రోజు పాటు సభ నుంచి బయటకు పంపించారు.
ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు.
దీంతో సభలో గందరగోళం తలెత్తింది.
బడ్జెట్‌కు అడ్డు తగులుతున్న తెలుగుదేశం
ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీకర్‌కు
కోరారు. ఆ తరువాత తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ బుగ్గన తీర్మానం
ప్రవేశపెట్టగా సభ దాన్ని ఆమోదించింది.
శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం
ఫొటో సోర్స్, Narthu Ramarao/Facebook
ఫొటో క్యాప్షన్, నర్తు రామారావు
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి
నర్తు రామారావు విజయం సాధించారు.
నర్తు రామారావుకు 632 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ
గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్‌లు విజయం
సాధించారు.
ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకు
చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది.
3 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరిగాయి.
ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత
వివాదాస్పదమయ్యాయి. ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్ల వరకూ పలు
ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
చివరకు తూర్పు రాయలసీమ పట్టభద్రుల
స్థానానికి తిరుపతిలో రీ పోలింగ్ కూడా నిర్వహించాల్సి వచ్చింది. స్థానిక సంస్థల
కోటాలో విజయం పట్ల ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీ, పట్టభద్రుల స్థానాల మీద కూడా
ఆశ పెట్టుకుంది.
అయితే ఉపాధ్యాయ సీట్లలో ఫలితాలు ఎలా
ఉంటాయనేది ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది.
టీడీపీ, పీడీఎఫ్, బీజేపీ కూడా పోటీపడ్డాయి.
ఫొటో సోర్స్, I&pr
ఫొటో క్యాప్షన్, చిత్తూరులో ఓట్ల లెక్కింపు
ఫొటో సోర్స్, I&pr
ఫొటో క్యాప్షన్, చిత్తూరులో ఓట్ల లెక్కింపు
కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా డాక్టర్ మధుసూదన్ (వైసీపీ) గెలిచారు.