నేటి లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.
దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారు.
నాగార్జున యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్ అందజేసింది.
ఈ విషయం వర్మ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
కాగా 1985 జులైలో సివిల్ ఇంజినీరింగ్‌లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లుగా అందులో ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అదాని-హిండెన్‌బర్గ్ కేసుపై దర్యాప్తు జరపాలని కోరుతూ, నేడు దిల్లీలో 18 పార్టీల ప్రతిపక్ష నేతలు పార్లమెంట్ నుంచి ఈడీకి ర్యాలీ నిర్వహిస్తున్నారు.
దాంతో, దిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పలుచోట్ల బ్యారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మధ్యహ్నం 12.30 ప్రాంతంలో ఈ ర్యాలీ ప్రారంభమైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, "17-18 రాజకీయ పార్టీల ఎంపీలు ఇక్కడ ఉన్నారు. అదానీ రెండున్నరేళ్లల్లో కోట్లు ఎలా సంపాదించారో మేమంతా తెలుసుకోవాలనుకుంటున్నాం. మమ్మల్ని పోలీసులు ఆపేశారు. మేం 200 మంది ఉన్నాం. పోలీసులు 2000 మంది ఉన్నారు. అంటే వాళ్లు మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. మేము ఈడీ డైరెక్టర్‌ను కలిసి అదానీ స్కామ్‌పై దర్యాప్తు చేయాలని వినతి పత్రం సమర్పించాలనుకుంటున్నాం. కానీ, మమ్మల్ని పోలీసులు విజయ్ చౌక్ చేరుకోనివ్వట్లేదు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మరోవైపు, "విజయ్ చౌక్ దగ్గర సెక్షన్ 14 సీఆర్‌పీఆర్ విధించారని, అక్కడ ఆందోళన చేయడానికి వీల్లేదని" పోలీసులు ప్రకటించారు.
హైదరాబాదులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ నుంచి రాజ్ భవన వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదానీ కేసుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, KeshavPayyavula/Facebook
శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, గవర్నర్‌కి తగిన గౌరవం ఇవ్వలేదంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
దానిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం నాడు సభలో ప్రస్తావించారు. ఈనాడు పత్రికలో ప్రచురితమైన వార్తను చదివి వినిపించారు. గవర్నర్‌ను ప్రభుత్వం అవమానించిందంటూ కేశవ్ చేసిన విమర్శలు నిరాధారం అంటూ వీడియోను ప్రదర్శించారు.
సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించి ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయాలని బుగ్గన కోరారు.
దానికి స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. సభ్యుడితో పాటుగా ఆ ప్రకటనను ప్రచురించిన ఈనాడుని కూడా ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా నోటీసు సిద్ధం చేయాలని సూచించారు.
దానికి మంత్రి సమాధానమిస్తూ ఇరువురికీ నోటీసులు అందించేందుకు ప్రతిపాదిస్తామని సభలో తెలిపారు.
అధికారపక్షం తీరుపై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వాలంటూ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. దాంతో సభలో గందరగోళం ఏర్పడింది.
గవర్నర్‌ని నేరుగా తీసుకు రాకుండా, ఆయన వేచి ఉండేలా చేశారని తాను వ్యాఖ్యానించినట్టు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభకి తెలిపారు. నిబంధనలు పాటించలేదని ఆయన కౌల్ అండ్ షెక్దర్ చదివి వినిపించారు.
గవర్నర్ ని స్పీకర్ ఛాంబర్ లో వెయిట్ చేయించడం రాజ్యాంగ విరుద్ధం అనే మాటలకు కట్టుబడి ఉన్నట్టు పయ్యావుల స్పష్టం చేశారు.
రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తూ, సభ ఔన్నత్యాన్ని ముఖ్య మంత్రి గౌరవాన్ని కించపరిచేలా ఉన్న ప్రకటనపై కఠిన చర్యలు తీసుకుంటాం అని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
అనంతరం, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు లను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు.
ఐఐటీ మద్రాసులో బీటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
23ఏళ్ల వైపు పుష్పక్ శ్రీ సాయి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఐఐటీ క్యాంపస్‌లోని అలకనంద హాస్టల్‌లో ఉంటున్న సాయి, 14న అంటే మంగళవారం ఉరి వేసుకుని చనిపోయినట్లు కొత్తుర్‌పుర్ పోలీసులు తెలిపారు.
ఈ నెలలో ఐఐటీ మద్రాసులో విద్యార్థులు ఆత్మహత్య చేయం ఇది రెండో సారి.
ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐఐటీ మద్రాస్ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Facebook/Kalvakuntla Kavitha
దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తనకు ఈడీ సమన్లు ఇవ్వడానికి సంబంధించి కవిత వేసిన పిటీషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. మార్చి 24న పిటిషన్ విచారణకు రానుంది.
అయితే ఈ లోపు కవితకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.
మార్చి 11న కవితను విచారించిన ఈడీ 16వ తేదీన మళ్లీ రావాలంటూ సమన్లు జారీ చేసింది.
ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పోరాటం చేస్తున్న కవిత, నేడు దిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే తీసుకురావాలంటూ 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద కవిత ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రారంభమైంది.
తిరుపతిలోని చిన్నబజారు వీధిలో గల బూత్ నంబర్ 229, సత్యనారాయణ పురంలో 233 లలో ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ జరుగుతోంది.
సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

ఫొటో సోర్స్, Facebook/Jr NTR
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం చాలా గర్వంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
‘‘కీరవాణి, చంద్రబోసు స్టేజీ మీద ఉన్న క్షణాలు మరపురాని మధురమైనవి. ఆస్కార్ అవార్డును చేతితో పట్టుకున్నప్పుడు చాలా బరువుగా అనిపించింది. మన దేశమంత బరువుగా ఉంది.
అది మాటల్లో చెప్పలేని అనుభూతి. మొదట ఆ వార్తను మా ఆవిడతో పంచుకున్నాను.
అభిమానుల ఆదరణ, సినిమా పరిశ్రమ మద్దతు వల్ల ఈ అవార్డు వచ్చింది. అభిమానులు, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కు, ఎయిర్‌పోర్టులో అభిమానులు స్వాగతం పలికారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా సమాచారం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.