నేటి లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.
తిరుమలకు యాత్రికులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాలలో గదులు ఇస్తున్నామని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి చెప్పారు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, TTD/Facebook
తిరుమలకు యాత్రికులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో 5 నుండి 10 నిమిషాలలో గదులు ఇస్తున్నామని టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి చెప్పారు.
తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు.
‘‘దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీబాగా ఉపయోగపడుతుంది. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొసం పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో, వారే ఉప విచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుంది’’ అని ధర్మారెడ్డి చెప్పారు.
‘‘ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే గదులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ. 2.95 కోట్ల రాబడి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్‌లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సిఆర్ఓ దగ్గరికి మార్చుతున్నాము. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డూలో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టాం. వ్యక్తి లేకుండా లడ్డు టోకెన్ రాదు’’ అని ధర్మారెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోర్టుకి హాజరుకావాలని ఆదేశాలు వెలుపడ్డాయి.
కోడి కత్తి కేసులో బాధితులుగా ఉన్న ఆయన విచారణకు కోర్టు ముందుకు రావాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఏప్రిల్ 10 న ఆయన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
2019లో వైజాగ్ ఎయిర్ పోర్టు వీఐపి లాంజ్ లో ఉండగా ఆనాటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
పాదయాత్ర నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న జగన్ పై శ్రీనివాస్ చేసిన దాడిలో ఆయన భుజానికి గాయమైంది.
ఈ కేసు తొలుత ఏపి పోలీసులు విచారించగా, ప్రస్తుతం ఎన్ఐఏ పరిధిలో ఉంది. అందులో భాగంగా జగన్ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాలని, ఆయన వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి కూడా రావాలని ఆదేశాలు వెలువడ్డాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ మంగళవారం విచారించింది.
ఆయన ఈ కేసులో సీబీఐ విచారణకు హాజరుకావడం ఇది నాలుగోసారి.
విచారణ అనంతరం అవినాశ్ రెడ్డి సీబీఐ కార్యాలయం నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, janasena
మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ బయలుదేరారు.
విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై ఆయన వెళ్తున్నారు.
తొలుత మంగళగిరి నుంచి యాత్ర ప్రారంభించాలని అనుకున్నా పోలీసుల ఆంక్షల కారణంగా ఆటోనగర్‌కు మార్చారు.

ఫొటో సోర్స్, janasena
పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి పవన్ కల్యాణ్ యాత్ర సాగుతోంది.
దారిపొడవునా అభిమానులు స్వాగతం పలుకుతున్నారు.
జనసేన యాత్ర కారణంగా విజయవాడలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఫొటో సోర్స్, janasena

ఫొటో సోర్స్, YS Sharmila Reddy/Facebook
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు.
అక్కడి నుంచి ర్యాలీగా పార్లమెంట్‌కు బయలుదేరారు. ‘‘కేసీఆర్ డౌన్ డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. అయితే దిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అది పెద్ద కుంభకోణం. అది ప్రజల సొమ్ము. అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆ ప్రాజెక్టులు రుణాలు ఇచ్చాయి. దీని మీద విచారణ చేపట్టాలి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నేడు ఇస్లామాబాద్ పోలీసులు అరెస్ట్ చేయవచ్చని ఏఎన్ఐ తెలిపింది.
ఇస్లామాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి పోలీసులు వచ్చే 24 గంటల్లో జమాన్ పార్క్‌లోని ఇమ్రాన్ ఖాన్ నివాస భవనం నుంచి ఆయన్ను అరెస్ట్ చేసే అవకశాలు ఉన్నాయని Geo News తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇమ్రాన్ ఖాన్ ఒక మహిళా జడ్జిని బెదిరించారన్న ఆరోపణలతో ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఆయనకు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని ఏఎన్ఐ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా ఆస్కార్ గెలుచుకున్న తరువాత, అందులో నటించిన ఏనుగు 'రఘు'కు అభిమానులు పెరిగారు.
రఘును చూసేందుకు దేశ విదేశాల నుంచి జనం తమిళనాడులోని ముదుమలైకు తరలివస్తున్నారు. తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ అభిమానులతో నిండిపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"నేను లండన్ నుంచి వచ్చాను. ఎలిఫెంట్ క్యాంప్ చూశాం. ఇందులో ఉన్న రెండు ఏనుగు పిల్లలకు ఆస్కార్ వచ్చిందని తెలిసింది. వాటిని చూడడం భలే ఉంది. నేను చాలా లక్కీ" అని గ్రేస్ అనే టూరిస్ట్ ఏఎన్ఐతో చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికలోని మలావి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ఒకే నెలలో రెండోసారి ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాలను తాకింది.
మలావిలోని బ్లాంటైర్‌లో 60 పైగా మృతదేహాలను వెలికితీశారు. బలమైన గాలులు, కుండపోతగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
"నదులు, చెరువులు పొంగుతున్నాయి. ప్రజలు నీటిలో కొట్టుకుపోతున్నారు. భవనాలు కూలిపోతున్నాయి" అని పోలీసు ప్రతినిధి పీటర్ కలయా బీబీసీ ఆఫ్రికాతో చెప్పారు.
బ్లాంటైర్‌లో చెట్లు పడిపోయి, కొండచరియలు విరిగిపడి, నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారని అధికారులు చెప్పారు.
"చాలా ఇళ్లు మట్టితో కట్టినవి. తగరపు రేకులు పైకప్పుగా ఉన్నవి. పైకప్పులు ఎగిరి మీద పడుతున్నాయి" అని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్) కంట్రీ డైరెక్టర్ మారియన్ పెచైర్ రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫ్రెడ్డీ తుపాను ఇప్పటివరకు రికార్డయిన అత్యంత బలమైన తుపాను అని, దీర్ఘకాలం కొనసాగుతున్న ఉధృతి అని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.
ఆదివారం ఉధృతి మొజాంబిక్‌ను తుఫానుగా తాకింది. ఒకే నెలలో ఇది రెండోసారి. హిందూ మహాసముద్రంలోని ద్వీపం మడగాస్కర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.
మొజాంబిక్‌లో విధ్వంసం, మృతుల సంఖ్యను అంచనా వేయడం క్లిష్టంగా మారిందని, విద్యుత్ సప్లయి, ఫోన్ సిగ్నల్స్ కట్ అయ్యాయని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, JNASENA/FACEBOOK
శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం
మచిలీపట్నం కేంద్రంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు అంతా సిద్ధమయ్యింది. తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతున్న సమయంలో ఈ సభను ఆర్భాటంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
భారీగా జనసేన శ్రేణులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సభా వేదిక, ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సభలో ఏర్పాట్ల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా విజయవాడలోనే ఉన్నారు.
మంగళవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరాల్సి ఉంది.
వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్, ఆయన వెంట భారీగా టూవీలర్లతో ప్రదర్శనకు జనసేన సిద్ధమవుతోంది.
అయితే, పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలోని పార్టీ ఆఫీసు నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా కృష్ణా జిల్లా వరకూ ఈ యాత్ర సాగాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ అధికారులతో పాటుగా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ర్యాలీకి అనుమతి లేదని ప్రకటించారు.

ఫొటో సోర్స్, JNASENA/FACEBOOK
పవన్ కళ్యాణ్ యాత్రకు దారిపొడవునా స్వాగతం పలికేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని ప్రధాన కూడళ్లలో భారీగా హోర్డింగులు, తోరణాలు సిద్ధం చేసింది.
మరోపక్క, పోలీసులు ఇప్పటికే విజయవాడ జనసేన నేత పోతిన మహేష్ వంటి వారికి నోటీసులు ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి ప్రదర్శనలకు అనుమతించబోమని తెలిపారు.
దాంతో, జనసేన అధినేత ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. గతంలో ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చేస్తున్నారంటూ పర్యటనకు బయలుదేరిన పవన్ కళ్యాణ్‌ని పార్టీ కార్యాలయం వద్ద అడ్డుకునే ప్రయత్నం జరిగింది.
ఆ క్రమంలో జనసేనాని తన వాహనం పైకి ఎక్కి ప్రయాణం చేయడం వివాదాస్పదమయ్యింది.
ప్రస్తుతం వారాహి వాహనం సిద్ధం చేసుకుని సాగుతున్న తరుణంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.