నేటి లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తీర్మానంపై మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రాజ్యాంగం మీద దాడి. భారతదేశాన్ని బద్నాం చేయటానికి బీబీసీ ప్రయత్నించింది. దీనిపై చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.
నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, ANI
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) మీద చర్యలు చేపట్టాలంటూ మధ్యప్రదేశ్ శాసనసభ సోమవారం నాడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
2002 గుజరాత్ అల్లర్ల మీద డాక్యుమెంటరీని ప్రసారం చేసినందుకు గాను బీబీసీ మీద చర్యలు చేపట్టాలంటూ బీజేపీ ఎంఎల్ఏ శైలేంద్ర జైన్ తీర్మానం ప్రవేశపెట్టారు.
‘ఇండియా, ది మోదీ క్వశ్చన్’ శీర్షికన బీబీసీ రెండు భాగాలుగా రూపొందించిన డాక్యుమెంటరీని భారతదేశంలో ఏ రూపంలోనూ ప్రసారం చేయలేదు. కొందరు వ్యక్తులు ఈ డాక్యుమెంటరీని అనధికారిక పద్ధతిలో షేర్ చేయటానికి ప్రయత్నించగా.. దానిని అడ్డుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది.
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు పంపించింది.
సీనియర్ పాత్రికేయుడు ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్ మీద తదుపరి విచారణ ఏప్రిల్ నెలలో చేపడతారు.
బీబీసీ మీద చర్యలు కోరుతూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానం తరహాలోనే ఇంతకుముందు గుజరాత్ అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు.

ఫొటో సోర్స్, www.mpvidhansabha.nic.in
ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ తీర్మానంపై మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రాజ్యాంగం మీద దాడి. భారతదేశాన్ని బద్నాం చేయటానికి బీబీసీ ప్రయత్నించింది. ఇది ఖండించాల్సిన విషయం. దీనిపై చర్యలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.
ఈ డాక్యుమెంటరీని పాత్రికేయ విధివిధానాలన్నిటినీ పాటిస్తూ రూపొందించామని, ఇందులో భాగస్వామ్య పక్షాలందరికీ వారి దృక్కోణాలను తెలియజేయటానికి అవకాశం ఇచ్చామని, బీజేపీ ఎంపీగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ స్వపన్‌దాస్ గుప్తా కూడా పాల్గొన్నారని, గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీని ఆయన సమర్థించారని బీబీసీ చెప్పింది.
ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన మూడు వారాల తర్వాత.. ఆదాయ పన్ను శాఖ అధికారులు బీబీసీ దిల్లీ, ముంబై కార్యాలయాల్లో మూడు రోజుల పాటు పత్రాలను పరిశీలించారు. రెండు కార్యాలయాల్లోనూ సీనియర్ అధికారులను ప్రశ్నించారు. ఈ చర్యను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సర్వే అని అభివర్ణించారు.
ఆదాయ పన్ను అధికారులకు పూర్తిగా సహకరిస్తామని బీబీసీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అలహాబాద్ హైకోర్టు ఆవరణలో ఉన్న మసీదును మూడు నెలల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు సోమవారం నాడు నిర్దేశించింది.
ఈ మసీదును తొలగించాలని అలహాబాద్ హైకోర్టు 2017 నవంబర్‌లో ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ వక్ఫ్ మసీద్ హైకోర్టు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు సుప్రీంకోర్టులు పిటిషన్ వేశాయి.
మసీదు భవనం ఉన్న స్థలానికి సంబంధించిన లీజు కాల పరిమితి ముగిసిపోయిందని, కాబట్టి ఆ ప్రాంతం తమ ఆధీనంలో ఉంటుందని వాదించే హక్కు పిటిషనర్లకు లేదని సుప్రీంకోర్టు చెప్పింది.
వారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అయితే.. మసీదు కోసం సమీపంలో స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరవచ్చునని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది.
ఒకవేళ మసీదును భవనాన్ని మూడు నెలల్లోగా తొలగించకపోయినట్లయితే.. దానిని తొలగించటానికి లేదా కూల్చివేయటానికి హైకోర్టు సహా పాలనా యంత్రానికి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.

ఫొటో సోర్స్, ANI
మూడు రోజుల్లో రెండు అమెరికా బ్యాంకులు దెబ్బతినటం.. సోమవారం నాడు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ సోమవారం నాడు 900 పాయింట్లు పతనమైంది.
సెన్సెక్స్ 58,237.85 వద్ద ముగిసింది. అప్పటికి దేశీయ మదుపుదార్లు 4.4 లక్షల కోట్లు కోల్పోయారు.
ఎన్ఎస్‌ఈ కూడా 256.60 పాయింట్లు పతనమై 17,154.30 దగ్గర ముగిసింది.
బీఎస్‌ఈలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న 3,757 స్టాక్స్‌లో.. 2,915 కంపెనీల షేర్లు పతనం కాగా, 695 షేర్లు లాభపడ్డాయి.

ఫొటో సోర్స్, ANI
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 2-1 ఆధిక్యంతో గెలుచుకుంది.
నాలుగో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఇక భారత్, ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో తలపడనున్నాయి. లండన్‌లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7వ తేదీన ఈ మ్యాచ్ జరుగనుంది.
నిజానికి.. శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ మొదటి మ్యాచ్‌లో గెలిచింది. శ్రీలంక ఓటమితో భారత జట్టు పాయింట్ల పట్టికలో పైకి వెళ్లింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది.

ఫొటో సోర్స్, ANI
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. శ్రీలంక, న్యూజీలాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజీలాండ్ విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది.
ఈ మేరకు ఐసీసీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఓవల్‌లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడనుందని ఐసీసీ పేర్కొంది.
ఈ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడానికి భారత్ ముందు రెండు మార్గాలు ఉండేవి. ఒకటి.. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియాను 3-1 తేడాతో ఓడించడం.. రెండో న్యూజీలాండ్ చేతిలో శ్రీలంక ఓడడం.
అయితే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ 5వ రోజులన కొనసాగుతుండడంతో ఆ జట్టును 3-1 తేడాతో ఓడిస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు. కానీ, ఇంతలోనే శ్రీలంక జట్టు న్యూజీలాండ్ చేతిలో ఓటమి పాలవడంతో భారత్ ఫైనల్ చేరడానికి మార్గమేర్పడింది.
న్యూజీలాండ్, శ్రీలంక మ్యాచ్‌లో అయిదో రోజు కేన్ విలియమ్సన్ 121 పరుగులు చేయడంతో న్యూజీలాండ్ విజయం సాధించింది. దీంతో భారత్ ఫైనల్‌కు చేరింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అమెరికాలో జరిగింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుని ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది.
మరొక భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.
మొత్తం మీద ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం అత్యధికంగా 7 అవార్డులు గెలుచుకుంది.
ఆస్కార్ అవార్డు గెలిచిన సందర్భంగా...
కీరవాణి, చంద్రబోసు, రాజమౌళిలతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, narendra modi/Facebook
ఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు సినిమా బృందాలకు అభినందనలు తెలిపారు.
‘‘ఎక్సెప్షనల్!
నాటునాటు పాట అంతర్జాతీయంగా పాపులర్ అయింది. దాన్ని కొన్ని తరాల పాటు గుర్తుంచుకుంటారు. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ఇతర సినిమా బృందానికి శుభాకాంక్షలు’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్
మెషెల్లీ యొ(ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్)
బ్రెండన్ ఫేజర్(ది వేల్)
ఎవిరిథింగ్ ఎవిరివేర్ ఆల్ ఎట్ వన్స్ డైరెక్టర్లు డేనిల్ క్వాన్, డేనిల్ సెనెర్ట్‌లకు బెస్ట్ డైరెక్టర్లుగా అవార్డు దక్కింది.