ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.
నారాయణకు, ఆయన కుమార్తెకు మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన కీలకమైన ఆడియో క్లిప్ లభించిందని చెబుతున్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.

ఫొటో సోర్స్, GETTY IMAGE
10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విమానం ల్యాండింగ్‌కు ఎయిర్‌పోర్ట్ వర్గాలు అనుమతులు ఇవ్వలేదు.
ల్యాండింగ్‌కు నిరాకరించడంతో ప్రయాణీకులతో కూడిన ఆ విమానం బయల్దేరిన చోటుకే తిరిగి వెళ్లింది. ఈ ఘటన జపాన్‌లో జరిగింది.
జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఎల్ 331 విమానం, ఫిబ్రవరి 19న టోక్యో నుంచి ఫుకుయోకాకు బయల్దేరింది.
విమానాన్ని మార్చాల్సి రావడం వల్ల ఆ ప్రయాణం 90 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
అబ్దుల్లా పూర్ మెట్టు పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవీన్ అనే వ్యక్తిని హరిహరకృష్ణ అనే వ్యక్తి హత్య చేశాడు.
"వీళ్లిద్దరూ బీటెక్ విద్యార్థులు. చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒక అంశంలో ఇద్దరి మధ్య తగాదా వచ్చి హత్య వరకు వెళ్లింది. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి చర్యల కోసం నవీన్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాం. నవీన్ తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. చనిపోయిన అబ్బాయి లంబాడా యువకుడు. యువకులిద్దరి మధ్య తగాదా ఎందుకు వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం
పెళ్లయినా కాపురానికి పోలేదని కన్న కూతుర్ని తండ్రి దేవేందర్ రెడ్డి గొంతు నొక్కి చంపేశాడని పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో ప్రసన్న(21) అనే వివాహిత హత్యకు గురైంది. ప్రసన్నకు రెండు సంవత్సరాల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిగింది.
అయితే, 20 రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసిన ప్రసన్న కాపురానికి పొమ్మంటే పోలేదన్న కక్షతో తండ్రి చంపేసినట్టు పోలీసులు చెప్పారు.
"ఈ నెల 10వ తేదీన ఆలమూరు గ్రామానికి చెందిన ప్రసన్న (21)ని ఆమె తండ్రి దేవేందర్ రెడ్డి ఇంట్లో అతి కిరాతకంగా గొంతు నొక్కి చంపేశారు. తరువాత మరికొంతమంది సహాయంతో కూతురి శవాన్ని తీసుకెళ్లి గిద్దలూరు-గాజులపల్లి ఘాట్ రోడ్లో ఒక లోయలో పడేశారు. తల నుంచి మొండాన్ని వేరు చేసి, ఎవిడెన్స్ లేకుండా చేయాలని ఉద్దేశంతో లోయలో పడేశారు.
ప్రసన్నను రెండేళ్ల క్రితం మనోహర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. రెండు సంవత్సరాలు బానే కాపురం జరిగింది. 20 రోజుల కిందట భర్తతో కొట్లాడి ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో పెద్దమనుషులు సర్దిచెప్పి, బనగాన పల్లి మండలం చిన్నల గ్రామంలో వాళ్ల అత్తగారింటికి పంపించారు.
అయితే, భర్తతో సంసారం చేయడం ఇష్టం లేక పురుగుమందు తాగింది. వెంటనే, బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులు చికిత్స ఇచ్చి, రికవరీ అయ్యాక ఆలమూరు గ్రామంలో తండ్రి ఇంట్లో దింపారు. తరువాత కూడా, ఎంత చెప్పినా ఆ అమ్మాయి మాట వినడం లేదని ఆగ్రహించిన తండ్రి 10వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో గొంతు నొక్కి అతి దారుణంగా చంపేశారు.
ప్రసన్న తాత శివారెడ్డి మనుమరాలి గురించి అడగడంతో, ఎంత చెప్పినా వినడం లేదు.. కాపురానికి వెళ్లడం లేదన్న కోపంతో చంపేశానని దేవేందర్ రెడ్డి చెప్పారు. శవాన్ని గిద్దలూరు ఘాట్లో పడేశానని చెప్పి దేవేందర్ పారిపోయారు. నిన్న శివారెడ్డి పాణ్యం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాం. వెంటనే కేసు ఫైల్ చేసి, శవాన్ని పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. నిందితుడిని పట్టుకున్న తరువాత ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉందన్నది తెలుస్తుంది. ఎంత చెప్పినా సంసారానికి పోలేదనే ఉద్దేశంతోనే చపినట్టు తెలిసింది" అని పాణ్యం సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు.
ప్రసన్న వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం సహించలేక, భర్తతో కాపురానికి వెళ్లమని ఎంత చెప్పినా వినకపోవడంతోనే దేవేందర్ రెడ్డి ఈ హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా టీటీడీ మరో ప్రయత్నం చేస్తోంది.
ఇక నుంచి లడ్డు ప్రసాదాన్ని తాటాకు బుట్టలో అందించాలని నిర్ణయించింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేసే దిశలో ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.
తిరుమలలో వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేసేలా తాటాకు బుట్టలను ప్రయోగత్మకంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
టీటీడీ అధికారికంగా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బుట్టలు ఈవోకు చూపించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/DR.PONGURUNARAYANA
శంకర్ వడిసెట్టి, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి. నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‍లోని నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. కూకట్‍పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లలోని పలు ఇళ్లలో రికార్డులు పరిశీలిస్తున్నారు.
నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంక్ స్టేట్‍మెంట్ పరిశీలన కోసం ఆధారాలు సేకరిస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలపై ఏపీ సీఐడీ అధికారుల ఆరా తీస్తున్నారు.
అమరావతి కొనుగోళ్ల లావాదేవీలను పరిశీలించేందుకు ఏపీ సీఐడీ ఈ సోదాలు చేపట్టింది. శుక్రవారం మొదలుపెట్టి శనివారం నాడు కూడా కొనసాగిస్తోంది.
అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు దొరికాయని చెబుతున్నారు.
నారాయణ, కుమార్తె మధ్య ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ లభించిందని, అందులో నారాయణ మనీ రూటింగ్ ఎలా చేయాలో కూమర్తెకు వివరిస్తున్నట్టు ఉందని అంటున్నారు. నారాయణ చెప్పిన ప్రకారమే మనీ రూటింగ్, అమరావతిలో భూముల కొనుగోళ్లు జరిగాయని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, HCA
ఆర్ఆర్ఆర్ తాజాగా అంతర్జాతీయ స్థాయిలో మరో నాలుగు అవార్డులు సొంత చేసుకుంది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డులను ప్రకటించింది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకునేందుకు రాజమౌళితో పాటు రామ్ చరణ్ కూడా వేదిక మీదకు వచ్చారు. ఈ అవార్డ్ అందించినందుకు హెచ్‌సీఏకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రాజమౌళి మాట్లాడుతూ "భారతదేశంలో మేం అంతర్జాతీయ స్థాయి సినిమాలను రూపొందించగలమని ఈ అవార్డు నిరూపించింది" అన్నారు.
బెస్ట్ స్టంట్స్ అవార్డ్ అందుకుంటూ, "అన్ని స్టంట్స్ రూపొందించిన సాల్మన్‌కు ధన్యవాదాలు. క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు రూపొందించేందుకు సహాయపడిన జూజీకి, మిగతా స్టంట్ కొరియోగ్రాఫర్లకు ధన్యవాదాలు. మా నటులు జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా స్టంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో ఎక్కువ సమయం స్టంట్స్‌కే ఖర్చుచేశాం. మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
హెచ్‌సీఏ అవార్డు ప్రతిమకు ఉన్న రెక్కలను ఉద్దేశిస్తూ, "ఈ రెక్కలు మేం మరింత పైకి ఎగిరేందుకు సహాయపడతాయని ఆశిస్తున్నాం" అన్నారు రాజమౌళి.
"అద్భుతమైన కథలు అందించే నా దేశానికి వందనాలు, జైహింద్" అంటూ ప్రసంగం ముగించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నాటు నాటు పాటకు హెచ్‌సీఏ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న కీరవాణి వేదికపై ఇంగ్లిష్‌లో చిన్న పాట పాడారు.
"ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉంది, రాజమౌళికి థాంక్యూ" అంటూ పాట రూపంలో కృతజ్ఞతలు తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో పరువు హత్య కలకలం రేపింది.
పెళ్లయిన కూతుర్ని కన్న తండ్రే కడతేర్చారు.
ప్రసన్న(21)కు రెండు సంవత్సరాల క్రితం బనగానపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో వివాహం అయింది.
అయితే, కొన్ని రోజుల కిందట ప్రసన్న ఆలమూరులో తండ్రి దేవేందర్ రెడ్డి వద్దకు వచ్చారు.
తరువాత, అదే గ్రామానికి చెందిన ప్రియుడితో పరారయ్యారు.

ఫొటో సోర్స్, UGC
అనంతరం, పెద్దలు పెద్దమనుషులతో పంచాయతీ నిర్వహించి ఎవరి ఇంటికి వారిని పంపేశారు.
ఇకనైనా భర్త దగ్గరికి వెళ్లాలని తండ్రి కోరగా, ప్రసన్న నిరాకరించారు.
దాంతో, తండ్రి ఇంట్లోనే ఆమె గొంతు పిసికి చంపారు.
మరికొంతమంది సహాయంతో మృతదేహాన్ని కారులో గిద్దలూరు ఘాట్‌కు తీసుకొని వెళ్లి తల, మొండెం వేరు చేసి లోయలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు.
పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి దేవేందర్ రెడ్డితో పాటు మరికొందని అరెస్ట్ చేశారు.

ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 50,000 దాటింది.
ఈ రెండు దేశాలలో 1,60,000 కంటే ఎక్కువ భవనాలు కూలిపోయాయి లేదా ధ్వంసమయ్యాయి. వీటిల్లో మొత్తం 5,20,000 అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.