You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పవన్ కల్యాణ్ మీద అలీ ఎన్నికల్లో పోటీ చేస్తారా... మీడియాతో ఆయన ఏమన్నారు

పవన్ కల్యాణ్ గురించి మీడియా ప్రస్తావించగా... సినిమాలు వేరు... స్నేహం వేరు... రాజకీయాలు వేరు... ఒక ఇంట్లో ఉన్న వాళ్లు ఒక పార్టీకే ఓటు వేయాలనే రూలు లేదు కదా అని ఆయన అన్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. రెండో ప్రపంచయుద్ధం: ఈ మ్యాప్ ఉంటే కోటీశ్వరులు కావొచ్చా... బంగారం, వజ్రాల నిధిని పట్టుకోవచ్చా

  3. నేపాల్: విమానం కూలిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం ఎలా

  4. చైనా: 60ఏళ్లలో తొలిసారి తగ్గిన జనాభా... ఇది దేనికి సంకేతం

  5. లెస్బియన్‌గా జీవితం ఎలా ఉంటుంది... ఇందులోనూ మోసాలు ఉంటాయా

  6. 'నేను ఆర్ఎస్ఎస్ ఆఫీసులో అడుగు పెట్టాలంటే ముందు నా పీక కోయాలి' - రాహుల్ గాంధీ

    వరుణ్ గాంధీ సిద్ధాంతాలకు, తన సిద్ధాంతాలకూ పొంతన లేదని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు.

    వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరే అవకాశాలపై రాహుల్ మాట్లాడుతూ, "ఆయన బీజేపీలో ఉన్నారు. ఇందులోకి వస్తే సమస్యలు వస్తాయి" అన్నారు.

    "వరుణ్ గాంధీ ఆలోచనలు వేరు. నా ఆలోచనలు వేరు. నేను ఆర్ఎస్ఎస్ ఆఫీసులో ఎప్పటికీ అడుగుపెట్టలేను. ముందు నా గొంతు కోయాలి. నేను వెళ్లలేను" అన్నారు రాహుల్ గాంధీ.

    "నా కుటుంబానికి ఒక సిద్ధాంతం ఉంది. ఒక సొంత ఆలోచనా విధానం ఉంది. వరుణ్ గాంధీ ఒకప్పుడు, బహుసా ఇప్పటికీ ఆ (బీజేపీ) సిద్ధాంతాలతో ఏకీభవిస్తారు. నేను దానిని అంగీకరించలేను. నేను కచ్చితంగా ఆయనను ప్రేమగా కౌగలించుకోగలను. కానీ, ఆ సిద్ధాంతాన్ని అంగీకరించలేను" అన్నారు.

  7. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 2024 జూన్ వరకు జేపీ నడ్డా - అమిత్ షా

    బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2024 జూన్ వరకు అదే పదవిలో కొనసాగుతారని బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు వెల్లడించారు.

    తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉంది. అప్పటివరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా ఉంటారన్నది స్పష్టం.

    సోమవారం నుంచి బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.

    మంగళవారం సమావేశంలో జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదనను మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ముందుకు తీసుకొచ్చారని, జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని అమిత్‌ షా తెలిపారు.

    జేపీ నడ్డా 2020 జనవరి 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    జేపీ నడ్డా హయాంలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని, తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో తమ పార్టీ బలపడిందని అమిత్ షా అన్నారు.

    నరేంద్ర మోదీ, జేపీ నడ్డా నేతృత్వంలో 2024లో బీజేపీ మరింత భారీ మెజారిటీతో గెలుస్తుందని, మరోసారి మోదీ ప్రధానిగా దేశానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు.

  8. నేపాల్: పోఖరా విమానాశ్రయానికి భారత్ విమానాలు నడపదు... ఎందుకు

  9. పవన్ కల్యాణ్ మీద పోటీకి అలీ సిద్ధమేనా?

    మీరు పవన్ కల్యాణ్ మీద పోటీ చేస్తారా? అంటూ సినీనటుడు, వైసీపీ నేత అలీని పాత్రికేయులు అడిగారు.

    వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశిస్తే తాను సిద్ధమేనని ఆయన బదులిచ్చారు.

    ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి రోజా నియోజకవర్గం నగరి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

    పార్టీ నిర్ణయిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని అలీ తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి మీడియా ప్రస్తావించగా... సినిమాలు వేరు... స్నేహం వేరు... రాజకీయాలు వేరు... ఒక ఇంట్లో ఉన్న వాళ్లు ఒక పార్టీకే ఓటు వేయాలనే రూలు లేదు కదా అని ఆయన అన్నారు.

  10. రామచరిత మానసం గ్రంథంపై బిహార్ విద్యా మంత్రి వ్యాఖ్యలు.. నితీశ్ కుమార్ స్పందన

    రామచరితమానసం గ్రంథంపై బిహార్ విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

    మనుస్మృతి, రామచరిత మానసం, బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకాలు ద్వేషపూరితమైనవని ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

    దీనిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ, "మతం విషయంలో ఎలాంటి వివాదం ఉండకూడదు. ఏ మత పరమైన అంశాల్లో జోక్యం చేసుకోకూడదు" అన్నారు.

    సీఎం స్పందనతో బిహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. జేడీయూ-ఆర్‌జేడీ కూటమిలో కూడా ఉద్రిక్తతలు నెలకొన్నట్లు సమాచారం.

    "ఎవరి మతంలోనూ జోక్యం చేసుకోకూడదన్నదే మా సిద్ధాంతం. ఎవరికి నచ్చిన విధంగా వారు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. అందరికీ గౌరవం దక్కాలి. ఇలాంటి విషయాల్లో వేలుపెట్టకూడదు. ఎవరికి ఏ దేవుడిని పూజించాలనిపిస్తే వాళ్లని పూజిస్తారు. ఇలాంటి విషయాలను ప్రశ్నించకూడదు" అని నితీశ్ కుమార్ మంగళవారం అన్నారు.

    విద్యాశాఖ మంత్రి ఏం చెప్పారు?

    పైన చెప్పిన మూడు పుస్తకాలు ద్వేషాన్ని పంచేవని బిహార్ విద్యా మంత్రి చంద్రశేఖర్ అన్నారు.

    "మనుస్మృతిలో సమాజంలో ఒక పెద్ద వర్గానికి వ్యతిరేకంగా దుర్భాషలు ఉన్నాయి. అందుకే దాన్ని తగులబెట్టారు. తక్కువ కులాల వారికి విద్య పొందే అర్హత లేదని రామచరిత మానసంలో ఉంది. అందుకే దాన్ని ప్రతిఘటిస్తున్నారు.

    వీటన్నిటినీ ఉదహరిస్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజలకు వాటి గురించి తెలియజెప్పారు. ఇవి ద్వేషాన్ని నాటే పుస్తకాలు. ఒక యుగంలో మనుస్మృతి, మరొక యుగంలో రామచరిత మానసం, ఈ యుగంలో గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ విద్వేషంతో కూడిన పుస్తకాలు. ఇవి మన దేశాన్ని, సమాజాన్ని విభజిస్తాయి. ద్వేషం దేశాన్ని ముందుకు నడిపించదు. ప్రేమ నడిపిస్తుంది" అన్నారు.

  11. షేర్‌చాట్‌లో 20% ఉద్యోగాల కోత

    మెరిల్ సెబాస్టియన్, బీబీసీ ప్రతినిధి

    భారతీయ యునికార్న్ షేర్‌చాట్ 20 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ అనిశ్చితి కారణంగా వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ షేర్‌చాట్ వీడియో యాప్ మాతృ సంస్థ మొహల్లా టెక్ తెలిపింది.

    షేర్‌చాట్‌లో సుమారు 2,200 మంది ఉద్యోగులు ఉన్నారు. మేనేజ్మెంట్ రోల్స్‌లో ఉన్న సుమారు 500 మందిని తొలగించినట్లు మనీకంట్రోల్ న్యూస్ చానెల్ తెలిపింది.

    ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

    మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి టెజ్ దిగ్గజాలు కూడా గత కొన్ని నెలల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. అమెరికాలో ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఎంతోమంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు.

    2023లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 24,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని Layoffs.fyi వెబ్‌సైట్ తెలిపింది. ఈ చానెల్ టెక్ సంస్థలో ఉద్యోగాల కోతను ట్రాక్ చేస్తుంది.

    భారతదేశంలో టెక్ స్టార్టప్ సంస్థలైన అన్అకాడమీ, మాగ్లిక్స్, అప్‌గ్రాడ్, లీడ్ వంటివి ఈ ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగాల కోతను ప్రకటించాయి.

    షేర్ చాట్ మొట్టమొదటి స్వదేశీ సోషల్ మీడియా వేదిక. భారతీయ భాషల్లో ఇది కంటెంట్ అందిస్తుంది. గూగుల్, టెమాసెక్, ట్విట్టర్ వంటి పెద్ద పెద్ద సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి.

    బెంగళూరు నుంచి నడిచే ఈ సంస్థ విలువ సుమారు 5 బిల్లియన్ డాలర్లు. తమకు 18 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని షేర్‌చాట్ చెబుతోంది.

  12. దిల్లీ: నడిరోడ్డుపై దోపిడీ.. బైక్‌లపై వచ్చి 5 లక్షలు దోచుకున్నారు

    జనవరి 14న దిల్లీలో నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి నడిరోడ్డు మీద ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి, ఆయన వద్ద ఉన్న సొమ్మును దోచుకున్నారు.

    రూప్ నగర్ ఏరియాలోని శక్తి నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

    నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి, రోడ్డు పక్కన బైక్ ఆపి నిల్చున్న బాధితుడిని ఈడ్చుకెళ్లి కొట్టినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ అందించిన సీసీఫుటేజీలో కనిపిస్తోంది.

    బాధితుడు 42 ఏళ్ల హనీ కాల్రా అని, దుండగులు ఆయన దగ్గర ఉన్న అయిదు లక్షల రూపాయలు దోచుకున్నారని ఏఎన్ఐ తెలిపింది.

    బాధితుడి కుడి కాలికి గాయమైందని, ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారని పేర్కొంది.

  13. నేపాల్: విమానం కూలుతున్న క్షణాల్లో ఫేస్‌బుక్ లైవ్...ఆ వీడియోలో ఏముందంటే?

    నేపాల్‌ విమాన ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌లో ఒక వీడియో వైరల్‌గా మారింది.

    విమానం క్రాష్ కావడానికి కొన్ని సెకన్ల ముందు వరకు, బాధితుల్లో ఒకరైన సోనూ జైస్వాల్ ఈ విమానం నుంచి ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

    ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి నేపాల్ టూర్‌కు వెళ్లిన నలుగురు స్నేహితుల బృందంలో సోనూ జైస్వాల్ ఒకరు. కాఠ్‌మాండూ నుంచి పోఖరాకు వెళ్తున్న ఆ విమానంలో వీరు కూడా ఉన్నారు.

    పూర్తి కథనం ఇక్కడ చదవండి

  14. పాకిస్తాన్‌ తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 'గ్లోబల్ టెర్రరిస్ట్' జాబితాలో చేర్చిన ఐక్యరాజ్య సమితి

    పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) సోమవారం ప్రకటించింది.

    యూఎన్ఎస్‌సీ ఐఎస్ఐఎల్ (దాఎష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

    లష్కరే తోయిబా తీవ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలని భారత్ గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన తీసుకువచ్చింది. కానీ, చైనా దానిని అడ్డుకుంది. చైనా చర్యలపై భారత్ ఘాటుగా స్పందించింది.

    2011 నవంబర్ 26న భారతదేశంలో జరిగిన తీవ్రవాద దాడుల సూత్రధారిగా భావించే జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ బంధువు.

    సోమవారం ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ప్రకటనలో, అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 'గ్లోబల్ టెర్రరిస్ట్' జాబితాలో చేర్చినట్టు తెలుపుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మక్కీ ఆస్తులను జప్తుకు చేస్తారని, మక్కీ అంతర్జాతీయ ప్రయాణాలపై పరిమితులు ఉంటాయని తెలిపింది.

    భారతదేశం, అమెరికా ఇప్పటికే అబ్దుల్ రెహ్మాన్ మక్కీని 'టెర్రరిస్ట్'గా ప్రకటించాయని ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

    యువతను తీవ్రవాదం వైపు ప్రేరేపించడం, భారత్‌లో దాడులకు ప్రణాళిక రచించడం,, అక్రమ నిధుల సేకరణ వంటి అనేక ఆరోపణలు మక్కీపై ఉన్నాయి.