వరల్డ్ కప్ ఓటమి తరువాత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతో సహా సెలెక్షన్ కమిటీ మీద బీసీసీఐ వేటు
చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతోపాటు నేషనల్ సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని బీసీసీఐ తొలగించింది.
లైవ్ కవరేజీ
ఇక ఆకాశం నుంచి డబ్బులు కురిపించవచ్చా, భారత్‌లో ప్రైవేట్ శాటిలైట్ విజయాలు ఏం చెబుతున్నాయి?
తిరుమల: ఆర్గానిక్ లడ్డూ అంటే ఏంటి?
వయసు పైబడ్డాక శృంగారం గురించి ఈ సెక్స్ హెల్త్ ఎడ్యుకేటర్ ఏమంటున్నారు
సెలెక్షన్ కమిటీ మీద బీసీసీఐ వేటు
చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మతోపాటు నేషనల్ సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని బీసీసీఐ తొలగించింది.
2022 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి, ఇంటి దారి పట్టింది. ఇంగ్లండ్ మీద ఒక్క వికెట్ కూడా తీయలేక పోయింది.
ఆసియా కప్‌లోనూ పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీం ఇండియా బయటకు వచ్చేసింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీం ఇండియా మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న కాలంలో 2021, 2022 టీ20 వరల్డ్ కప్స్‌లో భారత్ ఫైనల్‌కు చేరలేక పోయింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హనీ ట్రాప్ అంటే ఏంటి... సెక్స్‌ను ఒక ఆయుధంగా ఎలా వాడతారు
జిన్నా:హిందూ జెనాభాయ్ ఠక్కర్ కొడుకు, ముస్లిం మహమ్మద్ అలీ జిన్నా ఎలా అయ్యారు?
కేసీఆర్ 13 లక్షల ఎకరాల భూముల సమస్యను పరిష్కరించగలరా?
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
నేను బైసెక్సువల్‌ని...నాలాంటి వారిపై ఎందుకు చిన్నచూపు?
‘పాకిస్తాన్‌కు రహస్య సమాచారం ఇచ్చారనే ఆరోపణలతో విదేశాంగ శాఖ ఉద్యోగి అరెస్టు’
పాకిస్తాన్‌కు ‘రహస్యమైన’, ‘సున్నితమైన’ సమాచారం ఇచ్చారనే ఆరోపణల మీద కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో డ్రైవర్‌గా పని చేసే ఒక వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ పన్నిన ‘హనీ ట్రాప్’లో ఆ డ్రైవర్ పడినట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ధర్మపురి అరవింద్: ‘‘విపరీతమైన కుల అహంకారంతోనే నా ఇంటిపై కవిత దాడి చేయించారు’’

కేసీఆర్, కవిత, కేటీఆర్‌లకు విపరీతమైన కుల అహంకారం ఉందని, ఈ అహంకారంతోనే తన ఇంటిపై దాడి చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
దమ్ముంటే నిజామాబాద్ వచ్చి పోటీచేసి తనపై గెలవాలని ఆయన సవాలు విసిరారు.
తన ఇంటిపై దాడి చేసే హక్కు, తన తల్లిని, తన ఇంట్లోని మహిళా సిబ్బందిని బెదిరించే హక్కు వారికి ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ అధ్యక్షునికి కవిత ఫోన్ చేశారు. ఎందుకు చేశారో నాకు తెలియదు. తెరాస పార్టీని భారాసగా మార్చే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని తన తండ్రిపై కవితకు కోపం వచ్చి ఉండొచ్చు. అదే కోపంతో కాంగ్రెస్ వారిని సంప్రదించి ఉండొచ్చు.
బీజేపీలోకి కవితను పిలుస్తున్నారని స్వయంగా ఆమె తండ్రే అన్నారు. మరి తన తండ్రి ఇంటిపై ఎందుకు దాడి చేయించలేదు. అసలు దానికి ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కానీ, మల్లికార్జున్ ఖర్గేకు కవిత ఫోన్ చేశారని నేను చెప్పిన విషయంపై మాత్రం ఈ స్థాయిలో ఆమె స్పందించారు. అంటే ఇందులో నిజముందనే కదా అర్థం’’ అని అరవింద్ వ్యాఖ్యానించారు.
సంధ్యా దేవనాథన్: విశాఖపట్నంలో చదివిన మెటా ఇండియా హెడ్ ‘చదువులో చురుకు, వాట్సాప్‌లో సైలెంట్ ’
లిఫ్ట్ అడిగిన భారతీయులను తన రెస్టారెంట్‌కు ఆహ్వానించిన పాకిస్తానీ వ్లాగర్ వీడియో ఎందుకు వైరల్‌గా మారింది
బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి

ఫొటో సోర్స్, Arvind Dharmapuri/Twitter
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై శుక్రవారం దాడి జరిగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
హైదరాబాద్‌లోని ఆయన నివాసంపై టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు దాడికి పాల్పడి వస్తువులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తన ఇంటిపై దాడి జరిగినట్లు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ గుండాలు తన ఇంటిపై దాడి చేసినట్లు ట్వీట్‌లో ఆయన ఆరోపించారు.
ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని.. తన తల్లిని బెదిరించారని ఆయన ఆరోపించారు.
కాగా... ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఆమె సంప్రదించారని అరవింద్ గురువారం ఆరోపించారు.
ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు.

నోరు అదుపులో పెట్టుకోకపోతే చెప్పుతో కొడతా.. ఫేక్ డిగ్రీపై రాజస్థాన్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేస్తా- కవిత
నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మళ్లీ తన గురించి, పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పు తో కొడతా అని అన్నారు.
‘‘అరవింద్‌ది సంకుచిత మనస్తత్వం. ఆయనవి చిల్లర మాటలు. అనుకోకుండా ఎంపీ అయ్యారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీ. దీనిపై నేను రాజస్థాన్ యూనివర్సిటీ కి పిర్యాదు చేస్తా.
నిన్న ప్రెస్‌మీట్‌లో ఆయన నీచంగా మాట్లాడారు. అరవింద్ భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోంది. నేను సమస్యల మీద మాట్లాడతాను. వ్యక్తుల మీద ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ, అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదు.
మళ్లీ నా గురించి పార్టీ మారడం గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నా.
అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తా. కాంగ్రెస్‌లో చేరేందుకు నేను ఖర్గేతో మాట్లాడాను అనేది శుద్ధ తప్పు. నిజామాబాద్‌లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై అరవింద్ నా మీద గెలిచారు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, bandi sanjay
మా సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు: బండి సంజయ్
కాగా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఖండించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఇలా భౌతిక దాడులకు దిగుతారా అని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతులను నొక్కినంతమాత్రాన తాము భయపడేది లేదని ఆయన అన్నరు.
బీజేపీ చూపుతున్న సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని.. తమ పార్టీ కార్యకర్తలు బరిలోకి దిగితే టీఆర్ఎస్ తట్టుకోలేదని సంజయ్ హెచ్చరించారు.
భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్‌తుంబ్డేకు బెయిల్.. అమలుపై వారం రోజులు స్టే
భీమా కోరేగావ్ కేసు: ఆనంద్ తేల్‌తుంబ్డేకు బెయిల్

ఫొటో సోర్స్, ANI
భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన ఆనంద్ తేల్‌తుంబ్డేకు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు ఈ బెయిల్ లభించింది.
సుప్రీం కోర్టులో అప్పీలుపై జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన అభ్యర్థనపై కోర్టు వారం రోజుల పాటు స్టే విధించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భీమా కోరేగావ్ యుద్ధం జరిగి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా 2018 జనవరి 1న నిర్వహించిన ఒక కార్యక్రమంలో హింస చెలరేగింది.
ఈ హింసలో ఒక వ్యక్తి మరణించగా 10 మంది పోలీసులతో సహా పలువురికి గాయాలయ్యాయి.
భీమా కోరేగావ్‌లో ఘర్షణల తర్వాత జనవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఈ మేరకు పోలీసులు 162 మందిపై 58 కేసులు నమోదు చేశారు.
ఆనంద్ తేల్‌తుంబ్డే ఎవరు?
ఆనంద్ తేల్‌తుంబ్డే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మేధావి, స్కాలర్, రచయిత కూడా. ఆయన చాలా పుస్తకాలు ప్రచురితం అయ్యాయి.
ఆయన ఇంజనీర్. ఐఐఎం, అహ్మదాబాద్‌లో కూడా చదివారు. ఆయన భారత పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.
కానీ ఆయన తర్వాత టీచింగ్ ఎంచుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
ఆ సమయంలో ఆయన గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ఆయన చాలా పత్రికలకు పరిమితంగా రాసేవారు. కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్(సీపీడీఆర్) సభ్యులుగా తేల్‌తుంబ్డే చాలా ఉద్యమాలలో పాల్గొన్నారు.
తిరుమలలో ఆర్గానిక్ లడ్డూ, అన్నప్రసాదాలు.. సేంద్రియ ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి
బ్రేకింగ్ న్యూస్, విక్రమ్ ఎస్: భారత్‌లో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో

భారత్‌లో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్- ‘విక్రమ్ ఎస్‘ను శుక్రవారం ఇస్రో ప్రయోగించింది.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11:30 గంటలకు ఈ రాకెట్‌ను పంపించారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఈ రాకెట్‌ను తయారు చేసింది.
ఈ రాకెట్ ప్రయోగంతో భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలు లాంఛనంగా అడుగుపెట్టినట్లు అయింది.
ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని పేరు పెట్టింది స్కైరూట్ ఏరోస్పేస్.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శ్రద్ధ హత్య కేసు: పోలీసులకు సహకారంపై డేటింగ్ యాప్ ‘బంబుల్’ ఏం చెప్పిందంటే...

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, పోలీసుల కస్టడీలో అఫ్తాబ్ దిల్లీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు వ్యవహారంలో భారతీయ దర్యాప్తు సంస్థలకు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని డేటింగ్ యాప్ బంబుల్ చెప్పింది.
భారత దర్యాప్తు సంస్థలకు కావాల్సినప్పుడల్లా అందుబాటులో ఉంటామని యాప్ తెలిపింది.
శ్రద్ధ హత్య వ్యవహారంతో డేటింగ్ యాప్ ‘బంబుల్’ పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో శ్రద్ధ ప్రియుడు అఫ్తాబ్ పూనావాలాను నిందితునిగా చేర్చారు.
శ్రద్ధ, అఫ్తాబ్‌లు 2019లో బంబుల్ డేటింగ్ యాప్‌లోనే కలుసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
బంబుల్ యాప్ ద్వారా అఫ్తాబ్, ఇంకా ఎవరైనా ఇతర మహిళలను కలిశాడో తెలుసుకోవడానికి దిల్లీ పోలీసులు బంబుల్ యాప్‌లోని అఫ్తాబ్ ప్రొఫెల్‌కు సంబంధించిన సమాచారాన్ని కోరినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
బంబుల్ ప్రతినిధి మాట్లాడుతూ... ‘‘ మేం ఈ కేసును నిశితంగా పరిశీలిస్తున్నాం. దర్యాప్తు సంస్థలకు అవసరమైనప్పుడల్లా మేం వారికి అందుబాటులో ఉంటాం. మా సభ్యుల భద్రత, క్షేమం మాకు తొలి ప్రాధాన్యం. ఈ నేరం గురించి తెలుసుకొని మేం షాకయ్యాం’’ అని అన్నారు.
దిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో శ్రద్ధతో కలిసి అఫ్తాబ్ నివసించేవారు.
శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్ ఆమె శరీర అవయాలను అనేక ముక్కలుగా నరికి అడవి ప్రాంతంలో విసిరేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అఫ్తాబ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
