లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
సెంట్రల్ ఇస్తాంబుల్‌లోని రద్దీ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడులో పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, EPA
తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు చనిపోయినట్లుగా తర్కిష్ సిటీ గవర్నర్ తెలిపారు.
మార్కెట్ ప్రాంతమైన తక్సిమ స్క్వేర్‌లో స్థానిక కాలమానం ప్రకారం 04:20 నిమిషాలకు పేలుడు సంభవించిందని అలీ యెర్లికాయా ట్వీట్ చేశారు.
అయితే పేలుడు కారణాలను ఇంకా వెల్లడించలేదు.
బీబీసీ కరస్పాండెంట్ ఓర్లా గ్యూరీన్ ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించినట్లు ఆమె తెలిపారు.
అంబులెన్సులు రాకపోకలు సాగిస్తుంటే హెలికాప్టర్లు పైన తిరుగుతున్నాయని చెప్పారు.
2016లో కూడా ఇదే వీధిలో ఆత్మాహుతి దాడి జరిగింది.

ఫొటో సోర్స్, Reuters

తుర్కియే రాజధాని ఇస్తాంబుల్ నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో జరిగిన పేలుడులో పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పేలుడులో 11 మంది గాయాలపాలయ్యారు.
నగరంలోని టస్కిమ్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గాయపడిన వారికి చికిత్స చేసేందుకు, సహాయం చేసేందుకు వైద్య, ప్రభుత్వ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.20 గంటలకు ఇస్తికలాల్ వీధిలో పేలుడు జరిగిందని ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లికయా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.
పాక్ బ్యాటర్లలో షాన్ మసూద్ 38, బాబర్ ఆజమ్ 32, షదాబ్ ఖాన్ 20, మొహమ్మద్ రిజ్వాన్ 15 పరుగులు చేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కర్రన్ 3, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డన్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.

ఫొటో సోర్స్, ANI
పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్ ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఐదు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది.
మొహమ్మద్ రిజ్వాన్ 14 బంతుల్లో 15 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు.
బాబర్ వజీమ్ (11), మొహమ్మద్ హారిస్ (0) క్రీజులో ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇంగ్లండ్ జట్టు సెమీ ఫైనల్‌లో భారత జట్టును 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
దానికిముందు మరో సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
రెండు జట్లూ సెమీ ఫైనల్స్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లతోనే ఫైనల్‌లో తలపడుతున్నాయి.
పాకిస్తాన్ జట్టు: మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మొహమ్మద్ హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హఆరిస్ రవూఫ్
ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా పార్లమెంటు అయిన కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎగువ సభ సెనేట్ మీద అధికార డెమొక్రటిక్ పార్టీ పట్టు నిలుపుకుంది. దిగువసభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తుది ఫలితం ఇంకా తేలలేదు.
డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు చివరివరకూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.
సెనేట్‌లోని మొత్తం 100 సీట్లకు గాను 35 సీట్లకు మంగళవారం నాడు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ఫలితాల ప్రకారం నిన్నటివరకూ రెండు పార్టీలూ చెరో 49 సీట్లతో నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. తాజాగా నెవాడా రాష్ట్ర ఓట్ల లెక్కింపు పూర్తికావచ్చింది. ఆ రాష్ట్రంలో సెనెటర్ కాథరీన్ కార్టెజ్ మాస్టో తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆడమ్ లాక్సాల్ట్‌ను ఓడించనున్నట్లు ఫలితాల సరళి చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విజయంతో 100 సీట్లలో 50 సీట్లు డెమొక్రటిక్ పార్టీకి లభిస్తాయి. రిపబ్లికన్ పార్టీ 49 సీట్లతో నిలుస్తుంది. మరొక రాష్ట్రం జార్జియాకు వచ్చే నెలలో, అంటే డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి.
ఒకవేళ ఆ రాష్ట్రం రిపబ్లికన్ పార్టీ వశమైతే.. సెనేట్‌లో ఇరు పార్టీల బలం 50-50 గా సమమవుతుంది. ఆ పరిస్థితుల్లో ఉపాధ్యక్షురాలైన కమలా హ్యారిస్ ఓటు నిర్ణయాత్మకమవుతుంది. ఆమె డెమొక్రటిక్ పార్టీ నేత కావటంతో సెనేట్ మీద ఆ పార్టీ పట్టు నిలుస్తుంది.
ఇక ప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లకూ మంగళవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల్లో రెండు పార్టీలూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. మెజారిటీ మార్కు 218 సీట్లు కాగా.. ఇప్పటివరకూ డెమొక్రటిక్ పార్టీ 204 సీట్లు, రిపబ్లికన్ పార్టీ 211 సీట్లు గెలుచుకున్నాయి. అయితే.. రిపబ్లికన్ పార్టీ అవసరమైన మెజారిటీ సాధిస్తుందని మిగిలిన సీట్ల తుది ఫలితాల సరళి సూచిస్తోంది.
ఈ సభను రిపబ్లికన్లు గెలుచుకున్నట్లయితే.. అధ్యక్షుడు జోబైడెన్ కార్యక్రమాలను వారు కొంత వరకూ అడ్డుకోగలరు.

ఫొటో సోర్స్, ANI
అమెరికాకు చెందిన ఒక మానవరహిత అంతరిక్ష నౌక అత్యంత సుదీర్ఘ కాలం అంతరిక్షంలో తిరిగిన రికార్డును నెలకొల్పి శనివారం నాడు భూమికి తిరిగి వచ్చిందని ఆ విమానాన్ని తయారు చేసిన బోయింగ్ సంస్థ తెలిపింది.
‘‘ఎక్స్-37బి ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ (ఓటీవీ) 908 రోజుల పాటు అంతరిక్షంలో భూ కక్ష్యలో సంచరించి శనివారం నాడు ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్‌లో దిగింది. ఇదే నౌక గతంలో 780 రోజుల పాటు అంతరిక్షంలో ఉండి నెలకొల్పిన రికార్డును ఇప్పుడు అధిగమించింది’’ అని బోయింగ్ ఒక ప్రకటనలో వివరించింది.
సౌరశక్తితో నడిచే ఈ అంతరిక్ష నౌక.. 9 మీటర్ల పొడవు ఉంటుంది. తాజా ప్రయాణానికి ముందు ఐదుసార్లు సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో విహరించింది.
ఆరోసారి 2020 మే నెలలో ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కానవరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు.
తాజా ప్రయాణంతో కలిపి ఈ విమానం ఇప్పటివరకూ మొత్తం 3,774 రోజుల పాటు అంతరిక్షంలో విహరించి, 130 కోట్ల మైళ్లు ప్రయాణించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కోసం ఈ అంతరిక్ష నౌకలో ప్రయోగాలు నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Giancarlo/@giankaizen
రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన రెండు పాతకాలపు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలిన ఘోర ప్రమాదం అమెరికాలోని టెక్సస్‌లో జరిగింది.
డాలస్ దగ్గర జరుగుతున్న ఎయిర్ షోలో శనివారం నాడు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో.. ఆ రెండు విమానాలు తక్కువ ఎత్తులోనే ఢీకొనటం, ఒక విమానం సగానికి విరిగిపోవటం కనిపిస్తోంది. అవి కూలిపోయిన తర్వాత భారీ మంట చెలరేగింది.
ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారు, ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ విమానాల్లో ఒకటి బోయింగ్ బి-17 ఫ్లయింగ్ ఫోర్ట్రెస్. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద యుద్ధంలో అమెరికా గెలవటానికి బీ-17 బాంబర్ ప్రధాన పాత్ర పోషించింది.
రెండో విమానం ‘పి-63 కింగ్‌కోబ్రా’ యుద్ధ విమానాన్ని కూడా అదే యుద్ధంలో ఉపయోగించారు. అయితే కేవలం సోవియట్ వాయుసేన మాత్రమే వీటిని యుద్ధంలో ఉపయోగించింది.
అమెరికాలో శుక్రవారం నాడు ‘వెటరన్స్ డే (మాజీ సైనికుల దినోత్సవం) గౌరవార్థం ‘వింగ్స్ ఓవర్ డాలస్ ఎయిర్‌షో’ పేరుతో రెండో ప్రపంచ యుద్ధం సంస్మరణ వైమానిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మూడు రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోను 4,000 మంది నుంచి 6,000 మంది వరకూ వీక్షిస్తున్నారు.
విమానాలు ఢీకొని కుప్పకూలటం ‘ఘోర విషాద’మని డాలస్ మేయర్ ఎరిక్ జాన్సన్ అభివర్ణించారు.
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యా ఇంకా నిర్ధారణ కాలేదని, అయితే నేల మీద ఎవరూ గాయపడలేదని ఆయన ఒక ట్వీట్‌లో చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.