సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేవు - నరేంద్ర మోదీ
తెలంగాణలోని సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో రాజకీయ స్వార్థం కోసం కొందరు ప్రజలను భయపెట్టేందుకు రూమర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
లైవ్ కవరేజీ
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ : 30 ఏళ్ల పాత రికార్డును పాకిస్తాన్ రిపీట్ చేస్తుందా? ప్రపంచకప్ గెలిచి బాబర్ పాక్ ప్రధాని అవుతాడా?
బ్రేకింగ్ న్యూస్, దిల్లీలో భూ ప్రకంపనలు, బీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, riseq.seismo.gov.in
దేశ రాజధాని దిల్లీలో శనివారం భూమి పలు సెకండ్లపాటు కంపించింది.
రాత్రి 8 గంటల సమయంలో మొదలైన ఈ ప్రకంపనలు రెండు, మూడు సార్లు.. మొత్తంగా సుమారు 50 సెకండ్లపాటు కొనసాగాయి.
వారం రోజుల వ్యవధిలో దిల్లీలో భూ ప్రకంపనలు రావడం ఇది రెండోసారి.
రాత్రి 7.57 గంటలకు రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైన ఈ భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం నేపాల్‌లో ఉందని భారత జాతీయ భూకంప కేంద్రం పేర్కొంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
650 రూపాయల ట్విటర్ బ్లూ టిక్.. ఒక కంపెనీకి ఒక్క రోజులో రూ.1.22 లక్షల కోట్లు నష్టం తెచ్చింది.. ఎలాగంటే..
అమెజాన్: రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’
రామగుండం పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారంటే.., ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, NarendraModi
తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీశనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువులు కర్మాగారం, భద్రాచలం-సత్తుపల్లి నూతన రైల్వే లైన్ లను జాతికి అంకితం చేశారు. 2268 కోట్ల వ్యయంతో చేపట్టిన మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి, బోధన్-బాసర- భైంసా, సిరోంచా-మహదేవ్ పూర్ జాతీయ రహదారుల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కొత్త రైల్వే, రోడ్డు లైన్ లతో బొగ్గు గనులు, విద్యుత్ పరిశ్రమలు, చెరుకు రైతులకు లాభం చేకూరుతుందని మోదీ తెలిపారు.
ఢిల్లీ లో రైతు క్షేమం కోరే ప్రభుత్వం ఉందని అన్న మోదీ యూరియా కొరత ను తీర్చేందుకు మూతపడ్డ 5 ఎరువుల కర్మాగారాలను కొత్త టెక్నాలజీలతో ప్రారంభిస్తున్నామని మోదీ తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా తెలంగాణ, ఏపి, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర,కర్నాటక రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ ఫ్యాక్టరీలు అన్నీ ప్రారంభమైతే ఏటా 60 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుందని, దీంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం విదేశాలకు ఎరువుల కొనుగోళ్ల రూపంలో వెచ్చించడం ఆగిపోతుందన్నారు. ఇకపై దేశంలో భారత్ యూరియా ఉత్పత్తి ఉంటుందని, కొత్త టెక్నాలజీతో నానో యూరియా ఉత్పత్తి చేయబోతున్నామని తెలిపారు. దీంతో తక్కువ మొత్తం యూరియా తోనే రైతులు ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కొత్త ఫ్యాక్టరీలు, రోడ్ల విస్తరణల వల్ల పరోక్షంగా ఉపాధి మార్గాలు, ఉధ్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. సబ్సిడీ ధరకు ఎరువులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో 10 లక్షల కోట్లు వెచ్చించిందని, ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ పై రెండున్నర లక్షల కోట్లను ఖర్చు చేస్తున్నామని, పీఎం కిసాన్ సమ్మన్ నిధి 2.25 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసామని మోదీ తెలిపారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని, గత 30 ఏళ్లలో జరిగిన అభివృద్ది ఇప్పుడు కొన్నేళ్లలోనే జరగబోతోందని దీనికి గత8 ఏళ్లలో జరిగిన మార్పులే కారణం అన్నారు.
ఆత్మవిశ్వాసంతో కూడిన భారత్ ప్రపంచం ముందు నిలబడిందని, అది పెద్ద లక్ష్యాలు నిర్ధేశించుకుని వాటిని చేరేందుకు కొత్త పద్దతులు, వ్యవస్థలను ఏర్పాటుచేసుకుని ముందుకు పోతోందన్నారు.
గతంలో బొగ్గు గనుల్ల్లో వేల కోట్ల కుంభకోణాలు జరిగేవని. ఇప్పుడు పారదర్శకంగాగనులను వేలం వేస్తున్నామని, DMF(డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధి ఏర్పాటుచేసి రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నామని మోదీ చెప్పారు.
నరేంద్ర మోదీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు

తెలంగాణలోని సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
రామగుండం ప్రాంతీయ ఎరువుల కర్మాగారాన్ని శనివారం కరీంనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో రాజకీయ స్వార్థం కోసం కొందరు ప్రజలను భయపెట్టేందుకు రూమర్లు సృష్టిస్తున్నారు.
సింగరేణి సంస్థగురించి కూడా ఇలాంటి పుకార్లే పుట్టిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఈ పుకార్లను ప్రోత్సహిస్తున్నారు.
ఇలాంటి పుకార్లు పుట్టించేవారికి తెలియదు.. వాళ్ల అబద్ధాలన్నీ దొరికిపోతాయి. గొప్ప అబద్ధం ఏటంటే.. సింగరేణిలో 51 శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా, భారత ప్రభుత్వానిది 49 శాతం మాత్రమే.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద మెజార్టీ వాటా ఉన్నప్పుడు దానిని ప్రైవేటీకరించే అధికారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలా ఉంటుంది? సింగరేణి ప్రైవేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. మా వద్ద అలాంటి ప్రస్తావనే లేదు. సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశ్యం కూడా మాకు లేదు.
ఈ అబద్ధాల వ్యాపారులను హైదరాబాద్‌కే పరిమితం చేయండి. వాళ్ల రూమర్లను నమ్మొద్దు.
గతంలో బొగ్గుకు సంబంధించి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. మేం అధికారంలోకి వచ్చాక ప్రజలకు, కార్మికులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాం
ఈరోజు హైదరాబాద్‌లో కొందరికి నిద్ర పట్టదు’’ అని నరేంద్ర మోదీ అన్నారు.
ఐటీ రంగం సంక్షోభంలో ఉందా, ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు?
పవన్ కల్యాణ్ మీద ఏపీ పోలీసుల కేసు: కారు టాప్ మీద ప్రయాణించడంపై ఫిర్యాదు
చిలకలూరిపేట భర్తపై దాడి చేసిన భార్య, అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన భర్త, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో భర్తపై భార్య దాడి చేసిన ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోయారు.
షేక్ సత్తార్ అనే 43 ఏళ్ల వెల్డర్ ఇంటి నిర్వహణ విషయంలో నిత్యం భార్యతో తగాదా పడేవారు.
అయితే శనివారం ఉదయం తీవ్రంగా ఆగ్రహించిన భార్య మంచం కోడుతో దాడి చేయడంతో సత్తార్ అక్కడిక్కడే చనిపోయారని చిలకలూరిపేట సీఐ జి రాజేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం చిలకలూరిపేటలోని పురుషోత్తంపేట ప్రాంతంలోని షేక్ సత్తార్, షర్మిళ నివాసం ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు.
అయితే మద్యం మత్తులో కుటుంబ పోషణకు సహకరించడం లేదనే కారణంతో భార్య పలుమార్లు తగాదా పడేవారు.
చివరకు శనివారం ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమె నిలదీయడంతో సత్తార్ ఎదురుతిరిగారు.
ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి చివరకు సమీపంలోని దొరికిన చెక్కతో ఆమె దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన 13 ఏళ్ల కొడుకు మీద కూడా దాడి చేసింది.
దాంతో తీవ్రంగా గాయపడిన సత్తార్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అక్కడి నుంచి ఆమె పరారయ్యిందని, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళే సరికి ఆమె పారిపోయిందని సీఐ వివరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కడప: యోగి వేమన విశ్వవిద్యాలయంలో యోగి వేమన విగ్రహం స్థానంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎందుకు పెట్టారు?
ఆంధ్రప్రదేశ్: బాణాసంచా తయారీ కేంద్రాల్లో వరుస ప్రమాదాలు ఎందుకు నివారించలేకపోతున్నారు.. బాధ్యత ఎవరిది, ఏం చేయాల్సి ఉంది?
తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు వచ్చింది: హైదరాబాద్‌లో మోదీ ప్రసంగం

ఫొటో సోర్స్, ANI
తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు వచ్చిందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.
ఆయన శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా బేగంపేటలో జరిగిన సభలో ప్రసంగించారు. తాజాగా ముగిసిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికలో బీజేపీ శ్రేణులు వీరోచితంగా పోరాడాయని అభినందించారు.
తెలంగాణలో బీజేపీని నిరంతరం బలోపేతం చేయాలని, రాష్ట్రానికి అవినీతి నుంచి ముక్తి కల్పించటం తమ కర్తవ్యమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లి కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వం బీజేపీని, నరేంద్రమోదీని తిట్టడానికే ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘నేను రోజుకు రెండు, మూడు కిలోలు తిట్లు తింటూనే ఉన్నాను. ఆ తిట్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు అలసట లేదు. ఆ తిట్లే నాకు బలంగా మారుతున్నాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
‘‘మోదీని, బీజేపీని తిట్టటం వల్ల తెలంగాణకు మేలు జరుగుతుందనుకుంటే అలాగే కానివ్వండి’’ అని పేర్కొన్నారు.
‘‘అవినీతి, కుటుంబ పాలన అనేవి అభివృద్ధికి అతిపెద్ద శత్రువులు. అందుకే అవినీతి, కుటుంబ పాలన మీద బీజేపీ నిరంతరం పోరాటం చేస్తోంది. పేదలను దోచుకునే వారిని వదిలిపెట్టేది లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఆడుకుంటే ప్రతిఘటన తప్పదు’’ అని మోదీ చెప్పారు.
ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టో కరెన్సీ కంపెనీ నుంచి వెనుదిరుగుతున్న పెట్టుబడులు-పతనం అంచున అమెరికన్ సంస్థ
ఏపీకి మీ సహాయ సహకారాలు కావాలి-విశాఖ సభలో ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి

ఫొటో సోర్స్, ANI
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు విశాఖపట్నంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పనులకు.. ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ సభా వేదిక నుంచి ప్రధాని మోదీ వర్చువల్ మోడల్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.వీటిలో రెండు రైల్వే ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజ వాయువు, మూడు రోడ్డు రవాణా, హైవేలు, ఫిషింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
ప్రధాని సభ కోసం బస్సులు, ఆటోల్లో జనాన్ని భారీగా తరలించారు.
‘‘కొన్ని నెలలక్రితం నేను విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలకోసం వచ్చాను. ఇపుడు ఇలా మరోసారి రాగలిగాను. విశాఖ దేశంలోనే ఒక ప్రత్యేక నగరం. వాణిజ్య నగరంగా దీనికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఒకపుడు విశాఖరేవునుంచి పశ్చిమాసియా, తూర్పు ఆసియాలకు ఓడల ద్వారా వ్యాపారం జరిగింది’’ అని ప్రధాని అన్నారు.
‘‘ఇక్కడి వారు అనేక రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభ చూపుతున్నారు. విద్య, వ్యాపారం, టెక్నాలజీ, వైద్య రంగాల్లో ఏపీ యువతది ప్రత్యేకత. ఇది కేవలం విద్యార్జన ద్వారా రాలేదు. స్నేహ, సేవా స్వభావాలు అందుకు కారణం. తెలుగు వారు నిత్య నూతన ఆవిష్కరణలకు, విధానాలకు చొరవ చూపుతారు. నేటి ప్రాజెక్టులు తెలుగువారికే కాక దేశ పురోభివృద్ధికి దోహదపడతాయి’’ అన్నారు ప్రధాని.
‘‘రైల్వేలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అత్యాధునిక వసతులతో కల్పిస్తున్నాము. వీటి వల్ల సప్లయి చైన్, మార్కెటింగు సదుపాయాలు మెరుగుపడతాయి. మల్టీ మోడల్ లాజిస్టిక్సు వల్ల వీటి అభివృద్ధి సాధ్యమవుతుంది.’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సాయం కావాలని విజ్జప్తి చేశారు.
‘‘కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్ర అభివృద్ధి తప్ప మాకు మరో అజెండా లేదు. దానికి కేంద్రం సహకారం కావాలి. విభజన నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. కేంద్రం మమ్మల్ని ఆశీర్వదించి తగిన సహకారం అందించాలి. మేము కేంద్రానికి చేసుకున్న విజ్ఞప్తులన్నీ పరిశీలించి, పరిష్కరించాలని కోరుతున్నాం’’ అని సీఎం జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ప్రధానమంత్రిని కోరారు.
అయితే, రాష్ట్రాభివృద్ధి పేరుతో ఇవాళ నిర్వహించిన సభలో రాజకీయ ప్రయోజనాల గురించి తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఆలోచించలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.
‘‘రాష్ట్రానికి సంబంధించిన డిమండ్లను జగన్ గట్టిగా ప్రస్తావించ లేదు. ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేయడమే తప్ప డిమాండ్ చేసే స్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు. ప్రధాని పర్యటన రాజకీయంగా పవన్ కల్యాణ్ కు బూస్ట్ ఇవ్వడానికే ఉపయోగపడింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. పవన్ కల్యాణ్ ను పిలిపించడం ద్వారా అందరితో సఖ్యంగా ఉన్నామని బీజేపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది’’ అని విశాఖపట్నానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుబ్బారావు విమర్శించారు.
‘‘పవన్ కల్యాణ్‌తో మాట్లాడాలనుకుంటే హైదరాబాద్‌లోనే మాట్లాడొచ్చు. ఇక్కడికి పిలిపించడం ద్వారా మోదీ అందరూ నావాళ్లే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు’’ అని ఆయన అన్నారు.
‘‘ప్రజలు కోరుతున్న డిమాండ్లను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కానీ, ఈ విషయంలో బీజేపీ శ్రేణులు ఫెయిలయ్యాయి. ప్రధానమంత్రి వస్తున్నప్పుడు, ఇక్కడి వాళ్లకు ఏదో హామీలాంటిది వచ్చేలా పార్టీ నాయకులు ప్రయత్నించి ఉంటే పార్టీకి, రాష్ట్రానికి బాగుండేది’’ అని ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామకృష్ణ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC
పటిష్ట భద్రత
ప్రధాని విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో డ్రోన్ల వినియోగంపై పోలీసులు నిషేధం విధించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు ఎగరవేయొద్దనే ఆంక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
విశాఖలో కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, నేతలతో సమావేశం తర్వాత రామగుండం వెళతారు.

ఫొటో సోర్స్, UGC
స్టీల్ ప్లాంటు ప్రైవేకీరణ పట్ల నిరసనలు.. అడ్డుకున్న పోలీసులు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కార్మికులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా ఆందోళనకు దిగారు. వారంతా సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్తలుగా చెప్తున్నారు.
మోదీ సభా ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలోనే ఆందోళన చేస్తుంటే పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తెలంగాణలో నేడు మోదీ పర్యటన.. పలు సంఘాల నేతల ముందస్తు అరెస్టులు

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో అరెస్టయిన సీపీఐ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణలో పర్యటిస్తారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్‌సీఎల్ (రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) ఎరువుల కర్మాగారాన్ని మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు.
విశాఖ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకునే ఆయన బేగంపేటలో పార్టీ కార్యకర్తల సభలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ లో రామగుండం చేరుకుంటారు.
ఎన్టీపీసీ టౌన్‌షిప్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక మార్గం ద్వారా RFCL చేరుకోనున్న మోదీ కర్మాగారాన్ని ప్రారంభించి అక్కడి యూరియా ఉత్పత్తిని పరిశీలిస్తారు.
అనంతరం ఎన్టీపీసీ టౌన్ షిప్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
అదే వేదికపై నుండి 460 కోట్లతో చేపట్టిన కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్ పనులను ప్రారంభిస్తారు.
ప్రధాని సభకు లక్ష మంది జనసమీకరణ చేస్తున్నట్టు స్థానిక బీజేపి పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు.
పటిష్ట భద్రత
మోదీ పర్యటను అడ్డుకుంటామని వామపక్షాలు, ప్రజా సంఘాల హెచ్చరించిన నేపథ్యంలో 2600 మంది పోలీసులతో రామగుండం, గోదావరిఖనిలో భద్రత ఏర్పాటు చేశారు. వీరికి అదనంగా 300 మంది ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రధాని భద్రతలో ఉంటారు.
ఇప్పటికే సింగరేణి ప్రాంతానికి చెందిన పలువురు ప్రజా, కార్మిక, పౌర సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి గోదావరిఖని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉన్నారు.
అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్‌లో కూనంనేని దీక్షకు దిగారు.
మరోవైపు ప్రధాని పర్యటనను నిరసిస్తూ కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో నల్ల బెలూన్‌లు ఎగురవేసి నిరసన చేపట్టాలని టీఆర్ఎస్‌వీ పిలుపు ఇచ్చింది.
ఎన్టీపీసీ టౌన్షిప్, రామగుండం ఎరువుల కర్మాగారం ఎస్పీజీ ఆధీనంలో ఉంది.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
