తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

అక్టోబర్ 23వ తేదీన తెలంగాణ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. సోమవారం రాత్రి మద్నూర్ మండలం మెనూరు వద్ద భారీ బహిరంగ సభతో ముగిసింది.

లైవ్ కవరేజీ

  1. ‘మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది’: ధర్మాన ప్రసాద రావు

    ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు

    ఫొటో సోర్స్, Facebook/Dharmana Prasada Rao

    ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉందని రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు.

    ప్రజలు సంస్కరణలను అర్థం చేసుకోలేక పోవడమే ఇందుకు కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

    ‘సంస్కరణలు అమలై ఫలితాలు వచ్చిన తరువాత ప్రజలు వాటిని అర్థం చేసుకుంటారు. కానీ ముందే వాటికి ఆమోదం రాదు. ఆ రకంగా చూస్తే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వారు సంస్కరణలు అర్థం చేసుకోలేక పోవడమే’ అని ఆయన అన్నారు.

    శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ధర్మాన ప్రసాద రావు మాట్లాడారు.

  2. సుప్రీం కోర్టు: ‘విద్య అనేది వ్యాపారం కాదు’

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీబీఎస్ కోర్సు ఫీజులను ఏడు రెట్లు పెంచడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.

    ‘విద్య అనేది వ్యాపారం కాదు. ట్యూషన్ ఫీజులు అందరికీ అందుబాటులో ఉండాలి’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

    ఎంబీబీసీ కోర్సు ఫీజులను ఏడాదికి రూ.24 లక్షలకు పెంచుతూ 2017 సెప్టెంబరులో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు అంతకు ముందు కంటే 7 రెట్లు ఎక్కువ.

    అయితే ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హై కోర్టు పక్కన పెట్టింది. దీని మీద ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు వెళ్లగా హై కోర్టు తీర్పునే అది సమర్థించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఆంధ్రప్రదేశ్: రెడ్లు, కాపుల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటం నలిగి పోతోందా?

  4. హిందూ అనేది పర్షియా పదం అన్న కర్నాటక కాంగ్రెస్ నేత... ఖండించిన బీజేపీ

    ‘హిందూ’ అనేది పర్షియా పదం అంటూ కర్నాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జర్కిహోళి చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఖండించారు.

    ‘సతీశ్ జర్కిహోళి అన్న మాటలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు అరకొర జ్ఞానంతో ఆ మాటలు అన్నారు. వాటిని అందరూ ఖండించాలి. రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య మౌనంగా ఉన్నారంటే దాని అర్థం ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా?’ అంటూ బసవరాజు బొమ్మై ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఒక కార్యక్రమంలో మాట్లాడిన సతీశ్ జర్కిహోళి, ‘హిందూ పదం ఎక్కడి నుంచి వచ్చింది? అది పర్షియా నుంచి వచ్చింది. దానికి భారత్‌తో సంబంధం ఏముంది? హిందూ మీది ఎలా అవుతుంది? వాట్సాప్, వీకీపీడియాలను చూడండి. ఆ పదానికి అర్థం చాలా అసహ్యంగా ఉంటుంది’ అని ఆయన అన్నారు.

    జర్కిహోళీ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయనను కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.

    ‘హిందూ పదం పర్షియా నుంచి వచ్చింది’ అనే విషయాన్ని అనేక పుస్తకాలు చెబుతున్నాయని, తాను చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపిస్తూ రాజీనామా చేస్తానని సతీశ్ జర్కిహోళీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. ‘తుపాకీ మిస్ ఫైర్’ జరిగి కానిస్టేబుల్ మృతి, ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం

    కానిస్టేబుల్ రజనీ కుమార్

    ఫొటో సోర్స్, UGC

    కుమ్రం భీము ఆసిఫాబాద్ జిల్లా కౌఠాల పోలీస్ స్టేషన్లో సెంట్రీ డ్యూటీ కానిస్టేబుల్ సూర రజనీ కుమార్(23) బుల్లెట్ గాయంతో చనిపోయారు.

    తీవ్రంగా గాయపడ్డ రజనీకుమార్‌ను అత్యవసర చికిత్స కోసం మొదట కాగజ్ నగర్ ఆ తర్వాత కరీంనగర్ ఆసుపత్రులకు తరలించారు.

    ‘ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగిపోయే సమయంలో గన్ అన్ లోడ్ చేస్తుండగా బుల్లెట్ మిస్ ఫైర్ అవడంతో రజనీ కుమార్ తలకు తీవ్ర గాయమైంది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు’ అని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ బీబీసీకి తెలిపారు.

    మంచిర్యాల జిల్లా బట్వాన్పల్లికి చెందిన రజనీ కుమార్ 2020లో తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్ఎస్పీ) గుడిపేట బెటాలియన్‌‌లో కానిస్టేబుల్‌గా చేరారు.

    మే నెల నుంచి కౌఠాల పోలీస్ స్టేషన్‌లో సెంట్రీ డ్యూటీలో ఉంటున్నాడు.

  6. టీ20 వరల్డ్‌కప్ 2022: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఫైనల్స్ రావాలని మాజీ క్రికెటర్లు ఎందుకు కోరుకుంటున్నారు?

  7. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్... సీఎస్ రేసులో ఉండే అవకాశం, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వై.శ్రీలక్ష్మికి ఊరట లభించింది.

    ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చింది.

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల సెక్రటరీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఆమెతో పాటుగా నాటి గనుల శాఖ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్ మీద కూడా కేసు పెట్టారు.

    గనుల లీజు కోసం రూ. 80 లక్షలు లంచం కోరారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. కొద్దికాలం పాటు ఆమె జైలులో ఉన్నారు. ఆ సమయంలో తీవ్ర అనారోగ్యానికి కూడా గురయ్యారు. ఆ తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు.

    గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కట్టబెట్టడంలో భారీగా ముడుపులు స్వీకరించినట్టు ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ.

    అయితే శ్రీలక్ష్మి తప్పు చేసినట్లుగా తగిన ఆధారాలతో నిరూపించ లేకపోయినందున ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అక్రమాలకు శ్రీలక్ష్మి అండగా నిలిచినట్లు సీబీఐ ఆరోపించింది.

    1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన యర్రా శ్రీలక్ష్మి ప్రస్తుతం ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్‌లలో ఒకరు.

    ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమీర్ శర్మ పదవీ కాలం గతంలో పొడిగించారు. ఇది త్వరలోనే ముగియనుంది. దాంతో సీనియర్ అయిన శ్రీలక్ష్మి, చీఫ్ సెక్రటరీ రేసులో ఉండే అవకాశం ఉంది.

    సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి

    ఫొటో సోర్స్, UGC

  8. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఎందుకు వస్తాయి? 5 పాయింట్లలో తెలుసుకోండి

  9. బ్రేకింగ్ న్యూస్, ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి క్లీన్ చిట్

    ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జనగ్‌కు ఈ కేసుతో సంబంధం ఉంది.

  10. ఎల్‌కే అడ్వాణీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ

    ఎల్‌కే అడ్వాణీతో ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    నేడు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ 95వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

    ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

    ప్రధాని మోదీతో పాటు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు.

    1927ఆగస్టు 8న బ్రిటిష్ ఇండియాలోని కరాచీలో ఎల్‌కే అడ్వాణీ జన్మించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. టీ20 వరల్డ్ కప్: నెట్స్‌లో గాయపడిన రోహిత్ శర్మ

    నెట్స్‌లో ప్రాక్టీస్ ఆపేసి కూర్చొని ఉన్న రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నెట్స్‌లో ప్రాక్టీస్ ఆపేసి కూర్చొని ఉన్న రోహిత్ శర్మ

    నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

    కుడి చేతికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.

    రోహిత్ శర్మ ప్రాక్టీస్ మధ్యలో ఆపేసి పక్కన కూర్చొని ఉన్న వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. వైద్య సిబ్బంది వచ్చి రోహిత్ శర్మ చేతిని పరిశీలిస్తూ కనిపించారు.

    గాయమైన తరువాత 50 నిమిషాలు బ్రేక్ తీసుకొని మళ్లీ 10 నిమిషాల పాటు రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేశాడు.

    రోహిత్ శర్మకు అయిన గాయం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    గురువారం ఇంగ్లండ్‌తో భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ధర్మాన: ‘మా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది... సంస్కరణలు అర్థం చేసుకోక పోవడమే కారణం’

  13. చంద్రగ్రహణం ఈరోజు భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?

  14. రాహుల్ గాంధీ: భారత్‌ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి నడుస్తున్న తెలుగు వారు ఏం చెబుతున్నారు?

  15. అబార్షన్ కోసం గర్భిణులను రాష్ట్రాలు దాటిస్తున్న పైలట్

  16. ఏటా లక్షలాది మంది సందర్శించే ఈ గ్రామం రోజు రోజూ భూమిలో కుంగిపోతోంది.. ఎందుకు?

  17. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  18. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న వారి వాదన ఏంటి?

  19. ప్రతి వరల్డ్ కప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును ఓడిస్తున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఏంటి