నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.
అంతవరకు సెలవు.
ఆదివారం మధ్యాహ్నం 12.07 గంటలకు ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రయాణం ప్రారంభిస్తాయి.
తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.
అంతవరకు సెలవు.

ఫొటో సోర్స్, ISRO/FB
అక్టోబర్ 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒకేసారి అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను పంపనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి భారీ రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతారు.
రాత్రి 12.07 నిమిషాలకు ఈ ప్రయోగం జరుగుతుందని ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ISRO/FB

ఫొటో సోర్స్, ANICopyright
కేంద్రప్రభుత్వ‘రోజ్‌గార్ మేళా’ను ‘జుమ్లాకింగ్’(మాటకారి) చేస్తున్న ఈవెంట్‌బాజీ(షో)గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది.
దేశంలోని యువతకు హామీ ఇచ్చిన 16 కోట్ల ఉద్యోగాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, గత ఎనిమిదేళ్లుగా అది నెరవేర్చలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు.
‘‘ఈ ప్రకటన రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రకు తొలి భారీ విజయం. 70వేల ఉద్యోగాలు ఒంటె నోట్లో జీలకర్రలాంటిది.కానీ, ఏమైతేనేం, దిల్లీ రాజు మొత్తానికి మేలుకొన్నారు. నిరుద్యోగ సమస్యను గుర్తించారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పుడు 70 వేల ఉద్యోగాలు ప్రకటించారు’’ అని ఆయన తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
‘‘మొత్తానికి రాహుల్ గాంధీ యాత్ర ఈ జుమ్లాకింగ్ మీద ఒత్తిడి పెంచింది. మరి ఇప్పుడు చెప్పండి, 8 సంవత్సరాలలో ఇవ్వాల్సిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు, ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి’’ అని రణదీప్ సూర్జేవాలా అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, bbc
అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రను తాత్కాలికంగా ఆపుతున్నట్లు అమరావతి రైతు జేఏసీ నేతలు ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం వరకూ ఈ యాత్ర చేరుకుంది.
శుక్రవారం ఆ పట్టణంలో ప్రవేశిస్తుండగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
కోర్టు తీర్పునకు అనుగుణంగా కేవలం 600 మందిని, నాలుగు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు పట్టుబట్టారు.
గుర్తింపు కార్డులు చూపించిన వారిని మాత్రమే యాత్రకు అంగీకరిస్తామని పోలీసులు అడ్డుచెప్పారు.
దాంతో పాదయాత్రలో ఉన్న వారు దానిని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, తోపులాటకు దారితీసింది.
ఆ క్రమంలో ఓ మహిళా రైతు కిందపడి గాయాలు పాలయ్యారు. శనివారం ఉదయం కూడా పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండగా పోలీసులు మరోసారి జోక్యం చేసుకున్నారు.
యాత్రను ముందుకు సాగించేందుకు అనుమతించాలంటే కోర్టు ఆదేశాలను పాటించాలంటూ ఆదేశించారు.
దాంతో పాదయాత్ర విషయంలో జేఏసీ నేతలు తాత్కాలిక విరమణ నిర్ణయం తీసుకున్నారు.
దీపావళి సెలవుల కారణంగా కోర్టు నాలుగు తర్వాత తీర్పు విషయంలో స్పష్టతనిస్తుందని ఆశిస్తున్నామంటూ జేఏసీ నేతలు తెలిపారు.
శుక్రవారం ఏపీ హైకోర్టు పాదయాత్రకు పోటీగా నిరసనలకు అనుమతివ్వకూడదని ఆదేశాలు ఇచ్చింది.
అదే సమయంలో పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటనలు చేసిన అధికార పార్టీకి చెందిన నర్సీపట్నం ఎమ్మెల్యే కి కూడా నోటీసులు జారీ చేసింది.
పాదయాత్రలో నిబంధనలు పాటిస్తూ 600 మంది వరకూ అడ్డంకులు లేకుండా పాల్గొనేందుకు పోలీసులు సహకరించాలని తెలిపింది.
గుర్తింపు కార్డులు ఉంటేనే పాదయాత్రకు అనుమతిస్తామని పోలీసులు చెప్పడంపై జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై కోర్టులోనే తేల్చుకొని పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది.
4 రోజుల తాత్కాలిక విరామం తీసుకున్నట్టు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచ కప్ సూపర్ -12 మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో శనివారం నుంచి ఆరంభమవుతున్నాయి.
ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది జట్లు సూపర్-12కి నేరుగా అర్హత సాధించగా మొదటి రౌండ్ మ్యాచ్‌లలో పాయింట్ల ఆధారంగా శ్రీలంక, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్ అర్హత సాధించాయి.
సూపర్ -12 మ్యాచ్‌లలో మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య జరగనుంది. శనివారమే మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ తలపడనున్నాయి.
టీమ్ ఇండియా ఆదివారం తన తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది.
గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ ఉండగా గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్ ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో నవంబర్ 13న నిర్వహిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ ఎలక్షన్ కమిషన్(ఈసీ) అనర్హత వేటు వేసింది.
ఎలక్షన్ కమిషన్ నిర్ణయ ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.
విదేశీ అతిథుల నుంచి అందుకున్న బహుమతుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు సరిగా సమర్పించకపోవడంతో పాటు ఇమ్రాన్ వాటిని అక్రమంగా విక్రయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు వెలువరించింది.
ఈ బహుమతుల జాబితాలో రోలెక్స్ వాచీలు, ఒక ఉంగరం, కఫ్ లింక్స్ జత ఒకటి ఉన్నాయి.
కాగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ తరఫు లాయర్ తెలిపారు.
తనపై విధించిన అనర్హతను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలపాలని ఇమ్రాన్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండడం.. పోలీసులువారిపై బాష్పవాయువు ప్రయోగించడం వంటివి సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలలో కనిపించాయి.
అయితే, అక్కడికి కొద్దిసేపటికే ఈ ఆందోళనలను ముగించాలంటూ ఇమ్రాన్ తన మద్దతుదారులను కోరారు.
కాగా ప్రస్తుత నేషనల్ అసెంబ్లీ ఎంతకాలం కొనసాగుతుందో అంతవరకు ఈ అనర్హత అమలులో ఉంటుంది. ప్రస్తుత నేషనల్ అసెంబ్లీ 2018లో ప్రారంభమైంది.. అక్కడి నుంచి అయిదేళ్ల కాలం ఇది అమలులో ఉంటుందని డాన్ పత్రిక పేర్కొంది.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అప్డేట్ల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.