స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్‌ టీఆర్ఎస్‌లో చేరిక

కేటీఆర్ సమక్షంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమ నాయకులు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. 50 ఏళ్లుగా స్నానం చేయని మనిషి.. స్నానం చేయించిన కొన్నాళ్లకే జబ్బు పడి మృతి

  2. భారతదేశంలో ఎలాంటి గుర్తింపులు, రుజువులు లేని ‘గూఢచారులు’ వీళ్లు

  3. రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?

  4. ఈ ఒక్క నగరంలో 60,000 మంది కోటీశ్వరులున్నారు

  5. గుజరాత్: 141 మంది మృతికి కారణమైన వంతెన కూలిపోతున్న క్షణాలు..

  6. తిరుప‌తి: రేపటి నుంచి మళ్లీ ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు

    హైదరాబాద్ టీటీడీ ఆలయంలో వేంకటేశ్వర స్వామికి పూజలు చేస్తున్న అర్చకులు (పాత ఫొటో)
    ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ టీటీడీ ఆలయంలో వేంకటేశ్వర స్వామికి పూజలు చేస్తున్న అర్చకులు (పాత ఫొటో)

    తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీ‌నివాసం కాంప్లెక్స్‌, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాల వ‌ద్ద నవంబర్ 1వ తేదీ మంగ‌ళ‌వారం నుంచి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియయ పునఃప్రారంభం కానుంది.

    ఈ నేప‌థ్యంలో టీటీడీ ఈవోధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సోమ‌వారం ఏర్పాట్లను ప‌రిశీలించారు. టోకెన్ల జారీ కౌంట‌ర్లు, క్యూలైన్లు, భ‌క్తుల‌కు క‌ల్పించాల్సిన స‌దుపాయాల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

    తిరుప‌తి: రేపటి నుంచి మళ్లీఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు

    ఈ సంద‌ర్భంగా భూదేవి కాంప్లెక్స్ వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు మంగ‌ళ‌వారం నుంచి ప్రయోగాత్మకంగాతిరుపతిలో ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగ‌తా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తామ‌న్నారు. టోకెన్ ల‌భించిన భ‌క్తుడు అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామ‌ని, నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశామ‌న్నారు. టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదుర‌య్యే లోటుపాట్లను స‌రిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతామ‌ని తెలిపారు. ఆధార్ నంబర్ ఆధారంగా టోకెన్లు జారీ చేయ‌డం వ‌ల్ల భ‌క్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోక‌పోయినా నెల‌కు ఒక‌సారి మాత్రమే టోకెన్ పొందే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

    తిరుమ‌ల‌లో వ‌స‌తికి సంబంధించి ఒత్తిడి త‌గ్గించ‌డం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తామ‌ని, అక్కడే గదులు కేటాయిస్తామ‌ని చెప్పారు.

  7. భారత్ ఓటమిపై పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు.. విరాట్ కోహ్లీకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్లు

  8. గుజరాత్‌లో కుప్పకూలిన 100 ఏళ్ల కిందటి కేబుల్ బ్రిడ్జ్...

  9. మోర్బీ బ్రిడ్జి: 'బ్రిడ్జి కూలినప్పుడు నేను, నా చెల్లి బ్రిడ్జి మీద ఉన్నాం. నేను బతికి బయటపడ్డాను. కానీ, నా చెల్లెలు ఇంకా కనిపించ లేదు. తనకు ఆరేళ్లు’

  10. వీర్యం ఈదుకుంటూ వచ్చి అండంతో కలుస్తుందా? ఇది నిజమా? అపోహా?

  11. లులా డ సిల్వా: కార్ల ఫ్యాక్టరీ కార్మికుడి నుంచి దేశాధ్యక్షుడిగా, ఆపై కరప్షన్ ఖైదీగా, మళ్లీ దేశాధినేతగా మారిన నాయకుడు

  12. కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే వింత సమస్య, కొందరు తాగకుండానే తూగుతారు..దీనికి కారణం ఏంటి?

  13. ‘‘నా దగ్గరున్న తాడుతో 15 మృతదేహాలను బయటకు తీశా’’: మోర్బీ బ్రిడ్జి ప్రమాద ఘటనను వివరించిన ప్రత్యక్షసాక్షి

  14. మోర్బి కేబుల్ బ్రిడ్జి: రిపేర్ చేశాక ఫిట్‌నెస్ తనిఖీ, సర్టిఫికెట్ లేకుండానే వంతెనను తెరిచారా?

  15. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లులా డి సిల్వా విజయం.. బొల్సొనారో ఓటమి

    లులా డిసిల్వా

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో గెలుపు అనంతరం తన భార్య రోసాంజెలాను హత్తకుంటున్న లులా డిసిల్వా

    బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా మళ్లీ అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారోను ఓడించి లులా డి సిల్వా అధ్యక్షుడయ్యారు.

    బ్రెజిల్ రాజకీయాల్లో వామపక్షానికి, మితవాదపక్షానికి మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో వామపక్ష నేత లులా డిసిల్వా 50.9 శాతం ఓట్లు గెలుచుకున్నారు.

    గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న మితవాద నేత బొల్సొనారోను ఓడించటానికి ఈ ఓట్లు సరిపోతాయి. ఆయనకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన ఇంకా తన ఓటమి గురించి మాట్లాడలేదు.

    ఇద్దరు అభ్యర్థుల మధ్య కేవలం 21 లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే తేడా ఉండటం గమనార్హం.

    అయితే.. ఈ ఎన్నికలతో బ్రెజిల్ సమాజంలో ఏర్పడిన చీలిక ఇప్పట్లో సమసిపోయేలా కనిపించటం లేదు.

    గత ఎన్నికల సమయంలో జైలులో ఉన్న లులా డిసిల్వా (ఎడమ) ఈ ఎన్నికల్లో బొల్సొనారో (కుడి)పై పోటీ చేసి గెలిచి ఖంగు తినిపించారు

    ఫొటో సోర్స్, Reuters

    మాజీ అధ్యక్షుడు డి సిల్వా జైలులో ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించటంతో 2018 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేకపోయారు.

    బ్రెజిల్‌కు చెందిన ఒక నిర్మాణ సంస్థకు.. బ్రెజిల్ ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్ కాంట్రాక్టులు ఇచ్చినందుకు గాను ముడుపులు తీసుకున్నారన్న కేసులో ఆయనను దోషిగా నిర్ధారించి జైలుకు పంపించారు. ఆ తీర్పును రద్దు చేసే వరకూ 580 రోజుల పాటు ఆయన జైలులో ఉన్నారు. ఆ తీర్పు రద్దయ్యాక తిరిగి రాజకీయాల్లోకి వచ్చిన లులా డి సిల్వా తాజా ఎన్నికల్లో గెలుపుతో ఖంగు తినిపంచారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘‘నన్ను సజీవంగా సమాధి చేయటానికి వాళ్లు ప్రయత్నించారు.. నేను ఇక్కడ నిలిచాను’’ అని ఆయన తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

    లులా డి సిల్వా 2023 జనవరి 1వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అమెజాన్ అడవి నరికివేతకు ముగింపు పలుకుతానని ఆయన చెప్పారు. దేశంలో ఆకలిని నిర్మూలించటం తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితర ప్రపంచ నేతలు లులా డి సిల్వాకు అభినందనలు తెలిపారు.

  16. తిరుప‌తి: మళ్లీ ఉచిత సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు.. దర్శనం చేసుకున్నా, చేసుకోక‌పోయినా నెల‌కు ఒక‌సారి మాత్రమే

  17. రిషి సునక్ ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఫైనల్ చేస్తారా, స్కాచ్‌ విస్కీ ధరలకు దీనికి లింకేంటి

  18. గుజరాత్: బ్రిడ్జి నదిలో కూలిన ఘటనలో 141 మంది మృతి-ప్రకటించిన అధికారులు

  19. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

    కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి

    ఫొటో సోర్స్, Facebook/Komatireddy Raj Gopal Reddy

    మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి‌కి చెందిన కంపెనీ కొన్ని అకౌంట్లలో డబ్బులు వేసిందనే ఆరోపణల మీద కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.

    అక్టోబరు 31 అంటే రేపటి లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

    ఓటర్లను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.5.22 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు రాజ్‌గోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా బదిలీ చేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించింది.

    ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసింది. దీని మీద కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. 600 ఇళ్లు ఉన్న ఆ పల్లెటూరిలో ఆ ఒక్క కారణం కోసమే CC కెమెరాలు ఏర్పాటు చేశారు