తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్..

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్ అయ్యింది. మధ్యాహ్నం 12.46 గంటలకు పార్టీ తరపున చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

లైవ్ కవరేజీ

  1. అర్మేనియాకు భారత్ ఆయుధాలు ఎందుకు అమ్ముతోంది?

  2. రూ.3,000 తో కోళ్ల పెంపకం మొదలుపెట్టిన పేద రైతు, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు

  3. బకర్వాల్: సంప్రదాయ జీవనశైలిని కాపాడుకునేందుకు గిరిజన తెగ ప్రజల అవస్థలు..

  4. తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్.., బీఎస్ఎన్ మల్లేశ్వరరావు, బీబీసీ ప్రతినిధి

    తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్..

    తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ @JaiTDP హ్యాక్ అయ్యింది.

    అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 12.46 గంటలకు పార్టీ తరపున చివరి ట్వీట్ చేశారు.

    ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.

    అకౌంట్‌లో తెలుగుదేశం పార్టీ పేరును ‘టైలర్ హాబ్స్’గా మార్చారు.

    ప్రొఫైల్ ఫొటోను, ప్రొఫైల్ బ్యానర్‌ను కూడా మార్చేశారు. ఆ తర్వాత వరుసగా 24 రీట్వీట్లు చేశారు.

    అవన్నీ క్వింట్లీ క్వెరీ లాంగ్వేజ్ (క్యూక్యూఎల్) నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్‌టీ)కి సంబంధించిన ఆర్ట్ వర్క్ ఫొటోలు, సమాచారానికి సంబంధించినవే.

    దీనిపై తెలుగుదేశం పార్టీ డిజిటల్ విభాగం స్పందించింది.

    తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్‌ను నిర్ధరించింది.

    ఈ హ్యాక్ చేసింది వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఉన్న వాళ్లేనని ఆరోపించింది.

    తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్..

    తమ ట్విటర్ అకౌంట్ హ్యాక్‌ అయినట్లు తెలుగుదేశం పార్టీ ఫేస్‌బుక్‌లో ప్రకటించింది.

    తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ కావడం ఈ ఏడాది రెండోసారి.

    మార్చి 19వ తేదీన కూడా @JaiTDP హ్యాక్ అయ్యింది. అప్పట్లో వందలాది స్పామ్ ట్వీట్లు వెలువడ్డాయి.

    తెలుగుదేశం పార్టీ ట్విటర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్..
  5. ట్విటర్ బాస్‌ పరాగ్ అగర్వాల్‌‌, ఈలాన్ మస్క్‌ మధ్య మెసేజ్‌ల యుద్ధానికి కారణం ఏంటి? జాక్ డోర్సీ ఏం చేశారు?

  6. గ్రహణం మొర్రి అంటే ఏంటి? గ్రహణాలకూ, చిన్నారుల పెదవి చీలిపోవడానికి సంబంధం ఉందా?

  7. ‘లోకల్ గ్యాంగ్... హైపర్ బాయ్స్’: విశాఖపట్నంలో క్రిమినల్ గ్యాంగ్‌లు, నేరాలు పెరుగుతున్నాయా?

  8. మల్లిఖార్జున ఖర్గే: రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి రాజీనామా

    కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే

    ఫొటో సోర్స్, Facebook/Mallikarjun Kharge

    రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆ పదవికి రాజీనామా చేశారు.

    ఈమేరకు ఆయన రాజీనామా లేఖను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ చేసింది.

    కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

    ‘ఒకరికి ఒకటే పదవి’ అనే కాంగ్రెస్ విధానంలో భాగంగా మల్లిఖార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి సీనియర్ నేతలు పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి వారి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  9. ఇయాన్.. ఫ్లోరిడా చరిత్రలోనే వినాశకర హరికేన్: బైడెన్

  10. అమెరికన్ బాండ్స్: కొంటే కోట్లేనా? ఇన్వెస్టర్లు ఎందుకు వీటి వెంట పడుతున్నారు, డాలర్ బలపడి రూపాయి పతనమవడానికి ఇవే కారణమా

  11. జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: ‘ఆ నలుగురు మైనర్లను మేజర్లుగానే పరిగణించాలి’

    హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అయిదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగానే పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు పేర్కొంది.

    ఒక్కరిని మాత్రం ఇంకా మైనర్‌గానే పరిగణించనున్నారు.

    ఈ ఏడాది మే నెలలో ఈ ఘటన జరిగింది. ఆ రోజు ఒక పబ్‌ నుంచి తిరిగివస్తూ బాధితురాలిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి తమతో కారులో తీసుకెళ్లారు కొందరు. దారిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నది వీరిపై ఉన్న ఆరోపణ.

    ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరు మేజర్. కాగా, మిగతా వారు మైనర్లు.

    దీనిపై పోలీసులు ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేయగా కేసు విచారణ కొనసాగుతోంది

  12. పాకిస్తాన్ ట్విటర్ ఖాతా భారత్‌లో నిలిపివేత

    పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను భారత్‌లో నిలిపివేశారు.

    జులైలో కూడా ఈ ఖాతాను భారత్‌లో నిలిపివేసినప్పటికీ ఆ తరువాత పునరుద్ధరించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కోర్టు ఆదేశాలు వంటి వాటి ఆధారంగా న్యాయబద్ధమైన డిమాండ్ ఉంటే ట్విటర్ ఇలా ఖాతాలను నిలిపివేస్తుంది.

    తాజా పరిణామం కారణంగా భారత్‌లో @GovtofPakistan ఖాతా కనిపించదు.

  13. 5జీ సేవల ప్రారంభం: ఇక 4జీ మనుగడ ఎలా ఉండనుంది

  14. దేశంలో 5జీ సేవలు ప్రారంభించిన మోదీ

    దేశంలో 5జీ సేవలు ప్రారంభించిన మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ఇండియాలో 5జీ సేవలను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహిస్తున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ అనంతరం 5జీ సేవలను ప్రారంభించారు.

    అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శను మోదీ వీక్షించారు.

    5జీ సామర్థ్యాన్ని డెమొ ప్రదర్శన ద్వారా మోదీకి జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ వివరించారు.

    ఈ 5జీ సేవలు తొలి విడతలో 13 నగరాలలో ప్రారంభమవుతున్నాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరిస్తారు.

    తొలి దశలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గుర్‌గావ్, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, జామ్‌నగర్, పుణె, ముంబయిలలో అందుబాటులోకి తెస్తారు.

    వీటిలో కొన్ని నగరాలలో శనివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

  15. బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా

    బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర కొరియా మరో సారి రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా అధికారులు ధృవీకరిస్తూ క్షిపణులు జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లినట్లు చెప్పారు.

    జపాన్ విదేశాంగ శాఖ కూడా క్షిపణులను పరీక్షించినట్లు ధృవీకరించింది.

    ఈ క్షిపణులు జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ కు అవతల కూలినట్లు జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అయితే, వీటి వల్ల వారి నౌకలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు.

    వీటిని శనివారం ఉదయం 6.45 , 7.03 నిమిషాలకి ప్యాంగ్ యాంగ్ లోని సునాన్ ప్రాంతం నుంచి పరీక్షించినట్లు సౌత్ కొరియా వార్తా సంస్థ యోన్ హాప్ తెలిపింది.

    గురువారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ దక్షిణ కొరియా పర్యటన ముగిసిన వెంటనే ఉత్తర కొరియా ఈ క్షిపణులను పరీక్షించింది.

    ఈ ఏడాది ఉత్తర కొరియా క్షిపణుల పరీక్షలను పెంచింది. ఉత్తర కొరియా 2017లో తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల పరీక్షను నిర్వహించింది.

    రానున్న వారాల్లో ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించే అవకాశమున్నట్లు నివేదికలొస్తున్నాయి.

    ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఉత్తర కొరియా 20 బాలిస్టిక్ క్షిపణులు , 2 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది.ఇది గత వారంలో నాలుగవ పరీక్ష కాగా అందులో ఆరు క్షిపణులు పేలాయి.

  16. మైక్‌లో ప్రసంగించలేకపోయినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, BJP/TWITTER

    నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ఈ వీడియో ఆయన రాజస్థాన్‌లోని సిరోహీ జిల్లాలో అబూ రోడ్‌లో నిర్వహించిన సమావేశానికి సంబంధించినది. ఈ సమావేశంలో మోదీ మైకు ఉపయోగించకుండా ప్రసంగించారు. ఇందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు.

    నిజానికి ఆయన అబూ రోడ్‌లో సమావేశానికి శుక్రవారం సాయంత్రమే వెళ్ళాలి. కానీ, కాస్త ఆలస్యమై, ఆయన అక్కడకు చేరుకునే సరికి రాత్రి 10 అయింది.

    ఈ వీడియోను రాజస్థాన్ బీజేపీ నాయకుడు ట్వీట్ చేశారు.

    నిబంధనలను అనుసరించి రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లను వాడకూడదు. దీంతో, మోదీ ప్రజల నుద్దేశించి మైకు లేకుండా ఒక నిమిషం సేపు మాత్రమే మాట్లాడారు.

    "నేను రావడం ఆలస్యమయింది. ఇప్పుడు రాత్రి 10 అయింది. నేను నిబంధనలను పాటించాలని నా ఆత్మ చెబుతోంది. నన్ను క్షమించండి. కానీ, నేను మరోసారి వచ్చి మీ ప్రేమాభిమానాలకు వడ్డీతో సహా రుణాన్ని తీర్చుకుంటాను" అని మోదీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మోదీ శుక్రవారం గుజరాత్, రాజస్థాన్‌లో పర్యటించారు.

    రాజస్థాన్‌లోకొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది.

  17. ఇరాన్ పెట్రో ఉత్పత్తుల పై ఆంక్షలు విధించిన అమెరికా

    ఆంటోనీ బ్లింకెన్

    ఫొటో సోర్స్, Getty Images

    యూఎస్ ట్రెజరీ విభాగానికి చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్ కంట్రోల్ (ఒఫాక్ ) ఇరాన్ పెట్రో, పెట్రో కెమికల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థల పై ఆంక్షలను విధించింది. ఇందులో కొన్ని భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి.

    ఈ సంస్థలు ఉత్పత్తులను దక్షిణ, తూర్పు ఆసియాలో విక్రయిస్తున్నాయి.

    ఇరాన్ పెట్రో ఉత్పత్తులకు రవాణా సౌకర్యాలు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్న యూఏఈ, హాంగ్ కాంగ్, ఇండియాలో ఉన్న ప్రధాన సంస్థలు, ఇరాన్ కు చెందిన మధ్యవర్తి సంస్థలుపై ఒఫాక్ ఆంక్షలను విధించింది.

    వీటితో పాటుఇరాన్ తో పెట్రో వాణిజ్యం చేస్తున్న మరో రెండు చైనా సంస్థల పై కూడా నిషేధం విధించింది.

    "ఇరాన్ ఉత్పత్తి చేసే అక్రమ ఇంధనం, పెట్రో కెమికల్ ఉత్పత్తుల విక్రయాన్ని నిరోధించేందుకు అమెరికా కట్టుబడి ఉంది" అని ఒఫాక్ అధికారి బ్రెయిన్ ఈ నెల్సన్ చెప్పారు.

    అణ్వస్త్ర నిరోధ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను పూర్తిగా అమలు చేసే ప్రయత్నాలకు ఇరాన్ తిరస్కరిస్తున్నంత వరకు ఇరాన్ పెట్రో ఉత్పత్తుల అమ్మకాల పై అమెరికా ఆంక్షల విధింపును కొనసాగిస్తుంది" అని చెప్పారు.

    ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్ కంట్రోల్ (ఒఫాక్ )

    ఫొటో సోర్స్, US TREASURY

    దిగుమతులను నిలిపేసిన భారత్

    ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను విక్రయానికి హాంగ్ కాంగ్ కు చెందిన ట్రిలియన్స్ పెట్రో కెమికల్ కంపెనీ లిమిటెడ్ నెట్ వర్క్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ ఇరాన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, మిడిల్ ఈస్ట్ ఆల్కెమీ పార్స్ సంస్థ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి భారత్ కు సరఫరా చేస్తుంది.

    కొన్ని లక్షల డాలర్లవిలువైన ఇరాన్ ఉత్పత్తులనుభారతీయ సంస్థ టీబాలాజీ పెట్రో కెమ్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసి చైనాకు పంపిస్తోంది. అమెరికా ఈ సంస్థ పై కూడా ఆంక్షలు విధించింది.

    మే 2019 నాటికి ఇరాన్ భారత్ కు అత్యధికంగా ఇంధన సరఫరా చేస్తోంది. అమెరికా ఆంక్షలకు భయపడి భారత్ ముడి చమురు, ఇతర ఉత్పత్తుల దిగుమతిని నిలుపు చేసింది.

    "ఇరాన్ ఉత్పత్తుల పై విధించిన నిషేధాన్ని తప్పించుకోవాలని చూసిన వారి పై అమెరికా చర్యలు తీసుకుంటుందని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అన్నారు.

  18. తెలంగాణా: ఎస్టీలకు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంపు

    కే చంద్రశేఖర రావు

    ఫొటో సోర్స్, TELANGANA CMO/FACEBOOK

    తెలంగాణా ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల వారికిరిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికిపెంచింది. ఈ రిజర్వేషన్లు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తాయి. ఈ ఆదేశాలు అక్టోబరు 01, శనివారం నుంచి అమలులోకి వస్తాయి.

    ఆరేళ్ళ క్రితం తెలంగాణ శాసన సభ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వేషన్లను పెంచాలనే నిర్ణయం తీసుకుని ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. అయితే, కేంద్రం నుంచి ఈ బిల్లుకు ఆమోదం రాలేదు.

    చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్ల కోటాను పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

    తెలంగాణ టుడేలో ప్రచురించిన ఈ వార్తను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.