ఇటలీ తొలి మహిళా ప్రధానిగా గెలిచిన రైట్ వింగ్ లీడర్ జార్జియా మెలోనీ

ఇటలీ ప్రధానిగా ఫార్ రైట్ వింగ్ లీడర్ జార్జియా మెలోనీ గెలిచారు. అలాగే ఆమె ఆ దేశానికి తొలి మహిళా ప్రధాని కూడా. రెండో ప్రపంచయుద్ధం తరువాత అత్యంత తీవ్రమైన రైట్ వింగ్ ప్రభుత్వం మెలోనీ ఆధ్వర్యంలో వస్తుందనే అంచనాలు ఎక్కువగా వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో కలుద్దాం.

    అంతవరకు సెలవు.

  2. ఇటలీ ప్రధానిగా జార్జియా మెలోనీ

    ఇటలీ ప్రధానిగా గెలిచిన రైట్ వింగ్ లీడర్ జార్జియా మెలోనీ

    ఫొటో సోర్స్, Facebook/Giorgia Meloni

    ఫొటో క్యాప్షన్, ఇటలీ ప్రధానిగా గెలిచిన రైట్ వింగ్ లీడర్ జార్జియా మెలోనీ

    ఇటలీ ప్రధానిగా ఫార్ రైట్ వింగ్ లీడర్ జార్జియా మెలోనీ గెలిచారు. అలాగే ఆమె ఆ దేశానికి తొలి మహిళా ప్రధాని కూడా.

    రెండో ప్రపంచయుద్ధం తరువాత అత్యంత తీవ్రమైన రైట్ వింగ్ ప్రభుత్వం మెలోనీ ఆధ్వర్యంలో వస్తుందనే అంచనాలు ఎక్కువగా వచ్చాయి.

    యూరప్‌లో మూడో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న ఇటలీకి రైట్ వింగ్ లీడర్ రావడం వల్ల కలిగే ప్రభావాన్ని చూడాల్సి ఉంది.

    తాము అన్ని వర్గాల ప్రజలకు సేవ చేస్తామని, ఎవరినీ మోసం చేయమని ప్రధానిగా గెలిచిన సందర్భంగా మెలోనీ అన్నారు.

    అయితే రైట్ వింగ్ గెలవడం ఇటలీకి, యూరప్‌కు దుర్దిదనమి మెలోనీ చేతిలో ఓడిపోయిన ఎన్రికో లెట్టా అన్నారు.

  3. ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ తమిళనాడు ఆర్డినెన్స్

    తమిళనాడులో ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

    ఈమేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదం పొందిన తరువాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది.

  4. పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

  5. లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్‌ కనెక్షన్’ ఏంటి?

  6. ఆంధ్రప్రదేశ్‌: పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు

  7. మ్యాక్స్‌వెల్ రన్ అవుట్: స్టంప్స్‌ మీద ఒక బెయిల్ ఉన్నా ఔటేనా? ఐసీసీ క్రికెట్ నిబంధన ఏంటి?

  8. కేసీఆర్ కోరుకుంటున్న ప్రతిపక్ష కూటమిని నితీశ్ కుమార్, లాలు ప్రసాద్ యాదవ్ కోరుకోవడం లేదా

  9. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరుపై స్పందించిన లక్ష్మీ పార్వతి, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    లక్ష్మీ పార్వతి

    ఫొటో సోర్స్, ysrcp

    డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు.

    ఎన్టీఆర్ మీద ఇప్పుడు కొందరు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన వైఎస్ఆర్ పేరు యూనివర్సిటీకి పెట్టడం సముచితమేనన్నారు.చంద్రబాబులా, పగతోనో, ద్వేషంతోనో పేరు మార్చడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పై గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే, ఎవరూ అడగకపోయినా, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన్ను గౌరవించిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ఆమె ప్రశంసించారు.

    ‘‘జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలా? యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టాలా? అని నన్ను ప్రశ్నిస్తే జిల్లాకే ఎన్టీఆర్‌ పేరు ఉండాలని నేను కోరుకుంటాను’’ అని ఆమె అన్నారు.

    ఎన్టీఆర్ కు ద్రోహం చేసిన వాళ్ళే.. నేడు ఆయన పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ గౌరవార్థం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. అధికార దాహంతో చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

    టీడీపీ, వారికి వత్తాసు పలికే మీడియాలో తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారున, ఎన్టీఆర్‌ తనను వివాహమే చేసుకోలేదని, నందమూరి ఇంటిపేరు వాడుకునే హక్కులేదంటూ అతి దారుణంగా మాట్లాడుతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. చరిత్ర ఎప్పుడూ చరిత్రే. దాన్ని ఎవరు చెరిపివేయాలనుకున్నా చెరపలేరని వ్యాఖ్యానించారు.

    ఎన్టీరామారావుపై నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, ఎన్టీరామారావుకు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే అధికార మార్పా? అని ఆమె ప్రశ్నించారు.

    లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలను టీడీపీ తప్పుబడుతోంది. ఆమె అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుని చెరిపేస్తుంటే దానిని కూడా సమర్థించడానికి సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు.

  10. రష్యా: స్కూలు మీద దాడి... 13 మంది మృతి

    రష్యాలోని ఇజేవస్క్ నగరం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, రష్యాలోని ఇజేవస్క్ నగరం

    రష్యాలోని ఇజేవస్క్ నగరంలో గల ఒక స్కూలు మీద జరిపిన కాల్పుల్లో సూమారు 13 మంది చనిపోయినట్లు రష్యా అధికారులు తెలిపారు. వీరిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు.

    దాడి జరిగిన స్కూల్లో సుమారు 1,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

    ఒక వ్యక్తి తుపాకీతో స్కూల్లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాడి సంబంధించిన కొన్ని వీడియాలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

    దాడి తరువాత ఆ సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. ఈ దాడికి కచ్చితమైన కారణం ఏంటో ఇంకా తెలియలేదని అధికారులు చెబుతున్నారు.

    ఆ సాయుధుడు ధరించిన టీ షర్ట్ మీద నాజీల గుర్తులు ఉన్నట్లుగా స్థానిక న్యూస్ ఏజెన్సీ టాస్ రిపోర్ట్ చేసింది.

  11. ‘డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన గులాంనబీ ఆజాద్

    ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపించారు.

    దాని పేరు డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ అని పెట్టారు.

    ఈ సందర్భంగా ఆయన తన పార్టీ జెండాను జమ్మూలో ఆవిష్కరించారు.

    మూడు రంగులున్న డెమొక్రాటిక్ ఆజాద్ పార్టీ జెండా ఆవపువ్వు రంగు, నీలం, తెలుపు రంగులలో ఉంది.

    ఆవపువ్వు రంగు సృజనాత్మకతకు, భిన్నత్వంలో ఏకత్వానికి సూచిక అని, నీలి రంగు స్వేచ్ఛకు, తెలుపు రంగు శాంతికి నిదర్శనమని పార్టీ ప్రకటన సందర్భంగా ఆజాద్ పేర్కొన్నారు.

    కొత్త పార్టీ పెట్టిన గులాం నబీ ఆజాద్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, కొత్త పార్టీ పెట్టిన గులాం నబీ ఆజాద్
    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. రాజస్థాన్ రాజకీయ సంక్షోభం పై పార్టీ హై కమాండ్ కు నివేదికను సమర్పించనున్న కాంగ్రెస్ పరిశీలకులు

    కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖార్గే, అజయ్ మకెన్ రాజకీయ పరిస్థితికి సంబంధించిన నివేదికను దిల్లీలో కాంగ్రెస్ నాయకత్వానికి సమర్పించనున్నారు.

    అయితే, గెహ్లోత్ తరుపున ఉన్న శాసనసభ్యులు పార్టీ పరిశీలకులను కలిసేందుకు సుముఖత చూపించలేదని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐ సీసీ) పార్టీ హై కమాండ్ తో చర్చించి తదుపరి చర్య గురించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపినట్లుఏఎన్ఐ పేర్కొంది.

    ఆదివారం సాయంత్రం రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసంలో అబ్జార్వర్ల సమక్షంలో శాసన సభ్యుల సమావేశం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి సచిన్ పైలట్ కూడా హాజరయ్యారు.

    కానీ, గెహ్లోత్ మద్దతుదారులు క్యాబినెట్ మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో మరో సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సమావేశం తర్వాత 90 మంది శాసన సభ్యులు స్పీకర్ కు తమ రాజీనామాను సమర్పించారు.

    శాసనసభ్యులు సోనియా గాంధీ పంపిన పరిశీలకుల సమక్షంలో జరిగిన సమావేశానికి హాజరై ఉండాల్సిందని కొంత మంది వ్యాఖ్యానించారు.

    శాసనసభ్యులను వ్యక్తిగతంగా వచ్చి కలవమని అభ్యర్ధించినట్లు అజయ్ మకెన్ చెప్పారు.

  13. ఫిలిప్పీన్స్‌లో తుపానుధాటికి ఐదుగురు సహాయక సిబ్బంది మృతి

    ఫిలిప్పీన్స్‌లో ఏర్పడిన తుపానుధాటికి ఐదుగురు సహాయక సిబ్బంది మరణించారు.

    ఫిలిప్పీన్స్‌లో ఏర్పడిన తుపానుధాటికి ఐదుగురు సహాయక సిబ్బంది మరణించారు. అనేక ఇళ్ళు వరదల్లో కొట్టుకుపోయాయి. లక్షలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

    మనీలాకు ఉత్తరంగా ఉన్న సాన్ మిగువెల్ జిల్లాలో తుపాను సహాయక చర్యలు కొనసాగిస్తుండగా సహాయక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

    నోరు తుపాను ధాటికి ఈ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.

    కొంత మంది ఇళ్ల పై కప్పుల పైకి ఎక్కి చిక్కుకుపోయారు. కొంత మంది ఛాతీ లోతు నీటిలో నడుస్తూ నిత్యావసరాలను సరఫరా చేస్తూ కనిపించారు.

    దేశ జనాభాలో సగం మంది నివసించే లూజోన్ లో ఈ తుపాను గాలులు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీచాయి.

    తుపాను సోమవారం సాయంత్రానికి ఫిలిప్పీన్స్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

  14. లండన్‌లో పాకిస్తాన్ సమాచార మంత్రిని చుట్టుముట్టి దూషించిన పాక్ ప్రజలు

    మరియం ఔరంగజేబ్

    ఫొటో సోర్స్, VIDEOGRAB

    పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ లండన్ లోని ఒక కాఫీ షాపులో ఉండగా కొంత మంది పాకిస్తానీయులు ఆమెను చుట్టుముట్టిదూషించడం మొదలుపెట్టారు.

    ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    లండన్ లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు వీడియోలో కనిపించింది.కొంత మందిఆమెను 'దొంగ' అని కూడా దూషించారు.

    ఒక వైపు పాకిస్తాన్ తీవ్రమైన వరదలతో సతమతమవుతుంటే, మరోవైపు నాయకులు మాత్రం ప్రజాధనంతో విదేశాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు.

    అయితే, ఆమె ఈ చర్యకు స్పందించకుండా మొబైల్ చూసుకుంటూ ఉండిపోవడం వీడియోలో కనిపించింది.

    "పాకిస్తాన్ టీవీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇక్కడ ఆమె తల పై స్కార్ఫ్ కూడా ధరించలేదు" అని ఒక మహిళ విమర్శించారు.

    దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ విలేఖరి సయ్యద్ తలత్ హుస్సేన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

    అయితే, మరియం ఈ సంఘటన పట్ల ట్వీట్ ద్వారా తన సమాధానాన్ని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "ఇమ్రాన్ ఖాన్ చేసిన విద్వేష రాజకీయాలు, విభజనలు పాకిస్తానీ సోదరీ సోదరుల పై పడటం విచారకరం. వాళ్ళ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పాను. కానీ, వారు ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రచారానికి బాధితులు. ఆయన చేసిన విషపూరిత రాజకీయాలను తిప్పి కొట్టి ప్రజలను ఏకం చేసే పనిని మేం కొనసాగిస్తాం" అని ట్వీట్ చేశారు.

  15. సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌

    ఫొటో సోర్స్, ANI

    సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో దిల్లీలోని కోర్టుకు హాజరయ్యారు.

    జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

    అదనపు సెషన్స్ జడ్జీ శైలేందర్ మలిక్ బెయిల్ పిటిషన్ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను సమాధానం చెప్పమని కోరింది.

    ఈడీ సమాధానం వచ్చేవరకు ఆమె బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ లో ఉంటుంది.

    జాక్వెలిన్ న్యాయవాది అభ్యర్ధన మేరకు రూ.50,000 బెయిల్ బాండు పై కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

    సుకేశ్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. ఇప్పటికే రూ.7.27 కోట్ల విలువైన జాక్వెలిన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

  16. ఇరాన్ హిజాబ్ నిరసనలు: లండన్‌లో పోలీసులతో ఘర్షణపడిన నిరసనకారులు

    లండన్‌లో పోలీసులతో ఘర్షణపడిన నిరసనకారులు

    ఫొటో సోర్స్, UGC

    ఇరాన్‌లో మొరాలిటీ పోలీసుల నిర్బంధంలో 22 ఏళ్ల మహసా అమీనీ మరణించిన తర్వాత ఇరాన్‌లో నిరసనలు మొదలయ్యాయి.

    మహసా అమీనీ హిజాబ్ సరిగ్గా ధరించలేదనే ఆరోపణతో మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

    ఇరాన్‌లో మొదలైన నిరసనలు ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి.

    లండన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎదుట నిరసనకారులు లండన్ పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

    లండన్‌లో ఆదివారం చోటు చేసుకున్న నిరసనల్లో నిరసనకారులు అధికారుల పైకి బాంబులను విసిరి నైట్స్ బ్రిడ్జ్ దగ్గర నియంత్రణదాటి లోపలకు ప్రవేశించారని మెట్ పోలీసు చెబుతున్నారు.

    ఈ ఘర్షణల్లో చాలా మంది అధికారులకు గాయాలయినట్లు చెబుతున్నారు.

    ఐదుగురు నిరసనకారులను అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనలతో సుస్థిరతకు భంగం కలిగించేందుకు ప్రయత్నించారనే అభియోగం పై పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

    "ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలి" అంటూ కొన్ని డజన్ల మంది నిరసనకారులు నినాదాలు చేశారు. నిరసనకారులు 1979కు ముందు ఉండే ఇరాన్ జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు.

  17. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సంక్షోభం

    సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది.

    ఈ మేరకు బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు ట్వీట్ చేస్తూ, భగవంతుడు మాత్రమే రాజస్థాన్ ను రక్షించాలని అన్నారు.

    "రాజస్థాన్ లో రాజకీయ పరిస్థితి రాష్ట్రపతి పాలన వైపు దారి తీసేలా ఉంది" అని అంటూ రాజస్థాన్ బీజేపీ నాయకుడు రాజేంద్ర రాథోడ్ ట్వీట్ చేశారు.

    "ముఖ్యమంత్రి గారు మీరు నాటకం ఎందుకు ఆడుతున్నారు? క్యాబినెట్ రాజీనామా చేసిన తర్వాత మీరు రాజీనామా చేయడంలో జాప్యం ఏంటి? మీరు కూడా రాజీనామా చేయండి" అని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రస్తుతం రాజస్థాన్ లో నెలకొన్న పరిస్థితి 2023లోనే ఎన్నికలు వచ్చేటట్లు అనిపించేలా ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

    రాజస్థాన్ కాంగ్రెస్ లో రాజీనామాల రాజకీయం నడుస్తోందని ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఇది కంచెలతో కూడిన ప్రభుత్వం" అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేసారు.

    రాజస్థాన్ లో ఆదివారం కూడా రాజకీయ సంక్షోభం కొనసాగింది. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ముందు అశోక్ గెహ్లోత్

    మద్దతుదారులు రాజీనామాలు సమర్పించేందుకు స్పీకర్ ఇంటికి చేరుకున్నారు.

    ప్రస్తుతం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్య రాష్ట్రంలో అధికారం కోసం జరుగుతున్న ఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది.

    గెహ్లోత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పోటీ చేస్తూ ఉండటంతో సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం పరిస్థితిని మార్చేసింది.

    సచిన్ పైలట్ మద్దతుదారులు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టిన వర్గానికి చెందినవారినే ముఖ్యమంత్రిని చేయాలనిఅశోక్ గెహ్లోత్ వర్గం పట్టుబడుతోంది.

    కేవలం 10 - 15 మంది శాసనసభ్యుల మాటను మాత్రమే విన్నారని, మిగిలిన వారి అభిప్రాయాలను పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎం ఎల్ ఏ శాసన సభ్యుడు ప్రతాప్ సింగ్ కచారియవాస్ అన్నట్లు ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది.

    "పార్టీ మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటోంది" అని ఆయన అన్నారు.

  18. హిమాచల్ లోని కులు వ్యాలీలో వ్యాన్ లోయలోపడి ఏడుగురి మృతి, పలువురికి గాయాలు

    టెంపో అదుపు తప్పి లోయలో పడిపోయింది.

    ఫొటో సోర్స్, ANI

    హిమాచల్ ప్రదేశ్ లోని కులు లో ఆదివారం రాత్రి వ్యాను లోయలో పడి ఏడుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

    వీరంతా టెంపోలో ప్రయాణిస్తున్నారు. టెంపో అదుపు తప్పి లోయలో పడిపోయింది.

    సోమవారం ఉదయం స్థానిక బీజేపీ ఎంఎల్ ఏ సురేంద్ర సౌరి ఘటనా స్థలానికి చెందిన వీడియోను అప్ లోడ్ చేశారు.

    ఈ ప్రమాదం కులులోని బంజర్ తాలూకాలో జరిగినట్లు తెలిపారు.

    ప్రమాదంలో గాయపడినవారికి ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరంతా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీకి చెందిన పర్యాటకులని బంజర్ ఎంఎల్ ఏ చెప్పారు.

    రక్షణ చర్యలు కొనసాగించేందుకు పోలీసులకు స్థానికులు సహాయం చేసారు.

    "బంజరు వ్యాలీలో ఘియాగి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గాయాలైన ఐదుగురిని కులు జోనల్ ఆస్పత్రిలో చేర్చారు. ఐదుగురికి బంజర్ లోనే చికిత్సను అందిస్తున్నారు" అని కులు జిల్లా ఎస్ పీ గురుదేవ్ సింగ్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.