ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం

కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు స్థానిక, జాతీయ, అంతర్జాతీ వార్తల లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ లైవ్ అప్‌‌డేట్స్‌తో రేపు ఉదయం కలుద్దాం.

  2. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో భారత్ విజయం.. టీ20 సిరీస్ కైవసం

    విరాట్ కోహ్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ చేజిక్కించుకుంది.

    కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

    187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    భారత్ జట్టులో సూర్య కుమార్ యాదవ్ 69, విరాట్ కోహ్లీ 63 పరుగులు సాధించారు.

    అంతకుముందు భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్షల్ పటేల్‌లు తలో వికెట్ తీశారు.

    ఈ మ్యాచ్‌ విజయంతో భారత్ 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

  3. అటార్నీ జనరల్ పదవి చేపట్టలేను.. నా పేరు పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఙతలు: ముకుల్ రోహత్గీ

    అటార్నీ జనరల్ పదవి చేపట్టేందుకు తాను సుముఖంగా లేనని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గా చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ‘‘కేంద్రం నా ముందు ఉంచిన ప్రతిపాదనకు నేను అంగీకరించడం లేదు. ఈ పదవికి నా పేరు పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ప్రస్తుతం ఈ పదవి నేను చేపట్టలేను. నా నిస్సహాయతను నేను కేంద్రానికి తెలిపాను’’ అని రోహత్గీ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. రోగులకు ఉండే 17 రకాల హక్కులేమిటో తెలుసా

  5. యుక్రెయిన్ యుద్ధం: రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తుందా

  6. అక్టోబరు 16న సీపీసీ సమావేశం... అధ్యక్షునిగా మూడోసారి షీ జిన్ పింగ్?

    చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

    అక్టోబరు 16న జరగనున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల ఎన్నిక పూర్తి అయిందని ఆ పార్టీ తెలిపింది.

    ఈ 20వ సమావేశానికి మొత్తం 2,296 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరంతా కలిసి చైనా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

    ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడోవసారి ఆ పదవికి ఎన్నిక అయ్యే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు.

    చైనా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయని, షీ జిన్‌పింగ్‌ను ఇంటిలో నిర్బంధించారనే ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.

    అయితే ‘సోషలిజం మీద జిన్ పింగ్ ఆలోచనలకు అనుగుణంగానే’ ప్రతినిధుల ఎంపిక జరిగినట్లు పార్టీ ప్రకటించింది.

  7. అఫ్టానిస్తాన్ నుంచి భారత్‌కు 55 మంది సిక్కులు

    అఫ్గానిస్తాన్ నుంచి భారత్ చేరుకున్న సిక్కులు

    ఫొటో సోర్స్, ANI

    అఫ్గానిస్తాన్ నుంచి 55 మంది సిక్కులు భారత్‌కు వచ్చారు.

    కాబుల్ నుంచి బయలు దేరిన ప్రత్యేక విమానం కొద్ది సేపటి కిందట దిల్లీలో ల్యాండ్ అయింది.

    ఇతర దేశాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న భారత సంతతి మైనారిటీలను తీసుకురావలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వీరంతా ఇక్కడకు చేరుకున్నారు.

    ఇందుకోసం అమృత్‌సర్‌లోని శిరోమణి గురుద్వారా ప్రబందక్ కమిటీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

    కాబుల్‌లోని గురుద్వారా కర్తే పర్వాన్ మీద దాడి జరిగిన తరువాత ఇప్పటి వరకు సుమారు 68 మంది సిక్కులు, హిందువులు భారత్‌కు చేరుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. సోనియా గాంధీ నివాసానికి చేరుకున్న లాలు ప్రసాద్ యాదవ్

    కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ చేరుకున్నారు.

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా రానున్నారు.

    2024 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో భాగంగా ఈ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. డయేరియాతో బాధ పడుతున్నప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు?

  10. ఫిలిప్పిన్స్‌ను వణికిస్తున్న నోరు తుపాను

    నోరు తుపాను

    ఫొటో సోర్స్, Reuters

    ఫిలిప్పిన్స్‌ను నోరు తుపాన్ వణికిస్తోంది.

    గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. లుజాన్ దీవి వద్ద తీరం దాటేలా కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.

    ఫిలిప్పిన్స్ రాజధాని మనీలా ఉంది లుజాన్ దీవిలోనే. ప్రజలు అత్యంత ఎక్కువగా ఉండే లుజాన్‌ను తుపాన్ తాకితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

    ‘సముద్ర తీరాలకు దగ్గరగా నివసించే వారిని ఇప్పటికే ఖాళీ చేయించారు. సముద్రంలోకి బోట్లు వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించారు. జనావాసాలకు, పంటలకు తుపాను భారీ నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు.

    సముద్రంలో అలల తీవ్రత పెరగడంతోపాటు కొండ చరియలు కూడా విరిగిపడతాయని ఆందోళన చెందుతున్నారు’ అని బీబీసీ ఏసియా ఫసిఫిక్ ఎడిటర్ మైఖేల్ బ్రిస్టో తెలిపారు.

  11. 'కుక్కల కంటే హీనంగా చూశారు'... రష్యా విడుదల చేసిన బ్రిటన్ ఖైదీ

  12. బంగ్లాదేశ్‌లో బోటు ప్రమాదం... 23 మంది మృతి

    బంగ్లాదేశ్ బోటు
    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    బంగ్లాదేశ్‌లో బోటు తిరగబడటంతో సుమారు 23 మంది మరణించారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపినట్లు పీటీఐ రిపోర్ట్ చేసింది.

    ఇంకా పదుల సంఖ్యలో ప్రయాణికులు కనిపించలేదు.

    కరటోవా నది ఔలియాఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. జార్జియా మెలోని: ఇటలీలో ముస్సోలిని తర్వాత ఈమె పేరే వినిపిస్తోంది ఎందుకు

  14. ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనా, పాకిస్తాన్‌ల పేరెత్తకుండానే విమర్శలు చేసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

  15. హీరోయిన్లు, అందగత్తెలు తాగే బ్లాక్‌వాటర్ అంటే ఏంటి?

  16. "2025 నాటికి భారత్‌లో క్షయ అంతం" - మన్ కీ బాత్‌' లో మోదీ

    మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రజల సహకారంతో భారత్ 2025 నాటికి క్షయ వ్యాధికి అంతం పలుకుతుందని ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' లో ప్రకటించారు.

    2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా చెబుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చిరుధాన్యాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని అన్నారు. చిరుధాన్యాలకు సంబంధించిన ఈ-బుక్ లేదా పబ్లిక్ ఎన్ సైక్లోపీడియాను తయారు చేయమని సూచించారు.

    పాలిథీన్ వాడకాన్ని తగ్గించి సహజసిద్ధ పదార్ధాలతో తయారు చేసిన సంచులను వాడమని సూచించారు.

    గాంధీ జయంతిని పురస్కరించుకుని "వోకల్ ఫర్ లోకల్" (స్థానిక ఉత్పత్తుల ప్రచారం) ప్రచారాన్ని పెంచేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

    మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగా పని చేస్తుందని ప్రపంచం గుర్తించిందని అన్నారు.

    భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా చీతాలకు, వాటి ప్రచారానికి పేర్లను సూచించమని ప్రజలను కోరారు.

    మరొక ముఖ్యమైన ప్రకటన చేస్తూ చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా పేరును పెడుతున్నట్లు ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "సెప్టెంబరు 28న భగత్ సింగ్ జన్మదినోత్సవానికి ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఆయనకు అర్పిస్తున్న నివాళి" అని అన్నారు.

    "ప్రాంతాలు, సంస్థలు, నిర్మాణాలకు అమరుల పేర్లను పెట్టడం ద్వారా ప్రజలను కర్తవ్యం నిర్వహించేలా చేసేందుకు స్ఫూర్తిని కలిగిస్తాయి. కొన్ని రోజుల క్రితమే, దిల్లీలోని కర్తవ్య పథ్ లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు.

  17. భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించిన ఈ అవుట్‌ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఎందుకు రెండుగా చీల్చింది?

  18. ఇరాన్:హిజాబ్ వ్యతిరేక నిరసనల పైకఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన అధ్యక్షుడు రైసీ

    ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు 31 ప్రాంతాలకు వ్యాపించాయి.

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు రైసీ ఆదేశించారు.

    ప్రస్తుతం ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు 31 ప్రాంతాలకు వ్యాపించాయి.

    పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహసా అమీనీ మరణించిన తర్వాత చోటు చేసుకున్న నిరసనల్లో ఇప్పటి వరకు మొత్తం 35మంది మరణించారు.

    పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

    హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల పై అమీనీని అరెస్టు చేశారు.

    ఆమెను పోలీసులు వేధింపులకు గురి చేయడం మాత్రమే కాకుండా ఆమె తలను వాహనాలకు వేసి కొట్టారు. దీంతో ఆమె మరణించారు.

    పోలీసులు మాత్రం ఆమె గుండె పోటుతో మరణించారని చెబుతున్నారు.

    అమీనీ మరణం పై విచారణ జరిపిస్తామని రైసీ చెప్పారు.

    ఇరాన్ గృహ మంత్రి కూడా అమీనీని నిర్బంధంలో హింసించలేదని పేర్కొన్నారు..

  19. రేణిగుంటలోని ఆస్పత్రి భవనంలో అగ్ని ప్రమాదం. ముగ్గురి మృతి

    రేణిగుంటలో కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనంలో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, UGC

    రేణిగుంటలోని రాజరాజేశ్వరి నగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్‌లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది.

    ఈ అగ్నిప్రమాదంలో ఒక వైద్యుడు మరణించారు. మంటల వల్ల ఊపిరి అందక ఆయన ఇద్దరు పిల్లలు కూడా చనిపోయినట్లు రేణిగుంట డిప్యూటీ పోలీస్ సూపెరింటెండెంట్ రామచంద్ర తెలిపారు.

    ఆయన తల్లిని, భార్యను మంటల్లోనుంచి రక్షించారు.

    సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది సంఘటనా స్థలం దగ్గరకు చేరి సహాయక చర్యలు మొదలుపెట్టారు.

    తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన పన్నెండేళ్ల కుమారుడు సిద్ధార్థ, తొమ్మిదేళ్ల కుమార్తె కార్తికలను అగ్నిమాపక సిబ్బంది రక్షించి, చికిత్స కోసం 108 వాహనంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

    చికిత్స పొందుతూ చిన్నారులు మృతి చెందారు.

    ఈ ఘటన విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ వల్లే జరిగినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.

  20. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.