ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్‌డేట్లతో మళ్లీ కలుద్దాం.
"అంకిత మృతదేహం లభించింది. గుండెలు పగిలే ఈ సంఘటనతో మనసంతా దుఃఖపూరితం అయ్యింది. ‘సిట్’ ఈ కేసును విచారించి అపరాధులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తుంది"
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా అప్‌డేట్లతో మళ్లీ కలుద్దాం.
భారతదేశం గత 75 ఏళ్లలో ఆర్థికంగా ఎదిగిన తీరును విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ యూఎన్ జనరల్ అసెంబ్లీలో వివరించారు. సర్వసభ్య సమావేశంలో ఇండియా@75 కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కోవిడ్ సమయంలో ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఇతర దేశాల విదేశాంగ మంత్రులు భారత్‌ను ప్రశంసించారని చెప్పారు.
‘‘ఇండియా@75 కార్యక్రమంలో ఓ విదేశాంగ మైత్రి వ్యాక్సీన్ మైత్రి గురించి చెప్పారు. మరో విదేశాంగ మంత్రి అయితే.. ఆర్థిక వ్యవస్థల పరంగా భారత్‌ది ప్రపంచంలో అయిదో స్థానం కావొచ్చు కానీ.. అత్యంత విశాల హృదయం ఉన్న దేశం మాత్రం భారతే’ అన్నారు అంటూ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Ankita Bhandari
ఉత్తరాఖండ్‌లోని ఒక రిసార్టులో పని చేస్తున్న రిసెప్షనిస్టు హత్యకు గురయ్యారు. ఈ రిసెప్షనిస్టు హత్యకు సంబంధించి బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడు పులకిత్ ఆర్యను అరెస్టు చేశారు.
ఉత్తరాఖండ్ పోలీసులు శనివారం ఉదయం అంకిత భండారీ అనే అమ్మాయి మృతదేహాన్ని రిషికేష్ లోని చీలా కాలువ నుంచి వెలికితీశారు.
ఈ ఘటన పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అపరాధులను క్షమించేది లేదని స్పష్టం చేశారు.
ఇదే ట్వీట్‌లో, "ఈ ఉదయం అంకిత మృతదేహం లభించింది. గుండెను పగిల్చే ఈ సంఘటనతో మనసంతా దుఃఖంగా అయిపొయింది. పోలీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పీ. రేణుక దేవి నేతృత్వంలో నియమించిన సిట్ కమిటీ ఈ కేసును విచారించి అపరాధులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తుంది" అని ట్వీట్ చేశారు.
అత్యున్నత స్థాయి విచారణ కమిటీని నియమించి ఈ కేసును విచారించాలని ఆదేశించారు. నిందితులు చట్టవ్యతిరేకంగా నిర్వహిస్తున్న రిసార్టును కూల్చేందుకు బుల్ డోజర్లను పంపినట్లు తెలిపారు. ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డ వారిని వదిలిపెట్టేది లేదని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆరు రోజుల తర్వాత లభించిన మృత దేహం
అంకిత హత్యకు సంబంధించిపోలీసులు పులకిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తను శుక్రవారం అరెస్టు చేశారు.
హత్య చేసిన తర్వాత అంకితను చీలా కాలువలోకి విసిరేసినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు చెప్పారు.
విచారణ చేస్తుండగా మొదట పోలీసులను తప్పు దారి పట్టించాలని చూసారని, కానీ, గట్టిగా ప్రశ్నించేసరికి నిజం చెప్పారని ఏ ఎస్ పీ శేఖర్ చంద్ర సూయల్ చెప్పారు.
సోమవారం అంకిత ఇంట్లో కనిపించకపోయేసరికి, కుటుంబ సభ్యులు ఆమె తప్పిపోయినట్లు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పులకిత్ ఆర్య తండ్రి వినోద్ ఆర్య బీజేపీ ప్రభుత్వంలో గతంలో కేబినెట్ ర్యాంక్‌లో పనిచేశారు. ఆయన ఉత్తరాఖండ్ మాటీకళ బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న అన్ని రిసార్టులను తనిఖీ చేయమని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అన్ని రిసార్టుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
పౌరి జిల్లాలో యమకేశ్వర్ బ్లాకులో నిర్మించిన బీజేపీ నేత రిసార్టునుశుక్రవారం బుల్ డోజర్లతో కూల్చివేశారు. ఈ రిసార్టును పులకిత్ ఆర్య నిర్వహిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, ANI
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాపై జరగుతున్న దాడులకు ఆపరేషన్ ఆక్టోపస్ అని కేంద్రం దర్యాప్తు సంస్థ పేరు పెట్టింది.
పలు నగరాలలో ఈ సంస్థకు చెందిన కార్యాలయాలో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ, పలు డాక్యుమెంట్లును, డబ్బును, కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు దేశ రాజధాని దిల్లీలో అరెస్టైన పీఎఫ్ఐ కార్యకర్తలను విచారించేందుకు 7 రోజుల కస్టడీకి దిల్లీలోని ఈడీ కోర్టు అనుమతించింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈ సంస్థ కార్యాలయాలు, నేతలపై జరిపిన దాడుల్లో చాలా అభ్యంతరకరమైన అంశాలు దొరికాయని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.
పీటీఐ ప్రకారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన రిమాండ్ నివేదికలో ఈ కేసుకు సంబంధించిన 10 మందిని ఎన్ఐఏ కస్టడీకి కోరింది.
దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసులలో పేర్కొన్న ప్రకారం, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)లో చేరడానికి యువతను పీఎఫ్ఐ ప్రేరేపిస్తోంది.
"భారతదేశంలో ఇస్లామిక్ పాలనకు కుట్ర"
హింసాత్మక జిహాద్, తీవ్రవాద కార్యకలాపాల ద్వారా భారతదేశంలో ఇస్లామిక్ పాలనను తెచ్చేందుకు ఈ సంస్థ కుట్ర పన్నిందని సెప్టెంబర్ 22న సమర్పించిన నివేదిక పేర్కొంది.
"ప్రభుత్వ విధానాలను సమాజంలోని ఒక వర్గానికి తప్పుగా అన్వయించి, భారతదేశానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడానికి పీఎఫ్‌ఐ ప్రయత్నించింది. దేశంపట్ల, ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేసింది" అని ఆ నివేదిక పేర్కొంది.
"ఎఫ్‌ఐఆర్ నమోదైన వ్యక్తులు నిరంతరం వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని, సమాజంలోని ఇతర మత వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశ్యంతో ఉన్నారని దర్యాప్తులో రికవరీ చేసిన అంశాల ద్వారా తేలింది" అని నివేదిక పేర్కొంది.
నిందితులను ఎన్ఐఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ దాడుల్లో కేరళ నుంచి 22మంది, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 20, తమిళనాడు నుంచి 10, అస్సాం నుంచి 9, ఉత్తరప్రదేశ్ నుంచి 8, ఆంధ్రప్రదేశ్ నుంచి 5, మధ్యప్రదేశ్ నుంచి 4, పుదుచ్చేరి, దిల్లీల నుంచి ముగ్గురిని, రాజస్థాన్ నుంచి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రోహింజ్యాల అంశం గురించి మాట్లాడారు.
తమ దేశంలో రోహింజ్యాలు చాలా కాలంగా ఉండిపోవడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం, దేశ భద్రత,సామాజిక, రాజకీయ సుస్థిరత పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"వీరిని తరలించే విషయం పై నెలకొన్న అనిశ్చితి వల్ల విసుగు, సీమాంతర వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నాయి" అని ఆమె అన్నారు.
ఆమె ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహింజ్యాల అంశం గురించి ప్రస్తావించారు. రోహింజ్యాలు తమ దేశానికి పెను భారంగా మారుతున్నారని అంటూ ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్ సహాయం చేయాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ శుక్రవారం టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు. లండన్‌లో జరిగిన లేవర్ కప్ లో రఫేల్ నాడల్ తో కలిసి ఆడిన ఆటలో ఓటమి పాలయ్యారు.
ఫెదరర్, నాడల్ ద్వయం అమెరికన్ ఆటగాళ్లు ఫ్రాన్సిస్ టియా ఫో, జాక్ సాక్ తో ఆడిన ఆటలో 4 -6, 7-6, 11-9 స్కోర్‌తో ఓడిపోయారు.
ఈ ఓటమితో ఫెదరర్ టెన్నిస్ కెరీర్ ముగిసింది.
ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ఫెదరర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆఖరి ఆటలో ఓడిపోయిన విచారం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆయన టెన్నిస్ కోర్టులో ఉన్న అభిమానులకు అభివాదం చేశారు.
గత రెండు దశాబ్దాలుగా టెన్నిస్ ప్రపంచంలో ప్రముఖంగా వినిపించిన ఈయన 24 ఏళ్ల తర్వాత టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు.
20 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్ 2021 వింబుల్డన్ తరువాత మళ్లీ ఆడలేదు. మోకాలికి ఆపరేషన్ చేయించుకోవాల్సి రావడం వల్లే ఆయన అప్పటి నుంచి టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టలేకపోయారు.
"మనమందరం ఇలాంటి క్షణాన్ని ఎప్పుడో ఒకసారి అనుభవించాల్సి వస్తుంది. ఇదొక అద్భుతమైన రోజు. నేను సంతోషంగానే ఉన్నాను. విచారంగా లేను. ఇక్కడ నిలబడినందుకు గర్వంగా ఉంది. ఆఖరు సారి నా షూ లేసులు కట్టుకుంటూ చాలా ఆనందించాను. ఇక్కడ కొన్ని విషయాలు నాకు ఆఖరిసారి అవుతాయి" అని రోజర్ అన్నారు.
"ఏదో జరుగుతుందని అనిపించినప్పటికీ నేను ఒత్తిడికి లోనవ్వను. కానీ, ఈ మ్యాచ్ అద్భుతంగా సాగింది. రఫేల్ లాంటి వాళ్లతో ఆడటం ఒక గొప్ప అనుభవం. అందరికీ నా ధన్యవాదాలు" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టెన్నిస్ ప్రపంచంలో తన ప్రయాణానికి ఆయన భార్య అందించిన సహకారం చాలా ముఖ్యమైన పాత్ర పోషించిందని అన్నారు.
"నన్ను ఎప్పుడో ఆపి ఉండొచ్చు. కానీ, ఆమె నన్ను ఆపలేదు. నన్ను ఆడేందుకు ప్రోత్సహించారు. అది నిజంగా గొప్ప విషయం. ధన్యవాదాలు" అని చెప్పారు.
రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లాం టైటిళ్లు గెలుచుకున్నారు. ఆయన 2003లో జరిగిన వింబుల్డన్ లో తొలి గ్రాండ్ స్లాం టైటిల్ గెలుచుకున్నారు.
ఆయన కెరీర్లో 3 ఆస్ట్రేలియా ఓపెన్, ఒక ఫ్రెంచ్ ఓపెన్, 8 వింబిల్డన్, 5 యూఎస్ ఓపెన్ టోర్నమెంటులను గెలుచుకున్నారు.
పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లాంలను గెలుచుకున్న వారిలోరఫేల్ నాడల్, నోవాక్ జొకోవిక్ తర్వాతఫెదరర్ మూడవ స్థానంలో ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.