INDvsAUS T20: నేనే తప్పూ చేయలేదు.. నాకేం సంబంధం లేదు- అజారుద్దీన్

ఒక బలమైన ప్రతిపక్షం కోసం దేశం ఎదురు చూస్తోందని, అందుకే తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నానని గహ్లోత్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా అప్‌డేట్లతో మళ్లీ కలుద్దాం.

  2. హాకీ ఇండియా అధ్యక్షునిగా దిలీప్ టిర్కీ

    దిలీప్ టిర్కీ

    ఫొటో సోర్స్, @DilipTirkey

    భారత హాకీ మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ, హాకీ ఇండియా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఈ పదవి కోసం ఉత్తరప్రదేశ్ హాకీ చీఫ్ రాకేశ్ కథ్యాల్, జార్ఖండ్ హాకీ నుంచి భోళానాథ్ సింగ్ కూడా పోటీపడ్డారు. అయితే, వారిద్దరూ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో టిర్కీ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

    అధ్యక్షునిగా భారత హాకీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

    దిలీప్ టిర్కీ, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.

    2012 నుంచి 2018 వరకు బిజూ దనతాదళ్ రాజ్యసభ ఎంపీగా పని చేశారు.

    1995లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టిర్కీ అరంగేట్రం చేశారు. 1996 అట్లాంటా, 2000 సిడ్నీ, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

    ఆయనకు పద్మశ్రీ, అర్జున, ఏకలవ్య అవార్డులు లభించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. నార్మల్ డెలివరీ కష్టమైనా సిజేరియన్ చేయలేదా? నల్గొండలో గర్భిణి మృతికి కారణమేంటి

  4. యుక్రెయిన్‌తో యుద్దాన్ని వ్యతిరేకిస్తే జైలుపాలే అంటున్న రష్యా

  5. ప్రొడక్టివిటీ పారనోయా: 'వర్క్ ఫ్రమ్ హోం'లో ఉద్యోగులు తక్కువగా పని చేశారా-మైక్రోసాఫ్ట్ సర్వే ఏం చెప్పింది

  6. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  7. వైఎస్ జగన్: ‘కుప్పం వద్దు, హైదరాబాద్ ముద్దు... ఇదీ చంద్రబాబు పాలసీ’

    ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్

    ఫొటో సోర్స్, FACEBOOK.COM/ANDHRAPRADESHCM

    నారా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 33 సంవత్సరాలు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఇక్కడ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

    14 ఏళ్లుసీఎంగా ఉండి కూడా కుప్పంలో కరవుకు చంద్రబాబు పరిష్కారం చూపలేకపోయారని వ్యాఖ్యానించారు.

    చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.

    అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని మహిళల జీవితాల్లో ఎంతో మార్పు కనిపిస్తోందని అన్నారు. నాలుగు పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు.

    నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకే తాము చేస్తోన్న సాయం వెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని ప్రజలను కోరారు.

    కుప్పంలో కరవు, నీటి సమస్యకు హంద్రీనీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా... హంద్రీనీవా పనులకు చంద్రబాబు అవరోధంగా మారాడని అన్నారు.

    తమ ప్రభుత్వంగత 39 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ... కేవలం కుప్పం నియోజకవర్గానికి రూ.1,149 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.

  8. ఈ వైరస్ క్యాన్సర్ కణాలను చంపేస్తుంది

  9. పుట్టగానే ఆసుపత్రిలో తారుమారయ్యారు.. ఇరవై ఏళ్ల తరువాత వాళ్లిద్దరే పెళ్లి చేసుకున్నారు

  10. బ్లాక్ వాటర్: టాలీవుడ్, బాలీవుడ్ అందగత్తెలు తాగే ఈ నీటి ప్రత్యేకత ఏమిటి

  11. బ్రేకింగ్ న్యూస్, అజహరుద్దీన్: ‘తొక్కిసలాటకు, హెచ్‌సీఏకు సంబంధం లేదు’

    తొక్కిసలాట

    జింఖానా గ్రౌండ్ వద్ద మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలకు సంబంధించి గురువారం జరిగిన తొక్కిసలాటకు, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)కు సంబంధం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ అన్నారు.

    ఆ ఘటనకు కారణం ఎవరో తనకు తెలియదనీ, కానీ అలా జరగడంతో చాలా నిరాశ చెందాం అని చెప్పారు.

    హెచ్‌సీఏ తరఫున బాధితుల చికిత్స ఖర్చులను భరిస్తామని అన్నారు. టిక్కెట్ల అమ్మకాలకు సంబంధించిన వివరాలను సుప్రీం కోర్టు కమిటీకి అందజేస్తానని చెప్పారు.

    శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ... ‘‘నేనేం తప్పు చేశానో చెప్పండి. నేను ఏ తప్పు చేయలేదు. మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చేస్తున్నాం. పేటీఎం ద్వారా టిక్కెట్ల అమ్మకాలు జరిగాయి. అందులో నా పాత్ర పరిమితం. బ్లాక్‌లో అమ్మకాల గురించి నాకు తెలియదు. ఒకసారి అభిమానులు టిక్కెట్ కొనుకున్నాక, తర్వాత వారేం చేస్తారో మాకెలా తెలుస్తుంది. అన్ని అంశాలు నా పరిధిలో ఉండవు. జింఖానా వద్ద ఏం జరిగిందో పోలీసులకు తెలుసు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు కమిటీకి నేను జవాబుదారీగా ఉంటా. తొక్కిసలాటకు హెచ్‌సీఏకు సంబంధం లేదు. ఇందులో హెచ్‌సీఏ తప్పు లేదు. దీనిపై హెచ్‌సీఏ తరఫున కమిటీని వేస్తాం’’ అని ఆయన అన్నారు.

  12. ఆంధ్రప్రదేశ్: వాట్సాప్‌లో పోస్టుకు సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్, సీఐడీ కుట్ర కేసు ఎందుకు పెట్టింది

  13. నూపుర్ శర్మ కేసులో నావికా కుమార్‌కు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు

    నావికా కుమార్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నావికా కుమార్‌

    మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టైమ్స్ నౌ యాంకర్ నావికా కుమార్‌పై కూడా పలు రాష్ట్రాల నుంచి కేసులు నమోదయ్యాయి.

    తనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ క్లబ్ చేయాలని కోరుతూ నావికా కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది.

    నావికా కుమార్‌పై ఉన్న "అన్ని ఎఫ్ఐఆర్‌లను దిల్లీ పోలీస్‌కు చెందిన ఐఎఫ్ఎస్ఓ యూనిట్‌కు తరలించాలని" సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

    దిల్లీ పోలీసు ఐఎఫ్ఎస్ఓ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌నే ప్రధాన కేసుగా తీసుకోవాలని తెలిపింది.

    అంతే కాకుండా, వచ్చే ఎనిమిది వారాల పాటు ప్రస్తుత ఎఫ్‌ఐఆర్‌లు లేదా భవిష్యత్తులో నమోదయ్యే ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి నావికా కుమార్‌పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదని వెల్లడించింది.

    జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పులో, “నావికా కుమార్ తనపై దాఖలైన ప్రధాన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయమని కోరుతూ హైకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది" అని వెల్లడించారు.

    నావికా కుమార్ నిర్వహించిన కార్యక్రమంలోనే నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

  14. యుక్రెయిన్‌లో ఏడుగురు శ్రీలంక బందీల విడుదల

  15. మసకబారుతున్న టైగ్రిస్ నది వైభవం

  16. మరింత క్షీణించిన రూపాయి విలువ.. డాలరుకు రూ. 81.27

    రూపాయి విలువ క్షీణత

    డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణత కొనసాగుతోంది.

    శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరింత పడిపోయి, కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది.

    డాలర్‌తో రూపాయి మారకంలో ఇదే కనిష్ట స్థాయి. అంటే, మీరు ఇప్పుడు ఒక డాలర్ కొనాలనుకుంటే, దానికి రూ. 81. 27 చెల్లించాల్సి ఉంటుంది.

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు పెరగడమే రూపాయి పతనానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.

    రూపాయి విలువ నిరంతరం పతనం కావడం భారత ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వడ్డీ రేట్లు విదేశీ పెట్టుబడులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి. అలాగే, చమురు దిగుమతులు భారమవుతాయి.

  17. 'నా కూతురు శవాన్ని కూడా నన్ను చూడనివ్వలేదు. ఆమె గురించి అధికారులు చెబుతున్నవన్నీ అబద్ధాలు'-మహసా తండ్రి ఆవేదన

  18. పీఎఫ్ఐపై ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా పలుచోట్ల నిరసనలు .. కేరళలో నేడు బంద్‌

    కేరళ

    ఫొటో సోర్స్, ANI

    పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సోదాలకు నిరసనగా కేరళలో నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.

    బంద్ సందర్భంగా, కొల్లం జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు పీఎఫ్ఐ మద్దతుదారులు అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారని ఏఎన్ఐ వెల్లడించింది.

    నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వడంతో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు గాయపడ్డారు. చాలా చోట్ల బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీను శాఖ, ఈడీలతో కలిసి దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.

    ఎన్‌ఐఏ సోదాలకు నిరసనగా కోయింబత్తూర్‌లో బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ నింపిన బాటిల్ విసిరారు.

  19. 'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా' - రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్

    కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. నామినేషన్ తేదీని త్వరలో నిర్ణయిస్తానని తెలిపారు.

    "దేశ పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది" అని అశోక్ గహ్లోత్ అన్నట్టు ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది