కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

సిరిసిల్లలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ప్రోగ్రాం కింద విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో మందు పంచను, డబ్బులు ఇవ్వనని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ‘హిజాబ్’ నిరసనలతో అట్టుడుకుతోన్న ఇరాన్

    ‘హిజాబ్’ నిరసనలతో అట్టుడుకుతోన్న ఇరాన్

    ఫొటో సోర్స్, EPA

    హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో ఇరాన్ యుద్ధభూమిని తలపిస్తోందని బీబీసీతో స్థానికులు చెప్పారు.

    మొత్తం 80 ప్రాంతాలకు ఈ నిరసనలు విస్తరించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

    ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య గురించి వివిధ నివేదికలు బయటకు వచ్చాయి.

    భద్రతా సిబ్బంది, నిరసనకారులతో కలిపి మొత్తం 17 మంది మరణించినట్లు అక్కడి అధికారిక మీడియా నివేదించింది.

    అయితే, కుర్దీష్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ మాత్రం కేవలం పశ్చిమ ఇరాన్‌లోనే 15 మంది నిరసనకారులు చనిపోయినట్లు చెప్పింది. కనీసం 31 మంది పౌరులు మరణించి ఉంటారని తెలిపింది.

  3. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు... తెలుగు రాష్ట్రాల్లో అయిదుగురి అరెస్ట్

    దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పోలీస్ శాఖ, ఈడీలతో కలిసి సంయుక్తంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో దాడులు చేసింది.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బిహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ మొత్తం 45 మందిని అరెస్ట్ చేసింది.

    ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అయిదుగురు ఉన్నారు. తెలంగాణకు చెందిన అబ్దుల్ వరీస్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్, అబ్దుల్ వహీద్ అలీ, షేక్ జఫ్రుల్లా, రియాజ్ అహ్మద్‌లను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో పాటు, శిక్షణ ఇస్తున్నట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో పీఎఫ్ఐ కార్యాలయాలతోపాటు కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    తెలుగు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో పాటు కేరళలో 19 మందిని, తమిళనాడులో 11 మందిని, కర్ణాటకలో ఏడుగురిని, రాజస్తాన్‌లో ఇద్దరిని, ఉత్తరప్రదేశ్‌లో ఒకరిని అరెస్ట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్

  5. బ్రేక్‌డాన్స్‌ ఓ క్రీడ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా?

  6. ఆంధ్రప్రదేశ్: నవంబర్ 1నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఫ్లెక్సీలపై నిషేధం

    ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నవంబర్‌ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టంచేసింది.

    తాజా ఉత్తర్వుల ప్రకారం ఏపిలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి ఉండదని తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శన పైనా నిషేధం విధించింది.

    ఈ నిషేధం అమలు చేయాల్సిన బాధ్యతలు కూడా నిర్దేశించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిషేధం అమలు పర్యవేక్షణ బాధ్యత పోలీస్‌, రవాణా, జీఎస్టీ శాఖలు తీసుకోవాలని తెలిపింది.

    ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని పేర్కొంది.

  7. అల్జీమర్స్‌ లక్షణాలు ఏంటి? దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  8. రూపాయి ఎందుకు పడిపోతోంది?

    బీబీసీ తెలుగు కార్టూన్
  9. హిజాబ్ ధరించని మహిళలను ‘వెంటాడి, వేటాడే’ ఇరాన్ మొరాలిటీ పోలీసులు ఎవరు? ఏం చేస్తారు?

  10. డోనాల్డ్ ట్రంప్, ఆయన పిల్లలపై చీటింగ్ కేసు: ఆస్తుల విలువ ‘వందల కోట్లు పెంచి’ తప్పుడు లెక్కలు చూపించారంటూ దావా

  11. ఆంధ్రప్రదేశ్: హెల్త్ యూనివర్సిటీకి మూడోసారి పేరు మార్పు.. అభ్యంతరాలు ఎందుకు? ఇబ్బందులు ఏంటి?

  12. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్‌టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్

    ఫొటో సోర్స్, Facebook/JrNTR

    ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం మీద సినీనటుడు జూనియర్ ఎన్‌టీఆర్ స్పందించారు.

    ‘ఎన్‌టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.

    ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు. అలాగని ఎన్‌టీఆర్ స్థాయిని తగ్గించదు.

    విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం ద్వారా ఎన్‌టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అని జూనియర్ ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

    తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KTR

    సిరిసిల్లలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ప్రోగ్రాం కింద విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో మందు పంచను, డబ్బులు ఇవ్వనని అన్నారు.

    ‘ఎన్నికలు అనగానే అడ్డగోలుగా ఖర్చు పెడతాం. ఎందుకు ఖర్చు పెడతాం? దేని మీద తగలబెడతాం? అనేది మీ అందరికీ తెలుసు.

    అదంతా బూడిదలో పోసిన పన్నీరే. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడితే గెలవరు. ఖర్చు పెట్టకపోతే ఓడిపోరు. కాస్త సిన్సియర్‌గా పని చేస్తే చాలు.

    నేను సిరిసిల్లలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేశా. ఒక్క ఎన్నికలో కూడా ఓట్ల కోసం నేను చుక్క మందు కూడా పంచలేదు. పంచను కూడా.

    ఓట్ల కోసం మందు పంచేది లేదు. పైసలు ఇచ్చేది లేదు.

    నాతో పోటీ పడాలి అనుకునే వాళ్లు మంచి పనుల్లో పోటీ పడాలి’ అని కేటీఆర్ అన్నారు.

  14. డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?

  15. జింఖానా మైదానం తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు : పోలీసులు

    జింఖానా మైదానం వద్ద స్పృహ తప్పి పడిపోయిన అభిమానులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద స్పృహ తప్పి పడిపోయిన అభిమానులు

    జింఖానా మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటల్లో మహిళ చనిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని హైదరాబాద్ నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ తెలిపారు.

    తొక్కిసలాటలో నలుగురు గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అంతేకానీ ఎవరూ చనిపోలేదని అన్నారు.

    ఒక మహిళ చనిపోయినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

    హెచ్‌సీఏ ఏర్పాట్లలో లోపాలు ఉన్నాయని విచారణలో తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీసీపీ స్పష్టం చేశారు.

    హైదరాబాద్ లో క్రికెట్ మాచ్ టికెట్స్ కోసం జనం ఒకేసారి ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. ఇవాళ తెల్లవారుజామున నుంచి జింఖానా గ్రౌండ్ దగ్గర వేలాది మంది బారులు తీరారు.

    చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అందులోనూ ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ కావడంతో ఉత్కంఠ పెరిగింది. ఆన్‌లైన్ టికెట్స్ వెంటనే అయిపోవడంతో ఆఫ్‌లైన్ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది.

    దీంతో జింఖానా మైదానం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు బారులు తీరారు. ఇంత మంది జనం వస్తారని ఊహించని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దానికి తగిన ఏర్పాట్లు చేయలేదు.

    దాంతో జనం మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అదుపు చేయడానికి నాన తంటాలు పడ్డారు. ఒక కానిస్టేబుల్ కి, ఒక మహిళ కీ గాయాలు అయ్యాయి. వారికి చికిత్స చేస్తున్నారు.

    ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు చికిత్స పొందుతున్నారు. ‘

    ‘మా ఆసుపత్రిలో ఎవరూ చనిపోలేదు. ఆ ఏడుగురికీ చికిత్స అందిస్తున్నాం. వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం’ అని యశోద ఆసుపత్రి ప్రతినిధులు బీబీసీకి తెలిపారు.

  16. ఇండియా-ఆస్ట్రేలియా: క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్‌‌లో తొక్కిసలాట

    జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత

    భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్ జరగనుంది.

    సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.

    టికెట్ల కోసం వేల మంది వచ్చి బారులు తీరారు. కొన్ని గంటల నుంచి బారుల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు.

    స్థానిక మీడియా కథనాల ప్రకారం గేట్లను ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 20 మందికి స్పృహ తప్పింది. వారిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపాయి.

    పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

    జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరిన అభిమానులు
  17. సౌదీ అరేబియా, యూఏఈ లాంటి దేశాల్లో మహిళలు ఏం చేయకూడదు, ఏమేం చేయొచ్చు?

  18. ఇరాన్‌లో హిజాబ్‌లను తగలబెడుతున్న మహిళలు

  19. మసీదుకు వెళ్లి ఇమామ్‌ను కలిసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

    ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, దిల్లీలో కస్తూర్బా గాంధీ రోడ్డులో గల మసీదు వద్ద ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

    ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ దిల్లీలోని కస్తూర్బా గాంధీ రోడ్డులో గల మసీదుకు వెళ్లారు.

    అక్కడ ఉన్న ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని మోహన్ భాగవత్ కలిశారు.

    అన్ని వర్గాలకు చెందిన ప్రజలను మోహన్ భాగవత్ కలుస్తుంటారని, అందులో భాగంగానే మసీదుకు వెళ్లి ఇమామ్‌ను కలిశారని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. నార్త్ వెస్ట్రన్ రైల్వేలో సేవలందిస్తున్న మహిళా పైలట్ నీలమ్ రాథల్