You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ఉచిత వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ ఉందా? లేదా?’ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్
ప్రజలకు అందే ప్రతి స్కీమ్ లో కేంద్ర రాష్ట్రాల వాటా ఉంటుందనీ, కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతున్నాయనీ, తెలంగాణలోనే కాకుండా దేశమంతా ఇదే జరుగుతుందనీ ఆమె చెప్పారు
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
చైనా అణచివేత నుంచి బయటపడి, బ్రిటన్‌లో సెటిల్ అవుతున్న హాంగ్ కాంగ్ ప్రజలు
ఇంకా పెళ్లి కాలేదా?! అంటూ ఎందుకు జాలి చూపుతుంటారు? జంట లేకుండా ఒంటరిగా జీవించటం తప్పా?
‘ఉచిత వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ ఉందా? లేదా?’ - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
పథకాలలో కేంద్రం వాటా ఒక్క పైసా ఉన్నాకేంద్ర నాయకుల పేరు ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ప్రజలకు అందే ప్రతి స్కీమ్ లో కేంద్ర రాష్ట్రాల వాటా ఉంటుందనీ, కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతున్నాయనీ, తెలంగాణలోనే కాకుండా దేశమంతా ఇదే జరుగుతుందనీ ఆమె చెప్పారు.
శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఆదాయంలో హైదరాబాద్ వాటా 55% ఉంటుందని, అలాగని అదిలాబాద్ ప్రాజెక్ట్ కి హైదరాబాద్ టాక్స్ పేయర్ డబ్బు అని రాస్తారా? అని నిర్మల అన్నారు.
"ఎవరిని తీయాలి ఎవరిని పెట్టాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను నిన్న కలెక్టర్ తో ఎక్కడా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడలేదు. నిధుల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పు దోవ పట్టిస్తే ఈ విషయాలు అన్నింటినీ ప్రజల్లోకి వెళ్లి చెప్తాం. ఉచిత వాగ్దానాలకు సరిపడా బడ్జెట్ ఉందా? లేదా? చూసుకోవాలి" అని నిర్మల సీతారామన్ అన్నారు.
నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
ఆర్టెమిస్ అంటే ఏంటి? చంద్రుడి మీదకు మనుషుల్ని నాసా ఎలా తీసుకెళ్తుంది, ఎలా తీసుకొస్తుంది?
పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చుతున్నారు.. ఇది రాజ్యాంగ బద్ధమా?: నితీశ్ కుమార్
మణిపూర్‌లో జనతా దళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రంలో అధికార బీజేపీలో విలీనం కావటం ‘రాజ్యాంగబద్ధమా’ అని జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశ్నించారు.
‘‘ఎన్‌డీఏ నుంచి మేం విడిపోయాక.. మణిపూర్‌లోని మా పార్టీ ఎమ్మెల్యేలు ఆరుగురూ వచ్చి మమ్మల్ని కలిశారు. తాము జేడీయూతోనే ఉన్నామని వారు గట్టిగా చెప్పారు’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఇప్పుడు ఏం జరుగుతోందనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరముంది. వాళ్లు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చుతున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా?’’ అని నితీశ్ ప్రశ్నించారు.
2024 పార్లమెంటు ఎన్నికలకు ప్రతిపక్షాలు ఏకమవుతాయని కూడా నితీశ్ కుమార్ చెప్పారు.
క్రికెట్ బాల్, టెన్నిస్ బాల్ సైజులో ఉండే వడగండ్లు పడటం ఇక సాధారణంగా మారుతుందా?
పొరపాటున ఇతర అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బును తిరిగి పొందడం ఎలా?
సెరెనా విలియమ్స్: తెల్లవారి టెన్నిస్‌ను ఏలిన నల్లజాతి రారాణి... 'గ్రేట్ లెజెండ్' ప్రస్థానం ఎలా సాగింది?
ముఖ్యమంత్రికి రక్తంతో లేఖ రాసి తండ్రికి శిక్ష పడేలా చేసిన కూతురు
గోటాబయ రాజపక్ష: శ్రీలంక నుంచి పారిపోయి మళ్ళీ స్వదేశం చేరుకున్న మాజీ అధ్యక్షుడు
తైవాన్‌కు 110 కోట్ల ఆయుధాల విక్రయానికి అమెరికా ఒప్పందం.. చైనా ఆగ్రహం
తైవాన్‌కు 110 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించటానికి అమెరికా అంగీకరించింది. ఇది చైనాకు ఆగ్రహం కలిగిస్తోంది.
ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద ఒక రాడార్ సిస్టమ్‌ను, యుద్ధనౌకల విధ్వంసక, క్షిపణి విధ్వంసక మిసైళ్లను తైవాన్‌కు అమెరికా అందిస్తుంది. ఈ ఒప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభించాల్సి ఉంది.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ గత నెలలో తైవాన్‌లో పర్యటించారు. గత పాతికేళ్లలో తైపీని సందర్శించిన ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధి ఆమె.
అప్పుడు కూడా చైనా తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ చుట్టూ భారీ స్థాయి సైనిక విన్యాసాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో తైవాన్‌తో అమెరికా తాజా ఆయుధ విక్రయ ఒప్పందాన్ని ఖరారు చేసింది. దీనిపట్ల కూడా చైనా తీవ్రంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని, లేదంటే ‘ప్రతి చర్యల’ను ఎదుర్కోవాలని వాషింగ్టన్ డీసీలోని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది.
అమెరికా, చైనాల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా ఏంబసీ అధికార ప్రతినిధి లియు పెంగ్యూ చెప్పారు.
స్వయం పాలిత తైవాన్‌ను చైనాలో అంతర్భాగంగా బీజింగ్ పరిగణిస్తుంది. తైవాన్ చైనాలో ఐక్యం కావాలని పట్టుపడుతోంది.
మణిపూర్: బీజేపీలో విలీనమైన ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు
మణిపూర్‌లో జనతా దళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు అధికార భారతీయ జనతా పార్టీలో కలిసినట్లు మణిపూర్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది.
జేడీ(యూ) ఎమ్మెల్యేలు, బీజీపీలో విలీనం కావటాన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూలు కింద స్పీకర్ ఆమోదించినట్లు ఆ ప్రకటన చెప్పింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 60 శాసనసభ స్థానాల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)కు ఆరు సీట్లు లభించాయి. నితీశ్ కుమార్ ఇటీవల బీహార్‌లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్‌జేడీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో మణిపూర్‌లో జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన సెరెనా విలయమ్స్.. చివరి మ్యాచ్‌లో ఓటమి
సెరెనా విలియమ్స్ అమెరికా ఓపెన్ టోర్నీకి, తన సుదీర్ఘ కెరీర్‌కు.. భావోద్వేగాల నడుమ వీడ్కోలు చెప్పారు.
న్యూయార్క్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ అజ్లా టొమిల్యానోవిక్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి సెరెనా ఓడిపోయారు. ఇదే తన కెరీర్ చివరి మ్యాచ్ అని ఆమె పరిగణిస్తున్నారు.
ఈ నెలలో 41వ పుట్టిన రోజు చేసుకోనున్న సెరెనా 27 ఏళ్ల సుదీర్ఘ టెన్నీస్ కెరీర్‌లో.. 23 సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. ఆమె సుదీర్ఘ కాలం పాటు వరల్డ్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు.
టెన్నిస్‌లో ఇప్పటివరకూ అతి గొప్ప క్రీడాకారిణి సెరెనా అని విస్తృతంగా భావిస్తున్నారు.
చివరి మ్యాచ్‌లో సెరెనా విలియమ్స్ 7-5, 6-7, (4-), 6-1 పాయింట్లతో పోరాడి ఓడిపోయారు.
న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆష్ స్టేడియం నుంచి ఆమె నిష్క్రమిస్తున్నపుడు.. స్టేడియంలో నిలుచోగలిగిన ప్రతి ఒక్కరూ నిలుచుని వీడ్కోలు చెప్పారు.
ఆమె వీడ్కోలు చెప్తూ చేయి ఊపి.. తన శైలిలో ట్విర్ల్ చేస్తుండగా.. టీనా టర్రన్ పాప్ క్లాసిక్ ‘సింప్లీ ద బెస్ట్’ అనే పాట సౌండ్ సిస్టమ్‌లో ప్లే చేశారు.
కోర్టు మధ్యలో ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు సెరెనా విలియమ్స్‌కు కన్నీళ్లు వచ్చాయి. తన కుటుంబానికి, తన టీమ్‌కు, ప్రేక్షకులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు.. ఇన్నాళ్లుగా తనకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.