ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్డేట్స్ ముగిశాయి. బీబీసీ తెలుగు వార్తలు, విశ్లేషణల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చీఫ్ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఈ పేజీలో లైవ్ అప్డేట్స్ ముగిశాయి. బీబీసీ తెలుగు వార్తలు, విశ్లేషణల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో పవన్ అభిమానులు లీలామహల్ థియేటర్ లోపల బీభత్సం సృష్టించారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా బెనిఫిట్ షో వేశారు. ఈ షో పూర్తైయన తర్వాత హాల్ లోని సీట్లు, స్ర్కీన్, ఇతర పరికరాలు అన్నీ కూడా ధ్వంసమై, ధియేటర్ మొత్తం చిందరవందరంగా కనిపించింది.
థియేటర్ కెపాసిటీ 700 అయితే 2 వేల మంది వరకు వచ్చారని ధియేటర్ యాజమాన్యం చెప్పింది. వీరిని సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోయారని థియేటర్ నిర్వాహకులు తెలిపారు.
“సినిమా థియేటర్ లోపల, బయట కూడా ఫ్యాన్స్ డీజేలతో హంగామా చేశారు. ఒక దశలో అత్యుత్సాహం చూపించి సినిమా హాల్‌లోని సీట్లను ధ్వంసం చేశారు. స్ర్కీన్ ను కూడా డ్యామేజ్ చేశారు. థియేటర్ అంతా పేపర్లు, బీరు సీసాలతో నింపేశారు. మేం కంట్రోల్ చేయలేకపోయాం. పోలీసులు వచ్చినా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అక్కడ కనిపించింది.
థియేటర్‌పై పవన్ అభిమానులు చేసిన విధ్వంసానికి రూ. 15 నుంచి 18 లక్షల వరకు నష్టం జరిగింది. ఈ నష్టంతో పాటు మరో నెల రోజుల పాటు థియేటర్ లో షోలు వేయలేని పరిస్థితి ఉంది. పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాం” అని ధియేటర్ యాజమాని బాబీ బీబీసీతో చెప్పారు.
“థియేటర్ యాజమాన్యం రాత్రి సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి, పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాం. అక్కడ బయట, లోపల కూడా గందరగోళం కనిపించింది. అయితే ప్రస్తుతం దీనిపై ఇంకా ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అనే విషయాలపై ఎంక్వైరీ చేస్తున్నాం” అని టూ టౌన్ సీఐ సోమ శేఖర్ చెప్పారు.
“రాష్ట్రంలో చాలా థియేటర్లో ఇదే పరిస్థితి. ఇది గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేశారా లేదా అనేది అనుమానమే. లీలామహల్ లో ఏం జరిగిందో సమాచారం సేకరిస్తే.. గందరగోళంలో ఎవరు ఎవరో తెలియని పరిస్థితిలో ఇదంతా జరిగినట్లు తెలిసింది. ఎవరు చేసినా ఇది మాత్రం తప్పే” అని జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి సురేష్ బీబీసీతో చెప్పారు.
సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
చీఫ్ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది.
2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు సహాయం చేసినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టిందని ఆమె తరఫు లాయర్ కపిల్ సిబల్ వాదించారు.
గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనలర్ తుషార్ మెహ్తా వాదనలు వినిపించగా... తీస్తాను కస్టడీలోకి తీసుకున్న తరువాత గత రెండు నెలలలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సంపాదించారో కోర్టుకు చెప్పాలని ధర్మాసనం కోరింది.
ఇంకా ఆమెను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పదవీచ్యుతురాలైన మియన్మార్ నేత ఆంగ్‌సాన్ సూచీకి మరో మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి మిలటరీ కోర్టు తీర్పు చెప్పింది.
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు ఈ శిక్ష విధించింది.
ఇప్పటికే ఆమెకు 11 కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష పడగా మరికొన్ని కేసులు ఇంకా పెండింగులో ఉన్నాయి.
అన్ని కేసుల్లోనూ ఆమెకు శిక్ష ఖరారైతే ఆ శిక్ష 200 ఏళ్ల వరకు ఉండొచ్చని అక్కడి న్యాయవాదులు చెబుతున్నారు.
సూచీ అధికారంలోకి రావడానికి ముందు కూడా అనేక ఏళ్ల పాటు గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
అర్జెంటీనా వైస్ ప్రెసిడెంట్ క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్‌నర్ తృటిలో తుపాకీ దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.
ఆమెపై కాల్పులు జరిపేందుకు ఓ సాయుధుడు ప్రయత్నించగా.. సరిగ్గా గురిచూసి కాల్చే సమయంలో తుపాకీ జామ్ అయిపోవడంతో కాల్పుల దాడి ప్రణాళిక అమలు చేయలేకపోయాడు.
క్రిస్టినా తన ఇంటి ఎదుట చేరిన మద్దతుదారులకు అభివాదం చేస్తుండగా గుంపు మధ్యలోంచి ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీ తీసి ఆమె తలకు గురిపెట్టాడు. అయితే, తుపాకీ జామ్ కావడంతో ఆయన కాల్చలేకపోయాడు.
ఈ ఘటన అనంతరం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ మాట్లాడుతూ... కాల్పులకు ప్రయత్నించిన సాయుధుడి తుపాకీలో 5 బుల్లెట్లు ఉన్నాయని చెప్పారు.
కాగా అవినీతి ఆరోపణల కేసులో విచారణ ఎదుర్కొటున్న క్రిస్టినా కోర్టు నుంచి ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.
తనపై అవినీతి ఆరోపణలు అవాస్తవమని క్రిస్టినా చెబుతున్నారు.
మరోవైపు హత్యకు యత్నించిన సాయుధుడిని పోలీసులు గుర్తించారు. బ్రెజిల్ జాతీయుడైన 35 ఏళ్ల వ్యక్తి ఈ దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా క్రిస్టినా ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించిన వీడియోను స్థానిక మీడియా, మరికొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంవైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విక్రాంత్ కేవలం యుద్ధ నౌక కాదని.. 21వ శతాబ్దపు భారత దేశపు నిబద్ధత, నిపుణతకు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు.
కేరళ తీరం నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుక సాక్షిగా ప్రతి భారతీయుడూ భవిష్యత్ నవోదయాన్ని వీక్షిస్తున్నాడని మోదీ అన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ చేరికతో భారత నౌకాదళ సత్తా మరింత పెరగనుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
స్వదేశీ తయారీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని మోదీ ఇండియన్ నేవీకి అప్పగించారు.
కేరళలోని కోచి షిప్పింగ్ యార్డ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
భారత సముద్రయాన చరిత్రలోనే సొంతంగా తయారుచేసిన అతి పెద్ద యుద్ధ నౌక ఇదే.
1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. భారత నౌకాదళంలో సుదీర్ఘకాలం సేవలందించి ఇంతకుముందు డీకమిషన్ అయిన విక్రాంత్ నౌక పేరునే దీనికీ పెట్టారు.
262 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తుండే ఐఏసీ విక్రాంత్ నౌకలో ఉన్నప్పుడు సముద్రంలో అలల ప్రభావం పెద్దగా కనిపించదు.
లోపల భిన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఉన్నాయి.
వీటి సాయంతో చాలా తేలిగ్గానే అటూఇటూ వెళ్లొచ్చు. ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల వల్ల పెద్దగా వేడి, చలి కూడా తెలియదు.
ఐఏసీ విక్రాంత్ ఫ్లైట్ డెక్ పరిమాణం 12,500 చదరపు మీటర్లు.
అంటే రెండున్న హాకీ మైదాలకు ఇది సమానం. ఒకేసారి 12 విమానాలు, ఆరు హెలికాప్టర్లను ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.