కేసీఆర్‌కు బిహార్‌లో అవమానం జరిగిందా? బీజేపీ నేతలు షేర్ చేస్తున్న ఈ వీడియోలో ఏముంది?

కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే జర్నలిస్టులను ఇక చాలన్నట్లుగా వెళ్లమని చేతితో సంజ్ఞ చేశారు నితీశ్ కుమార్. నితీశ్‌, తేజస్వి యాదవ్‌తో పాటు అక్కడున్న మిగతావారూ తమ సీట్ల నుంచి లేచి నిల్చున్నారు కూడా.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం.. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.

    ధన్యవాదాలు!

  2. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను త్వరలో దేశానికి అందిస్తాం: ఆదార్ పూనావాలా

    ఆదార్ పూనావాలా

    ఫొటో సోర్స్, ANI

    సర్వైకల్ క్యాన్సర్‌ రాకుండా నిరోధించే వ్యాక్సీన్ మరి కొన్ని నెలల్లో భారతదేశంలో అందుబాటులోకి రానుందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు.

    సాధారణంగా యువ మహిళల్లో కనిపించే సర్వైకల్ క్యాన్సర్‌ను నిరోధించటానికి ఈ వ్యాక్సీన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దేశీయంగా అభివృద్ధి చేసింది.

    ‘‘ఈ వ్యాక్సీన్‌ను తొలుత మన దేశానికి ఇచ్చి, ఆ తర్వాత ప్రపంచానికి ఇస్తాం’’ అని ఆయన చెప్పారు.

    ఈ వ్యాక్సీన్ ధర రూ. 200 నుంచి రూ. 400 మధ్య ఉండవచ్చునని, అయితే ధరలను ఇంకా ఖరారు చేయలేదని ఆయన తెలిపారు.

    రెండేళ్లలో 20 కోట్ల డోసులను తయారు చేయటానికి సిద్ధమవుతున్నట్లు పూనావాలా చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఆడపిల్లలు పుట్టారని భర్త వదిలేశాడు... ఆ తల్లి బిర్యానీ అమ్ముతూ ఐదుగురు కూతుళ్ళను సాకుతోంది

  4. నరేంద్ర మోదీ: ‘అవినీతిపరులను కాపాడటానికి కొందరు ఏకమవుతున్నారు’

    నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం నాడు కేరళ పర్యటనలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు ఎక్కుపెట్టారు.

    ‘‘దేశ ప్రగతికి అవినీతి అతిపెద్ద అవరోధం. అవినీతి మీద నిర్ణయాత్మక పోరు సల్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆగస్టు 15వ తేదీన నేను ఎర్రకోట మీద చెప్పాను. అవినీతి మీద పోరాటం తీవ్రమవుతుంటే.. రాజకీయాల్లో ఏకీకరణ పెరుగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించటానికి కొందరు జట్టుకడుతున్నారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

    కేరళలోని కోచిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయటానికి, ప్రారంభోత్సవం చేయటానికి మోదీ వచ్చారు.

    ‘‘ఓనం పండుగ సందర్భంగా కేరళకు రూ. 4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. హిమాలయాల్లోని 'రహస్య స్వర్గపు లోయల' మర్మమేంటి? ఈ ‘బీయూల్‌’ల గురించి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టారా?

  6. పరీక్షల్లో మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేశారంటూ.. టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు

  7. కేసీఆర్‌లా మీడియా ముందు నిలబడి, ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ప్రధానికే లేదు: టీఆర్ఎస్

    కేసీఆర్, నితీశ్‌కుమార్

    ఫొటో సోర్స్, @ysathishreddy

    కేసీఆర్ బీహార్ పర్యటనలో జరిగింది ఒకటైతే.. అక్కడ ఏదో జరిగినట్టు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్‌ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.

    ‘‘మోడీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి నితీశ్ కుమార్ మద్దతిస్తున్నారు కాబట్టే.. బీహార్‌కు ఆహ్వానించారు. ఆ ప్రెస్‌మీట్లో ఉన్న బీజేపీ అనుకూల మీడియా ప్రతినిధులు కావాలనే కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు వేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అటు నితీశ్‌కుమార్‌ను, ఇటు కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రశ్నలు అడిగారు. పదే పదే అవే ప్రశ్నలు వేశారు. అందుకే.. “ఇక ప్రశ్నలు అడగొద్దు.. ధన్యవాదాలు..” అంటూ నితీశ్ కుమార్ లేచి నిలబడ్డారు. అంతేగానీ బీజేపీవాళ్లు ప్రచారం చేస్తున్నట్టు కేసీఆర్‌తో సమ్మతి లేకపోవడం వల్ల కాదు’’ అని పేర్కొన్నారు.

    ‘‘వాస్తవానికి మీడియా ముందు నిలబడి, ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము దేశప్రధానికే లేదు. ప్రధాని అయ్యి 8 ఏళ్లు అవుతున్నా ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తారు. కానీ కేసీఆర్ అలా కాదు. రాష్ట్రంలో అయినా, పొరుగురాష్ట్రాలకు వెళ్లినా సరే.. అక్కడి మీడియా అడిగే ప్రశ్నలకు సమాదానాలిస్తారు. ప్రశ్నలన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. బిహార్ లోనూ అదే జరిగింది’’ అని వివరించారు.: టీఆర్ఎస్

    కేసీఆర్ బీహార్ పర్యటనలో జరిగింది ఒకటైతే.. అక్కడ ఏదో జరిగినట్టు బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్‌ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.

    ‘‘మోడీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి నితీశ్ కుమార్ మద్దతిస్తున్నారు కాబట్టే.. బీహార్‌కు ఆహ్వానించారు. ఆ ప్రెస్‌మీట్లో ఉన్న బీజేపీ అనుకూల మీడియా ప్రతినిధులు కావాలనే కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలు వేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

    ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అటు నితీశ్‌కుమార్‌ను, ఇటు కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రశ్నలు అడిగారు. పదే పదే అవే ప్రశ్నలు వేశారు. అందుకే.. “ఇక ప్రశ్నలు అడగొద్దు.. ధన్యవాదాలు..” అంటూ నితీశ్ కుమార్ లేచి నిలబడ్డారు. అంతేగానీ బీజేపీవాళ్లు ప్రచారం చేస్తున్నట్టు కేసీఆర్‌తో సమ్మతి లేకపోవడం వల్ల కాదు’’ అని పేర్కొన్నారు.

    ‘‘వాస్తవానికి మీడియా ముందు నిలబడి, ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము దేశప్రధానికే లేదు. ప్రధాని అయ్యి 8 ఏళ్లు అవుతున్నా ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే చెప్పాలనుకున్నది చెప్పి వెళ్తారు. కానీ కేసీఆర్ అలా కాదు. రాష్ట్రంలో అయినా, పొరుగురాష్ట్రాలకు వెళ్లినా సరే.. అక్కడి మీడియా అడిగే ప్రశ్నలకు సమాదానాలిస్తారు. ప్రశ్నలన్నీ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. బిహార్ లోనూ అదే జరిగింది’’ అని వివరించారు.

  8. పోర్చుగల్‌లో భారత గర్భిణి ఎలా చనిపోయారు, ఆ దేశ ఆరోగ్య మంత్రి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

  9. రష్యా: ‘ఆస్పత్రి కిటికీ నుంచి పడిపోయి’ చనిపోయిన చమురు దిగ్గజ సంస్థ అధినేత

    వ్లాదిమిర్ పుతిన్‌తో రవిల్ మగనోవ్

    ఫొటో సోర్స్, KREMLIN

    ఫొటో క్యాప్షన్, రవిల్ మగనోవ్‌కి 2019లో అధ్యక్షుడు పుతిన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఇచ్చారు

    రష్యాకు చెందిన చమురు వ్యాపార దిగ్గజ సంస్థ ల్యూకాయిల్ అధినేత రవిల్ మగనోవ్.. మాస్కోలో ఆస్పత్రి కిటికీ నుంచి జారిపడి చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయన వయసు 67 సంవత్సరాలు.

    మగనోవ్ మరణాన్ని ల్యూకాయిల్ ధృవీకరించింది. అయితే.. ‘‘తీవ్రంగా జబ్బుపడ్డ అనంతరం ఆయన కన్నుమూశారు’’ అని మాత్రమే చెప్పింది.

    కానీ.. మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స చేస్తున్నారని, ఆయన ఆస్పత్రి కిటికీ నుంచి కిందపడి గాయాలతో చనిపోయారని రష్యా మీడియా కథనాలు చెప్తున్నాయి.

    రష్యాలో ఉన్నతస్థాయి వ్యాపార ప్రముఖులు ఇటీవలి కాలంలో అంతుచిక్కని పరిస్థితుల్లో చనిపోతున్నారు. ఆ క్రమంలో తాజాగా మగలోవ్ మరణం సంభవించింది.

    ఆయన ఎలా చనిపోయారనేది తేల్చేందుకు తాము ఘటనా స్థలం వద్ద దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు చెప్పారు.

    ఆయన ఆరో అంతస్తులోని కిటికీ నుంచి కిందపడ్డారని అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ టాస్ వార్తా సంస్థ తొలుత చెప్పింది. ఆ తర్వాత.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది.

    యుక్రెయిన్‌ మీద రష్యా దండయాత్ర మొదలుపెట్టిన వెంటనే.. ఈ ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ల్యూకాయిల్ బోర్డు పిలుపునిచ్చింది. ‘‘ఈ విషాదపు’’ బాధితులకు సానుభూతి కూడా తెలిపింది.

    ఈ బోర్డు అధ్యక్షుడు, బిలియనీర్ అయిన విగిట్ అలెక్పెరోవ్ మీద బ్రిటన్ గత ఏప్రిల్‌లో ఆంక్షలు విధించింది. దీంతో ఆయన బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

    ఇటీవలి నెలల్లో రష్యా ఇంధన సంపన్నులు కొందరు అసాధారణ పరిస్థితుల్లో చనిపోయారు.

    నొవాటెక్ సంస్థ మాజీ మేనేజర్, మిలియనీర్ సెర్గీ ప్రొటోసేన్యా‌తో పాటు.. ఆయన భార్య, కుమార్తెలు కూడా ఏప్రిల్‌లో ఒక స్పానిష్ విల్లాలో విగతజీవులుగా కనిపించారు.

    గజ‌ప్రోమ్‌బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షుడు వ్లాదిస్లావ్ అవయేవ్, ఆయన భార్య, కూతురు.. ఏప్రిల్ నెలలోనే మాస్కోలోని వారి ఫ్లాట్‌లో చనిపోయి కనిపించారు.

    ల్యూకాయిల్ మాజీ టైకూన్ అలెగ్జాండర్ సుబోటిన్ మే నెలలో గుంబో జబ్బుతో చనిపోయారు. గుండె సమస్యకు నాటు మందు తీసుకున్న తర్వాత ఆయన చనిపోయినట్లు చెప్పారు.

  10. 'మూత్రాన్ని నోటితో శుభ్రం చేయించేవారు' ... పనిమనిషిని వేధించిన బీజేపీ నేత సీమా పాత్రా ఉదంతం ఎలా వెలుగులోకి వచ్చింది?

  11. ఆర్ఎస్ఎస్‌ను ప్రశంసించిన మమతబెనర్జీపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు

    మమత బెనర్జీ

    ఫొటో సోర్స్, Getty Images

    పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమత బెనర్జీపై ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

    ఆర్ఎస్ఎస్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ అభ్యంతరం తెలిపారు.

    2003లో ఆర్ఎస్ఎస్‌ ‘దేశభక్తులు’ అన్నారని.. అందుకు బదులుగా ఆమెను ఆర్ఎస్ఎస్ దుర్గాదేవిగా అభివర్ణించదని గుర్తుచేస్తూ ఒవైసీ ఓ వీడియోను షేర్ చేశారు. ఆర్ఎస్ఎస్ హిందూరాజ్య స్థాపనను కోరుకుంటోందని.. ఆర్ఎస్ఎస్ చరిత్రంతా ముస్లిం వ్యతిరేక విద్వేష నేరాలతోనే నిండిపోయిందని అసదుద్దీన్ అన్నారు.

    గుజరాత్ అల్లర్ల తరువాతా మమత బెనర్జీ బీజేపీని సమర్థించారని ఒవైసీ అన్నారు.

    ఒవైసీ ఒక వీడియోను కూడా షేర్ చేశారు. అందులో మమత... ‘ఆర్ఎస్ఎస్ అంత చెడ్డదేమీ కాదు. ఆర్ఎస్ఎస్ చెడ్డదని నేను అనుకోవడం లేదు. ఆర్ఎస్ఎస్‌లో ఇప్పటికీ మంచివారు, నిజాయితీగలవారు ఉన్నారు.వారంతా బీజేపీని సపోర్ట్ చేయరు’ అని అన్నారు.

    ఈ వీడియోను కొందరు కాంగ్రెస్, వామపక్ష నేతలూ షేర్ చేసి మమతపై విమర్శలు చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. మనిషిని మోస్తూ గాల్లో విహరించే డ్రోన్‌ను తయారు చేసిన పుణె కంపెనీ

  13. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక యుద్ధనౌక

  14. కేసీఆర్ మాట్లాడుతుంటే ఇక చాలంటూ లేచి నిల్చున్న నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్, వైరల్ వీడియోతో కేసీఆర్‌ను ట్రోల్ చేస్తున్న బీజేపీ నేతలు

    kcr, nitish kumar , tejaswi yadav

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్‌లో రాజకీయ పర్యటన జరిపిన కేసీఆర్ అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్‌... ఆర్జేడీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లతో కలిసి సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

    దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోను బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేసీఆర్‌ను ట్రోల్ చేస్తున్నాయి.

    ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

    విలేఖరుల సమావేశంలో జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్నలకే కేసీఆర్ సమాధానాలిస్తున్నారు. ప్రధాని పదవికి నితీశ్ కుమార్ పేరు ప్రతిపాదిస్తారా అని జర్నలిస్టులు అడగ్గా.. అలా ప్రతిపాదించడానికి నేనెవరు? అన్నారు కేసీఆర్.

    అయితే, కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే జర్నలిస్టులను ఇక చాలన్నట్లుగా వెళ్లమని చేతితో సంజ్ఞ చేశారు నితీశ్ కుమార్. నితీశ్‌, తేజస్వి యాదవ్‌తో పాటు అక్కడున్న మిగతావారూ తమ సీట్ల నుంచి లేచి నిల్చున్నారు కూడా.

    అయినా కేసీఆర్ మాత్రం వెళ్లొద్దు.. వెళ్లొద్దు.. కూర్చోండి మాట్లాడుకుందాం అంటూ పక్కనే ఉన్న నితీశ్ చేయి పట్టుకుని ‘ఆప్ బైటియే సాబ్’ అంటూ కూర్చోబెడుతుండడం ఆ వీడియలో కనిపిస్తోంది.

    దాంతో నితీశ్, తేజస్విలు కూర్చుని కొన్ని సెకండ్లలోనే మళ్లీ లేచి నిల్చున్నారు.

    కేసీఆర్ మాత్రం ‘బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలా పార్టీలను ఏకం చేసిన తరువాత అందరం కలిసి నిర్ణయించుకుని చెబుతాం’ అన్నారు కేసీఆర్.

    ఆ సమయంలో నితీశ్ కుమార్ నిల్చుని.. ‘అయిపోయింది.. ఇక వెళ్దాం’ అని హిందీలో అనడం వినిపిస్తుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ అవమానపడడానికే కేసీఆర్ బిహార్ వెళ్లారా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

    బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ ఈ వీడియో షేర్ చేసి ‘ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడానికే కేసీఆర్ పట్నా వెళ్లారా?’ అంటూ ట్వీట్ చేశారు.

    ‘విలేఖరుల సమావేశంలో కేసీఆర్ చెబుతున్నది పూర్తి చేసే అవకాశం ఇవ్వాలన్న కనీస మర్యాద కూడా నితీశ్ కుమార్ ఇవ్వలేదు. పూర్తి చేయనివ్వాలంటూ కేసీఆర్ కోరుతున్నా నితీశ్ పట్టించుకోలేదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    బిహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ కూడా దీనిపై ట్వీట్ చేశారు.

    ‘ప్రధాని పదవికి తన పేరు చెప్పాలన్న కోరికతో కేసీఆర్‌ను నితీశ్ కుమార్ పిలిచారు. కానీ, ఆయన నితీశ్ పేరు చెప్పకపోవడంతో నితీశ్ లేచి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి తయారయ్యారు’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  15. గత 6 నెలలుగా ప్రతి నెలా రూ. 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగా వసూలవుతున్న జీఎస్టీ

    ఈ ఏడాది ఆగస్ట్‌లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,43,612 కోట్లు. గత ఏడాది(2021) ఆగస్ట్‌తో పోల్చితే ఇది 28 శాతం ఎక్కువని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    గత ఆరు నెలలుగా ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ. 1.4 లక్షలు దాటి ఉంటున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. కాంగ్రెస్, బీజేపీల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా జరుగుతుంది?

  17. వీగర్ ముస్లింలపై చైనా అమానుష నేరాలకు పాల్పడింది: ఐరాస నివేదికలో వెల్లడి

    చైనాకు వ్యతిరేకంగా నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    చైనా అక్కడి జిన్‌జియాంగ్ రాష్ట్రంలో అకృత్యాలకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఐరాస ఆరోపించింది.

    ఈ నివేదికను విడుదల చేయొద్దంటూ చైనా ఐరాసను కోరింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు తాము పాల్పడ్డామన్నది అసత్యమని.. ఇదంతాపాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్న అవాస్తవాలని చైనా ఆరోపించింది.

    అయితే, అక్కడి వీగర్ ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాకులపై అకృత్యాలు జరిగాయనడానికి ఆధారాలు ఉన్నాయని ఐరాస నివేదిక వెల్లడిస్తోంది.

    Michelle Bachelet

    ఫొటో సోర్స్, Getty Images

    ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌గా నాలుగేళ్లు సేవలందించిన మిషెల్లీ బాషెలెట్ తన ఉద్యోగంలో చివరి రోజున ఈ నివేదిక విడుదల చేశారు.

    అల్పసంఖ్యాకుల హక్కులను హరిస్తూ, ఏకపక్షమైన నిర్బంధ వ్యవస్థలను స్థాపించుకోవడానికి వీలుగా చైనా తన దేశంలోని జాతీయ భద్రత చట్టాలను దుర్వినియోగం చేస్తోందని మిషెల్ బృందం ఈ నివేదికలో ఆరోపించింది.

    జిన్‌జియాంగ్ రాష్ట్రంలో వీగర్లు, ఇతర మైనారిటీలను జైళ్లలో పెట్టి వారిపై లైంగిక వేధింపులకూ పాల్పడ్డారని నివేదిక బయటపెట్టింది.

    ఇంకొందరు బలవంతపు కుటుంబ నియంత్రణ చికిత్సలకు బలయ్యారని పేర్కొంది.

    ఈ క్రమంలో స్వేచ్ఛను కోల్పోయిన వేధింపుల బాధితులందరినీ విడుదల చేయడానికి చైనా తక్షణం చర్యలు చేపట్టాలని ఐరాస సూచించింది.

    చైనా అమానుషమైన నేరాలకు పాల్పడిందని ఐరాస పేర్కొంది.

  18. కేజ్రీవాల్ అబద్ధం చెప్పారా? దేశంలో ఫస్ట్ వర్చువల్ స్కూల్ ఏది?, దిల్లీ సీఎం కేజ్రీవాల్ క్లెయిమ్‌ను ఖండించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్

    kejriwal

    ఫొటో సోర్స్, Getty Images

    దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్ ప్రారంభిస్తున్నామన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనను ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్’(ఎన్ఐఓఎస్) ఖండించింది.

    దేశంలోనే మొట్టమొదటి ఓపెన్ స్కూల్‌ను కేంద్ర ప్రభుత్వం 2021 ప్రారంభించిందని ఎన్ఐఓఎస్ పేర్కొంది. 2022 ఆగస్ట్ 31న దిల్లీ ప్రభుత్వం దేశంలోనే తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభించిందని కేజ్రీవాల్ చెప్పారని మీడియాలో వస్తున్న కథనాలు తప్పు అని పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    బుధవారం(ఆగస్ట్ 31) దిల్లీ ప్రభుత్వం ‘దిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’ను ప్రారంభించింది.

    ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్‌ను దిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభిస్తున్నాం’ అని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఈ వర్చువల్ స్కూల్‌లో చేరొచ్చని కేజ్రీవాల్ అన్నారు.

    బుధవారం నుంచి దీనికి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైందని కేజ్రీవాల్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కాగా కేజ్రీవాల్ క్లెయిమ్ సరికాదని ఎన్ఐఓఎస్ పేర్కొంది. 2021లో ప్రారంభమైన తొలి వర్చువల్ స్కూల్ ఎన్ఐఓఎస్‌కు దేశవ్యాప్తంగా 7 వేల స్టడీ సెంటర్లు ఉన్నాయని చెప్పింది.

  19. మోదీకి థాంక్స్ చెప్పిన పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్.. ఎందుకంటే

    భారీ వరదల కారణంగా అతలాకుతలమవుతున్న పాకిస్తాన్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో భారత ప్రధాని మోదీ చేసిన ఓ ట్వీట్ రెండు దేశాల మధ్య సంబంధాలను కాస్త తేలికపర్చింది.

    భారత ప్రధాని మోదీ ట్వీట్‌కు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్పందించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పాకిస్తాన్‌లో వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ప్రజల కష్టాలపై మోదీ తన ఆవేదన వ్యక్తంచేస్తూ.. పాకిస్తాన్‌లో వరదలు సృష్టించిన విలయం చూసి చాలా బాధపడ్డానంటూ మోదీ ట్వీట్ చేశారు.

    బాధిత కుటుంబాలకు తన సానుభూతి ప్రకటించారు.

    వీలైనంత వేగం పాక్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    దీనికి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ట్విటర్ వేదికగా ప్రతిస్పందించారు. ‘పాకిస్తాన్‌లో వరదల కారణంగా ఏర్పడిన ఆస్తి, ప్రాణ నష్టాలపై స్పందించినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన ప్రతిస్పందించారు.

    ఈ ప్రకృతి విలయం నుంచి ప్రజలు కోలుకుంటారని అన్నారు.

    కాగా పాకిస్తాన్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి.

    అక్కడ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.