నేటి లైవ్ పేజీ ముగిస్తున్నాం.. ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.
ధన్యవాదాలు!
60 ఏళ్ల కేమిలో గవేరా గుండెపోటుతో చనిపోయినట్లు క్యూబా అధికారులు తెలిపారు. క్యూబా విప్లవంలో ఫిడెల్ కాస్ట్రోతో పాటు పోరాడిన తన తండ్రి చే గవేరా జీవిత విశేషాలను సేకరించడం, రికార్డ్ చేయడానికే కేమిలో తన కెరీర్‌లో ఎక్కువ సమయం కేటాయించారు.
ఇక్కడితో బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ తాజా అప్‌డేట్లతో రేపు ఉదయం కలుద్దాం.
ధన్యవాదాలు!
ఆసియా కప్‌లో భారత్ రెండో విజయాన్ని సాధించింది. బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచింది.
193 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన హాంకాంగ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్, విరాట్ కోహ్లి అర్ధసెంచరీలు చేశారు.
ఈ విజయంతో భారత్ సూపర్ 4కి చేరింది.

ఫొటో సోర్స్, Twitter/imVkohli
ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌పై భారత్ చెలరేగింది. సూర్యకుమార్ మెరుపులకు తోడు, విరాట్ కోహ్లి అర్ధసెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
దుబయ్‌లో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది.
సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలుపెట్టిన భారత్ మూడో ఓవర్‌లో దూకుడు పెంచింది. రోహిత్ శర్మ 6, 4తో పాటు రాహుల్ కూడా సిక్స్ బాదడంతో 22 పరుగులు రాబట్టింది.
అయితే, మరో ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ (13 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి అవుటయ్యాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో ఘనత సాధించాడు. టి20ల్లో 3500 పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
తొలి ఓవర్‌లో హరూన్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రోహిత్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ ఖాతాలో 3,499 టి20 పరుగులు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.
ఆ తర్వాత 10వ ఓవర్ వరకు భారత్ ఒక బంతిని మాత్రమే బౌండరీ దాటించగలిగింది. 9వ ఓవర్ మూడో బంతిని రాహుల్ సిక్సర్‌గా మలిచాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లి స్ట్రయిక్ రొటేట్ చేశాడు.
తాను ఎదుర్కొన్న 20వ బంతికి కోహ్లి తొలి ఫోర్ కొట్టాడు. మహమ్మద్ గజఫర్ బౌలింగ్‌లో కోహ్లి ఈ ఫోర్ బాదాడు. తర్వాత 13వ ఓవర్‌లో కోహ్లి సిక్సర్ కొట్టాడు. వెంటనే రాహుల్ (39 బంతుల్లో 36; 2 సిక్సర్లు) అవుటయ్యాడు. అప్పటికి భారత స్కోరు 13 ఓవర్లలో 94/2.
తొలి బంతికే ఫోర్
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు రావడంతో స్కోరు వేగం పెరిగింది. తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ మరుసటి బంతిని కూడా బౌండరీకి తరలించాడు.
ఇన్నింగ్స్ 16వఓవర్‌లో సిక్సర్‌తో కోహ్లి అర్ధసెంచరీకి సమీపించాడు. అదే ఓవర్‌లో సూర్యకుమార్ వరుసగా 4,6 బాదాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి.
17వ ఓవర్‌ను ఎహ్‌సాన్ కట్టుదిట్టంగా వేయడంతో భారత్ కేవలం 4 పరుగులే రాబట్టింది. అయితే శుక్లా వేసిన తర్వాతి ఓవర్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన యాదవ్, నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు.
మరోవైపు 40 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును అందుకున్నకోహ్లి, టి20ల్లో 31వ అర్ధసెంచరీని నమోదు చేశాడు. తర్వాత మరో సిక్సర్‌తో అలరించాడు.
ఇక చివరి ఓవర్‌లో సూర్యకుమార్ రెచ్చిపోయాడు. హరూన్ అర్షద్ 20వ ఓవర్‌లో బౌలింగ్‌కు రాగా వరుసగా తొలి మూడు బంతుల్ని భారీ సిక్సర్లుగా బాదాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఐదో బంతిని కూడా సిక్స్ కొట్టడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌కు అజేయంగా 42 బంతుల్లో 98 పరుగుల్ని జోడించారు.
ప్రత్యర్థి బౌలర్లలో అయూష్ శుక్లా, మొహమ్మద్ గజాఫర్ చెరో వికెట్ తీశారు.
హాంకాంగ్ గెలవాలంటే 193 పరుగులు చేయాలి
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, Getty Images
లాటిన్ అమెరికా విప్లవకారుడు చే గవేరా కుమారుడు ‘కేమిలో గవేరా మార్చ్’ కన్నుమూశారు.
60 ఏళ్ల కేమిలో గవేరా గుండెపోటుతో చనిపోయినట్లు క్యూబా అధికారులు తెలిపారు.
ఊపిరితిత్తులలో రక్తం అక్కడక్కడా గడ్డ కట్టడంతో గుండెపోటు వచ్చిన ఆయన చనిపోయారని చెప్పారు.
వెనెజ్వెలా రాజధాని కారకస్‌కు వెళ్లిన కేమిలో అక్కడ గుండెపోటుతో చనిపోయారని అధికారులు వెల్లడించారు.
క్యూబా విప్లవంలో ఫిడెల్ కాస్ట్రోతో పాటు పోరాడిన తన తండ్రి చే గవేరా జీవిత విశేషాలను సేకరించడం, రికార్డ్ చేయడానికే కేమిలో తన కెరీర్‌లో ఎక్కువ సమయం కేటాయించారు.
అల్బర్ట్ కోర్డా తీసిన తన తండ్రి ఫేమస్ ఫొటోగ్రాఫ్‌ను వాణిజ్య ప్రకటనలకు వాడుకోవడాన్ని కేమిలో తీవ్రంగా వ్యతిరేకించేవారు.
చే గవేరా కుమార్తె అలైదా తమ కుటుంబం తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరించే బాధ్యత తీసుకోగా... క్యూబా రాజధాని హవానాలోని ‘సెంటర్ ఆఫ్ చే గవేరా స్టడీస్’ బాధ్యతను కేమిలో చూసేవారు.
తండ్రి చే గవేరా బొలీవియాలో ప్రభుత్వ దళాల కాల్పుల్లో చనిపోయిన నాటికి కేమిలో వయసు అయిదేళ్లు.
కేమిలో లా చదువుకున్నప్పటికీ తన జీవితంలో ఎక్కువ భాగం తండ్రికి సంబంధించిన పత్రాలు, స్మారకాలు సంరక్షించడం... సేకరించడం వంటి పనుల్లోనే గడిపారు.
కేమిలోకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కేమిలో తల్లి అలీదా కూడా ఆయనతోనే ఉండేవారు.
చే గవేరా నలుగురు సంతానంలో కేమిలో రెండో వారు. ఆయనకు అక్క అలీదా, చెల్లెలు సెలియా, తమ్ముడు ఎర్నెస్టో ఉన్నారు.
అక్క అలీదా చిన్నపిల్లల డాక్టర్ కాగా చెల్లెలు వెటర్నేరియన్, తమ్ముడు మోటార్ సైకిల్ టూర్లు నిర్వహిస్తుంటారు.
సోనియా గాంధీ తల్లి పావోలా మాయినో ఇటలీలో మృతి చెందారు.
ఆమె ఆగస్ట్ 27న మృతి ఇటలీలోని తన స్వగృహంలో మరణించగా మంగళవారం(ఆగస్ట్ 30న) అంత్యక్రియలు పూర్తయినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కాగా సోనియా గాంధీ తల్లి మరణించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బిహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. ఆయన సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్డీదేవిలను వారి స్వగృహంలో కలిశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బిహార్ పర్యటనలో భాగంగా పట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు.
మోదీ 8 ఏళ్ల పాలనలో దేశం ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదని.. రైతులు, మహిళలు, పేదలకు మోదీ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని కేసీఆర్ అన్నారు.
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని.. భారతదేశాన్ని మార్చే ప్రభుత్వం కావాలని కేసీఆర్ అన్నారు.
విద్వేషాలు సృష్టించే శక్తులు దేశానికి ఎంతమాత్రం మంచివి కావని.. అందుకే విపక్షాలను ఏకం చేసే అంశంపై నితీశ్ కుమార్‌తో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు.
ప్రజల మద్దతుతో బీజేపీ ముక్త భారత్ కోసం కలిసి పనిచేయాలని నితీశ్ కుమార్‌ను కోరినట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, SICUS CARBONELL
స్పెయిన్‌లో కురిసిన వడగండ్ల వాన కారణంగా 20 నెలల బాలుడు మృత్యువాత పడ్డారు. మంగళవారం సాయంత్రం కాటలోనియాలోని గిరోనా రీజియన్‌లో పది నిమిషాల పాటు భీకర వడగండ్ల వాన కురిసింది.
భారీ స్థాయిలో ఉన్న ఒక మంచు గడ్డ, బాలుడి తలకు తగలడంతో ఆ చిన్నారి మరణించారు.
వడగండ్లలో ఒకటి 10 సెం.మీ వ్యాసాన్ని కలిగి ఉన్నట్లు కాటలోనియా వాతావరణ విభాగ శాఖ తెలిపింది.
ఈ వడగండ్ల కారణంగా దాదాపు 50 మంది గాయపడ్డారు. కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి పెద్ద గాయాలు అయ్యాయి. వాన కారణంగా ఇళ్ల పైకప్పులు, విద్యుత్ కేబుళ్లు ధ్వంసం అయ్యాయి.
2002 తర్వాత కాటలోనియాలో కురిసిన భారీ వర్షం ఇదే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
సీరం ఇన్స్టిటూట్ ఆఫ్ ఇండియా, డెపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సీన్ అభివృద్ధి చేశాయి.
'క్వాడ్రివలెంట్ హ్యూమన్ పాపిలోమావిరస్' అని పిలిచే ఈ టీకాను సెప్టెంబర్ 1న మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఈ వ్యాక్సీన్‌ను గురువారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ లాంచ్ చేయనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కోవిడ్ వర్కింగ్ గ్రూపు చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్ కే అరోరా మాట్లాడుతూ, "గర్భాశయ క్యాన్సర్‌కు భారత్‌లోనే వ్యాక్సీన్ అభివృద్ధి చేయడం చాలా ఉత్సాహకరమైన విషయం. మన కూతుళ్లు, మనుమరాళ్లు ఈ వ్యాక్సిన్ పొందుతారని, గర్భాశయ క్యాన్సర్ నుంచి తప్పించుకుంటారని ఆశిస్తున్నా" అన్నారని ఏఎన్ఐ తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
బిహార్ రాజధాని పట్నా చేరుకున్న కేసీఆర్‌కు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు.
బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా కేసీఆర్‌కు స్వాగతం పలికారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అనంతరం, ఇరువురు ముఖ్యమంత్రులూ కలిసి గల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరులైన బిహార్ సైనికుల కుటుంబాలకు చెక్కులు అందేశారు.
అలాగే, తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన 12 మంది బిహార్ కూలీల కుటుంబాలను పరిహారం అందించారు.

ఫొటో సోర్స్, ANI
బిహార్ నుంచి లక్షలాది మంది పని కోసం తెలంగాణ వస్తున్నారని, బిహార్ కార్మికులు తెలంగాణ అభివృద్ధికి ప్రతినిధులని కేసీఆర్ అన్నారు.
"గల్వాన్ లోయలో అమరుల త్యాగం ఎంతో గొప్పది. అమరుల కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటాం. గోదావరి తీరం నుంచి గంగా తీరానికి వచ్చాను. చాలా ఆనందంగా ఉంది" అన్నారు కేసీఆర్.
"బిహార్ కార్మికులకు, గల్వాన్ అమరవీరులకు పరిహారం అందించాలన్న ఆలోచన చాలా గొప్పది. అందుకు కేసీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. బిహార్ కార్మికుల గురించి మేం ఆలోచించాలి. కానీ, మీరు పట్టించుకున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా కార్మికులకు ఇలాంటి సాయం అందాలి" అని నితీశ్ కుమార్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తరువాత, నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్‌లతో సమావేశమై భారతదేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

ఫొటో సోర్స్, Facebook/Seema Patra
పనిమనిషిని చిత్రహింసలకు గురిచేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి భార్య సీమా పాత్రను రాంచీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాంచీలోని అర్గోరా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైందని ఏఎన్ఐ తెలిపింది.
పనిమనిషి ఆదివాసి కావడంతో సీమ పాత్రాపై ఎస్‌సీఎస్‌టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
సీమా పాత్రా ఇంట్లో పనిచేస్తున్న 29 ఏళ్ల మహిళను యజమానులు శారీరంగా హింసించారని, ఆగస్టు 22న తమ బృందం ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చి రక్షించిందని పోలీసులు తెలిపారు.
వెంటనే సీమా పాత్రాపై కేసు నమోదు చేశారు. ఆ మహిళకు వైద్య చికిత్సలు అందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్ ఈ కేసులో పోలీసుల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ప్రశ్నించారు.
మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
అయితే, ఇవి తప్పుడు ఆరోపణలని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సీమా పాత్రా వాదిస్తున్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు.
కాగా, పని చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే మేడం తనను కొట్టేవారని ఆ ఆదివాసి మహిళ ఏఎన్ఐకి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీమా పాత్రా తన పనిమనిషిని చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న వార్త బయటకు రాగానే బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది. ఎస్‌సీ, ఎస్‌టీలపై హింసను తమ పార్టీ ఎంతమాత్రం సహించదని పేర్కొంది.
దీనిపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని నియమించామని, విచారణ తరువాత తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
హుబ్లీలోని ఈద్గా మైదానం భూమి యాజమాన్యం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, ఇది బెంగళూరులోని చామరాజ్‌పేట్ ఈద్గా కేసు కన్నా భిన్నమైనదని పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు హుబ్లీలోని ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతించింది.
మంగళవారం రాత్రి 10 గంటలకు కర్ణాటక హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. గంటకు పైగా సాగిన వాదనల అనంతరం, జస్టిస్ అశోక్ ఎస్ కినాగి రాత్రి 11.45 గంటలకు తీర్పును వెలువరించారు.
"ప్రస్తుత కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పెట్టిన పిటిషన్‌లో నాకు ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. అందువల్ల, ఈ పిటిషన్ కొట్టివేస్తున్నాం" అని జస్టిస్ కినాగి తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హుబ్లీ-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (హెచ్‌డీఎంసీ), ఈద్గా మైదానంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు హిందూ సంస్థలకు ఇచ్చిన అనుమతులను కోర్టు సమర్థించింది.
ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాలని, మతపరమైన కార్యక్రమాలకు నిరోధించాలని కోరుతూ అంజుమన్-ఏ-ఇస్లాం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా కప్ 2022లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై వరుస విజయాలతో అఫ్గానిస్తాన్ సూపర్ 4కు చేరుకుంది.
ఈ టోర్నీలో భాగంగా మంగళవారం షార్జాలో జరిగిన మూడో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఏడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ టీంలో ముజిబుర్ రెహ్మాన్, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు చొప్పున తీసి బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ ఇబ్రహీం జద్రాన్ (41 బంతుల్లో 42 పరుగులు), నజీబుల్లా జద్రాన్ (17 బంతుల్లో 43 పరుగులు) నిలకడగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యాన్ని చేరుకుంది.