చర్చిలో అగ్నిప్రమాదం... కనీసం 41 మందికి పైగా మృతి

కాప్టిక్ అబు సిఫిన్ చర్చిలో ప్రార్థనల కోసం సుమారు 5 వేల మంది వచ్చారని, ఈ సమయంలో విద్యుత్ తీగల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని భద్రతా దళాలు చెప్పినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంత వరకు సెలవు.

  2. జాతీయ గీతాన్ని 75సార్లు ఆలపించి రికార్డు సృష్టించిన అర్చన

  3. సల్మాన్ రష్దీ: ఎన్‌‌టీఆరే ‘ది సాటానిక్ వెర్సెస్’లో ఫరిస్తా పాత్రకు స్ఫూర్తిగా నిలిచారా-బీబీసీ ఇంటర్వ్యూలో రష్దీ ఏమన్నారు?

  4. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తొలి సందేశం

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    ఫొటో సోర్స్, President of India/YouTube

    ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము దేశానికి తొలి సందేశం ఇచ్చారు.

    76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమె ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

    ‘స్వతంత్ర దేశంగా భారత్ 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. నేటి మన స్వేచ్ఛకు కారణమైన నాటి పోరాట యోధులకు మనం నివాళులు అర్పించాలి’ అని ముర్ము తన ప్రసంగంలో అన్నారు.

    దేశం అన్ని విధాలుగా ముందుకు పోతోందని ఆమె తెలిపారు.

  5. ఈజిప్టు: చర్చిలో అగ్నిప్రమాదం... సుమారు 41 మంది మృతి

    మంటలతో కాలిపోయిన చర్చి

    ఫొటో సోర్స్, Getty Images

    ఈజిప్టులోని ఒక చర్చిలో అగ్నిప్రమాదం జరిగి సుమారు 41 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

    కాప్టిక్ అబు సిఫిన్ చర్చిలో ప్రార్థనల కోసం సుమారు 5 వేల మంది వచ్చారని, ఈ సమయంలో విద్యుత్ తీగల నుంచి మంటలు రావడంతో ప్రమాదం జరిగిందని భద్రతా దళాలు చెప్పినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

    మంటల వల్ల చర్చి ప్రవేశ ద్వారం మూసుకు పోవడంతో తొక్కిసలాట జరిగింది.

    ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

    ‘కరెంటు పోవడంతో జనరేటర్ వేశారు. కరెంటు వచ్చిన తరువాత లోడ్ ఎక్కువ అయింది. దీంతో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి’ అని దగ్గర్లోని మరొక చర్చిలో ఫాదర్‌గా ఉన్న ఫరీద్ ఫామీ, న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీకి తెలిపారు.

    ప్రమాదం జరిగిన చర్చి ఉన్న ప్రాంతం

    ఫొటో సోర్స్, Reuters

  6. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి, కానీ పెట్రోలు ధర వారంలో 50శాతం పెరిగింది

  7. పాత ఇంటిని పడగొడుతుంటే బయటపడ్డ ఇనుప పెట్టే... తెరచి చూడగా?

    విజయనగరం జిల్లా రాజంలో ఓ పాత ఇంటిని పడగొడుతుంటే ఓ ఐరన్ లాకర్ బయటపడింది. కానీ కూలీలు ఆ సంగతి యజమానికి చెప్పలేదు.

    విషయం తెలుసుకున్న యజమాని నిలదీయగా... అందులో తమకూ వాటా కావాలని గొడవ పెట్టుకున్నారు.

    ఇంతకు ఆ పెట్టలో ఏముంది?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  8. పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా, ఆ మాట నిజమేనా

  9. ఒకే చైనా విధానానికి భారత్ మద్దతు ప్రకటించాలి - చైనా రాయబారి సన్ వీడోంగ్

    సన్ వీడోంగ్

    ఫొటో సోర్స్, ANI

    అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత మొదటిసారి భారత్‌కు చైనా రాయబారి సన్ వీడోంగ్ ప్రకటన చేశారు.

    ఆయన శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. చైనా అవలంబిస్తున్న "ఒకే చైనా" విధానానికి భారత్ మద్దతు తెలపాలని చైనా ఆశిస్తున్నట్లు చెప్పారు.

    ఒకే చైనా విధానం గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

    "ఒకే చైనా విధానం విషయంలో భారత్ వైఖరిలో మార్పు లేదని భావిస్తున్నాం" అని వీడోంగ్ అన్నారు.

    తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో ఇరు దేశాలు చర్చలు కొనసాగించాలని ఆయన అన్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చైనా అవలంబిస్తున్న ఒకే చైనా విధానం గురించి ప్రస్తావించలేదు. విధానాల పట్ల భారత్ వైఖరి అందరికీ తెలుసని దానిని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

    పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత సుమారు 160 దేశాలు ఒకే చైనా విధానానికి మద్దతు తెలిపాయని వీడోంగ్ అన్నారు. తైవాన్‌ను చైనా అంతర్భాగంగా పరిగణిస్తుంది.

    భారత్ గతంలో ఒకే చైనా విధానాన్ని సమర్ధించింది. కానీ గత దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక పత్రాల్లో లేదా బహిరంగంగా ఈ ప్రకటనను చేయలేదు.

  10. ఆజాద్ కపూర్, కార్గిల్ ప్రభు, ఎమర్జెన్సీ యాదవ్... ఎవరు వీరంతా? వీరి పేర్ల వెనుక చరిత్ర ఏమిటి

  11. కశ్మీర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సన్నద్ధం

    75వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునేందుకు కశ్మీర్‌ సన్నద్ధమవుతోంది.

    ఇందు కోసం తగిన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు.

    డ్రోన్లను ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ కొనసాగుతోంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతాయని ఆశిస్తున్నాం అని బారాముల్లా ఎస్ఎస్పీ రేస్ భట్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. ప్రేమలో విఫలమయ్యారా? ఆ బాధ నుంచి కోలుకోవడం ఎలా

  13. రాకేష్ ఝన్‌ఝున్‌వాలా మృతి - సంతాపం తెలిపిన మోదీ

    రాకేష్ ఝన్‌ఝున్‌వాలా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    "రాకేష్ ఝన్‌ఝున్‌వాలా తిరుగులేని వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూ, జీవం ఉట్టిపడుతూ దూరదృష్టితో ఉండేవారు. ఆయన ఆర్ధిక రంగానికి తిరుగులేని సేవలను అందించారు. భారత్ అభివృద్ధి గురించి ఆయన చాలా ఆసక్తితో ఉండేవారు. ఆయన మృతి విచారకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం తెలియచేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.

  14. Rakesh Jhunjunwala: బిలియనీర్, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతి

    రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో పేరుమోసిన షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణించారు.

    హంగామా మీడియా, ఆప్టెక్ వంటి సంస్థలకు చైర్మన్‌గా... వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రొవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు.

    ఆయన వయసు 62 సంవత్సరాలు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. సమంత: అంతరిక్షం నుంచి భారత్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    సమంత క్రిస్టోఫోరెట్టీ

    ఫొటో సోర్స్, INSTAGRAM

    ఇటాలియన్ వ్యోమగామి సమంత క్రిస్టోఫోరెట్టీ అంతరిక్షం నుంచి భారత్‌కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

    ఆమె స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతున్నట్లు చెప్పారు.

    ఈ వీడియోను ఇస్రో ట్విటర్‌లో షేర్ చేస్తూ నాసాకు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ధన్యవాదాలు తెలిపింది.

  16. మాట్లాడగల్గుతున్న సల్మాన్ రష్దీ - వెంటిలేటర్ తొలగింపు

    సల్మాన్ రష్దీ

    ఫొటో సోర్స్, Reuters

    ప్రముఖ రచయత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించారు. ఆయన ప్రస్తుతం మాట్లాడగల్గుతున్నట్లు రష్దీకు ఏజెంటుగా పని చేస్తున్న ఆండ్రూ వైలీ చెప్పారు.

    రష్దీ పై శుక్రవారం రాత్రి న్యూ యార్క్ లోదాడి జరిగింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    రష్దీ పై జరిగిన దాడికి సంబంధించి 24 ఏళ్ల హదీ మతార్ ను అరెస్టు చేశారు.

  17. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.