గుడ్ నైట్..
ఇంతటితో ఇవాల్టి లైవ్ పేజీ ముగిసింది. మళ్లీ రేపు కలుద్దాం.
ఆసక్తికరమైన కథనాలు, విశ్లేషణల కోసం బీబీసీ తెలుగు న్యూస్ ఫాలో అవ్వండి.
విద్య, వైద్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును 'ఉచిత పథకాల' కింద లెక్క కట్టలేమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ ఈ మాటలు అన్నట్టు మీడియా కథనం.
ఇంతటితో ఇవాల్టి లైవ్ పేజీ ముగిసింది. మళ్లీ రేపు కలుద్దాం.
ఆసక్తికరమైన కథనాలు, విశ్లేషణల కోసం బీబీసీ తెలుగు న్యూస్ ఫాలో అవ్వండి.

ఫొటో సోర్స్, ANI
చీనాబ్ నదిపై 'గోల్డెన్ జాయింట్' రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఇది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వర్కర్లు ఈరోజు జాతీయ జెండా ఎగురవేసి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
"ఇదొక సుదీర్ఘ ప్రయాణం. 'గోల్డెన్ జాయింట్' అనే పదాన్ని సివిల్ ఇంజనీర్లు సృష్టించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన" అని కొంకణ్ రైల్వే చైర్మన్, ఎండీ సంజయ్ గుప్తా చెప్పినట్టు ఏఎన్ఐ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, M. K. STALIN @FACEBOOK
విద్య, వైద్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును 'ఉచిత పథకాల' కింద లెక్క కట్టలేమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
శనివారం ఆయన మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు విద్య, వైద్యంపై ఖర్చు చేస్తున్నామని, అవి ఉచిత పథకాలు కావని అన్నారు.
అయితే, ఇది రాజకీయాంశంగా మారుతుందని, దీని గురించి ఎక్కువ మాట్లాడనని స్టాలిన్ అన్నారు.
సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ ఈ మాటలు అన్నట్టు పీటీఐ కథనం.
ఉచిత వస్తువులు ఇవ్వడానికి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి తేడా ఉందని స్వయంగా సుప్రీంకోర్టు చెప్పిందని స్టాలిన్ అన్నారు.
ఉచితాల సంస్కృతి దేశం ఆత్మనిర్భరత సాధించకుండా అడ్డుకుంటోందని ఇటీవల మోదీ అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండాలి. అప్పుడే పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన అన్నారు.
మోదీ ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు ఆమ్ ఆద్మీ పార్టీపై దాడిగా భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా సోకింది. ఆమెకు జూన్ నెల మొదట్లో కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
పార్లమెంటు సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియచేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ కు అనుగుణంగా ఆమె ఐసోలేషన్ లో ఉంటారని తెలిపారు.
జూన్‌లో సోనియాకు కరోనా సోకి ఆస్పత్రిలో కూడా చేరాల్సి వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ వారంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
రెండు నెలల వ్యవధిలో ఆమెకు కరోనా రావడం ఇది రెండవ సారి.
అనారోగ్యం వల్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా గత వారం ఆల్వార్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సరిహద్దుల్లో పరిస్థితులు మెరుగుపడకుండా భారత్ -చాలా మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఆయన బెంగళూరులో భారత్-చైనా అంశం పై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా సరిహద్దుల్లో శాంతి సామరస్యాలకు భంగం కలిగించాలని చూస్తే, అది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తుందని అన్నారు.
లైన్ ఆఫ్ కంట్రోల్ కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి వైదొలగడంలో భారత సేనలు పురోగతి సాధించాయని చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
రెండేళ్ల క్రితం లద్దాఖ్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణల తర్వాత భారత్ కుచైనాతో సంబంధాలు దెబ్బ తిన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
"నేను 2020, 2021లో ఏమి చెప్పానో, అదే విషయాన్ని 2022లో కూడా చెబుతాను. భారత్ - చైనాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవు" అని అన్నారు.

ఫొటో సోర్స్, AFP
వాటికన్ దగ్గర్లో కూలిన సొరంగంలో ఇటలీకి చెందిన వ్యక్తి చిక్కుకున్నారు. ఈయనను పోలీసులు సొరంగం నుంచి బయటకు తీసి రక్షించారు. దగ్గర్లో ఉన్న బ్యాంకులో చోరీ చేసేందుకు సొరంగాన్ని తవ్వి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చినందుకు గాను ఆయన పై కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
అక్కడ నుంచి పారిపోవాలని ప్రయత్నించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు రాయ్ వార్తా సంస్థ పేర్కొంది.
చోరీకి ప్రణాళిక చేసిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు సొరంగం కూలకముందే తప్పించుకుని పారిపోయారు.
కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో జరిగిన దాడి పిరికిపంద చర్య అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు.
ఈ పోరాటంలోఆయన రష్దీకు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
"గత 33 ఏళ్లుగా రష్దీ స్వేచ్ఛ కోసం గొంతు విప్పారు. సంప్రదాయవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. ద్వేషాన్ని, విధ్వంసాన్ని ప్రోత్సహించేవారి పిరికిపంద చర్యకు ఆయన గురయ్యారు. ఇది అందరి పోరాటం. ఈ సమయంలో మేము మరింత దృఢ చిత్తంతో ఆయన వెంట నిలుస్తాం"
రష్దీ ప్రస్తుతం వెంటిలేటర్‌పై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.
రష్దీపై దాడి తర్వాత పోలీసులు న్యూ జెర్సీలోని ఫెయిర్ వ్యూ నుంచి 24ఏళ్ల హదీ మతార్ నుఅరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సల్మాన్ రష్దీపై జరిగిన దాడికి బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ స్పందించారు. ఈమెను బంగ్లాదేశ్ బహిష్కరించింది.
"ఆయనపై దాడి జరిగిందంటే ఇస్లాంను విమర్శించిన ఎవరిపైనైనా దాడి జరగొచ్చు" అని అంటూ ఆమె ట్వీట్ చేశారు.
తస్లీమా నస్రీన్ 1994లో రాసిన పుస్తకంపై వ్యతిరేకత ఎదురవడంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇండియాలో తల దాచుకోవాల్సి వచ్చింది.
"సల్మాన్ రష్దీ పై న్యూయార్క్ లో దాడి జరిగింది. నేను దిగ్బ్రాంతికి లోనయ్యాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఆయన పశ్చిమ దేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ ఆయనకు 1989 నుంచి రక్షణ లభిస్తోంది. ఆయన పై దాడి జరిగిందంటే ఇస్లాంను విమర్శించిన ఎవరి పైనైనా దాడి జరగొచ్చు. నాకు ఆందోళనగా ఉంది" అని ఆమె ట్వీట్ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.